- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446–1406 BC
The Wilderness Years
Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.
ఈ కాలపు వచనాలు
- ద్వితీయోపదేశకాండము 18:21సుమారు క్రీ.పూ. 1451
“ఒక సందేశం యెహోవా మాట్లాడింది కాదు అని మనం ఎలా తెలుసుకోగలము?” అని మీలో మీరు అనుకుంటారు,
- ద్వితీయోపదేశకాండము 18:22సుమారు క్రీ.పూ. 1451
ఒకవేళ యెహోవా పేరెత్తి ఒక ప్రవక్త ప్రకటించి అది నెరవేరకపోయినా లేదా నిజం కాకపోయినా, అది యెహోవా మాట్లాడింది కాదు. ఆ ప్రవక్త అహంకారంతో మాట్లాడాడు, కాబట్టి భయపడవద్దు.
- ద్వితీయోపదేశకాండము 19:1సుమారు క్రీ.పూ. 1451
మీ దేవుడైన యెహోవా మీకు ఇవ్వబోయే దేశంలో ఉన్న జనాన్ని ముందు నాశనం చేసినప్పుడు, ఆ దేశాన్ని మీరు స్వాధీనం చేసుకుని, మీరు వారిని తరిమివేసి వారి పట్టణాల్లో వారి ఇళ్ళలో నివసించాలి.
- ద్వితీయోపదేశకాండము 19:2సుమారు క్రీ.పూ. 1451
మీ దేవుడైన యెహోవా వాగ్దానం చేసి ఇస్తున్న భూమిని మీరు స్వాధీనం చేసుకున్న తర్వాత, అందులో మూడు పట్టణాలను ప్రత్యేకించాలి.
- ద్వితీయోపదేశకాండము 19:3సుమారు క్రీ.పూ. 1451
మీ దేవుడైన యెహోవా మీకిచ్చే దేశాన్ని మూడు ప్రాంతాలుగా విభజించి ఆ పట్టణాలకు త్రోవలు ఏర్పరచాలి, ఒకడు ఎవరినైనా చంపితే అతడు ఆ పట్టణాల్లో ఒక దానికి పారిపోయేలా ఉండాలి.
- ద్వితీయోపదేశకాండము 19:4సుమారు క్రీ.పూ. 1451
మునుపటి శత్రుత్వం ఏదీ లేకపోయినా ఎవరైనా అనుకోకుండ మరొకరిని చంపితే, హంతకుడు ప్రాణాలతో బ్రతకడానికి ఈ ఆశ్రయపురాల్లో దేనికైనా పారిపోవచ్చు.
- ద్వితీయోపదేశకాండము 19:5సుమారు క్రీ.పూ. 1451
ఉదాహరణకు, చెట్లు నరకడానికి పొరుగువాడితో అడవికి వెళ్లి గొడ్డలితో చెట్టు కొట్టినప్పుడు గొడ్డలి పడి ఊడి అవతలి వాడికి తగిలి చనిపోయిన, చంపినవాడు ఆ మూడు పట్టణాల్లో ఒక దానిలోకి పారిపోయి తన ప్రాణం దక్కించుకోవచ్చు.
- ద్వితీయోపదేశకాండము 19:6సుమారు క్రీ.పూ. 1451
ఎక్కువ దూరమైతే, ప్రతీకారం చేయాలని వెంటాడినవాడు అతన్ని పట్టుకుని చంపుతాడేమో! అతడు ద్వేషంతో పొరుగువానిని చంపలేదు కాబట్టి, అతనికి మరణశిక్ష తగదు.
- ద్వితీయోపదేశకాండము 19:7సుమారు క్రీ.పూ. 1451
అందువల్లనే మూడు పట్టణాలను మీరు ఎంచుకోవాలని ఆజ్ఞాపించాను.
- ద్వితీయోపదేశకాండము 19:8సుమారు క్రీ.పూ. 1451
మీ పూర్వికులకు ప్రమాణం చేసినట్లు మీ దేవుడైన యెహోవా మీ సరిహద్దులను విశాలపరచి వారికి వాగ్దానం చేసిన దేశమంతటిని మీకు ఇస్తే,
- ద్వితీయోపదేశకాండము 19:9సుమారు క్రీ.పూ. 1451
నేడు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఈ చట్టాలన్నిటిని మీరు జాగ్రత్తగా అనుసరించి అనగా మీ దేవుడనైన యెహోవాను ప్రేమిస్తూ, నిత్యం ఆయన పట్ల విధేయత కలిగి మీరు నడుస్తూ, మరో మూడు పట్టణాలు ప్రత్యేకించాల్సి ఉంటుంది.
- ద్వితీయోపదేశకాండము 19:10సుమారు క్రీ.పూ. 1451
మీ దేవుడైన యెహోవా నీకు వారసత్వంగా ఇస్తున్న మీ దేశంలో నిర్దోషి రక్తం చిందించబడకుండ, మీరు రక్తపాతానికి పాల్పడకుండ ఉండడానికి ఇలా చేయండి.
- ద్వితీయోపదేశకాండము 19:11సుమారు క్రీ.పూ. 1451
కాని ఎవరైనా ద్వేషంతో ఎవరి కొరకైనా పొంచి ఉండి, అతని మీద పడి చంపితే అతడా పట్టణాల్లో ఒక దానిలోకి పారిపోయినా ఊరి పెద్దలు అతన్ని బయటకు రప్పించాలి.
- ద్వితీయోపదేశకాండము 19:12సుమారు క్రీ.పూ. 1451
హంతకుని పట్టణ పెద్దలు పిలిపించి, ప్రతీకారం చేయడానికి వచ్చిన వానికి అతన్ని అప్పగించాలి.
- ద్వితీయోపదేశకాండము 19:13సుమారు క్రీ.పూ. 1451
జాలి చూపవద్దు. నిర్దోషి రక్తాన్ని చిందించిన అపరాధాన్ని మీరు ఇశ్రాయేలు నుండి ప్రక్షాళన చేయాలి, తద్వారా మీరు బాగుంటారు.
- ద్వితీయోపదేశకాండము 19:14సుమారు క్రీ.పూ. 1451
మీ దేవుడైన యెహోవా స్వాధీనం చేసుకోమని మీకు ఇవ్వబోతున్న దేశంలో మీరు పొందే వారసత్వంలో మీ పూర్వికులు ఏర్పాటుచేసిన మీ పొరుగువారి సరిహద్దు రాయిని తరలించవద్దు.
- ద్వితీయోపదేశకాండము 19:15సుమారు క్రీ.పూ. 1451
ఒకడు చేసిన పాపం విషయంలో గాని అపరాధం విషయంలో గాని దాన్ని నిర్ధారించడానికి కేవలం ఒక్క వ్యక్తి సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకోకూడదు, ఇద్దరు లేదా ముగ్గురు సాక్ష్యాల మీద నేరం నిర్ధారణ చేయాలి.
- ద్వితీయోపదేశకాండము 19:16సుమారు క్రీ.పూ. 1451
ఒకవేళ కపట బుద్ధి గలవాడు ఎవరిమీదైనా నేరారోపణ చేయడానికే పూనుకుంటే,
- ద్వితీయోపదేశకాండము 19:17సుమారు క్రీ.పూ. 1451
ఆ వివాదంలో ఉన్న ఇద్దరూ యెహోవా ఎదుట అంటే ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న యాజకుల ఎదుట న్యాయాధిపతుల ఎదుట నిలబడాలి.
- ద్వితీయోపదేశకాండము 19:18సుమారు క్రీ.పూ. 1451
న్యాయాధిపతులు ఆ వాదనను బాగా విచారణ చేయాలి, సాక్షి అబద్ధికుడని రుజువైతే, తోటి ఇశ్రాయేలీయులపై అబద్ధ సాక్ష్యమును పలికిన ఎడల,
- ద్వితీయోపదేశకాండము 19:19సుమారు క్రీ.పూ. 1451
వాడు తలపెట్టిన కీడు వాడి మీదకే రావాలి, ఆ విధంగా న్యాయమైన తీర్పు చెప్పి మీ మధ్య నుండి దుర్మార్గాన్ని తొలగించాలి.
- ద్వితీయోపదేశకాండము 19:20సుమారు క్రీ.పూ. 1451
ప్రజలు ఇది చూసి భయపడి అలాంటి దుర్మార్గపు పనులు మీ దేశంలో మళ్ళీ చేయరు.
- ద్వితీయోపదేశకాండము 19:21సుమారు క్రీ.పూ. 1451
జాలి పడకూడదు: ప్రాణానికి ప్రాణం కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చేయి, కాలికి కాలు. ఇదే నియమం పాటించి తీరాలి.
- ద్వితీయోపదేశకాండము 20:1సుమారు క్రీ.పూ. 1451
మీ శత్రువులతో యుద్ధానికి వెళ్లినప్పుడు, మీ దగ్గర ఉన్నవాటి కంటే వారి దగ్గర ఎక్కువ గుర్రాలు, రథాలను చూసినప్పుడు, వారికి భయపడవద్దు, ఎందుకంటే ఈజిప్టు నుండి క్షేమంగా రప్పించిన మీ దేవుడైన యెహోవా మీతో ఉంటారు.
- ద్వితీయోపదేశకాండము 20:2సుమారు క్రీ.పూ. 1451
మీరు యుద్ధానికి వెళ్లబోయేటప్పుడు, యాజకుడు ముందుకు వచ్చి సైన్యాన్ని ఉద్దేశించి మాట్లాడుతాడు.