కంటెంట్‌కు వెళ్లండి

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ద్వితీయోపదేశకాండము 11:22సుమారు క్రీ.పూ. 1491

    మీరు పాటించాలని నేను మీకు ఇస్తున్న ఆజ్ఞలను మీరు జాగ్రతగా పాటిస్తే అనగా మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయన మార్గాల్లో నడుస్తూ, ఆయనను అంటిపెట్టుకుని ఉండాలి.

  2. ద్వితీయోపదేశకాండము 11:23సుమారు క్రీ.పూ. 1491

    అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ జనాంగాలన్నిటిని వెళ్లగొడతారు. మీకంటే విస్తారమైన, బలమైన దేశాలను మీరు వెళ్లగొడతారు.

  3. ద్వితీయోపదేశకాండము 11:24సుమారు క్రీ.పూ. 1491

    మీరు అడుగుపెట్టే ప్రతి చోటు మీదే అవుతుంది: ఎడారి నుండి లెబానోను వరకు, యూఫ్రటీసు నది నుండి మధ్యధరా సముద్రం వరకు మీ సరిహద్దులు వ్యాపిస్తాయి.

  4. ద్వితీయోపదేశకాండము 11:25సుమారు క్రీ.పూ. 1491

    మీకు ఎదురుగా ఎవరు నిలబడలేరు. ఆయన మీకు వాగ్దానం చేసిన ప్రకారం మీ దేవుడైన యెహోవా మీరు వెళ్లే దేశమంతటికి మీరంటే వణుకును భయాన్ని పుట్టిస్తారు.

  5. ద్వితీయోపదేశకాండము 11:26సుమారు క్రీ.పూ. 1491

    చూడండి, ఈ రోజు నేను మీ ముందు దీవెనను శాపాన్ని ఉంచుతున్నాను.

  6. ద్వితీయోపదేశకాండము 11:27సుమారు క్రీ.పూ. 1491

    ఈ రోజు నేను మీకు ఇచ్చే మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలకు లోబడితే మీకు దీవెన;

  7. ద్వితీయోపదేశకాండము 11:28సుమారు క్రీ.పూ. 1491

    మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలకు లోబడకుండా, ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే మార్గాన్ని విడిచిపెట్టి మీకు తెలియని ఇతర దేవుళ్ళను అనుసరిస్తే మీకు శాపం.

  8. ద్వితీయోపదేశకాండము 11:29సుమారు క్రీ.పూ. 1491

    మీరు స్వాధీనం చేసుకోబోతున్న దేశంలోనికి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని చేర్చిన తర్వాత, గెరిజీము పర్వతం మీద దీవెనను ఏబాలు పర్వతంమీద శాపాన్ని ప్రకటించాలి.

  9. ద్వితీయోపదేశకాండము 11:30సుమారు క్రీ.పూ. 1491

    మీకు తెలిసినట్లు, ఈ పర్వతాలు యొర్దాను అవతల సూర్యుడు అస్తమించే దిక్కుకు వెనుక మోరె లోని సింధూర వృక్షాల దగ్గర గిల్గాలు ప్రాంతంలో ఉన్న అరాబాలో నివసించే కనానీయుల సరిహద్దులో ఉన్నాయి.

  10. ద్వితీయోపదేశకాండము 11:31సుమారు క్రీ.పూ. 1491

    మీ దేవుడైన యెహోవా మీకు ఇవ్వబోతున్న దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి మీరు యొర్దాను నది దాటబోతున్నారు. మీరు దానిని స్వాధీనం చేసుకుని దానిలో నివసించినప్పుడు,

  11. ద్వితీయోపదేశకాండము 11:32సుమారు క్రీ.పూ. 1491

    ఈ రోజు నేను మీ ముందు ఉంచిన అన్ని శాసనాలను చట్టాలను తప్పనిసరిగా పాటించండి.

  12. ద్వితీయోపదేశకాండము 12:1సుమారు క్రీ.పూ. 1451

    మీరు స్వాధీనం చేసుకోవడానికి మీ పూర్వికుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశంలో మీరు నివసించినంత కాలం మీరు జాగ్రత్తగా అనుసరించవలసిన శాసనాలు చట్టాలు ఇవి.

  13. ద్వితీయోపదేశకాండము 12:2సుమారు క్రీ.పూ. 1451

    మీరు స్వాధీనం చేసుకోబోయే దేశాల్లో ఎక్కడైతే ప్రజలు తమ దేవుళ్ళను సేవిస్తారో, అనగా ఎత్తైన పర్వతాలమీద కొండల పైన విస్తరించి ఉన్న చెట్టు క్రింద ఉన్న ఆ స్థలాలన్నిటిని పూర్తిగా నాశనం చేయాలి.

  14. ద్వితీయోపదేశకాండము 12:3సుమారు క్రీ.పూ. 1451

    వారి బలిపీఠాలను పడగొట్టాలి, వారి పవిత్ర రాళ్లను పగులగొట్టాలి, వారి అషేరా స్తంభాలను అగ్నితో కాల్చివేయాలి; వారి దేవతల ప్రతిమలను కూల్చివేసి, వాటి పేర్లు ఆ స్థలంలో లేకుండా నిర్మూలం చేయాలి.

  15. ద్వితీయోపదేశకాండము 12:4సుమారు క్రీ.పూ. 1451

    మీరు మీ దేవుడైన యెహోవాను వారి విధానంలో ఆరాధించకూడదు.

  16. ద్వితీయోపదేశకాండము 12:5సుమారు క్రీ.పూ. 1451

    కాని మీ దేవుడైన యెహోవా మీ గోత్రాలన్నిటిలో తన పేరును స్థాపించడానికి ఆయనకు నివాస స్థానంగా ఏర్పరచుకొనే స్థలాన్ని మీరు వెదికి ఆ స్థలానికి మీరు వెళ్లాలి;

  17. ద్వితీయోపదేశకాండము 12:6సుమారు క్రీ.పూ. 1451

    అక్కడికే మీరు మీ దహనబలులు, మీ బలులు, మీ దశమభాగాలు, ప్రత్యేక అర్పణలు, మీరు ఇస్తామన్న మ్రొక్కుబడులు, స్వేచ్ఛార్పణలు, పశువుల మందలో గొర్రెల మందలోని మొదట పుట్టిన వాటిని తీసుకురావాలి.

  18. ద్వితీయోపదేశకాండము 12:7సుమారు క్రీ.పూ. 1451

    మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించారు కాబట్టి, అక్కడ మీ దేవుడైన యెహోవా సన్నిధిలో మీరు, మీ కుటుంబాలు తిని, మీ చేతి పనులన్నిటిని బట్టి సంతోషించాలి.

  19. ద్వితీయోపదేశకాండము 12:8సుమారు క్రీ.పూ. 1451

    ఈ రోజు మనం ఇక్కడ చేస్తున్నట్లు మీలో ప్రతిఒక్కరు తమ దృష్టికి సరియైనది అనుకున్న దానిని చేయకూడదు,

  20. ద్వితీయోపదేశకాండము 12:9సుమారు క్రీ.పూ. 1451

    ఎందుకంటే, ఇంకా మీరు మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న విశ్రాంతి స్థలానికి వారసత్వ దేశాన్ని చేరుకోలేదు.

  21. ద్వితీయోపదేశకాండము 12:10సుమారు క్రీ.పూ. 1451

    అయితే మీరు యొర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు వారసత్వంగా ఇస్తున్న దేశంలో స్థిరపడాలి, మీరు క్షేమంగా జీవించేలా ఆయన మీ చుట్టూ ఉన్న శత్రువులందరి నుండి మీకు విశ్రాంతినిస్తారు.

  22. ద్వితీయోపదేశకాండము 12:11సుమారు క్రీ.పూ. 1451

    అప్పుడు యెహోవా తన నామానికి నివాస స్థలాన్ని ఏర్పరచుకుంటారు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని అనగా, మీ దహనబలులు, మీ బలులు, మీ దశమభాగాలు, ప్రత్యేక అర్పణలు, మీరు యెహోవాకు ఇస్తామని మ్రొక్కుబడి చేసుకున్న కానుకలు అక్కడికే తీసుకురావాలి.

  23. ద్వితీయోపదేశకాండము 12:12సుమారు క్రీ.పూ. 1451

    అక్కడ మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు దాసీలు, భాగం గాని స్వాస్థ్యం గాని లేకుండా మీ ఇళ్ళలో ఉండే లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధిలో సంతోషించాలి.

  24. ద్వితీయోపదేశకాండము 12:13సుమారు క్రీ.పూ. 1451

    మీరు నచ్చిన ప్రతి స్థలంలో మీ దహనబలులు అర్పించకుండ జాగ్రత్తపడండి.

  25. ద్వితీయోపదేశకాండము 12:14సుమారు క్రీ.పూ. 1451

    మీ గోత్రాల్లో ఒకదానిలో యెహోవా ఏర్పరచుకొనే స్థలంలోనే మీ దహనబలులు అర్పించి, అక్కడే నేను ఆజ్ఞాపించే వాటన్నిటిని జరిగించాలి.