- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446–1406 BC
The Wilderness Years
Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.
ఈ కాలపు వచనాలు
- ద్వితీయోపదేశకాండము 21:8సుమారు క్రీ.పూ. 1451
యెహోవా, మీరు విమోచించిన మీ ప్రజలైన ఇశ్రాయేలు కోసం ఈ ప్రాయశ్చిత్తాన్ని అంగీకరించండి, నిర్దోషి యొక్క రక్తాన్ని బట్టి మీ ప్రజలను దోషులుగా పరిగణించవద్దు” అప్పుడు రక్తపాతం ప్రాయశ్చిత్తం చేయబడుతుంది,
- ద్వితీయోపదేశకాండము 21:9సుమారు క్రీ.పూ. 1451
యెహోవా దృష్టిలో మీరు సరియైనది చేశారు కాబట్టి, నిర్దోషి రక్తం చిందించిన అపరాధం మీ నుండి తొలగిపోతుంది.
- ద్వితీయోపదేశకాండము 21:10సుమారు క్రీ.పూ. 1451
మీరు మీ శత్రువుల మీద యుద్ధానికి వెళ్లినప్పుడు మీ దేవుడైన యెహోవాకు వారిని మీ చేతులకు అప్పగించి, మీరు బందీలను తెచ్చినప్పుడు,
- ద్వితీయోపదేశకాండము 21:11సుమారు క్రీ.పూ. 1451
ఒకవేళ నీవు బందీలలో ఒక అందమైన స్త్రీని గమనించి, ఆమె పట్ల ఆకర్షితుడవైతే, నీవు ఆమెను మీ భార్యగా తీసుకోవచ్చు.
- ద్వితీయోపదేశకాండము 21:12సుమారు క్రీ.పూ. 1451
ఆమెను మీ ఇంటికి తీసుకురండి ఆమె తలను గుండు చేసుకోవాలి, గోర్లు కత్తిరించుకోవాలి,
- ద్వితీయోపదేశకాండము 21:13సుమారు క్రీ.పూ. 1451
చెరపట్టబడినప్పుడు ఆమె వేసుకుని ఉన్న వస్త్రాలు తీసివేయాలి. నెలరోజులు ఆమె మీ ఇంట్లోనే ఉండి, తన తల్లిదండ్రుల కోసం విలపించిన తర్వాత, నీవు ఆమె దగ్గరకు వెళ్లవచ్చు, నీవు ఆమెకు భర్తగా ఆమె నీకు భార్యగా ఉండవచ్చు.
- ద్వితీయోపదేశకాండము 21:14సుమారు క్రీ.పూ. 1451
వద్దనుకుంటే, ఆమె కిష్ఠమైన చోటికి ఆమెను పంపివేయాలి. నీవు ఆమెను అగౌరపరచినట్టే కాబట్టి ఆమెను డబ్బుకు అమ్మకూడదు బానిసగా చూడకూడదు.
- ద్వితీయోపదేశకాండము 21:15సుమారు క్రీ.పూ. 1451
ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉంటే, అతడు ఒకరిని ప్రేమిస్తాడు, మరొకరిని ప్రేమించడు, ఇద్దరూ అతనికి కుమారులను కంటారు కాని జ్యేష్ఠ కుమారుడు అతడు ప్రేమించని భార్య కుమారుడు,
- ద్వితీయోపదేశకాండము 21:16సుమారు క్రీ.పూ. 1451
అతడు తన కుమారులకు తన ఆస్తిని పంచినప్పుడు, నిజానికి జ్యేష్ఠ కుమారుడైన తాను ప్రేమించని భార్య కుమారుని స్థానంలో అతడు ప్రేమించే భార్య కుమారునికి జ్యేష్ఠత్వపు హక్కును ఇవ్వకూడదు.
- ద్వితీయోపదేశకాండము 21:17సుమారు క్రీ.పూ. 1451
అతడు తనకున్న అన్నిటిలో రెట్టింపు వాటా ఇవ్వడం ద్వారా తాను ప్రేమించని భార్య కుమారుడిని జ్యేష్ఠ కుమారునిగా గుర్తించాలి. ఆ కుమారుడు తన తండ్రి శక్తికి మొదటి సంకేతము. జ్యేష్ఠత్వపు హక్కు అతనికి చెందినది.
- ద్వితీయోపదేశకాండము 21:18సుమారు క్రీ.పూ. 1451
ఒకవేళ ఎవరికైనా తండ్రికి తల్లికి లోబడని, వారు వాన్ని క్రమశిక్షణ చేసినప్పుడు వారికి వినని, మొండితనం గల తిరుగుబాటు చేసే కుమారుడు ఉంటే,
- ద్వితీయోపదేశకాండము 21:19సుమారు క్రీ.పూ. 1451
అతని తండ్రి, తల్లి అతన్ని పట్టుకుని పట్టణ ద్వారం దగ్గర ఉన్న పెద్దల దగ్గరకు తీసుకురావాలి.
- ద్వితీయోపదేశకాండము 21:20సుమారు క్రీ.పూ. 1451
వారు పెద్దలతో, “ఈ మా కుమారుడు మొండివాడు, తిరుగుబాటు చేసేవాడు. వీడు మాకు లోబడడు. వీడు తిండిబోతు, త్రాగుబోతు” అని చెప్పాలి.
- ద్వితీయోపదేశకాండము 21:21సుమారు క్రీ.పూ. 1451
అప్పుడు అతని పట్టణంలోని పురుషులందరు వాన్ని రాళ్లతో కొట్టి చంపాలి. మీరు మీ మధ్య నుండి చెడును ప్రక్షాళన చేయాలి. ఇశ్రాయేలీయులందరు దాని గురించి విని భయపడతారు.
- ద్వితీయోపదేశకాండము 21:22సుమారు క్రీ.పూ. 1451
ఒకవేళ ఎవరైనా మరణశిక్షకు తగిన పాపం చేసి చంపబడి వారి దేహం చెట్టుకు వ్రేలాడదీయబడి ఉంటే,
- ద్వితీయోపదేశకాండము 21:23సుమారు క్రీ.పూ. 1451
దేహం రాత్రిపూట చెట్టుకు వ్రేలాడుతూ ఉండకూడదు. అదే రోజు దానిని పాతిపెట్టేలా చూడాలి, ఎందుకంటే మ్రానుపై వ్రేలాడదీయబడిన ఎవరైనా దేవుని శాపానికి గురవుతారు. మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యంగా ఇస్తున్న దేశాన్ని మీరు అపవిత్రం చేయకూడదు!
- ద్వితీయోపదేశకాండము 22:1సుమారు క్రీ.పూ. 1451
మీ తోటి ఇశ్రాయేలీయుల ఎద్దు లేదా గొర్రెలు దారితప్పినట్లు మీరు చూస్తే దానిని విస్మరించవద్దు. కానీ దానిని తిరిగి దాని యజమాని దగ్గరకు తీసుకెళ్లండి.
- ద్వితీయోపదేశకాండము 22:2సుమారు క్రీ.పూ. 1451
ఒకవేళ వారు మీ దగ్గర నివసించకపోయినా లేదా దాని యజమాని ఎవరో మీకు తెలియకపోయినా, దానిని మీతో ఇంటికి తీసుకెళ్లి, వారు దానిని వెదుక్కునే వరకు ఉంచి, తర్వాత తిరిగి ఇచ్చేయండి.
- ద్వితీయోపదేశకాండము 22:3సుమారు క్రీ.పూ. 1451
గాడిద గాని వస్త్రం గాని మరి ఏ వస్తువైనా దొరికితే ఇలాగే చేయాలి. దాన్ని విస్మరించవద్దు.
- ద్వితీయోపదేశకాండము 22:4సుమారు క్రీ.పూ. 1451
మీ తోటి ఇశ్రాయేలీయుని గాడిద గాని ఎద్దు గాని దారిలో పడి ఉండడం మీరు చూస్తే, దానిని విస్మరించవద్దు. అది తిరిగి లేచి నిలబడేలా దాని యజమానికి సహాయం చేయండి.
- ద్వితీయోపదేశకాండము 22:5సుమారు క్రీ.పూ. 1451
స్త్రీలు పురుషుల దుస్తులు వేసుకోకూడదు, పురుషులు స్త్రీల వస్త్రాలు వేసుకోకూడదు, ఎందుకంటే అలా చేసేవారిని మీ దేవుడైన యెహోవా అసహ్యించుకుంటారు.
- ద్వితీయోపదేశకాండము 22:6సుమారు క్రీ.పూ. 1451
రోడ్డు ప్రక్కన, చెట్టు ప్రక్కన లేదా నేలపై పక్షుల గూడు కనిపిస్తే, తల్లి చిన్నపిల్లలపై లేదా గుడ్లపై కూర్చుంటే, తల్లిని పిల్లలతో తీసుకెళ్లవద్దు.
- ద్వితీయోపదేశకాండము 22:7సుమారు క్రీ.పూ. 1451
మీరు పిల్లలను తీసుకెళ్లవచ్చు, కాని తల్లిని వదిలేయాలి, తద్వార మీరు బాగుంటారు దీర్ఘాయువు కలిగి ఉంటారు.
- ద్వితీయోపదేశకాండము 22:8సుమారు క్రీ.పూ. 1451
మీరు ఒక క్రొత్త ఇంటిని కట్టుకున్నప్పుడు, మీ పైకప్పు చుట్టూ ఒక పిట్టగోడను కట్టుకోండి, తద్వారా ఎవరైనా పైకప్పు నుండి క్రింద పడితే మీ ఇంటిపైకి రక్తపాతం యొక్క అపరాధం తీసుకురాదు.
- ద్వితీయోపదేశకాండము 22:9సుమారు క్రీ.పూ. 1451
మీ ద్రాక్షతోటలో రెండు రకాల విత్తనాలను నాటవద్దు; మీరు అలా చేస్తే, మీరు వేసే పంటలు మాత్రమే కాకుండా ద్రాక్షతోట యొక్క పండు కూడా అపవిత్రమవుతుంది.