- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446–1406 BC
The Wilderness Years
Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.
ఈ కాలపు వచనాలు
- ద్వితీయోపదేశకాండము 27:20సుమారు క్రీ.పూ. 1451
“తన తండ్రి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకుని తండ్రి పాన్పును అపవిత్రపరచినవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు, ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
- ద్వితీయోపదేశకాండము 27:21సుమారు క్రీ.పూ. 1451
“ఏ జంతువుతోనైనా లైంగిక సంబంధం పెట్టుకునేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు, ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
- ద్వితీయోపదేశకాండము 27:22సుమారు క్రీ.పూ. 1451
“తోబుట్టువుతో అనగా తన తండ్రి కుమార్తెతో గాని, తన తల్లి కుమార్తెతో గాని లైంగిక సంబంధం పెట్టుకునేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు, ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
- ద్వితీయోపదేశకాండము 27:23సుమారు క్రీ.పూ. 1451
“అత్తతో లైంగిక సంబంధం పెట్టుకునేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు, ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
- ద్వితీయోపదేశకాండము 27:24సుమారు క్రీ.పూ. 1451
“పొరుగువాన్ని రహస్యంగా చంపేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
- ద్వితీయోపదేశకాండము 27:25సుమారు క్రీ.పూ. 1451
“నిర్దోషి ప్రాణం తీయటానికి లంచం తీసుకునేవారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు, ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
- ద్వితీయోపదేశకాండము 27:26సుమారు క్రీ.పూ. 1451
“ఈ ధర్మశాస్త్రంలోని మాటలను అమలు చేయడం ద్వారా వాటిని పాటించనివారు శాపగ్రస్తులు” అని అన్నప్పుడు, ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.
- ద్వితీయోపదేశకాండము 28:1సుమారు క్రీ.పూ. 1451
మీరు మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటూ, నేను ఈ రోజు మీకిచ్చే ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరిస్తే, మీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త దేశాల కంటే పైగా మిమ్మల్ని హెచ్చిస్తారు.
- ద్వితీయోపదేశకాండము 28:2సుమారు క్రీ.పూ. 1451
మీ దేవుడైన యెహోవాకు మీరు లోబడితే, ఈ దీవెనలన్నీ మీ మీదికి వచ్చి, మిమ్మల్ని వెంబడిస్తాయి:
- ద్వితీయోపదేశకాండము 28:3సుమారు క్రీ.పూ. 1451
మీరు పట్టణంలో దీవించబడతారు, పొలంలో దీవించబడతారు.
- ద్వితీయోపదేశకాండము 28:4సుమారు క్రీ.పూ. 1451
మీ గర్భఫలం దీవించబడుతుంది, భూ పంటలు, పశువుల మందల్లోని దూడలు గొర్రెల మందల్లోని గొర్రెపిల్లలు దీవించబడతాయి.
- ద్వితీయోపదేశకాండము 28:5సుమారు క్రీ.పూ. 1451
మీ గంప, మీ పిండి పిసికే తొట్టి దీవించబడుతుంది.
- ద్వితీయోపదేశకాండము 28:6సుమారు క్రీ.పూ. 1451
మీరు లోపలికి వచ్చినప్పుడు, బయటకు వెళ్లినప్పుడు దీవించబడతారు.
- ద్వితీయోపదేశకాండము 28:7సుమారు క్రీ.పూ. 1451
శత్రువులు మీ మీదికి లేచినప్పుడు, యెహోవా వారిని మీ ముందు ఓడిపోయేలా చేస్తారు. వారు ఒకవైపు నుండి మీ దగ్గరకు వస్తారు కాని నీ దగ్గరి నుండి ఏడు వైపుల్లో పారిపోతారు.
- ద్వితీయోపదేశకాండము 28:8సుమారు క్రీ.పూ. 1451
మీ కొట్ల మీదకు మీ ప్రయత్నాలన్నిటి మీదకు యెహోవా దీవెనలు పంపుతారు. మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తారు.
- ద్వితీయోపదేశకాండము 28:9సుమారు క్రీ.పూ. 1451
మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను పాటించి, ఆయన మార్గంలో మీరు నడుచుకుంటే, యెహోవా ప్రమాణ పూర్వకంగా వాగ్దానం చేసినట్లుగా, యెహోవా మిమ్మల్ని తన పరిశుద్ధ ప్రజలుగా స్థాపిస్తారు.
- ద్వితీయోపదేశకాండము 28:10సుమారు క్రీ.పూ. 1451
అప్పుడు భూమి మీద ఉన్న జనాంగాలందరూ మీరు యెహోవా పేరుతో పిలువబడ్డారని చూసి, వారు మీకు భయపడతారు.
- ద్వితీయోపదేశకాండము 28:11సుమారు క్రీ.పూ. 1451
యెహోవా మీకు ఇస్తానని మీ పూర్వికులకు ప్రమాణం చేసిన దేశంలో, మీ గర్భ ఫలంలో, మీ పశువుల పిల్లల్లో, మీ నేల పంటల్లో మీకు సమృద్ధిగా వృద్ధిని ఇస్తారు.
- ద్వితీయోపదేశకాండము 28:12సుమారు క్రీ.పూ. 1451
కాలానుగుణంగా మీ భూమిపై వర్షం కురిపించడానికి, మీ చేతి పనులన్నింటినీ దీవించడానికి యెహోవా తన ఆకాశ గిడ్డంగులను తెరుస్తారు. మీరు అనేక దేశాలకు అప్పు ఇస్తారు, కానీ ఎవరినుండి అప్పు తీసుకోరు.
- ద్వితీయోపదేశకాండము 28:13సుమారు క్రీ.పూ. 1451
యెహోవా మిమ్మల్ని తలగా చేస్తారు, తోకగా కాదు. ఈ రోజు నేను మీకు ఇచ్చే మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు శ్రద్ధగా గమనించి, వాటిని జాగ్రత్తగా పాటిస్తే, మీరు పై వారిగా ఉంటారు, క్రింది వారిగా ఉండరు.
- ద్వితీయోపదేశకాండము 28:14సుమారు క్రీ.పూ. 1451
ఇతర దేవుళ్ళను అనుసరిస్తూ, వారిని సేవిస్తూ, ఈ రోజు నేను మీకు ఇచ్చే ఆజ్ఞల నుండి కుడికి గాని ఎడమకు గాని తిరగవద్దు.
- ద్వితీయోపదేశకాండము 28:15సుమారు క్రీ.పూ. 1451
అయితే, మీరు మీ దేవుడైన యెహోవాకు విధేయత చూపక, నేను ఈ రోజు మీకు ఇస్తున్న ఆయన ఆజ్ఞలన్నిటిని, శాసనాలను జాగ్రత్తగా పాటించకపోతే, ఈ శాపాలన్నీ మీపైకి వచ్చి మిమ్మల్ని ముంచేస్తాయి.
- ద్వితీయోపదేశకాండము 28:16సుమారు క్రీ.పూ. 1451
మీరు పట్టణంలో శపించబడతారు, పొలంలో శపించబడతారు.
- ద్వితీయోపదేశకాండము 28:17సుమారు క్రీ.పూ. 1451
మీ గంప, పిండి పిసికే తొట్టి శపించబడతాయి.
- ద్వితీయోపదేశకాండము 28:18సుమారు క్రీ.పూ. 1451
మీ గర్భఫలం శపించబడుతుంది, మీ భూమి పంటలు, మీ పశువుల దూడలు, మీ మందల గొర్రెపిల్లలు శపించబడతాయి.