- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446–1406 BC
The Wilderness Years
Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.
ఈ కాలపు వచనాలు
- ద్వితీయోపదేశకాండము 16:13సుమారు క్రీ.పూ. 1451
మీరు మీ నూర్పిడి కళ్ళం నుండి ధాన్యాన్ని, ద్రాక్ష గానుగ తొట్టె నుండి ద్రాక్షరసాన్ని సమకూర్చుకున్న తర్వాత గుడారాల పండుగ ఏడు రోజులు ఆచరించాలి.
- ద్వితీయోపదేశకాండము 16:14సుమారు క్రీ.పూ. 1451
మీరు, మీ కుమారులు కుమార్తెలు, మీ దాసదాసీలు, మీ పట్టణాల్లో నివసించే లేవీయులు, మీ మధ్య ఉండే విదేశీయులు, తండ్రిలేనివారు, విధవరాండ్రు, అందరు ఈ పండుగలో ఆనందించాలి.
- ద్వితీయోపదేశకాండము 16:15సుమారు క్రీ.పూ. 1451
యెహోవా ఏర్పరచుకొన్న స్థలంలో మీ దేవుడైన యెహోవాకు మీరు ఈ పండుగ ఏడు రోజులు ఆచరించాలి. ఎందుకంటే, మీ దేవుడైన యెహోవా మీ పంట అంతటిలో మీ చేతి పనులన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, మీ ఆనందం పరిపూర్ణం అవుతుంది.
- ద్వితీయోపదేశకాండము 16:16సుమారు క్రీ.పూ. 1451
సంవత్సరానికి మూడుసార్లు మీ పురుషులందరు మీ దేవుడైన యెహోవా తన నామానికి నివాస స్థలంగా ఏర్పరచుకొనే స్థలంలో కనబడాలి: పులియని రొట్టెల పండుగలో, వారాల పండుగలో, గుడారాల పండుగలో. యెహోవా సన్నిధిలో ఎవరూ వట్టి చేతులతో కనిపించకూడదు.
- ద్వితీయోపదేశకాండము 16:17సుమారు క్రీ.పూ. 1451
మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించిన ప్రకారం మీలో ప్రతి ఒకరు తమ శక్తి కొద్ది కానుకలు తీసుకురావాలి.
- ద్వితీయోపదేశకాండము 16:18సుమారు క్రీ.పూ. 1451
మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న ప్రతి పట్టణంలో మీ గోత్రాలకు న్యాయాధిపతులను, అధికారులను మీరు నియమించాలి, వారు న్యాయంగా ప్రజలకు తీర్పు తీర్చాలి.
- ద్వితీయోపదేశకాండము 16:19సుమారు క్రీ.పూ. 1451
న్యాయం తప్పి తీర్పు చెప్పకూడదు లేదా పక్షపాతం చూపించకూడదు. లంచం తీసుకోకూడదు, ఎందుకంటే లంచం జ్ఞానుల కళ్లకు గ్రుడ్డితనాన్ని కలిగిస్తుంది, నిర్దోషుల మాటలను వక్రీకరిస్తుంది.
- ద్వితీయోపదేశకాండము 16:20సుమారు క్రీ.పూ. 1451
మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశాన్ని స్వాధీనం చేసుకుని దానిలో మీరు జీవించేలా న్యాయాన్ని కేవలం న్యాయాన్ని అనుసరించి నడుచుకోవాలి.
- ద్వితీయోపదేశకాండము 16:21సుమారు క్రీ.పూ. 1451
మీ దేవుడైన యెహోవాకు మీరు నిర్మించే బలిపీఠం ప్రక్కన ఏ అషేరా స్తంభాన్ని ఏర్పాటు చేయకూడదు,
- ద్వితీయోపదేశకాండము 16:22సుమారు క్రీ.పూ. 1451
పవిత్ర రాతిని నిలబెట్టకూడదు, ఎందుకంటే మీ దేవుడైన యెహోవాకు ఇవి అసహ్యము.
- ద్వితీయోపదేశకాండము 17:1సుమారు క్రీ.పూ. 1451
మీ దేవుడైన యెహోవాకు మచ్చ గాని లోపంగాని ఉన్న ఎద్దునైనా గొర్రెనైనా బలిగా అర్పించకూడదు, అది మీ దేవుడైన యెహోవాకు అసహ్యము.
- ద్వితీయోపదేశకాండము 17:2సుమారు క్రీ.పూ. 1451
ఒకవేళ మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చే పట్టణాల్లో దేనిలోనైనా మీ మధ్య నివసిస్తున్న పురుషుడు గాని స్త్రీ గాని మీ దేవుడైన యెహోవా నిబంధన మీరి ఆయన దృష్టిలో చెడును చేస్తూ,
- ద్వితీయోపదేశకాండము 17:3సుమారు క్రీ.పూ. 1451
నా ఆజ్ఞకు వ్యతిరేకంగా ఇతర దేవుళ్ళను సేవించి, వాటికి గాని ఆకాశంలో ఉండే సూర్యచంద్ర నక్షత్రాలకు గాని నమస్కరిస్తూ ఉంటే,
- ద్వితీయోపదేశకాండము 17:4సుమారు క్రీ.పూ. 1451
ఆ విషయం మీ దృష్టికి తీసుకురాబడితే, మీరు దానిని క్షుణ్ణంగా పరిశోధించాలి. ఒకవేళ అది నిజమై, ఆ అసహ్యకరమైన విషయం ఇశ్రాయేలులో జరిగిందని నిరూపించబడితే,
- ద్వితీయోపదేశకాండము 17:5సుమారు క్రీ.పూ. 1451
ఆ దుర్మార్గం చేసిన పురుషుని గాని స్త్రీని గాని మీ పట్టణ ద్వారం దగ్గరకు తీసుకెళ్లి వారిని రాళ్లతో కొట్టి చంపాలి.
- ద్వితీయోపదేశకాండము 17:6సుమారు క్రీ.పూ. 1451
ఇద్దరు లేదా ముగ్గురు సాక్షుల వాంగ్మూలం మీదనే ఒక వ్యక్తికి మరణశిక్ష విధించాలి, కానీ ఒక్క సాక్షి వాంగ్మూలంపై ఎవరికి మరణశిక్ష విధించకూడదు.
- ద్వితీయోపదేశకాండము 17:7సుమారు క్రీ.పూ. 1451
ఆ వ్యక్తికి మరణశిక్ష విధించడంలో మొదట సాక్షుల చేతులు, తర్వాత ప్రజలందరి చేతులు ఉండాలి. మీరు మీ మధ్య నుండి దుర్మార్గాన్ని తొలగించాలి.
- ద్వితీయోపదేశకాండము 17:8సుమారు క్రీ.పూ. 1451
మీ దగ్గరకు వచ్చిన వివాదాలలో మీరు తీర్పు తీర్చడానికి చాలా కష్టంగా ఉన్న వివాదాలను అంటే రక్తపాతానికి సంబంధించినవి గాని వాదనలు గాని దాడులు గాని అలాంటి వాటిని మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకునే స్థలానికి తీసుకెళ్లండి.
- ద్వితీయోపదేశకాండము 17:9సుమారు క్రీ.పూ. 1451
లేవీయ యాజకుల దగ్గరకు, ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న న్యాయమూర్తి దగ్గరకు వెళ్లండి. వాటి గురించి విచారించండి, వారు మీకు తీర్పు ఇస్తారు.
- ద్వితీయోపదేశకాండము 17:10సుమారు క్రీ.పూ. 1451
మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకునే స్థలంలో వారు మీకు తెలియజేసిన నిర్ణయాల ప్రకారం మీరు నడుచుకోవాలి. మీరు చేయాలని వారు మీకు చెప్పే ప్రతిదీ జాగ్రత్తగా చేయాలి.
- ద్వితీయోపదేశకాండము 17:11సుమారు క్రీ.పూ. 1451
వారు మీకు బోధించిన, ఇచ్చిన నిర్ణయాల ప్రకారం మీరు చేయాలి. వారు మీకు చెప్పిన వాటినుండి కుడికి గాని ఎడమకు గాని తిరుగకూడదు.
- ద్వితీయోపదేశకాండము 17:12సుమారు క్రీ.పూ. 1451
న్యాయమూర్తి పట్ల గాని మీ దేవుడైన యెహోవాకు సేవచేసే యాజకుని పట్ల గాని ఎవరైనా ధిక్కారం ప్రదర్శిస్తే, వారికి మరణశిక్ష విధించబడాలి. మీరు ఈ దుర్మార్గాన్ని ఇశ్రాయేలు నుండి తొలగించాలి.
- ద్వితీయోపదేశకాండము 17:13సుమారు క్రీ.పూ. 1451
ప్రజలందరూ వింటారు, భయపడతారు, మళ్ళీ ధిక్కారంగా ఉండరు.
- ద్వితీయోపదేశకాండము 17:14సుమారు క్రీ.పూ. 1451
మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు ప్రవేశించి దానిని స్వాధీనం చేసుకుని స్థిరపడినప్పుడు మీరు, “మన చుట్టూ ఉన్న దేశాలవలె మనమీద కూడా రాజును నియమించుకుందాము” అని అంటే,
- ద్వితీయోపదేశకాండము 17:15సుమారు క్రీ.పూ. 1451
మీ దేవుడైన యెహోవా ఏర్పరచే వ్యక్తినే మీరు రాజుగా నియమించుకోవాలి. అతడు మీ మధ్యలో నుండి వచ్చిన తోటి ఇశ్రాయేలీయుడై ఉండాలి. ఇశ్రాయేలీయుడు కాని పరదేశిని మీమీద నియమించకూడదు.