కంటెంట్‌కు వెళ్లండి

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ద్వితీయోపదేశకాండము 25:8సుమారు క్రీ.పూ. 1451

    అప్పుడు పట్టణ పెద్దలు అతన్ని పిలిపించి మాట్లాడాలి. అప్పటికీ అతడు, “ఆమెను పెళ్ళి చేసుకోవడం నాకు ఇష్టం లేదు” అని మొండిగా ఉంటే,

  2. ద్వితీయోపదేశకాండము 25:9సుమారు క్రీ.పూ. 1451

    అతని సోదరుని విధవరాలు పెద్దల సమక్షంలో అతని దగ్గరకు వెళ్లి, అతని కాలి చెప్పు ఊడదీసి అతని ముఖం మీద ఉమ్మివేసి, “తన సోదరుని కుటుంబాన్ని నిలబెట్టని వ్యక్తికి ఇలాగే జరుగుతుంది” అని చెప్పాలి.

  3. ద్వితీయోపదేశకాండము 25:10సుమారు క్రీ.పూ. 1451

    అప్పుడు వాని వంశం ఇశ్రాయేలులో చెప్పు ఊడదీయబడిన కుటుంబం అని పిలువబడుతుంది.

  4. ద్వితీయోపదేశకాండము 25:11సుమారు క్రీ.పూ. 1451

    ఇద్దరు పురుషులు పోట్లాడుకుంటునప్పుడు వారిలో ఒకని భార్య అవతలివాని బారి నుండి తన భర్తను విడిపించడానికి వచ్చి వాని మర్మాంగాన్ని పట్టుకున్నట్లయితే,

  5. ద్వితీయోపదేశకాండము 25:12సుమారు క్రీ.పూ. 1451

    ఆమె చేతిని తెగనరకాలి. ఆమె మీద దయ చూపకూడదు.

  6. ద్వితీయోపదేశకాండము 25:13సుమారు క్రీ.పూ. 1451

    మీ సంచిలో రెండు వేరువేరు తూనిక రాళ్లు ఒకటి బరువైనవి ఇంకొకటి తేలికైనవి ఉండకూడదు.

  7. ద్వితీయోపదేశకాండము 25:14సుమారు క్రీ.పూ. 1451

    మీ ఇంట్లో రెండు విభిన్న కొలతలు ఒకటి పెద్దది, ఒకటి చిన్నది ఉండకూడదు.

  8. ద్వితీయోపదేశకాండము 25:15సుమారు క్రీ.పూ. 1451

    మీ ఖచ్చితమైన, న్యాయమైన తూనిక రాళ్లు న్యాయమైన త్రాసులు ఉండాలి, తద్వారా మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న భూమిలో మీరు ఎక్కువకాలం జీవిస్తారు.

  9. ద్వితీయోపదేశకాండము 25:16సుమారు క్రీ.పూ. 1451

    అన్యాయపు తూకం వేసేవారిని, అన్యాయం చేసేవారిని మీ దేవుడైన యెహోవా అసహ్యించుకుంటారు.

  10. ద్వితీయోపదేశకాండము 25:17సుమారు క్రీ.పూ. 1451

    ఈజిప్టు నుండి మీరు వచ్చినప్పుడు మీ ప్రయాణంలో అమాలేకీయులు మీకు చేసింది జ్ఞాపకముంచుకోండి.

  11. ద్వితీయోపదేశకాండము 25:18సుమారు క్రీ.పూ. 1451

    మీరు అలసిపోయి బడలికతో ఉన్నప్పుడు, వారు మీ ప్రయాణంలో మిమ్మల్ని కలుసుకున్నారు వెనుకబడిన వారందరిపై దాడి చేశారు; వారికి దేవుని భయం లేదు.

  12. ద్వితీయోపదేశకాండము 25:19సుమారు క్రీ.పూ. 1451

    మీ దేవుడైన యెహోవా స్వాస్థ్యంగా మీకిస్తున్న దేశాన్ని మీరు స్వాధీనపరచుకున్న తర్వాత మీ చుట్టూ ఉన్న శత్రువులను పారద్రోలి మీకు విశ్రాంతి ప్రసాదించిన తర్వాత ఆకాశం క్రింద అమాలేకీయులను నామరూపాలు లేకుండా తుడిచివేయాలని మరచిపోవద్దు.

  13. ద్వితీయోపదేశకాండము 26:1సుమారు క్రీ.పూ. 1451

    మీరు మీ దేవుడైన యెహోవా మీకు వారసత్వంగా ఇస్తున్న దేశంలోకి ప్రవేశించినప్పుడు దానిని స్వాధీనం చేసుకుని దానిలో స్థిరపడాలి.

  14. ద్వితీయోపదేశకాండము 26:2సుమారు క్రీ.పూ. 1451

    మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న భూమి నేల నుండి మీరు ఉత్పత్తి చేసే అన్ని ఫలాలను తీసుకుని వాటిని బుట్టలో ఉంచండి, తర్వాత మీ దేవుడైన యెహోవా తన నామానికి నివాసంగా ఎన్నుకునే ప్రదేశానికి వెళ్లి,

  15. ద్వితీయోపదేశకాండము 26:3సుమారు క్రీ.పూ. 1451

    ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న యాజకునికి, “మాకు ఇస్తానని యెహోవా మా పూర్వికులకు ప్రమాణం చేసిన దేశానికి నేను వచ్చానని ఈ రోజు మీ దేవుడైన యెహోవాకు ప్రకటిస్తున్నాను” అని చెప్పండి.

  16. ద్వితీయోపదేశకాండము 26:4సుమారు క్రీ.పూ. 1451

    యాజకుడు మీ చేతుల్లో నుండి ఆ గంపను తీసుకుని మీ దేవుడైన యెహోవా బలిపీఠం ముందు క్రింద పెట్టాలి.

  17. ద్వితీయోపదేశకాండము 26:5సుమారు క్రీ.పూ. 1451

    అప్పుడు మీరు మీ దేవుడైన యెహోవా ఎదుట ఇలా ప్రకటించాలి: “నా తండ్రి సంచరించే అరామీయుడు, అతడు కొద్దిమంది వ్యక్తులతో ఈజిప్టుకు వెళ్లి అక్కడ నివసించి, శక్తివంతమైన, అసంఖ్యాకమైన గొప్ప దేశంగా అయ్యాడు.

  18. ద్వితీయోపదేశకాండము 26:6సుమారు క్రీ.పూ. 1451

    కాని ఈజిప్టువారు మనలను హింసించి, బాధపెట్టి, మనలను కఠినమైన శ్రమకు గురి చేశారు.

  19. ద్వితీయోపదేశకాండము 26:7సుమారు క్రీ.పూ. 1451

    మనం మన పూర్వికుల దేవుడైన యెహోవాకు మొరపెట్టుకున్నాము. యెహోవా మన మొర విని, మన బాధ, ప్రయాస, మనకు కలిగిన హింసను చూశారు.

  20. ద్వితీయోపదేశకాండము 26:8సుమారు క్రీ.పూ. 1451

    యెహోవా తన బలమైన హస్తంతో చేయి చాపి మహా భయంకరమైన విధంగా చర్య తీసుకున్నాడు, అసాధారణ గుర్తులను, అద్భుతాలను చూపించారు.

  21. ద్వితీయోపదేశకాండము 26:9సుమారు క్రీ.పూ. 1451

    ఈ స్థలానికి మనలను తెచ్చి పాలు తేనెలు నదులైపారే ఈ దేశాన్ని మనకిచ్చారు.

  22. ద్వితీయోపదేశకాండము 26:10సుమారు క్రీ.పూ. 1451

    యెహోవా, మీరు నాకు ఇచ్చిన భూమిలోని మొదటి ఫలాలను ఇప్పుడు తెస్తున్నాను.” ఆ గంపను మీ దేవుడైన యెహోవా ముందు పెట్టి ఆయన ముందు నమస్కరించాలి.

  23. ద్వితీయోపదేశకాండము 26:11సుమారు క్రీ.పూ. 1451

    నీకు మీ ఇంటివారికి మీ దేవుడైన యెహోవా అనుగ్రహించిన మేలును బట్టి మీరూ లేవీయులు అలాగే మీ మధ్య ఉన్న విదేశీయులు కలిసి సంతోషించాలి.

  24. ద్వితీయోపదేశకాండము 26:12సుమారు క్రీ.పూ. 1451

    పదవ భాగం ఇచ్చే సంవత్సరం, అనగా మూడవ సంవత్సరం మీ రాబడిలో దశమభాగం చెల్లించి, అది లేవీయులకు విదేశీయులకు తండ్రిలేనివారికి విధవరాండ్రకు ఇవ్వాలి. వారు మీ గ్రామాల్లో వీరంతా తిని తృప్తి పొందాలి.

  25. ద్వితీయోపదేశకాండము 26:13సుమారు క్రీ.పూ. 1451

    అప్పుడు మీరు మీ దేవుడైన యెహోవా సన్నిధిలో ఇలా చెప్పాలి: “మీరు ఆజ్ఞాపించిన ప్రకారము నేను ప్రతిష్ఠితమైన దాన్ని నా ఇంటి నుండి తీసివేసి లేవీయులకు విదేశీయులకు, తండ్రిలేనివారికి విధవరాండ్రకు ఇచ్చాను. నేను మీ ఆజ్ఞలను ప్రక్కన పెట్టలేదు వాటిలో దేన్ని నేను మరచిపోలేదు.