కంటెంట్‌కు వెళ్లండి

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ద్వితీయోపదేశకాండము 8:18సుమారు క్రీ.పూ. 1451

    కాని, మీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోండి, ఆయన మీ పూర్వికులకు ప్రమాణం చేసినట్లు, తన నిబంధన ఈ రోజు ఉన్నట్లుగా స్థిరపరచడానికి మీరు సంపదను సంపాదించే సామర్థ్యం ఇచ్చేవారు ఆయనే.

  2. ద్వితీయోపదేశకాండము 8:19సుమారు క్రీ.పూ. 1451

    మీరు మీ దేవుడనైన యెహోవాను మరచిపోయి, ఇతర దేవుళ్ళను వెంబడించి పూజించి వాటిని సేవిస్తే, మీరు ఖచ్చితంగా నశించిపోతారని మీకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నాను.

  3. ద్వితీయోపదేశకాండము 8:20సుమారు క్రీ.పూ. 1451

    మీ దేవుడైన యెహోవాకు లోబడకపోతే, మీ ఎదుట ఉండకుండా యెహోవా నాశనం చేసిన దేశాల్లా మీరు నాశనమవుతారు.

  4. ద్వితీయోపదేశకాండము 9:1సుమారు క్రీ.పూ. 1451

    ఇశ్రాయేలూ, విను: ఇప్పుడు మీరు ఆకాశాన్నంటే ఎత్తైన గోడలున్న పెద్ద పట్టణాలు గల మీకన్నా గొప్ప బలమైన దేశాలను, స్వాధీనం చేసుకోవడానికి మీరు యొర్దాను దాటబోతున్నారు.

  5. ద్వితీయోపదేశకాండము 9:2సుమారు క్రీ.పూ. 1451

    అక్కడి ప్రజలు బలవంతులు పొడవైనవారు, వారు మీకు తెలిసిన అనాకీయుల వంశస్థులు. వారి గురించి, “అనాకీయుల ఎదుట ఎవరు నిలబడగలరు?” అని చెప్పడం మీరు విన్నారు కదా.

  6. ద్వితీయోపదేశకాండము 9:3సుమారు క్రీ.పూ. 1451

    అయితే దహించే అగ్నిలా మీ దేవుడైన యెహోవా మీకు ముందుగా దాటి వెళ్తారని మీరు నమ్మండి. ఆయన వారిని నాశనం చేస్తారు; మీ ఎదుట వారిని అణచివేస్తారు. యెహోవా మీకు ప్రమాణం చేసిన ప్రకారం, మీరు వారిని వెళ్లగొట్టి త్వరగా వారిని నిర్మూలం చేస్తారు.

  7. ద్వితీయోపదేశకాండము 9:4సుమారు క్రీ.పూ. 1451

    మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి వారిని వెళ్లగొట్టిన తర్వాత, “మా నీతిని బట్టే ఈ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి యెహోవా మమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చారు” అని మీ హృదయంలో అనుకోవద్దు. ఈ జనాంగాల దుర్మార్గాన్ని బట్టే యెహోవా మీ ఎదుట నుండి వారిని వెళ్లగొట్టబోతున్నారు.

  8. ద్వితీయోపదేశకాండము 9:5సుమారు క్రీ.పూ. 1451

    మీ నీతి, నిష్కపటమైన మీ హృదయం కారణంగా మీరు వారి దేశాన్ని స్వాధీనం చేసుకోవడంలేదు కాని ఈ జనాంగాల దుర్మార్గాన్ని బట్టే యెహోవా మీ పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణాన్ని నెరవేర్చడానికి మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి వారిని వెళ్లగొడతారు.

  9. ద్వితీయోపదేశకాండము 9:6సుమారు క్రీ.పూ. 1451

    మీరు మొండి ప్రజలు కాబట్టి, మీ దేవుడైన యెహోవా స్వాధీనం చేసుకోవడానికి ఈ మంచి దేశాన్ని మీకు ఇవ్వడానికి మీ నీతి కారణం కాదని మీరు గ్రహించండి.

  10. ద్వితీయోపదేశకాండము 9:7సుమారు క్రీ.పూ. 1451

    అరణ్యంలో మీరు మీ దేవుడైన యెహోవాకు ఎలా కోపం పుట్టించారో జ్ఞాపకం చేసుకోండి. మీరు ఈజిప్టు విడిచిన రోజు నుండి ఇక్కడకు వచ్చిన కాలం వరకు యెహోవా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు.

  11. ద్వితీయోపదేశకాండము 9:8సుమారు క్రీ.పూ. 1451

    హోరేబులో యెహోవా మిమ్మల్ని నాశనం చేసేంతగా ఆయనకు కోపం పుట్టించారు.

  12. ద్వితీయోపదేశకాండము 9:9సుమారు క్రీ.పూ. 1451

    రాతిపలకలు అనగా, యెహోవా మీతో చేసిన నిబంధనకు సంబంధించి పలకలను తీసుకోవడానికి నేను పర్వతం మీదికి ఎక్కి వెళ్లినప్పుడు, ఆ పర్వతం మీద నేను నలభై పగళ్లు, నలభై రాత్రులు ఉన్నాను; నేను ఆహారం తినలేదు, నీళ్లు త్రాగలేదు.

  13. ద్వితీయోపదేశకాండము 9:10సుమారు క్రీ.పూ. 1451

    దేవుని వ్రేలితో వ్రాయబడిన రెండు రాతిపలకలను యెహోవా నాకు ఇచ్చారు. మీరందరు సమావేశమైన రోజున పర్వతం మీద అగ్ని మధ్యలో నుండి యెహోవా మీకు ప్రకటించిన ఆజ్ఞలు ఆ పలకల మీద ఉన్నాయి.

  14. ద్వితీయోపదేశకాండము 9:11సుమారు క్రీ.పూ. 1451

    నలభై పగళ్లు, నలభై రాత్రులు గడిచినప్పుడు, యెహోవా రెండు రాతిపలకలు అనగా, నిబంధనకు సంబంధించిన పలకలు నాకు ఇచ్చారు.

  15. ద్వితీయోపదేశకాండము 9:12సుమారు క్రీ.పూ. 1451

    అప్పుడు యెహోవా నాతో, “నీవు వెంటనే ఇక్కడినుండి క్రిందికి వెళ్లు, నీవు ఈజిప్టు నుండి తీసుకువచ్చిన నీ ప్రజలు చెడిపోయారు. నేను వారికి ఆజ్ఞాపించిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి తమ కోసం ఒక విగ్రహాన్ని తయారుచేసుకున్నారు” అని చెప్పారు.

  16. ద్వితీయోపదేశకాండము 9:13సుమారు క్రీ.పూ. 1451

    ఇంకా యెహోవా నాతో, “నేను ఈ ప్రజలను చూశాను, వారు నిజంగా మొండి ప్రజలు.

  17. ద్వితీయోపదేశకాండము 9:14సుమారు క్రీ.పూ. 1451

    నన్ను విడిచిపెట్టు, నేను వారిని నాశనం చేసి, ఆకాశం క్రింద వారి పేరు ఉండకుండా తుడిచివేస్తాను. నిన్ను వారికంటే బలమైన దేశంగా, సంఖ్యలో వారికంటే ఎక్కువ ఉండేలా చేస్తాను” అని అన్నారు.

  18. ద్వితీయోపదేశకాండము 9:15సుమారు క్రీ.పూ. 1451

    కాబట్టి నేను పర్వతం అగ్నితో మండుతున్నప్పుడు తిరిగి పర్వతం దిగి వచ్చాను. రెండు నిబంధన పలకలు నా చేతిలో ఉన్నాయి.

  19. ద్వితీయోపదేశకాండము 9:16సుమారు క్రీ.పూ. 1451

    నేను చూసినప్పుడు, మీ దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా మీరు పాపం చేశారని నేను చూశాను; దూడ రూపంలో తయారుచేసిన విగ్రహాన్ని మీ కోసం తయారుచేసుకున్నారు. యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గంలో నుండి త్వరగా తొలగిపోయారు.

  20. ద్వితీయోపదేశకాండము 9:17సుమారు క్రీ.పూ. 1451

    కాబట్టి నా చేతుల్లో ఉన్న రెండు పలకలను విసిరి, మీ కళ్లముందే వాటిని ముక్కలు చేశాను.

  21. ద్వితీయోపదేశకాండము 9:18సుమారు క్రీ.పూ. 1451

    యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించి చేసిన పాపాలన్నిటిని బట్టి మీరు ఆయనకు కోపం పుట్టించిన కారణంగా మళ్ళీ నేను నలభై పగళ్లు నలభై రాత్రులు ఆహారం తినకుండా నీళ్లు త్రాగకుండా యెహోవా ఎదుట సాష్టాంగపడ్డాను.

  22. ద్వితీయోపదేశకాండము 9:19సుమారు క్రీ.పూ. 1451

    మిమ్మల్ని నాశనం చేయాలన్నంతగా కోప్పడిన యెహోవా కోపాన్ని ఉగ్రతను చూసి నేను భయపడ్డాను. కాని యెహోవా మరలా నా మనవి ఆలకించారు.

  23. ద్వితీయోపదేశకాండము 9:20సుమారు క్రీ.పూ. 1451

    అహరోనును కూడా నాశనం చేసేంతగా యెహోవా అతనిపై కోప్పడ్డారు, కాని నేను అప్పుడు అహరోను కోసం కూడా ప్రార్థన చేశాను.

  24. ద్వితీయోపదేశకాండము 9:21సుమారు క్రీ.పూ. 1451

    అలాగే మీరు చేసిన పాపిష్ఠి పని, అనగా దూడ విగ్రహాన్ని తీసుకుని అగ్నిలో కాల్చివేశాను. తర్వాత నలగ్గొట్టి దుమ్ము అంత మెత్తగా దానిని పొడిచేసి, ఆ పర్వతం నుండి ప్రవహిస్తున్న వాగులో పడేశాను.

  25. ద్వితీయోపదేశకాండము 9:22సుమారు క్రీ.పూ. 1451

    తబేరా, మస్సా, కిబ్రోతు హత్తావాలలో కూడా మీరు యెహోవాకు కోపం పుట్టించారు.