- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446–1406 BC
The Wilderness Years
Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.
ఈ కాలపు వచనాలు
- ద్వితీయోపదేశకాండము 28:19సుమారు క్రీ.పూ. 1451
మీరు లోపలికి వచ్చినప్పుడు శపించబడతారు, బయటకు వెళ్లినప్పుడు శపించబడతారు.
- ద్వితీయోపదేశకాండము 28:20సుమారు క్రీ.పూ. 1451
మీరు ఆయనను విడిచిపెట్టి చేసిన చెడు కారణంగా, అకస్మాత్తుగా నాశనమయ్యే వరకు, యెహోవా మీరు చేయి వేసిన ప్రతి దాని మీదికి శాపాలు, నిరాశను, నిరుత్సాహాన్ని పంపుతారు.
- ద్వితీయోపదేశకాండము 28:21సుమారు క్రీ.పూ. 1451
మీరు స్వాధీనపరచుకోడానికి ప్రవేశిస్తున్న దేశంలో ఉండకుండ మిమ్మల్ని నాశనం చేసే వరకు యెహోవా మిమ్మల్ని రోగాలతో తెగులుతో బాధిస్తారు.
- ద్వితీయోపదేశకాండము 28:22సుమారు క్రీ.పూ. 1451
యెహోవా వ్యాధితో, జ్వరం, వాపు, తీవ్రమైన వేడి, ఖడ్గంతో, ముడత, బూజుతో మీమీద దాడి చేస్తారు, మీరు నశించే వరకు ఇది తెగులుగా మిమ్మల్ని వేధిస్తుంది.
- ద్వితీయోపదేశకాండము 28:23సుమారు క్రీ.పూ. 1451
మీ తలమీద ఆకాశం ఇత్తడిలా మీ క్రింద నేల ఇనుములా ఉంటాయి.
- ద్వితీయోపదేశకాండము 28:24సుమారు క్రీ.పూ. 1451
యెహోవా మీ దేశపు వర్షాన్ని దుమ్ము, పొడిగా మారుస్తారు; మీరు నాశనం అయ్యేవరకు అది ఆకాశాల నుండి దిగి వస్తుంది.
- ద్వితీయోపదేశకాండము 28:25సుమారు క్రీ.పూ. 1451
మీ శత్రువుల చేతిలో యెహోవా మిమ్మల్ని ఓడిపోయేలా చేస్తారు.మీరు వారి దగ్గరకు ఒకవైపు నుండి వస్తారు, కాని వారి నుండి ఏడు వైపుల్లో పారిపోతారు. మీరంటే అన్ని రాజ్యాలకు భయం కలుగుతుంది.
- ద్వితీయోపదేశకాండము 28:26సుమారు క్రీ.పూ. 1451
మీ కళేబరాలు ఆకాశపక్షులకు అడవి మృగాలకు ఆహారమవుతాయి, వాటిని వెళ్లగొట్టే వారెవరూ ఉండరు.
- ద్వితీయోపదేశకాండము 28:27సుమారు క్రీ.పూ. 1451
యెహోవా మిమ్మల్ని నయం కాలేని ఈజిప్టు కురుపులు, గడ్డలు, చీముపట్టిన పుండ్లు, దురదతో బాధిస్తారు.
- ద్వితీయోపదేశకాండము 28:28సుమారు క్రీ.పూ. 1451
యెహోవా మిమ్మల్ని వెర్రితనంతో, గ్రుడ్డితనంతో, మానసిక ఆందోళనతో బాధిస్తారు.
- ద్వితీయోపదేశకాండము 28:29సుమారు క్రీ.పూ. 1451
మధ్యాహ్న సమయంలో మీరు చీకటిలో గ్రుడ్డివానిలా తడుముకుంటారు. మీరు చేసే ప్రతీ పనిలో మీరు విఫలమవుతారు; రోజు రోజుకు మీరు అణచివేయబడతారు, దోచుకోబడతారు, మిమ్మల్ని రక్షించడానికి ఎవరూ ఉండరు.
- ద్వితీయోపదేశకాండము 28:30సుమారు క్రీ.పూ. 1451
మీకు ఒక స్త్రీతో పెళ్ళి నిశ్చయమవుతుంది, కానీ మరొకరు ఆమెను తీసుకెళ్లి పాడుచేస్తారు. మీరు ఇల్లు కట్టుకుంటారు, కానీ మీరు అందులో నివసించరు. మీరు ద్రాక్షతోటను నాటుతారు, కానీ మీరు దాని ఫలాలను తినరు.
- ద్వితీయోపదేశకాండము 28:31సుమారు క్రీ.పూ. 1451
మీరు చూస్తూ ఉండగానే మీ ఎద్దు వధించబడుతుంది, కానీ మీరు దాంట్లో నుండి ఏమి తినరు. మీ గాడిద బలవంతంగా తీసుకెళ్తారు, మళ్ళీ మీకివ్వరు. మీ గొర్రెలు మేకలు శత్రువుల వశమవుతాయి, వాటిని ఎవ్వరూ రక్షించరు.
- ద్వితీయోపదేశకాండము 28:32సుమారు క్రీ.పూ. 1451
మీ కుమారులు కుమార్తెలు వేరొక దేశానికి ఇవ్వబడతారు, దినదినం వారి కోసం ఎదురుచూసి మీ కళ్లు అలసిపోతాయి, చేయి ఎత్తడానికి కూడా శక్తి ఉండదు.
- ద్వితీయోపదేశకాండము 28:33సుమారు క్రీ.పూ. 1451
మీకు తెలియని ప్రజలు మీ భూమి, మీ శ్రమ ఉత్పత్తి చేసే వాటిని తింటారు, మీ జీవితమంతా క్రూరమైన అణచివేత తప్ప మీకు ఏమీ ఉండదు.
- ద్వితీయోపదేశకాండము 28:34సుమారు క్రీ.పూ. 1451
మీరు చూసే దృశ్యాలు మిమ్మల్ని పిచ్చివారిని చేస్తాయి.
- ద్వితీయోపదేశకాండము 28:35సుమారు క్రీ.పూ. 1451
యెహోవా మీ మోకాళ్లను, కాళ్లను నయం చేయలేని బాధాకరమైన కురుపులతో బాధిస్తారు, అవి మీ అరికాళ్ల నుండి నడినెత్తి వరకు వ్యాపిస్తాయి.
- ద్వితీయోపదేశకాండము 28:36సుమారు క్రీ.పూ. 1451
మీకు, మీ పూర్వికులకు తెలియని దేశానికి యెహోవా మిమ్మల్ని మీరు నియమించుకున్న రాజును తోలివేస్తారు. అక్కడ మీరు ఇతర దేవుళ్ళు, చెక్క, రాతి దేవుళ్ళను సేవిస్తారు.
- ద్వితీయోపదేశకాండము 28:37సుమారు క్రీ.పూ. 1451
యెహోవా మిమ్మల్ని నడిపించే ప్రజలందరి మధ్య మీరు భయానకమైన, ఒక సామెతగా హేళనకు కారణంగా మారతారు.
- ద్వితీయోపదేశకాండము 28:38సుమారు క్రీ.పూ. 1451
మీరు పొలంలో చాలా విత్తనాలు విత్తుతారు, కానీ మిడుతలు దాన్ని మ్రింగివేస్తాయి కాబట్టి మీరు కొద్దిగా పంట కోస్తారు.
- ద్వితీయోపదేశకాండము 28:39సుమారు క్రీ.పూ. 1451
మీరు ద్రాక్షతోటలు నాటి వాటిని శ్రమపడి సేద్యం చేస్తారు కాని ద్రాక్షరసం త్రాగరు, ద్రాక్షపండ్లు ఏరుకోరు, కారణం పురుగులు వాటిని తినేస్తాయి.
- ద్వితీయోపదేశకాండము 28:40సుమారు క్రీ.పూ. 1451
మీకు ఒలీవచెట్లు ఉంటాయి గాని మీరు నూనె వాడరు, ఎందుకంటే ఒలీవలు రాలిపోతాయి.
- ద్వితీయోపదేశకాండము 28:41సుమారు క్రీ.పూ. 1451
మీకు కుమారులు, కుమార్తెలు ఉంటారు, కానీ వారు మీ దగ్గర ఉండరు, ఎందుకంటే వారు చెరలోకి వెళ్లిపోతారు.
- ద్వితీయోపదేశకాండము 28:42సుమారు క్రీ.పూ. 1451
మీ చెట్లను మీ పొలం పంటలను మిడతల గుంపులు వచ్చి ఆక్రమించుకుంటాయి.
- ద్వితీయోపదేశకాండము 28:43సుమారు క్రీ.పూ. 1451
మీ మధ్య నివసించే విదేశీయులు మీకంటే అంతకంతకు పైకి ఎదుగుతారు, కానీ మీరు అంతకంతకు దిగజారిపోతారు.