కంటెంట్‌కు వెళ్లండి

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ద్వితీయోపదేశకాండము 20:3సుమారు క్రీ.పూ. 1451

    అతడు వారితో ఇలా అంటారు: “ఇశ్రాయేలు విను: ఈ రోజు మీరు మీ శత్రువుల మీదికి యుద్ధానికి వెళ్తున్నారు. మీరు మూర్ఛపోవద్దు, భయపడవద్దు, జడియవద్దు, వారికి భయపడకండి.

  2. ద్వితీయోపదేశకాండము 20:4సుమారు క్రీ.పూ. 1451

    శత్రువులతో యుద్ధం చేసేది, మిమ్మల్ని రక్షించేది మీ దేవుడైన యెహోవాయే! ఆయన మీతో ఉన్నాడు.”

  3. ద్వితీయోపదేశకాండము 20:5సుమారు క్రీ.పూ. 1451

    అధికారులు సైనికులతో చెప్పవలసిన మాటలు: “మీలో ఎవరైనా క్రొత్తగా ఇల్లు కట్టుకుని ఇంకా గృహప్రవేశం చేయనట్లైతే, వెంటనే ఇంటికి వెళ్లిపోవాలి, లేకపోతే ఒకవేళ అతడు యుద్ధంలో చనిపోతే మరొకరు ఆ ఇంట్లో నివసిస్తారు.

  4. ద్వితీయోపదేశకాండము 20:6సుమారు క్రీ.పూ. 1451

    ఎవడైనా ద్రాక్షతోట వేసి దాని ఫలసాయం అనుభవించకుండా ఉన్నాడా? అలాగైతే అతడు ఇంటికి తిరిగి వెళ్లవచ్చు, లేదా అతడు యుద్ధంలో చనిపోతే అతని తోట ఫలసాయం మరొకరు అనుభవిస్తారు.

  5. ద్వితీయోపదేశకాండము 20:7సుమారు క్రీ.పూ. 1451

    ప్రధానం చేసుకుని ఇంకా పెండ్లి చేసుకోకుండా ఉన్నవాడు మీలో ఉంటే అతడు ఇంటికి వెళ్లిపోవచ్చు, అతడు ఒకవేళ యుద్ధంలో చనిపోతే మరొకడు ఆమెను పెళ్ళి చేసుకోవచ్చు.”

  6. ద్వితీయోపదేశకాండము 20:8సుమారు క్రీ.పూ. 1451

    అధిపతులు చేయవలసిన హెచ్చరికలు, “ఎవనికైనా భయాందోళనలున్నాయా? అలాగైతే ఇంటికి వెళ్లిపోవచ్చు, లేకపోతే ఆ పిరికితనం మిగతా సైనికులకు కూడా వ్యాపిస్తుంది.”

  7. ద్వితీయోపదేశకాండము 20:9సుమారు క్రీ.పూ. 1451

    అధిపతులు ప్రజలకు ఈ సందేశమిచ్చిన తర్వాత సేనాధిపతులు తమ బాధ్యతలను స్వీకరిస్తారు.

  8. ద్వితీయోపదేశకాండము 20:10సుమారు క్రీ.పూ. 1451

    పట్టణాన్ని ముట్టడించినప్పుడు ముందు దాని ప్రజలకు సమాధానం కోసం రాయబారం పంపాలి.

  9. ద్వితీయోపదేశకాండము 20:11సుమారు క్రీ.పూ. 1451

    ఒకవేళ వారు సమాధానపడడానికి ఒప్పుకుని వారి ద్వారాలు తెరిస్తే, అందులో ఉన్న ప్రజలంతా మీకు లొంగిపోయి మీ కోసం వెట్టిచాకిరి చేస్తారు.

  10. ద్వితీయోపదేశకాండము 20:12సుమారు క్రీ.పూ. 1451

    ఒకవేళ వారు సంధికి నిరాకరించి మీతో యుద్ధానికి వస్తే, ఆ పట్టణాన్ని ముట్టడించండి.

  11. ద్వితీయోపదేశకాండము 20:13సుమారు క్రీ.పూ. 1451

    మీ దేవుడైన యెహోవా దానిని మీ చేతికి అప్పగిస్తే, దానిలో ఉన్న మనుష్యులందరిని ఖడ్గంతో హతమార్చాలి.

  12. ద్వితీయోపదేశకాండము 20:14సుమారు క్రీ.పూ. 1451

    స్త్రీలను, చిన్న పిల్లలను పశువులను మీరు కొల్లగొట్టిన ఆస్తిని మీరు తీసుకోవచ్చు; మీ దేవుడైన యెహోవా మీకిచ్చే మీ శత్రువుల దోపుడుసొమ్ము మీదే అవుతుంది.

  13. ద్వితీయోపదేశకాండము 20:15సుమారు క్రీ.పూ. 1451

    మీకు దూరంగా ఉన్న సమీపంలోని దేశాలకు చెందని అన్ని పట్టణాల పట్ల మీరు ఈ విధంగా వ్యవహరిస్తారు.

  14. ద్వితీయోపదేశకాండము 20:16సుమారు క్రీ.పూ. 1451

    యెహోవా దేవుడు మీకు వారసత్వంగా ఇచ్చే పట్టణాల్లో ఊపిరి పీల్చేదేదీ మిగలకూడదు.

  15. ద్వితీయోపదేశకాండము 20:17సుమారు క్రీ.పూ. 1451

    మీ దేవుడైన యెహోవా ఆజ్ఞమేరకు హిత్తీయులను, అమోరీయులను కనానీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను పూర్తిగా నాశనం చేయాలి.

  16. ద్వితీయోపదేశకాండము 20:18సుమారు క్రీ.పూ. 1451

    లేకపోతే తమ దేవుళ్ళకు చేసే హేయ క్రియలను మీకు నేర్పుతారు, మీరు మీ దేవుడైన యెహోవాకు విరోధంగా పాపాలు చేస్తారు, అందుకే వారిని నిర్మూలించమని చెప్తున్నాను.

  17. ద్వితీయోపదేశకాండము 20:19సుమారు క్రీ.పూ. 1451

    మీరు ఒక పట్టణాన్ని ముట్టడి వేసి, దానిని స్వాధీనపరచుకోడానికి ఎక్కువసేపు దానితో పోరాడవలసి వస్తే, మీరు దాని చెట్లను గొడ్డలితో నరికివేయవద్దు, ఎందుకంటే వాటి ఫలాలు మీరు తినవచ్చు. చెట్లేమైనా మనుష్యులా మీరు వాటిని నరికివేయడానికి?

  18. ద్వితీయోపదేశకాండము 20:20సుమారు క్రీ.పూ. 1451

    ఏదేమైనా, పండ్లచెట్లు కాదని మీకు తెలిసిన చెట్లను మీరు నరికివేయవచ్చు, వాటి కర్రను మీరు ముట్టడి వేసిన పట్టణం పతనం అయ్యేవరకు ముట్టడి పనులను నిర్మించడానికి ఉపయోగించవచ్చు.

  19. ద్వితీయోపదేశకాండము 21:1సుమారు క్రీ.పూ. 1451

    మీరు స్వాధీనం చేసుకోవడానికి మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలోని ఒక పొలంలో ఎవరైనా హత్యకు గురియై పడి ఉండడం కనబడి, ఆ హంతకుడు ఎవరో తెలియనప్పుడు,

  20. ద్వితీయోపదేశకాండము 21:2సుమారు క్రీ.పూ. 1451

    మీ పెద్దలు, న్యాయాధిపతులు బయటకు వెళ్లి మృతదేహం నుండి దగ్గరలో ఉన్న పట్టణాలకు దూరం కొలుస్తారు.

  21. ద్వితీయోపదేశకాండము 21:3సుమారు క్రీ.పూ. 1451

    తర్వాత మృతుడికి దగ్గరగా ఉన్న పట్టణ పెద్దలు ఎప్పుడూ పని చేయని, కాడి కట్టని ఓ దూడను తెచ్చి,

  22. ద్వితీయోపదేశకాండము 21:4సుమారు క్రీ.పూ. 1451

    దానిని ప్రవహించే ప్రవాహం ఉండి, ఎన్నడు దున్నబడని నాటబడని లోయ దగ్గరకు తోలుకుపోవాలి. అక్కడ ఆ లోయలో పట్టణ పెద్దలు దూడ మెడను విరిచివేయాలి.

  23. ద్వితీయోపదేశకాండము 21:5సుమారు క్రీ.పూ. 1451

    లేవీయ యాజకులు ముందుకు సాగాలి, ఎందుకంటే మీ దేవుడైన యెహోవా వారిని పరిచర్య కోసం, యెహోవా పేరిట ఆశీర్వాదాలు పలకడానికి, వివాదాలు దాడులకు సంబంధించిన అన్ని దావాలను నిర్ణయించడానికి వారిని ఎన్నుకున్నారు.

  24. ద్వితీయోపదేశకాండము 21:6సుమారు క్రీ.పూ. 1451

    మృతుడి గ్రామానికి చెందిన పట్టణ పెద్దలు లోయలో మెడ విరగదీసిన దూడ మీద చేతులు కడుక్కుని,

  25. ద్వితీయోపదేశకాండము 21:7సుమారు క్రీ.పూ. 1451

    వారు ఇలా ప్రకటించాలి: “మా చేతులు రక్తపాతం చేయలేదు, మా కళ్లు అది చేయడం చూడలేదు.