కంటెంట్‌కు వెళ్లండి

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ద్వితీయోపదేశకాండము 24:5సుమారు క్రీ.పూ. 1451

    ఒక వ్యక్తి క్రొత్తగా పెళ్ళి చేసుకున్నట్లయితే, అతన్ని యుద్ధానికి పంపకూడదు, ఏ ఇతర భారాన్ని మోపకూడదు. ఒక సంవత్సరం పాటు అతడు స్వేచ్ఛగా ఇంట్లో ఉండి పెళ్ళి చేసుకున్న భార్యను సంతోషపెట్టాలి.

  2. ద్వితీయోపదేశకాండము 24:6సుమారు క్రీ.పూ. 1451

    అప్పు కోసం పూచీకత్తుగా ఒక తిరగలిని గాని, తిరగలి పై రాతిని గాని తాకట్టు పెట్టకూడదు. ఎందుకంటే అది మనిషి జీవనాధారాన్ని తాకట్టు పెట్టినట్లవుతుంది.

  3. ద్వితీయోపదేశకాండము 24:7సుమారు క్రీ.పూ. 1451

    ఎవరైనా తోటి ఇశ్రాయేలును ఎత్తుకెళ్లి, బానిసగా చూస్తూ లేదా అమ్ముతూ పట్టుబడినా, ఎత్తుకెళ్లిన వాడు మరణించాలి. మీ మధ్య నుండి చెడును ప్రక్షాళన చేయాలి.

  4. ద్వితీయోపదేశకాండము 24:8సుమారు క్రీ.పూ. 1451

    అపవిత్రం చేసే కుష్ఠు లాంటి వ్యాధి విషయాల్లో, లేవీయ యాజకులు మీకు సూచించిన విధంగా ఖచ్చితంగా చేయండి. నేను వారికి ఆజ్ఞాపించిన వాటిని మీరు జాగ్రత్తగా పాటించాలి.

  5. ద్వితీయోపదేశకాండము 24:9సుమారు క్రీ.పూ. 1451

    మీరు ఈజిప్టు నుండి ప్రయాణమై వస్తూ ఉండగా మీ దేవుడైన యెహోవా మిర్యాముకు ఏమి చేశారో జ్ఞాపకం ఉంచుకోండి.

  6. ద్వితీయోపదేశకాండము 24:10సుమారు క్రీ.పూ. 1451

    మీరు మీ పొరుగువానికి ఏదైనా అప్పు ఇచ్చినప్పుడు, వారు తాకట్టుగా పెట్టిన దాన్ని తెచ్చుకోడానికి ఇంట్లో చొరబడకూడదు.

  7. ద్వితీయోపదేశకాండము 24:11సుమారు క్రీ.పూ. 1451

    బయటనే నిలవాలి, ఇంట్లోనుండి వచ్చి అతడే స్వయంగా ఆ వస్తువు తెచ్చి ఇవ్వాలి.

  8. ద్వితీయోపదేశకాండము 24:12సుమారు క్రీ.పూ. 1451

    పొరుగువాడు పేదవాడైతే, వాని తాకట్టును మీ దగ్గర పెట్టుకుని నిద్రపోవద్దు.

  9. ద్వితీయోపదేశకాండము 24:13సుమారు క్రీ.పూ. 1451

    సూర్యాస్తమయానికి వారి వస్త్రాన్ని తిరిగి ఇవ్వండి, తద్వారా మీ పొరుగువారు దానిపై నిద్రపోవచ్చు. అప్పుడు వారు మిమ్మల్ని దీవిస్తారు, అది మీ దేవుడైన యెహోవా దృష్టిలో నీతిగా లెక్కించబడుతుంది.

  10. ద్వితీయోపదేశకాండము 24:14సుమారు క్రీ.పూ. 1451

    మీ తోటి ఇశ్రాయేలీయులలో గాని మీ పట్టణాల్లో నివసిస్తున్న విదేశీయులలో గాని పేదవారై అవసరంలో ఉన్న కూలివారిని బాధించవద్దు.

  11. ద్వితీయోపదేశకాండము 24:15సుమారు క్రీ.పూ. 1451

    ప్రతిరోజు సూర్యాస్తమయానికి ముందు వారి వేతనాలు చెల్లించండి, ఎందుకంటే వారు పేదవారు దానిని లెక్కిస్తున్నారు. లేకపోతే వారు మీకు వ్యతిరేకంగా యెహోవాకు మొర పెట్టవచ్చు, అప్పుడు మీరు దోషులుగా పరిగణించబడతారు.

  12. ద్వితీయోపదేశకాండము 24:16సుమారు క్రీ.పూ. 1451

    తల్లిదండ్రులు తమ పిల్లల కోసం మరణశిక్ష పొందకూడదు, లేదా వారి తల్లిదండ్రుల కోసం పిల్లలు మరణశిక్ష పొందకూడదు; ప్రతి ఒక్కరూ తమ సొంత పాపం కోసం చనిపోతారు.

  13. ద్వితీయోపదేశకాండము 24:17సుమారు క్రీ.పూ. 1451

    న్యాయం విషయంలో విదేశీయులను గాని తండ్రిలేనివారిని గాని వంచించకండి లేదా విధవరాలి యొక్క వస్త్రాన్ని తాకట్టుగా తీసుకోకండి,

  14. ద్వితీయోపదేశకాండము 24:18సుమారు క్రీ.పూ. 1451

    మీరు ఈజిప్టులో బానిసలుగా ఉన్నారని, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అక్కడినుండి విడిపించారని జ్ఞాపకముంచుకోండి. అందుకే ఇలా చేయండని నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను.

  15. ద్వితీయోపదేశకాండము 24:19సుమారు క్రీ.పూ. 1451

    మీరు మీ పొలంలో పంట కోసినప్పుడు, మీరు ఒక పనను పట్టించుకోకపోతే, దాన్ని తెచ్చుకోడానికి తిరిగి వెనుకకు వెళ్లవద్దు. మీ చేతుల యొక్క అన్ని పనులలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించేలా విదేశీయులు, తండ్రిలేనివారు, విధవరాండ్ర కోసం వదిలేయండి.

  16. ద్వితీయోపదేశకాండము 24:20సుమారు క్రీ.పూ. 1451

    మీరు మీ చెట్ల నుండి ఒలీవలను కొట్టినప్పుడు, రెండవసారి కొమ్మలపైకి వెళ్లవద్దు. విదేశీయులు, తండ్రిలేనివారు, విధవరాండ్ర కోసం మిగిలి ఉన్నవాటిని వదిలేయండి.

  17. ద్వితీయోపదేశకాండము 24:21సుమారు క్రీ.పూ. 1451

    మీరు మీ ద్రాక్షతోటలో ద్రాక్షను కోసినప్పుడు, మళ్ళీ తీగెల మీద వెదకవద్దు. మిగిలి ఉన్నవాటిని విదేశీయులు, తండ్రిలేనివారు, విధవరాండ్ర కోసం వదిలేయండి.

  18. ద్వితీయోపదేశకాండము 24:22సుమారు క్రీ.పూ. 1451

    మీరు ఈజిప్టులో బానిసలుగా ఉంటిరని జ్ఞాపకముంచుకోండి. అందుకే ఇలా చేయండని నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను.

  19. ద్వితీయోపదేశకాండము 25:1సుమారు క్రీ.పూ. 1451

    ప్రజలకు వివాదం ఉన్నప్పుడు, వారు దానిని న్యాయస్థానానికి తీసుకెళ్లాలి, న్యాయాధిపతులు నిర్దోషులను విముక్తులుగా ప్రకటిస్తూ, దోషులను దోషులుగా ప్రకటిస్తారు.

  20. ద్వితీయోపదేశకాండము 25:2సుమారు క్రీ.పూ. 1451

    ఒకవేళ దోషులు శిక్షార్హులైతే న్యాయాధిపతి వారిని పడుకోబెట్టి అతని సమక్షంలో నేరానికి తగ్గట్టుగా కొరడా దెబ్బల సంఖ్యతో కొరడాతో కొట్టాలి,

  21. ద్వితీయోపదేశకాండము 25:3సుమారు క్రీ.పూ. 1451

    కానీ న్యాయాధిపతి నలభైకి మించి కొరడా దెబ్బలు వేయకూడదు. దోషిని అంతకు మించి కొరడాలతో కొడితే మీ తోటి ఇశ్రాయేలీయుడు మీ దృష్టిలో దిగజారిపోతాడు.

  22. ద్వితీయోపదేశకాండము 25:4సుమారు క్రీ.పూ. 1451

    ఎద్దు ధాన్యాన్ని త్రొక్కుతున్నప్పుడు మూతికి చిక్కం కట్టవద్దు.

  23. ద్వితీయోపదేశకాండము 25:5సుమారు క్రీ.పూ. 1451

    అన్నదమ్ములు కలిసి ఉమ్మడి కుటుంబంగా వుంటున్నప్పుడు వారిలో ఒకడు సంతానం లేకుండా చనిపోతే అతని భార్య పరాయివాడ్ని చేసుకోకూడదు, గతించిన తన భర్త తోబుట్టువు ఆమెను పెళ్ళి చేసుకోవాలి, ఆమె పట్ల బావమరిది విధిని నెరవేర్చాలి.

  24. ద్వితీయోపదేశకాండము 25:6సుమారు క్రీ.పూ. 1451

    ఆమె కనిన మొదటి కుమారుడు చనిపోయిన సోదరుడి పేరును కొనసాగించాలి, తద్వారా అతని పేరు ఇశ్రాయేలు నుండి తొలగించబడదు.

  25. ద్వితీయోపదేశకాండము 25:7సుమారు క్రీ.పూ. 1451

    ఏదేమైనా, ఒక వ్యక్తి తన సోదరుడి భార్యను పెళ్ళి చేసుకోకూడదనుకుంటే, ఆమె పట్టణ ద్వారం దగ్గర ఉన్న పెద్దల దగ్గరకు వెళ్లి, “నా భర్త సోదరుడు ఇశ్రాయేలీయులలో తన సోదరుని పేరును కొనసాగించడానికి నా నిరాకరిస్తున్నాడు. అతడు నా పట్ల ఒక బావమరిది కర్తవ్యాన్ని నెరవేర్చడం లేదు” అని చెప్పాలి.