కంటెంట్‌కు వెళ్లండి

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ద్వితీయోపదేశకాండము 28:44సుమారు క్రీ.పూ. 1451

    వారు మీకు అప్పిస్తారు గాని, మీరు వారికి అప్పు ఇవ్వరు. వారు తలగా ఉంటారు, మీరు తోకగా ఉంటారు.

  2. ద్వితీయోపదేశకాండము 28:45సుమారు క్రీ.పూ. 1451

    ఈ శాపాలన్నీ మీ మీదికి వస్తాయి. మీరు నాశనమయ్యే వరకు వారు మిమ్మల్ని వెంటాడి, మిమ్మల్ని అధిగమిస్తారు, ఎందుకంటే మీరు మీ దేవుడైన యెహోవాకు విధేయత చూపలేదు, ఆయన మీకు ఇచ్చిన ఆజ్ఞలను, శాసనాలను మీరు పాటించలేదు.

  3. ద్వితీయోపదేశకాండము 28:46సుమారు క్రీ.పూ. 1451

    అవి మీకు, మీ వారసులకు ఎప్పటికీ సూచనలుగా ఆశ్చర్యం కలిగించేవిగా ఉంటాయి.

  4. ద్వితీయోపదేశకాండము 28:47సుమారు క్రీ.పూ. 1451

    ఎందుకంటే మీరు సమృద్ధి కలిగి ఉన్నప్పటికీ మీ దేవుడైన యెహోవాకు సంతోషంగా, ఆనందంగా సేవ చేయలేదు.

  5. ద్వితీయోపదేశకాండము 28:48సుమారు క్రీ.పూ. 1451

    అందువల్ల ఆకలి, దాహం, నగ్నత్వం, పేదరికంలో, యెహోవా మీకు వ్యతిరేకంగా పంపే శత్రువులకు మీరు సేవ చేస్తారు. మిమ్మల్ని నాశనం చేసే వరకు ఆయన మీ మెడ మీద ఇనుప కాడి మోపుతాడు.

  6. ద్వితీయోపదేశకాండము 28:49సుమారు క్రీ.పూ. 1451

    యెహోవా మీకు వ్యతిరేకంగా దూర ప్రాంతాల నుండి, భూమి చివర్ల నుండి, ఒక గ్రద్ద దూసుకు వస్తున్నట్లుగా, మీకు అర్థం చేసుకోలేని భాష మాట్లాడే ఒక దేశాన్ని తెస్తారు.

  7. ద్వితీయోపదేశకాండము 28:50సుమారు క్రీ.పూ. 1451

    అది వృద్ధుల పట్ల గౌరవం గాని చిన్నవారి పట్ల జాలి గాని లేని క్రూరంగా కనిపించే దేశము.

  8. ద్వితీయోపదేశకాండము 28:51సుమారు క్రీ.పూ. 1451

    మీరు నాశనమయ్యే వరకు వారు మీ పశువుల పిల్లలను, మీ భూమిలోని పంటలను మ్రింగివేస్తారు. మీరు నాశనమయ్యే వరకు వారు మీకు ధాన్యం గాని, క్రొత్త ద్రాక్షరసం గాని, ఒలీవనూనె గాని, మీ పశువుల దూడలను గాని, మీ మందల గొర్రెపిల్లలను వదిలిపెట్టరు.

  9. ద్వితీయోపదేశకాండము 28:52సుమారు క్రీ.పూ. 1451

    మీరు నమ్మే ఎత్తైన కోటగోడలు కూలిపోయే వరకు వారు మీ దేశంలోని అన్ని పట్టణాలను ముట్టడిస్తారు. మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలోని అన్ని పట్టణాలను వారు ముట్టడిస్తారు.

  10. ద్వితీయోపదేశకాండము 28:53సుమారు క్రీ.పూ. 1451

    ముట్టడి సమయంలో మీ శత్రువు మీకు కలిగించే బాధల కారణంగా, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన గర్భఫలం, కుమారులు కుమార్తెల మాంసాన్ని మీరు తింటారు.

  11. ద్వితీయోపదేశకాండము 28:54సుమారు క్రీ.పూ. 1451

    మీలో అత్యంత సౌమ్యుడైన, సున్నితమైన పురుషునికి కూడా తన సొంత సోదరునిపై గాని లేదా తాను ప్రేమించే భార్యపై గాని లేదా మిగిలి ఉన్న పిల్లలపై గాని కనికరం ఉండదు.

  12. ద్వితీయోపదేశకాండము 28:55సుమారు క్రీ.పూ. 1451

    అతడు తినే తన పిల్లల మాంసంలో కొంచెమైనా అతడు వారికి ఇవ్వడు. ఎందుకంటే మీ పట్టణాలన్ని ముట్టడి చేయబడిన సమయంలో మీ శత్రువు మీకు కలిగించిన బాధను బట్టి అతనికి మిగిలింది అదే.

  13. ద్వితీయోపదేశకాండము 28:56సుమారు క్రీ.పూ. 1451

    మీలో అత్యంత సౌమ్యమైన సున్నితమైన స్త్రీ తన పాదం కూడా నేలమీద మోపే సాహసం చేయని స్త్రీ తాను ప్రేమించిన భర్తను, తన సొంత కుమారుడు లేదా కుమార్తెను వేధిస్తుంది.

  14. ద్వితీయోపదేశకాండము 28:57సుమారు క్రీ.పూ. 1451

    మీ పట్టణాలు ముట్టడి చేయబడిన సమయంలో మీ శత్రువు మిమ్మల్ని పెట్టే బాధను బట్టి ఆమె వేరే దారి లేక ఆమె గర్భం నుండి స్రవించే మావిని, కనిన పిల్లలను రహస్యంగా తినాలని అనుకుంటుంది.

  15. ద్వితీయోపదేశకాండము 28:58సుమారు క్రీ.పూ. 1451

    ఈ గ్రంథంలో వ్రాసి ఉన్న ధర్మశాస్త్ర మాటలన్నిటిని ఒకవేళ మీరు జాగ్రత్తగా పాటించక, మీ దేవుడైన యెహోవా మహిమగల అద్భుతమైన నామానికి మీరు భయపడకపోతే,

  16. ద్వితీయోపదేశకాండము 28:59సుమారు క్రీ.పూ. 1451

    యెహోవా మీకు, మీ వారసులకు భయంకరమైన తెగుళ్ళు, కఠినమైన, సుదీర్ఘమైన విపత్తులు, తీవ్రమైన, దీర్ఘకాలిక అనారోగ్యాలను పంపుతారు.

  17. ద్వితీయోపదేశకాండము 28:60సుమారు క్రీ.పూ. 1451

    మీరు భయపడే ఈజిప్టు వ్యాధులన్నిటిని ఆయన మీ మీదికి తెస్తారు, అవి మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉంటాయి.

  18. ద్వితీయోపదేశకాండము 28:61సుమారు క్రీ.పూ. 1451

    మీరు నాశనం అయ్యేవరకు ఈ ధర్మశాస్త్ర పుస్తకంలో నమోదు చేయబడని ప్రతి విధమైన రోగాన్ని, విపత్తును కూడా యెహోవా మీపైకి తెస్తారు.

  19. ద్వితీయోపదేశకాండము 28:62సుమారు క్రీ.పూ. 1451

    ఆకాశంలోని నక్షత్రాల్లా అనేకమైన మీరు కొద్దిమంది మాత్రమే మిగిలి ఉంటారు, ఎందుకంటే మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడలేదు.

  20. ద్వితీయోపదేశకాండము 28:63సుమారు క్రీ.పూ. 1451

    మీరు వృద్ధి చెందడం, సంఖ్య పెరగడం యెహోవాకు ఎంత సంతోషాన్ని కలిగించిందో, మిమ్మల్ని పతనం చేయడం, నాశనం చేయడం కూడా ఆయనను అంతే సంతోషపరుస్తుంది. మీరు స్వాధీనం చేసుకోవడానికి ప్రవేశిస్తున్న దేశం నుండి మీరు పెరికివేయబడతారు.

  21. ద్వితీయోపదేశకాండము 28:64సుమారు క్రీ.పూ. 1451

    అప్పుడు యెహోవా భూమి యొక్క ఒక చివర నుండి మరొక చివర వరకు అన్ని దేశాల మధ్య మిమ్మల్ని చెదరగొడతారు. అక్కడ మీరు ఇతర దేవుళ్ళను మీకు గాని మీ పూర్వికులకు గాని తెలియని చెక్కతో రాతితో చేయబడిన దేవుళ్ళను సేవిస్తారు.

  22. ద్వితీయోపదేశకాండము 28:65సుమారు క్రీ.పూ. 1451

    ఆ దేశాల్లో మీకు విశ్రాంతి దొరకదు, మీ అరికాలుకు కూడా విశ్రాంతి స్థలం ఉండదు. అక్కడ యెహోవా మీకు మనోవేదన, ఎదురుచూపులతో మసకబారిన కళ్లను, కలవరపడుతున్న హృదయాన్ని ఇస్తారు.

  23. ద్వితీయోపదేశకాండము 28:66సుమారు క్రీ.పూ. 1451

    మీరు రాత్రి, పగలు దిగులుతో నిండుకొని, ఎప్పుడూ ప్రాణభయంతో జీవిస్తారు, మీరు బ్రతుకుతారన్న నమ్మకం మీకు ఉండదు.

  24. ద్వితీయోపదేశకాండము 28:67సుమారు క్రీ.పూ. 1451

    ఎందుకంటే మీ హృదయాలను నింపే భయం మీ కళ్లు చూసే దృశ్యాలను బట్టి మీరు ఉదయాన, “ఒకవేళ ఇది సాయంత్రం అయితే బాగుండు!” అని సాయంత్రం, “ఒకవేళ ఇది ఉదయం అయితే బాగుండు!” అని అంటారు.

  25. ద్వితీయోపదేశకాండము 28:68సుమారు క్రీ.పూ. 1451

    మీరు మళ్ళీ ఎన్నడూ ఈజిప్టుకు ప్రయాణం చేయకూడదని నేను చెప్పిన ఈజిప్టుకు యెహోవా మిమ్మల్ని ఓడలలో తిరిగి పంపుతారు. అక్కడ మీరు మగ, ఆడ బానిసలుగా మీ శత్రువులకు మిమ్మల్ని మీరు అమ్మకానికి పెట్టుకుంటారు, కానీ ఎవరూ మిమ్మల్ని కొనరు.