- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446–1406 BC
The Wilderness Years
Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.
ఈ కాలపు వచనాలు
- ద్వితీయోపదేశకాండము 26:14సుమారు క్రీ.పూ. 1451
నేను దుఃఖంలో ఉన్నప్పుడు ప్రతిష్ఠితమైన దానిలోనిది ఏదీ తినలేదు, నేను అపవిత్రంగా ఉన్న సమయంలో అందులో ఏదీ తీసివేయలేదు, చనిపోయినవారి కోసం దాన్ని అర్పించలేదు.నేను నా దేవుడైన యెహోవాకు లోబడ్డాను; మీరు ఆజ్ఞాపించిన ప్రతిదీ నేను చేశాను.
- ద్వితీయోపదేశకాండము 26:15సుమారు క్రీ.పూ. 1451
మీ పవిత్ర నివాసమైన ఆకాశం నుండి క్రిందికి చూడండి మీ పూర్వికులకు ప్రమాణం చేసినట్లుగా మీ ప్రజలైన ఇశ్రాయేలీయులను, మీరు మాకు ఇచ్చిన పాలు తేనెలు ప్రవహించే ఈ భూమిని ఆశీర్వదించండి.”
- ద్వితీయోపదేశకాండము 26:16సుమారు క్రీ.పూ. 1451
మీ దేవుడైన యెహోవా ఈ రోజున మీకాజ్ఞాపిస్తున్న ఈ శాసనాలు చట్టాలు మీరు పాటించాలి; మీ పూర్ణహృదయంతో, మీ ప్రాణమంతటితో మీరు జాగ్రత్తగా వాటిని పాటించాలి.
- ద్వితీయోపదేశకాండము 26:17సుమారు క్రీ.పూ. 1451
మీరు ఈ రోజు యెహోవాయే మీ దేవుడని మీరు ఆయనకు విధేయులై నడుస్తారని, మీరు ఆయన శాసనాలను, ఆజ్ఞలను, చట్టాలను పాటిస్తారని, ఆయన మార్గంలో నడుస్తారని మీరు ప్రకటించారు.
- ద్వితీయోపదేశకాండము 26:18సుమారు క్రీ.పూ. 1451
యెహోవా ఈ రోజున మీరు ఆయన ప్రజలని, ఆయన వాగ్దానం చేసినట్లుగా మీరు ఆయన స్వంత ప్రజలుగా ఉంటూ ఆయన ఆజ్ఞలన్నిటిని పాటించాలని ప్రకటించారు.
- ద్వితీయోపదేశకాండము 26:19సుమారు క్రీ.పూ. 1451
ఆయన తాను చేసిన అన్ని దేశాల కంటే మిమ్మల్ని హెచ్చిస్తారని, అప్పుడు మీరు ప్రశంసలు, కీర్తి, గౌరవం పొందుకుంటారని, ఆయన వాగ్దానం చేసినట్లుగా మీరు మీ దేవుడైన యెహోవాకు పరిశుద్ధ ప్రజలుగా ఉంటారని ఆయన ప్రకటించారు.
- ద్వితీయోపదేశకాండము 27:1సుమారు క్రీ.పూ. 1451
మోషే, ఇశ్రాయేలు పెద్దలు ప్రజలకు ఇలా ఆజ్ఞాపించారు: “ఈ రోజు మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞలన్నిటిని మీరు పాటించాలి.
- ద్వితీయోపదేశకాండము 27:2సుమారు క్రీ.పూ. 1451
మీకు దేవుడైన యెహోవా ఇస్తున్న వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి యొర్దాను దాటిన రోజున, మీరు పెద్ద రాళ్లు నిలబెట్టి వాటికి సున్నం వేయాలి.
- ద్వితీయోపదేశకాండము 27:3సుమారు క్రీ.పూ. 1451
మీ పూర్వికుల దేవుడైన యెహోవా మీకు వాగ్దానం చేసినట్లే, మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి ప్రవేశించడానికి మీరు దాటునప్పుడు ఈ చట్టం లోని పూర్తి మాటలను వాటిపై వ్రాయండి.
- ద్వితీయోపదేశకాండము 27:4సుమారు క్రీ.పూ. 1451
మీరు యొర్దాను దాటినప్పుడు, సున్నం వేసిన ఈ రాళ్లను నేను ఈ రోజు మీకు ఆజ్ఞాపించినట్లు ఏబాలు పర్వతం మీద నిలబెట్టండి.
- ద్వితీయోపదేశకాండము 27:5సుమారు క్రీ.పూ. 1451
అక్కడ మీ దేవుడైన యెహోవాకు ఒక బలిపీఠం రాళ్లతో కట్టాలి. వాటిపై ఎలాంటి ఇనుప సాధనాన్ని వాడకూడదు.
- ద్వితీయోపదేశకాండము 27:6సుమారు క్రీ.పూ. 1451
చెక్కని రాళ్లతో యెహోవాకు బలిపీఠం కట్టి దాని మీద దహనబలులు అర్పించాలి.
- ద్వితీయోపదేశకాండము 27:7సుమారు క్రీ.పూ. 1451
అక్కడ సమాధానబలులు సమర్పించి, వాటిని తింటూ మీ దేవుడైన యెహోవా సన్నిధిలో సంతోషించాలి.
- ద్వితీయోపదేశకాండము 27:8సుమారు క్రీ.పూ. 1451
మీరు నిలబెట్టిన రాళ్లమీద ఈ ధర్మశాస్త్రంలోని అన్ని మాటలను స్పష్టంగా వ్రాయండి.”
- ద్వితీయోపదేశకాండము 27:9సుమారు క్రీ.పూ. 1451
తర్వాత మోషే, లేవీయ యాజకులు ఇశ్రాయేలు ప్రజలందరితో ఇలా అన్నారు, “ఇశ్రాయేలూ, మౌనంగా ఉండి నేను చెప్పేది విను! ఇప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాకు ప్రజలయ్యారు.
- ద్వితీయోపదేశకాండము 27:10సుమారు క్రీ.పూ. 1451
మీరు దేవుడైన యెహోవాకు లోబడి, నేను మీకు ఈ రోజు ఇస్తున్న ఆయన ఆజ్ఞలను, శాసనాలను మీరు పాటించాలి.”
- ద్వితీయోపదేశకాండము 27:11సుమారు క్రీ.పూ. 1451
ఆ రోజే మోషే ప్రజలకు ఆజ్ఞాపించాడు:
- ద్వితీయోపదేశకాండము 27:12సుమారు క్రీ.పూ. 1451
మీరు యొర్దాను నది దాటిన తర్వాత, షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, యోసేపు, బెన్యామీను గోత్రాల వారు గెరిజీము పర్వతం మీద నిలబడి ప్రజలను దీవించాలి.
- ద్వితీయోపదేశకాండము 27:13సుమారు క్రీ.పూ. 1451
రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను, నఫ్తాలి గోత్రాల వారు ఏబాలు పర్వతం మీద నిలబడి, శాపాలు పలకాలి.
- ద్వితీయోపదేశకాండము 27:14సుమారు క్రీ.పూ. 1451
లేవీయులు ఇశ్రాయేలు ప్రజలందరికి బిగ్గరగా ఇలా చెప్పాలి:
- ద్వితీయోపదేశకాండము 27:15సుమారు క్రీ.పూ. 1451
“శిల్పి చేతులతో చెక్కబడి పోతపోయబడిన యెహోవాకు అసహ్యమైన విగ్రహాలను రహస్య స్థలంలో దాచుకునే వారెవరైనా శాపగ్రస్తులు” అని అన్నప్పుడు ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
- ద్వితీయోపదేశకాండము 27:16సుమారు క్రీ.పూ. 1451
“తండ్రిని గాని తల్లిని గాని అవమానపరచే వారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
- ద్వితీయోపదేశకాండము 27:17సుమారు క్రీ.పూ. 1451
“తన పొరుగువాడి సరిహద్దు రాయిని తీసివేసేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు, ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
- ద్వితీయోపదేశకాండము 27:18సుమారు క్రీ.పూ. 1451
“గ్రుడ్డివాన్ని త్రోవ తప్పించేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు, ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
- ద్వితీయోపదేశకాండము 27:19సుమారు క్రీ.పూ. 1451
“విదేశీయుల పట్ల, తండ్రిలేనివారి పట్ల, విధవరాండ్ర పట్ల న్యాయం తప్పి తీర్పు తీర్చేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు, ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.