కంటెంట్‌కు వెళ్లండి

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ద్వితీయోపదేశకాండము 17:16సుమారు క్రీ.పూ. 1451

    అంతేకాక, రాజు గుర్రాలను అధిక సంఖ్యలో సంపాదించవద్దు, వాటిని ఇంకా ఎక్కువ సంపాదించుకునేందుకు ప్రజలను ఈజిప్టుకు తిరిగి వెళ్లనివ్వకూడదు. ఎందుకంటే, “మీరు మరలా ఆ త్రోవలో వెళ్లకూడదు” అని యెహోవా మీకు చెప్పారు.

  2. ద్వితీయోపదేశకాండము 17:17సుమారు క్రీ.పూ. 1451

    అతడు చాలామంది భార్యలను చేసుకోకూడదు, లేదా అతని హృదయం దారి తప్పుతుంది. అతడు పెద్ద మొత్తంలో వెండి, బంగారాన్ని కూడబెట్టుకోకూడదు.

  3. ద్వితీయోపదేశకాండము 17:18సుమారు క్రీ.పూ. 1451

    అతడు తన రాజ్యసింహాసనం మీద ఆసీనుడైనప్పుడు, లేవీయ యాజకుల దగ్గర ఉన్న ధర్మశాస్త్రాన్ని చూసి తన కోసం ఒక ప్రతిని వ్రాసుకోవాలి.

  4. ద్వితీయోపదేశకాండము 17:19సుమారు క్రీ.పూ. 1451

    అది అతని దగ్గర ఉండాలి, అతడు దానిని తన జీవితకాలంతా చదువుతూ ఉండాలి తద్వార అతడు తన దేవుడైన యెహోవాకు భయపడడం నేర్చుకొని, ఈ ధర్మశాస్త్రంలోని మాటలన్నిటిని, శాసనాలను జాగ్రత్తగా అనుసరిస్తాడు,

  5. ద్వితీయోపదేశకాండము 17:20సుమారు క్రీ.పూ. 1451

    తన తోటి ఇశ్రాయేలీయునికన్నా తాను గొప్పవాడినని భావించడు, ధర్మశాస్త్రం నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోడు. అప్పుడు అతడు, అతని సంతానం ఇశ్రాయేలు రాజ్యాన్ని ఎక్కువకాలం పరిపాలిస్తారు.

  6. ద్వితీయోపదేశకాండము 18:1సుమారు క్రీ.పూ. 1451

    లేవీయులైన యాజకులకు అంటే, లేవీ గోత్రమంతటికి ఇశ్రాయేలీయులతో పాటు వాటా గాని వారసత్వం గాని ఉండదు. యెహోవాకు సమర్పించబడిన హోమబలుల పైనే వారు బ్రతకాలి, ఎందుకంటే అది వారి వారసత్వము.

  7. ద్వితీయోపదేశకాండము 18:2సుమారు క్రీ.పూ. 1451

    వారి తోటి ఇశ్రాయేలీయులతో వారికి వారసత్వం ఉండదు; యెహోవా వాగ్దానం చేసినట్టుగా యెహోవాయే వారి వారసత్వము.

  8. ద్వితీయోపదేశకాండము 18:3సుమారు క్రీ.పూ. 1451

    ప్రజలు అర్పణలుగా తీసుకువచ్చే పశువులు, గొర్రెలు మేకల నుండి యాజకులకు చెందవలసిన వాటా: భుజం, లోపలి అవయవాలు, చెంపలు.

  9. ద్వితీయోపదేశకాండము 18:4సుమారు క్రీ.పూ. 1451

    మీ ధాన్యం, క్రొత్త ద్రాక్షరసం, ఒలీవ నూనెలలో ప్రథమ ఫలాలు, అలాగే గొర్రెబొచ్చు కత్తిరించినప్పుడు మొదటి నూలు వారికే ఇవ్వాలి.

  10. ద్వితీయోపదేశకాండము 18:5సుమారు క్రీ.పూ. 1451

    యెహోవా పేర నిలిచి ఎల్లప్పుడు సేవ చేయటానికి అతని గోత్రాలన్నిటిలో అతన్ని అతని సంతానాన్ని మీ దేవుడైన యెహోవా ఎన్నుకున్నాడు.

  11. ద్వితీయోపదేశకాండము 18:6సుమారు క్రీ.పూ. 1451

    ఒక లేవీయుడు అతడు నివసించే ఇశ్రాయేలులో ఎక్కడైనా మీ పట్టణాల్లో ఒకదాని నుండి వెళ్తే, యెహోవా ఎంచుకునే ప్రదేశానికి పూర్తి శ్రద్ధతో వస్తే,

  12. ద్వితీయోపదేశకాండము 18:7సుమారు క్రీ.పూ. 1451

    అతడు తన దేవుడైన యెహోవా పేరిట అక్కడ సేవచేసే తన తోటి లేవీయులందరిలా సేవ చేయవచ్చు

  13. ద్వితీయోపదేశకాండము 18:8సుమారు క్రీ.పూ. 1451

    కుటుంబ ఆస్తులు అమ్మిన దానిలో డబ్బు వచ్చినప్పటికీ, వారి ప్రయోజనాలలో అతడు సమానంగా పంచుకోవాలి.

  14. ద్వితీయోపదేశకాండము 18:9సుమారు క్రీ.పూ. 1451

    మీ దేవుడైన యెహోవా మీకిచ్చే దేశంలో మీరు ప్రవేశించాక అక్కడి దేశాల అసహ్యకరమైన మార్గాలను అనుకరించడం నేర్చుకోకండి.

  15. ద్వితీయోపదేశకాండము 18:10సుమారు క్రీ.పూ. 1451

    తమ కుమారున్ని లేదా కుమార్తెను అగ్నిలో బలి ఇచ్చే వారినైననూ, భవిష్యవాణి లేదా మంత్రవిద్య, శకునాలను చెప్పు వారినైననూ, మంత్రవిద్యలో నిమగ్నమయ్యేవారునూ మీలో ఎవరూ కనబడకూడదు.

  16. ద్వితీయోపదేశకాండము 18:11సుమారు క్రీ.పూ. 1451

    మంత్రాలు జపించేవారు గాని, ఆత్మలతో మాట్లాడేవారు గాని, చనిపోయినవారిని సంప్రదించేవారు గాని మీలో ఉండకూడదు.

  17. ద్వితీయోపదేశకాండము 18:12సుమారు క్రీ.పూ. 1451

    ఇలాంటివి అభ్యసించేవారు యెహోవాకు అసహ్యులు; ఇలాంటి హేయక్రియలు చేస్తారు కాబట్టే యెహోవా మీ ముందు నుండి జనాలను వెళ్లగొడుతున్నారు.

  18. ద్వితీయోపదేశకాండము 18:13సుమారు క్రీ.పూ. 1451

    మీ దేవుడైన యెహోవా దృష్టిలో మీరు నిందారహితులై ఉండాలి.

  19. ద్వితీయోపదేశకాండము 18:14సుమారు క్రీ.పూ. 1451

    మీరు స్వాధీనం చేసుకోబోయే జనులు మంత్రవిద్య లేదా భవిష్యవాణి పాటించేవారి మాట వింటారు. అయితే, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అలా అనుమతించలేదు.

  20. ద్వితీయోపదేశకాండము 18:15సుమారు క్రీ.పూ. 1451

    మీ దేవుడైన యెహోవా నా లాంటి ఒక ప్రవక్తను మీలో నుండి మీ కోసం లేవనెత్తుతాడు, మీరు అతని మాట వినాలి.

  21. ద్వితీయోపదేశకాండము 18:16సుమారు క్రీ.పూ. 1451

    ఆ సభ రోజున హోరేబు దగ్గర మీ దేవుడనైన యెహోవాను మీరు అడిగింది ఇదే, “మన దేవుడైన యెహోవా స్వరాన్ని వినవద్దు, ఈ గొప్ప అగ్నిని ఇక చూడము, చూస్తే మేము చనిపోతాము.”

  22. ద్వితీయోపదేశకాండము 18:17సుమారు క్రీ.పూ. 1451

    యెహోవా నాతో, “వారన్న మాట సరియైనది.

  23. ద్వితీయోపదేశకాండము 18:18సుమారు క్రీ.పూ. 1451

    వారి తోటి ఇశ్రాయేలీయులలో నుండే నీలాంటి ప్రవక్తను లేపుతాను. ఆయన నోట నా మాటలుంటాయి, నా ఆజ్ఞలన్నీ వారికి చెప్తాను.

  24. ద్వితీయోపదేశకాండము 18:19సుమారు క్రీ.పూ. 1451

    నా పేరట ప్రవక్త చెప్పే మాటలకు ఎవరైనా స్పందించకపోతే వారిని నేనే లెక్క అడుగుతాను.

  25. ద్వితీయోపదేశకాండము 18:20సుమారు క్రీ.పూ. 1451

    కానీ నేను ఆజ్ఞాపించనిదేదైనా నా పేరున మాట్లాడాలని భావించే ప్రవక్త లేదా ఇతర దేవుళ్ళ పేరిట మాట్లాడే ప్రవక్తను చంపాలి” అని అన్నారు.