- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446–1406 BC
The Wilderness Years
Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.
ఈ కాలపు వచనాలు
- ద్వితీయోపదేశకాండము 31:2సుమారు క్రీ.పూ. 1451
“నాకు ఇప్పుడు నూట ఇరవై సంవత్సరాలు, నేను ఇకపై మిమ్మల్ని నడిపించలేను. ‘నీవు యొర్దాను దాటవు’ అని యెహోవా నాకు చెప్పారు.
- ద్వితీయోపదేశకాండము 31:3సుమారు క్రీ.పూ. 1451
మీ దేవుడైన యెహోవా స్వయంగా మీకు ముందుగా దాటి వెళ్లి మీ ముందు ఉండకుండ ఈ దేశాలను నాశనం చేస్తారు. మీరు వారి దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. యెహోవా చెప్పినట్టుగా, యెహోషువ కూడా మీకు ముందుగా దాటివెళ్తాడు.
- ద్వితీయోపదేశకాండము 31:4సుమారు క్రీ.పూ. 1451
అమోరీయుల రాజులైన సీహోను, ఓగులను వారి దేశంతో పాటు నాశనం చేసినట్టుగా, యెహోవా వారికి చేస్తారు.
- ద్వితీయోపదేశకాండము 31:5సుమారు క్రీ.పూ. 1451
యెహోవా వారిని మీకు అప్పగిస్తారు, నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ మీరు వారికి చేయాలి.
- ద్వితీయోపదేశకాండము 31:6సుమారు క్రీ.పూ. 1451
నిబ్బరంగా, ధైర్యంగా ఉండండి. వారికి మీరు భయపడవద్దు దిగులుపడవద్దు, ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీతో వెళ్తారు; ఆయన మిమ్మల్ని ఎన్నడూ వదిలేయరు, మీ చేయి విడువరు.”
- ద్వితీయోపదేశకాండము 31:7సుమారు క్రీ.పూ. 1451
తర్వాత మోషే యెహోషువను పిలిపించి, ఇశ్రాయేలీయులందరి సమక్షంలో అతనితో ఇలా అన్నాడు: “నిబ్బరంగా, ధైర్యంగా ఉండు, ఈ ప్రజలకు ఇస్తానని వారి పూర్వికులకు యెహోవా ప్రమాణం చేసిన దేశంలోకి నీవు ఈ ప్రజలతో పాటు వెళ్లి దానిని వారికి వారసత్వంగా ఇవ్వాలి.
- ద్వితీయోపదేశకాండము 31:8సుమారు క్రీ.పూ. 1451
యెహోవాయే స్వయంగా మీ ముందు వెళ్తారు మీతో ఉంటారు; ఆయన నిన్ను ఎన్నడూ వదిలేయరు, నిన్ను చేయి విడువరు. భయపడవద్దు; నిరుత్సాహపడవద్దు.”
- ద్వితీయోపదేశకాండము 31:9సుమారు క్రీ.పూ. 1451
కాబట్టి మోషే ఈ ధర్మశాస్త్రాన్ని వ్రాసి, లేవీయులైన యాజకులకు అంటే యెహోవా నిబంధన మందసాన్ని మోసేవారికి, ఇశ్రాయేలీయుల పెద్దలందరికి ఇచ్చాడు.
- ద్వితీయోపదేశకాండము 31:10సుమారు క్రీ.పూ. 1451
తర్వాత మోషే, “ప్రతి ఏడు సంవత్సరాల చివరిలో, అప్పులు రద్దు చేసే సంవత్సరంలో, గుడారాల పండుగ సమయంలో,
- ద్వితీయోపదేశకాండము 31:11సుమారు క్రీ.పూ. 1451
ఇశ్రాయేలీయులందరు మీ దేవుడైన యెహోవా ఎదుట ఆయన ఎంచుకున్న స్థలంలో కనబడినప్పుడు, మీరు వారందరికి ఈ ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించాలి.
- ద్వితీయోపదేశకాండము 31:12సుమారు క్రీ.పూ. 1451
మీ పట్టణాల్లో నివసిస్తున్న పురుషులు, స్త్రీలు, పిల్లలు, విదేశీయులను సమకూర్చండి. అప్పుడు వారు విని మీ దేవుడైన యెహోవాకు భయపడటం, ఈ ధర్మశాస్త్రంలోని అన్ని మాటలను జాగ్రత్తగా పాటించడం నేర్చుకుంటారు.
- ద్వితీయోపదేశకాండము 31:13సుమారు క్రీ.పూ. 1451
ఈ ధర్మశాస్త్రం తెలియని వారి పిల్లలు తప్పక విని, మీరు స్వాధీనం చేసుకోవడానికి యొర్దాను దాటి వెళ్లబోయే దేశంలో మీరు నివసించినంత కాలం మీ దేవుడైన యెహోవాకు భయపడటం నేర్చుకోవాలి.”
- ద్వితీయోపదేశకాండము 31:14సుమారు క్రీ.పూ. 1451
ఆ తర్వాత యెహోవా మోషేతో, “నీవు చనిపోయే రోజు దగ్గరలో ఉంది. యెహోషువను పిలిచి, సమావేశ గుడారం దగ్గరకు రండి, అక్కడ నేను అతన్ని నియమిస్తాను” అని చెప్పారు. కాబట్టి మోషే, యెహోషువ వచ్చి సమావేశ గుడారం దగ్గర ఉన్నారు.
- ద్వితీయోపదేశకాండము 31:15సుమారు క్రీ.పూ. 1451
అప్పుడు యెహోవా గుడారం దగ్గర మేఘస్తంభంలో ప్రత్యక్షమయ్యారు, మేఘం గుడార ద్వారం మీద నిలిచింది.
- ద్వితీయోపదేశకాండము 31:16సుమారు క్రీ.పూ. 1451
యెహోవా మోషేతో ఇలా అన్నారు, “నీవు నీ పూర్వికులతో విశ్రాంతి తీసుకోబోతున్నావు, ఈ ప్రజలు త్వరలో తాము ప్రవేశించే దేశంలోని పరదేశి దేవతలకు వేశ్యగా మారతారు. వారు నన్ను విడిచిపెట్టి నేను వారితో చేసుకున్న నిబంధనను ఉల్లంఘిస్తారు.
- ద్వితీయోపదేశకాండము 31:17సుమారు క్రీ.పూ. 1451
ఆ రోజున నేను వారిపై కోప్పడి వారి చేయి విడిచిపెడతాను; నేను వారి నుండి నా ముఖాన్ని దాచుకుంటాను, వారు నాశనమవుతారు. అనేక విపత్తులు, ఆపదలు వారి పైకి వస్తాయి, ఆ రోజు వారు, ‘ఈ విపత్తులు మనపైకి రావడానికి కారణం మన దేవుడు మనతో లేకపోవడం కాదా?’ అని అనుకుంటారు.
- ద్వితీయోపదేశకాండము 31:18సుమారు క్రీ.పూ. 1451
వారు ఇతర దేవుళ్ళ వైపు తిరిగి చేసిన దుష్టత్వాన్ని బట్టి నేను ఆ రోజు ఖచ్చితంగా నా ముఖాన్ని దాచుకుంటాను.
- ద్వితీయోపదేశకాండము 31:19సుమారు క్రీ.పూ. 1451
“ఇప్పుడు ఈ పాటను వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పించి వారితో పాడించండి, అది వారికి వ్యతిరేకంగా నాకు సాక్ష్యంగా ఉంటుంది.
- ద్వితీయోపదేశకాండము 31:20సుమారు క్రీ.పూ. 1451
నేను వారి పూర్వికులకు ప్రమాణం చేసిన ప్రకారం వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి తీసుకువచ్చినప్పుడు, వారు తృప్తిగా తిని లావెక్కినప్పుడు, వారు ఇతర దేవుళ్ళ వైపు తిరిగి వాటిని సేవించి, నన్ను తిరస్కరిస్తూ, నా నిబంధనను ఉల్లంఘిస్తారు.
- ద్వితీయోపదేశకాండము 31:21సుమారు క్రీ.పూ. 1451
వారి మీదికి అనేక విపత్తులు, ఆపదలు వచ్చి పడతాయి. ఈ అనుభవాలకు సాక్ష్యంగా ఈ పాట పాడుకుంటారు. దీన్ని వారి సంతతివారు ఎన్నడూ మరచిపోరు. ప్రమాణం చేసిన వాగ్దాన దేశంలో నేను ఇంకా వారిని తీసుకురాకముందే, ఈ రోజే వారేం ఆలోచన చేస్తున్నారో నాకు తెలుసు.”
- ద్వితీయోపదేశకాండము 31:22సుమారు క్రీ.పూ. 1451
కాబట్టి మోషే ఆ రోజు ఈ పాటను వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పించాడు.
- ద్వితీయోపదేశకాండము 31:23సుమారు క్రీ.పూ. 1451
యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఈ ఆజ్ఞ ఇచ్చారు: “నిబ్బరంగా, ధైర్యంగా ఉండు, ఎందుకంటే నేను ఇశ్రాయేలీయులకు ప్రమాణంతో వాగ్దానం చేసిన దేశంలోకి నీవు వారిని తీసుకువస్తావు, నేను నీతో ఉంటాను.”
- ద్వితీయోపదేశకాండము 31:24సుమారు క్రీ.పూ. 1451
మోషే ఈ ధర్మశాస్త్రం యొక్క మాటలన్నీ మొదటి నుండి చివరి వరకు ఒక గ్రంథంలో వ్రాయడం పూర్తి చేశాక,
- ద్వితీయోపదేశకాండము 31:25సుమారు క్రీ.పూ. 1451
యెహోవా నిబంధన మందసాన్ని మోసే లేవీయులకు మోషే ఇలా ఆజ్ఞాపించాడు:
- ద్వితీయోపదేశకాండము 31:26సుమారు క్రీ.పూ. 1451
“ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకుని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసం ప్రక్కన ఉంచండి. అది మీమీద సాక్షిగా ఉంటుంది.