కంటెంట్‌కు వెళ్లండి

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ద్వితీయోపదేశకాండము 23:5సుమారు క్రీ.పూ. 1451

    ఎలాగైతేనేం, మీ దేవుడైన యెహోవా బిలాము మాటలను ఆమోదించ లేదు. దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. అందుకే శాపాన్ని దీవెనగా మార్చారు.

  2. ద్వితీయోపదేశకాండము 23:6సుమారు క్రీ.పూ. 1451

    మీరు బ్రతికి ఉన్నంత వరకు వారితో స్నేహ ఒప్పందం కోరవద్దు.

  3. ద్వితీయోపదేశకాండము 23:7సుమారు క్రీ.పూ. 1451

    ఎదోమీయులను తృణీకరించవద్దు, ఎందుకంటే ఎదోమీయులు మీ బంధువులు. ఈజిప్టువారిని తృణీకరించవద్దు, ఎందుకంటే మీరు వారి దేశంలో విదేశీయులుగా నివసించారు.

  4. ద్వితీయోపదేశకాండము 23:8సుమారు క్రీ.పూ. 1451

    వారికి జన్మించిన మూడవ తరం పిల్లలు యెహోవా సమాజంలో ప్రవేశించవచ్చు.

  5. ద్వితీయోపదేశకాండము 23:9సుమారు క్రీ.పూ. 1451

    మీరు మీ శత్రువులకు వ్యతిరేకంగా గుడారాలు వేసుకున్నప్పుడు, అపవిత్రమైన ప్రతీ దానికి దూరంగా ఉండండి.

  6. ద్వితీయోపదేశకాండము 23:10సుమారు క్రీ.పూ. 1451

    రాత్రి జరిగినదాని వల్ల అపవిత్రమైన వ్యక్తి, శిబిరం బయటకు వెళ్లి అక్కడ ఉండాలి.

  7. ద్వితీయోపదేశకాండము 23:11సుమారు క్రీ.పూ. 1451

    కానీ సాయంకాలం అవుతుండగా అతడు స్నానం చేసుకోవాలి, సూర్యాస్తమయం అయినప్పుడు అతడు శిబిరానికి తిరిగి రావచ్చు.

  8. ద్వితీయోపదేశకాండము 23:12సుమారు క్రీ.పూ. 1451

    మీ విసర్జన కోసం శిబిరం బయట ప్రత్యేకంగా స్థలం ఏర్పరచుకోవాలి.

  9. ద్వితీయోపదేశకాండము 23:13సుమారు క్రీ.పూ. 1451

    త్రవ్వడానికి మీ దగ్గర పరికరాలతో పాటు ఒక పారను దగ్గర ఉంచుకుని దానితో గుంట త్రవ్వి, మలవిసర్జన తర్వాత మట్టితో మలాన్ని కప్పివేయాలి.

  10. ద్వితీయోపదేశకాండము 23:14సుమారు క్రీ.పూ. 1451

    మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని రక్షించడానికి, మీ శత్రువులను మీకు అప్పగించడానికి మీ శిబిరంలో సంచరిస్తారు. మీ శిబిరం తప్పనిసరిగా పరిశుద్ధంగా ఉండాలి, తద్వారా ఆయన మీ మధ్య అసభ్యకరమైనదేది చూడరు, మీ నుండి తప్పుకోరు.

  11. ద్వితీయోపదేశకాండము 23:15సుమారు క్రీ.పూ. 1451

    బానిసలు మిమ్మల్ని ఆశ్రయిస్తే, వారిని వారి యజమానికి అప్పగించవద్దు.

  12. ద్వితీయోపదేశకాండము 23:16సుమారు క్రీ.పూ. 1451

    వారిని మీ మధ్య వారికి ఇష్టమైనట్లు, వారు ఎంచుకున్న పట్టణంలో నివసింపనివ్వండి. వారిని అణచివేయవద్దు.

  13. ద్వితీయోపదేశకాండము 23:17సుమారు క్రీ.పూ. 1451

    ఏ ఇశ్రాయేలు పురుషుడు గాని స్త్రీ గాని ఆలయ వేశ్యగా మారకూడదు.

  14. ద్వితీయోపదేశకాండము 23:18సుమారు క్రీ.పూ. 1451

    మీ దేవుడైన యెహోవా వారిద్దరిని అసహ్యిస్తారు కాబట్టి ఏ మ్రొక్కుబడినైనా చెల్లించడానికి వేశ్యలైన స్త్రీలు గాని పురుషులు గాని వారి సంపాదనలు మీరు మీ దేవుడైన యెహోవా మందిరంలోకి తీసుకురాకూడదు.

  15. ద్వితీయోపదేశకాండము 23:19సుమారు క్రీ.పూ. 1451

    వడ్డీ సంపాదించగల డబ్బు గాని ఆహారమే గాని వేరే ఏదైనా గాని, తోటి ఇశ్రాయేలు దగ్గర వడ్డీ వసూలు చేయకూడదు.

  16. ద్వితీయోపదేశకాండము 23:20సుమారు క్రీ.పూ. 1451

    మీరు విదేశీయుల దగ్గర వడ్డీని వసూలు చేయవచ్చు, కానీ తోటి ఇశ్రాయేలు దగ్గర కాదు, తద్వారా మీరు స్వాధీనం చేసుకునే దేశంలో మీరు చేయి పెట్టిన ప్రతి దానిలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు.

  17. ద్వితీయోపదేశకాండము 23:21సుమారు క్రీ.పూ. 1451

    మీరు మీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుబడి చేస్తే, దానిని తీర్చడానికి ఆలస్యం చేయకండి, ఎందుకంటే మీ దేవుడైన యెహోవా ఖచ్చితంగా మీ నుండి దాన్ని కోరతారు, మీరు పాపాన్ని బట్టి దోషులవుతారు.

  18. ద్వితీయోపదేశకాండము 23:22సుమారు క్రీ.పూ. 1451

    కానీ మీరు మ్రొక్కుబడి చేయడం మానుకుంటే, మీరు దోషులు కారు.

  19. ద్వితీయోపదేశకాండము 23:23సుమారు క్రీ.పూ. 1451

    మీ పెదవులు ఏది చెప్పినా మీరు తప్పకుండా చేయాలి, ఎందుకంటే మీరు మీ దేవుడైన యెహోవాకు మీ నోటితో స్వేచ్ఛగా మ్రొక్కుబడి చేశారు.

  20. ద్వితీయోపదేశకాండము 23:24సుమారు క్రీ.పూ. 1451

    మీరు మీ పొరుగువారి ద్రాక్షతోటలోనికి ప్రవేశిస్తే, మీకు కావలసిన ద్రాక్షపండ్లను మీరు తినవచ్చు, కానీ మీ బుట్టలో వాటిని వేసుకోకూడదు.

  21. ద్వితీయోపదేశకాండము 23:25సుమారు క్రీ.పూ. 1451

    మీరు మీ పొరుగువారి ధాన్యపు పొలంలోకి ప్రవేశిస్తే, మీరు మీ చేతులతో విత్తనాలను తీసుకోవచ్చు, కానీ మీరు పండిన పంటను కొడవలితో కోయకూడదు.

  22. ద్వితీయోపదేశకాండము 24:1సుమారు క్రీ.పూ. 1451

    ఒక వ్యక్తి ఒక స్త్రీని పెళ్ళి చేసుకున్న తర్వాత ఆమె అంతకుముందే వేరొకనితో సంబంధం కలిగి ఉన్నట్లు అనుమానం కలిగి ఆమె మీద ఇష్టం తొలగిపోతే, అతడు ఆమెకు విడాకుల ధృవీకరణ పత్రం వ్రాసి ఆమెకు ఇచ్చి తన ఇంట్లోనుండి పంపివేయాలి.

  23. ద్వితీయోపదేశకాండము 24:2సుమారు క్రీ.పూ. 1451

    ఒకవేళ ఆమె అతని ఇంటి నుండి వెళ్లిన తర్వాత ఆమె మరొక వ్యక్తికి భార్య అయితే,

  24. ద్వితీయోపదేశకాండము 24:3సుమారు క్రీ.పూ. 1451

    ఆమె రెండవ భర్త కూడా ఆమెను ఇష్టపడలేదు, ఆమెకు విడాకుల ధృవీకరణ పత్రం వ్రాసి ఆమెకు ఇచ్చి అతని ఇంటి నుండి పంపిస్తే లేదా అతడు చనిపోతే,

  25. ద్వితీయోపదేశకాండము 24:4సుమారు క్రీ.పూ. 1451

    అప్పుడు ఆమె విడాకులు తీసుకున్న ఆమె మొదటి భర్త, ఆమె అపవిత్రమైన తర్వాత ఆమెను మళ్ళీ పెళ్ళి చేసుకోవడానికి అనుమతించబడలేదు. అది యెహోవా దృష్టిలో అసహ్యకరమైనది. మీ దేవుడైన యెహోవా మీకు వారసత్వంగా ఇస్తున్న దేశం మీదికి మీరు దోషం తీసుకురావద్దు.