కంటెంట్‌కు వెళ్లండి

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ద్వితీయోపదేశకాండము 29:26సుమారు క్రీ.పూ. 1451

    వారు వెళ్లి ఇతర దేవుళ్ళను సేవించారు, వారికి నమస్కరించారు, వారు వారికి తెలియని దేవుళ్ళు, ఆయన వారికి ఇవ్వని దేవుళ్ళు.

  2. ద్వితీయోపదేశకాండము 29:27సుమారు క్రీ.పూ. 1451

    అందువల్ల ఆ దేశంపై యెహోవా కోపం భగ్గుమంది, అందుకే గ్రంథంలో వ్రాయబడి ఉన్న అన్ని శాపాలను ఆయన వారి పైకి తీసుకువచ్చారు.

  3. ద్వితీయోపదేశకాండము 29:28సుమారు క్రీ.పూ. 1451

    యెహోవా భీకరమైన కోపంలో, గొప్ప క్రోధంలో వారి దేశంలో నుండి వారిని పెకిలించి, ఇప్పుడున్నట్లుగా, వారిని వేరే దేశంలోకి నెట్టివేశారు.”

  4. ద్వితీయోపదేశకాండము 29:29సుమారు క్రీ.పూ. 1451

    రహస్య విషయాలు మన దేవుడైన యెహోవాకు చెందినవి, కానీ వెల్లడించబడిన విషయాలు మనకు మన పిల్లలకు ఎప్పటికీ ఉంటాయి, ఈ ధర్మశాస్త్రంలోని మాటలన్నిటినీ మనం పాటించాలి.

  5. ద్వితీయోపదేశకాండము 30:1సుమారు క్రీ.పూ. 1451

    నేను మీ ముందుంచిన ఈ దీవెనలు, శాపాలన్నీ మీ మీదికి వచ్చి, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని చెదరగొట్టిన దేశాల్లో మీరు వాటిని హృదయంలో భద్రం చేసుకుని,

  6. ద్వితీయోపదేశకాండము 30:2సుమారు క్రీ.పూ. 1451

    మీరు మీ పిల్లలు మీ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగివచ్చి, ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే ప్రతీదాని ప్రకారం మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణ ఆత్మతో ఆయనకు లోబడితే,

  7. ద్వితీయోపదేశకాండము 30:3సుమారు క్రీ.పూ. 1451

    మీ దేవుడైన యెహోవా మీ భాగ్యాలను పునరుద్ధరిస్తారు, మీపై కనికరం చూపించి ఆయన మిమ్మల్ని చెదరగొట్టిన అన్ని దేశాలన్నిటి నుండి మిమ్మల్ని మళ్ళీ సమకూరుస్తారు.

  8. ద్వితీయోపదేశకాండము 30:4సుమారు క్రీ.పూ. 1451

    మీరు ఆకాశం క్రింద అత్యంత సుదూర దేశానికి చెదరిపోయినప్పటికి, అక్కడినుండి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని సమకూర్చి తిరిగి తీసుకువస్తారు.

  9. ద్వితీయోపదేశకాండము 30:5సుమారు క్రీ.పూ. 1451

    మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని మీ పూర్వికులకు చెందిన దేశానికి తీసుకువస్తారు. మీరు దాన్ని స్వాధీనం చేసుకుంటారు. మీ పూర్వికులకంటే ఆయన మిమ్మల్ని వృద్ధిలోను, సంఖ్యలోను అధికం చేస్తారు.

  10. ద్వితీయోపదేశకాండము 30:6సుమారు క్రీ.పూ. 1451

    మీ దేవుడైన యెహోవా మీ హృదయాలను, మీ సంతతివారి హృదయాలను సున్నతి చేస్తారు. అప్పుడు మీరు ఆయనను మీ పూర్ణ హృదయం, మీ పూర్ణ ఆత్మతో ప్రేమించి జీవిస్తారు.

  11. ద్వితీయోపదేశకాండము 30:7సుమారు క్రీ.పూ. 1451

    మీ దేవుడైన యెహోవా ఈ శాపాలన్నింటినీ మిమ్మల్ని ద్వేషించే, మిమ్మల్ని హింసించే మీ శత్రువులపైకి తెస్తారు.

  12. ద్వితీయోపదేశకాండము 30:8సుమారు క్రీ.పూ. 1451

    మీరు తిరిగివచ్చిన తర్వాత యెహోవాకు లోబడి ఆయన ఆజ్ఞలన్నిటిని పాటిస్తారు.

  13. ద్వితీయోపదేశకాండము 30:9సుమారు క్రీ.పూ. 1451

    అప్పుడు మీ దేవుడైన యెహోవా మీ చేతిపనులన్నిటిలోను మీ గర్భఫలాల్లో మీ పశువుల పిల్లల్లోను మీ భూమిలోని పంటల్లోను మిమ్మల్ని వర్ధిల్ల చేస్తారు. యెహోవా మీ పూర్వికుల విషయంలో సంతోషించి మిమ్మల్ని అభివృద్ధి చేస్తారు.

  14. ద్వితీయోపదేశకాండము 30:10సుమారు క్రీ.పూ. 1451

    అయితే, మీరు మీ దేవుడైన యెహోవాకు విధేయులై ఉండి, ఈ ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను శాసనాలను పాటించి మీ పూర్ణహృదయంతో మీ పూర్ణాత్మతో యెహోవా వైపు తిరగాలి.

  15. ద్వితీయోపదేశకాండము 30:11సుమారు క్రీ.పూ. 1451

    నేను ఈ రోజున మీకిస్తున్న ఆజ్ఞ అంత కష్టమైందేమీ కాదు, ఇది మీరు అందుకోలేనిదీ కాదు.

  16. ద్వితీయోపదేశకాండము 30:12సుమారు క్రీ.పూ. 1451

    మీరు, “దానిని పొందడానికి పరలోకంలోకి ఎవరు ఎక్కి వెళ్లి, మేము దానిని పాటించేలా మాకు ఎవరు ప్రకటిస్తారు?” అని అడగడానికి ఇది పరలోకంలో లేదు.

  17. ద్వితీయోపదేశకాండము 30:13సుమారు క్రీ.పూ. 1451

    లేదా, “సముద్రాన్ని దాటి దాన్ని తెచ్చి, మేము దానిని పాటించేలా మాకు ఎవరు ప్రకటిస్తారు?” అని మీరు అడగడానికి అది సముద్రం అవతల లేదు.

  18. ద్వితీయోపదేశకాండము 30:14సుమారు క్రీ.పూ. 1451

    మీరు దానిని పాటించేలా ఆ వాక్యం మీకు చాలా దగ్గరగా ఉంది; అది మీ నోటిలో, మీ హృదయంలో ఉంది.

  19. ద్వితీయోపదేశకాండము 30:15సుమారు క్రీ.పూ. 1451

    చూడండి, నేను ఈ రోజు జీవాన్ని వృద్ధిని, మరణాన్ని నాశనాన్ని మీ ముందు ఉంచాను.

  20. ద్వితీయోపదేశకాండము 30:16సుమారు క్రీ.పూ. 1451

    మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలని, ఆయన మార్గంలో నడుచుకోవాలని, ఆయన ఆజ్ఞలు, శాసనాలు, చట్టాలను పాటించాలని నేను ఈ రోజు మీకు ఆజ్ఞాపిస్తున్నాను; అప్పుడు మీరు జీవిస్తారు, వృద్ధిచెందుతారు, మీరు స్వాధీనం చేసుకోవడానికి ప్రవేశించే దేశంలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు.

  21. ద్వితీయోపదేశకాండము 30:17సుమారు క్రీ.పూ. 1451

    కానీ ఒకవేళ మీ హృదయం మారి, మీరు విధేయత చూపకుండ ఇతర దేవుళ్ళకు నమస్కరించి వారిని సేవించడానికి ఆకర్షించబడితే,

  22. ద్వితీయోపదేశకాండము 30:18సుమారు క్రీ.పూ. 1451

    మీరు ఖచ్చితంగా నాశనం చేయబడతారని నేను ఈ రోజు మీకు ప్రకటిస్తున్నాను. మీరు ప్రవేశించి, స్వాధీనం చేసుకోవడానికి యొర్దాను దాటుతున్న దేశంలో మీరు ఎక్కువకాలం జీవించలేరు.

  23. ద్వితీయోపదేశకాండము 30:19సుమారు క్రీ.పూ. 1451

    ఈ రోజు నేను మీ ముందు జీవాన్ని మరణాన్ని, దీవెనలు శాపాలను ఉంచి, ఆకాశాలను భూమిని మీకు మీద సాక్షులుగా పిలుస్తాను. ఇప్పుడు జీవాన్ని ఎంచుకోండి, అప్పుడు మీరు, మీ పిల్లలు బ్రతకవచ్చు.

  24. ద్వితీయోపదేశకాండము 30:20సుమారు క్రీ.పూ. 1451

    మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించేలా, ఆయన స్వరాన్ని విని ఆయనను గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే యెహోవాయే మీ జీవం; మీ పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశంలో ఆయన మీకు దీర్ఘాయుష్షు ఇస్తారు.

  25. ద్వితీయోపదేశకాండము 31:1సుమారు క్రీ.పూ. 1451

    మోషే బయటకు వెళ్లి ఇశ్రాయేలీయులతో ఈ మాటలు చెప్పాడు: