కంటెంట్‌కు వెళ్లండి

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ద్వితీయోపదేశకాండము 14:15సుమారు క్రీ.పూ. 1451

    కొమ్ముల గుడ్లగూబ, జీరగపిట్ట, కోకిల, ప్రతి రకమైన డేగ,

  2. ద్వితీయోపదేశకాండము 14:16సుమారు క్రీ.పూ. 1451

    పైడికంటే, గుడ్లగూబ, హంస,

  3. ద్వితీయోపదేశకాండము 14:17సుమారు క్రీ.పూ. 1451

    గూడబాతు, నల్లబోరువ, చెరువు కాకి,

  4. ద్వితీయోపదేశకాండము 14:18సుమారు క్రీ.పూ. 1451

    సంకు బుడ్డి కొంగ, ప్రతి రకమైన కొంగ, కూకుడు గువ్వ, గబ్బిలము.

  5. ద్వితీయోపదేశకాండము 14:19సుమారు క్రీ.పూ. 1451

    ఎగిరే పురుగులన్నీ మీకు అపవిత్రమైనవి; మీరు వాటిని తినకూడదు.

  6. ద్వితీయోపదేశకాండము 14:20సుమారు క్రీ.పూ. 1451

    ఆచారరీత్య పవిత్రమైన రెక్కలు గల ప్రతి ప్రాణిని మీరు తినవచ్చు.

  7. ద్వితీయోపదేశకాండము 14:21సుమారు క్రీ.పూ. 1451

    మీరు ముందే కనుగొన్న చచ్చినదానిని తినకూడదు. మీ పట్టణాల్లో నివసించే విదేశీయులకు మీరు దానిని ఇవ్వవచ్చు, వారు దానిని తినవచ్చు లేదా ఇతర విదేశీయులకు దానిని అమ్మవచ్చు. అయితే మీరు మీ దేవుడైన యెహోవాకు పవిత్ర ప్రజలు. మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు.

  8. ద్వితీయోపదేశకాండము 14:22సుమారు క్రీ.పూ. 1451

    ప్రతి సంవత్సరం మీ పొలాల్లో పండే పంటల్లో పదవ వంతును ఖచ్చితంగా ప్రత్యేకంగా ఉంచాలి.

  9. ద్వితీయోపదేశకాండము 14:23సుమారు క్రీ.పూ. 1451

    మీ దేవుడైన యెహోవాకు మీరు ఎల్లప్పుడు భయపడడం నేర్చుకునేలా మీ దేవుడైన యెహోవా తన నామానికి నివాస స్థలంగా ఏర్పరచుకొనే స్థలంలో మీ ధాన్యంలో, క్రొత్త ద్రాక్షరసంలో, ఒలీవ నూనెలో దశమభాగాన్ని, పశువుల్లో, మందలలో మొదటి పిల్లల్లో పదవ దానిని యెహోవా సన్నిధిలో తినాలి.

  10. ద్వితీయోపదేశకాండము 14:24సుమారు క్రీ.పూ. 1451

    ఒకవేళ ఆ స్థలం అంటే యెహోవా తన నామానికి నివాస స్థలంగా ఏర్పరచుకొనే స్థలం మీకు చాలా దూరంగా ఉంటే, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించినందున మీ దశమభాగాన్ని అక్కడికి మోసుకొని వెళ్లలేనప్పుడు,

  11. ద్వితీయోపదేశకాండము 14:25సుమారు క్రీ.పూ. 1451

    మీ దశమభాగాన్ని వెండికి మార్చి, దానిని మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొనే స్థలానికి తీసుకురావాలి.

  12. ద్వితీయోపదేశకాండము 14:26సుమారు క్రీ.పూ. 1451

    ఆ వెండితో మీకు నచ్చిన వాటిని కొనండి: పశువులు, గొర్రెలు, ద్రాక్షరసం లేదా మద్యం లేదా మీకు నచ్చింది ఏదైన. తర్వాత మీరు మీ కుటుంబీకులు అక్కడే మీ దేవుడైన యెహోవా సన్నిధిలో వాటిని తిని సంతోషించాలి.

  13. ద్వితీయోపదేశకాండము 14:27సుమారు క్రీ.పూ. 1451

    మీ పట్టణాల్లో నివసించే లేవీయులను నిర్లక్ష్యం చేయకూడదు, ఎందుకంటే వారికి మీతో పాటు భాగం గాని వారసత్వం గాని లేదు.

  14. ద్వితీయోపదేశకాండము 14:28సుమారు క్రీ.పూ. 1451

    మీ దేవుడైన యెహోవా మీ చేతిపనిని ఆశీర్వదించేలా, ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి, ఆ సంవత్సరం పండిన పంటలో దశమభాగాన్ని తెచ్చి మీ పట్టణాల్లో నిలువచేయాలి, తద్వార మీతో పాటు భాగం గాని వారసత్వం గాని లేని లేవీయులు, మీ పట్టణాల్లో నివసించే విదేశీయులు, తండ్రిలేనివారు, విధవరాండ్రు వచ్చి భోజనం చేసి తృప్తిపొందుతారు.

  15. ద్వితీయోపదేశకాండము 14:29సుమారు క్రీ.పూ. 1451

    And the Levite, (because he hath no part nor inheritance with thee,) and the stranger, and the fatherless, and the widow, which are within thy gates, shall come, and shall eat and be satisfied; that the LORD thy God may bless thee in all the work of thine hand which thou doest.

  16. ద్వితీయోపదేశకాండము 15:1సుమారు క్రీ.పూ. 1451

    ప్రతి ఏడు సంవత్సరాల చివర మీరు అప్పులు రద్దు చేయాలి.

  17. ద్వితీయోపదేశకాండము 15:2సుమారు క్రీ.పూ. 1451

    రద్దు చేయవలసిన విధానం ఇది: తన తోటి ఇశ్రాయేలీయునికి అప్పు ఇచ్చిన ప్రతి అప్పులవాడు దానిని రద్దు చేయాలి. ఆ సంవత్సరం అప్పు తీర్చమని అడగకూడదు, ఎందుకంటే అది అప్పులు రద్దు చేయడానికి యెహోవా సమయంగా ప్రకటించబడింది.

  18. ద్వితీయోపదేశకాండము 15:3సుమారు క్రీ.పూ. 1451

    మీరు విదేశీయులను అప్పు చెల్లించమని అడగవచ్చు కాని మీ తోటి ఇశ్రాయేలీయుని ప్రతి అప్పు రద్దు చేయాలి.

  19. ద్వితీయోపదేశకాండము 15:4సుమారు క్రీ.పూ. 1451

    అయితే, మీ మధ్యలో పేదవారు ఎవరు ఉండకూడదు, ఎందుకంటే మీ స్వాస్థ్యంగా మీరు స్వాధీనం చేసుకోవడానికి మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో ఆయన మిమ్మల్ని అధికంగా దీవిస్తారు.

  20. ద్వితీయోపదేశకాండము 15:5సుమారు క్రీ.పూ. 1451

    కాబట్టి ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఈ ఆజ్ఞలన్నిటిని జాగ్రత్తగా పాటించి మీ దేవుడైన యెహోవాకు మీరు పూర్తిగా లోబడి జీవించాలి.

  21. ద్వితీయోపదేశకాండము 15:6సుమారు క్రీ.పూ. 1451

    మీ దేవుడైన యెహోవా మీకు వాగ్దానం చేసిన ప్రకారం ఆయన మిమ్మల్ని దీవిస్తారు. మీరు అనేకమంది ప్రజలకు అప్పు ఇస్తారు కాని అప్పు చేయరు. మీరు అనేక దేశాలను పరిపాలిస్తారు అయితే మిమ్మల్ని ఎవరు పరిపాలించరు.

  22. ద్వితీయోపదేశకాండము 15:7సుమారు క్రీ.పూ. 1451

    మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశపు పట్టణాల్లో ఎక్కడైనా మీ తోటి ఇశ్రాయేలీయులలో ఎవరైనా పేదవారు ఉంటే, వారి పట్ల మీ హృదయాలను కఠినంగా లేదా పిసినారిగా ఉంచకూడదు.

  23. ద్వితీయోపదేశకాండము 15:8సుమారు క్రీ.పూ. 1451

    కాని వారికి అవసరమైనంత దానిని వారికి గుప్పిలి విప్పి ధారాళంగా అప్పు ఇవ్వాలి.

  24. ద్వితీయోపదేశకాండము 15:9సుమారు క్రీ.పూ. 1451

    ఈ దుష్ట ఆలోచన మీ హృదయాల్లో పుట్టకుండా జాగ్రత్తపడండి: “ఏడవ సంవత్సరం, అప్పులు రద్దు చేసే సంవత్సరం సమీపించింది” తద్వార మీ తోటి ఇశ్రాయేలీయుల మధ్య ఉన్న పేదవారి పట్ల దయ చూపించకుండ మీరు వారికి ఏమి ఇవ్వకుండ ఉండకూడదు. మీరు అలా చేస్తే, వారు మీకు వ్యతిరేకంగా యెహోవాకు మొరపెడతారు; అప్పుడు మీరు పాపం చేసినవారిగా పరిగణించబడతారు.

  25. ద్వితీయోపదేశకాండము 15:10సుమారు క్రీ.పూ. 1451

    వారికి ధారాళంగా ఇవ్వండి, సణిగే హృదయం లేకుండా వారికి ఇవ్వండి; అప్పుడు మీ దేవుడైన యెహోవా మీ పనులన్నిటిలో మీరు చేసే ప్రతీ దానిలో మిమ్మల్ని దీవిస్తారు.