కంటెంట్‌కు వెళ్లండి

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ద్వితీయోపదేశకాండము 13:8సుమారు క్రీ.పూ. 1451

    మీరు వారి మాటలు అంగీకరించవద్దు, వారి మాట వినవద్దు. వారి మీద జాలి చూపవద్దు. వారిని విడిచిపెట్టవద్దు, వారిని కాపాడవద్దు.

  2. ద్వితీయోపదేశకాండము 13:9సుమారు క్రీ.పూ. 1451

    వారిని ఖచ్చితంగా చంపాల్సిందే. వారిని చంపడానికి మిగిలిన ప్రజలందరి కంటే ముందు మీ చేయి వారి మీద పడాలి.

  3. ద్వితీయోపదేశకాండము 13:10సుమారు క్రీ.పూ. 1451

    వారిని రాళ్లతో కొట్టి చంపాలి ఎందుకంటే, ఈజిప్టు దేశంలో నుండి మిమ్మల్ని బయటకు తీసుకువచ్చి బానిస దేశం నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా దగ్గర నుండి మిమ్మల్ని దూరం చేయడానికి వారు ప్రయత్నించారు.

  4. ద్వితీయోపదేశకాండము 13:11సుమారు క్రీ.పూ. 1451

    అప్పుడు ఇశ్రాయేలీయులందరు విని భయపడతారు, మీలో ఎవరూ మరలా అలాంటి దుర్మార్గం చేయరు.

  5. ద్వితీయోపదేశకాండము 13:12సుమారు క్రీ.పూ. 1451

    మీరు నివసించడానికి మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న పట్టణాల్లో దేనిలోనైనా దుష్టులు కొందరు మీ మధ్యలో లేచి, “మనం ఇతర దేవుళ్ళను సేవిద్దాం” అని చెప్పి (మీకు తెలియని దేవుళ్ళను) తమ పట్టణంలోని ప్రజలను ప్రోత్సహించినట్లు మీరు వినివుంటే,

  6. ద్వితీయోపదేశకాండము 13:13సుమారు క్రీ.పూ. 1451

    Certain men, the children of Belial, are gone out from among you, and have withdrawn the inhabitants of their city, saying, Let us go and serve other gods, which ye have not known;

  7. ద్వితీయోపదేశకాండము 13:14సుమారు క్రీ.పూ. 1451

    దాని గురించి మీరు విచారణ చేసి పూర్తిగా పరిశోధించి తెలుసుకోవాలి. అది నిజమై, మీ మధ్య ఈ అసహ్యకరమైన పని జరిగిందని నిరూపించబడితే,

  8. ద్వితీయోపదేశకాండము 13:15సుమారు క్రీ.పూ. 1451

    ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరినీ ఖచ్చితంగా ఖడ్గంతో సంహరించాలి; దానిలో ఉన్న సమస్తాన్ని, అంటే ప్రజలను పశువులను పూర్తిగా నాశనం చేయాలి.

  9. ద్వితీయోపదేశకాండము 13:16సుమారు క్రీ.పూ. 1451

    దానిలో ఉన్న విలువైన వస్తువులన్నిటిని పట్టణంలో మధ్యలోనికి తీసుకువచ్చి మీ దేవుడైన యెహోవాకు దహనబలిగా ఆ పట్టణాన్ని, దానిలోని వస్తువులను పూర్తిగా కాల్చివేయాలి. ఆ పట్టణం మరలా కట్టబడకుండా ఎల్లప్పుడు పాడుపడిన దానిగానే ఉండాలి,

  10. ద్వితీయోపదేశకాండము 13:17సుమారు క్రీ.పూ. 1451

    నాశనానికి చెందిన వాటిలో ఏది మీ దగ్గర ఉండకూడదు. అప్పుడు యెహోవా తన తీవ్రమైన కోపాన్ని విడిచిపెట్టి, మిమ్మల్ని కనికరించి, మీమీద దయ చూపుతారు. మీ పూర్వికులకు ఇచ్చిన వాగ్దానం మేరకు మిమ్మల్ని అసంఖ్యాకంగా విస్తరింపజేస్తారు,

  11. ద్వితీయోపదేశకాండము 13:18సుమారు క్రీ.పూ. 1451

    ఎందుకంటే నేను ఈ రోజు మీకు ఇస్తున్న ఆయన ఆజ్ఞలన్నిటిని పాటించడం ద్వారా, మీ దేవుడైన యెహోవాకు మీరు విధేయత చూపించి ఆయన దృష్టిలో సరియైన వాటిని మీరు చేస్తున్నారు.

  12. ద్వితీయోపదేశకాండము 14:1సుమారు క్రీ.పూ. 1451

    మీరు మీ దేవుడైన యెహోవాకు పిల్లలు. చనిపోయినవారి కోసం మిమ్మల్ని మీరు కోసుకోకూడదు, మీ కనుబొమ్మల మధ్య క్షవరం చేసుకోకూడదు,

  13. ద్వితీయోపదేశకాండము 14:2సుమారు క్రీ.పూ. 1451

    ఎందుకంటే మీ దేవుడైన యెహోవాకు మీరు పవిత్ర ప్రజలు. భూమి మీద ఉన్న ప్రజలందరిలో యెహోవా మిమ్మల్ని తన విలువైన స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నారు.

  14. ద్వితీయోపదేశకాండము 14:3సుమారు క్రీ.పూ. 1451

    అసహ్యమైనదేది తినకూడదు.

  15. ద్వితీయోపదేశకాండము 14:4సుమారు క్రీ.పూ. 1451

    మీరు తినదగిన జంతువులు: ఎద్దు, గొర్రె, మేక,

  16. ద్వితీయోపదేశకాండము 14:5సుమారు క్రీ.పూ. 1451

    జింక, దుప్పి, ఎర్రచిన్న జింక, అడవి మేకలు, అడవి గొర్రెలు, లేడి దుప్పులు, కొండ గొర్రెలు,

  17. ద్వితీయోపదేశకాండము 14:6సుమారు క్రీ.పూ. 1451

    చీలిన డెక్కలు ఉండి నెమరువేసే ఏ జంతువునైనా మీరు తినవచ్చు.

  18. ద్వితీయోపదేశకాండము 14:7సుమారు క్రీ.పూ. 1451

    అయితే, నెమరువేసే జంతువు లేదా చీలిన డెక్కలు కలిగి ఉన్న ఒంటెలు, కుందేలు, పొట్టి కుందేలు లాంటివి మీరు తినకూడదు. అవి నెమరువేసేవైనా వాటికి చీలిన డెక్కలు లేవు; అవి మీకు ఆచారరీత్య అపవిత్రమైనవి.

  19. ద్వితీయోపదేశకాండము 14:8సుమారు క్రీ.పూ. 1451

    పంది కూడా అపవిత్రమైనది; దానికి చీలిన డెక్కలు ఉంటాయి కాని అది నెమరువేయదు. వాటి మాంసం తినవద్దు వాటి కళేబరాలు ముట్టుకోవద్దు.

  20. ద్వితీయోపదేశకాండము 14:9సుమారు క్రీ.పూ. 1451

    నీటిలో నివసించే జీవులన్నిటిలో రెక్కలు పొలుసులు గలవాటిని మీరు తినవచ్చు.

  21. ద్వితీయోపదేశకాండము 14:10సుమారు క్రీ.పూ. 1451

    రెక్కలు పొలుసులు లేనివాటిని మీరు తినకూడదు; అవి మీకు అపవిత్రమైనవి.

  22. ద్వితీయోపదేశకాండము 14:11సుమారు క్రీ.పూ. 1451

    పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చు.

  23. ద్వితీయోపదేశకాండము 14:12సుమారు క్రీ.పూ. 1451

    కాని మీరు తినకూడనివి ఇవే: గ్రద్ద, రాబందు, నల్ల రాబందు,

  24. ద్వితీయోపదేశకాండము 14:13సుమారు క్రీ.పూ. 1451

    ఎర్ర గ్రద్ద, నల్ల గ్రద్ద, ప్రతి రకమైన తెల్ల గ్రద్ద,

  25. ద్వితీయోపదేశకాండము 14:14సుమారు క్రీ.పూ. 1451

    ప్రతి రకమైన కాకి,