కంటెంట్‌కు వెళ్లండి

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ద్వితీయోపదేశకాండము 6:19సుమారు క్రీ.పూ. 1451

    To cast out all thine enemies from before thee, as the LORD hath spoken.

  2. ద్వితీయోపదేశకాండము 6:20సుమారు క్రీ.పూ. 1451

    భవిష్యత్తులో, “మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించిన నిబంధనలు, శాసనాలు, చట్టాలకు అర్థం ఏంటి?” అని మీ పిల్లలు మిమ్మల్ని అడిగినప్పుడు,

  3. ద్వితీయోపదేశకాండము 6:21సుమారు క్రీ.పూ. 1451

    మీరు వారితో, “మనం ఈజిప్టులో ఫరోకు బానిసలుగా ఉన్నప్పుడు, యెహోవా బలమైన హస్తంతో మనలను ఈజిప్టులో నుండి బయటకు తీసుకువచ్చారు.

  4. ద్వితీయోపదేశకాండము 6:22సుమారు క్రీ.పూ. 1451

    మన కళ్లముందు యెహోవా ఈజిప్టు మీద, ఫరో మీద, అతని ఇంటివారందరి మీద గొప్ప, భయంకరమైన అసాధారణ గుర్తులను, అద్భుతాలను చేశారు.

  5. ద్వితీయోపదేశకాండము 6:23సుమారు క్రీ.పూ. 1451

    ఆయన మన పూర్వికులతో ప్రమాణం చేసిన దేశంలోనికి మనలను తీసుకువచ్చి దానిని మనకు ఇవ్వడానికి అక్కడినుండి మనలను బయటకు తీసుకువచ్చారు.

  6. ద్వితీయోపదేశకాండము 6:24సుమారు క్రీ.పూ. 1451

    మనం ఎల్లప్పుడు వర్ధిల్లుతూ, నేడు ఉన్నట్లుగా మనం బ్రతికి ఉండడానికి ఈ శాసనాలన్నిటికి లోబడి మన దేవుడైన యెహోవాకు భయపడమని యెహోవా మనకు ఆజ్ఞాపించారు.

  7. ద్వితీయోపదేశకాండము 6:25సుమారు క్రీ.పూ. 1451

    మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన ఎదుట మనం ఈ ఆజ్ఞలన్నిటిని జాగ్రత్తగా అనుసరిస్తే అది మనకు నీతిగా పరిగణించబడుతుంది” అని చెప్పండి.

  8. ద్వితీయోపదేశకాండము 7:1సుమారు క్రీ.పూ. 1451

    మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలోనికి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని తీసుకువచ్చి, మీ ఎదుట నుండి అనేక జనాంగాలను అనగా మీకన్నా విస్తారమైన, బలమైన ఏడు జనాంగాలను హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను వెళ్లగొట్టి,

  9. ద్వితీయోపదేశకాండము 7:2సుమారు క్రీ.పూ. 1451

    మీ దేవుడైన యెహోవా వారిని మీకు అప్పగించగా, మీరు వారిని ఓడించినప్పుడు, వారిని పూర్తిగా నాశనం చేయాలి. వారితో సంధి చేసుకోకూడదు వారిని కరుణించకూడదు.

  10. ద్వితీయోపదేశకాండము 7:3సుమారు క్రీ.పూ. 1451

    వారితో పెళ్ళి సంబంధాలు పెట్టుకోవద్దు. వారి కుమారులకు మీ కుమార్తెలను ఇవ్వకూడదు, మీ కుమారులకు వారి కుమార్తెలను పుచ్చుకోకూడదు,

  11. ద్వితీయోపదేశకాండము 7:4సుమారు క్రీ.పూ. 1451

    ఎందుకంటే వారు నన్ను అనుసరించకుండా ఇతర దేవుళ్ళను సేవించేలా మీ పిల్లలను త్రిప్పివేస్తారు, అప్పుడు యెహోవా కోపం మీమీద రగులుకొని మిమ్మల్ని త్వరగా నాశనం చేస్తుంది.

  12. ద్వితీయోపదేశకాండము 7:5సుమారు క్రీ.పూ. 1451

    మీరు వారికి ఇలా చేయాలి: వారి బలిపీఠాలను పడగొట్టండి, వారి పవిత్ర రాళ్లను పగులగొట్టండి, వారి అషేరా స్తంభాలను ముక్కలు చేయండి, వారి విగ్రహాలను అగ్నితో కాల్చివేయండి.

  13. ద్వితీయోపదేశకాండము 7:6సుమారు క్రీ.పూ. 1451

    ఎందుకంటే, మీరు మీ దేవుడైన యెహోవాకు పరిశుద్ధ ప్రజలు. ఈ భూమి మీద ప్రజలందరిలో నుండి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని తన సొంత ప్రజలుగా, విలువైన ఆస్తిగా ఎన్నుకున్నారు.

  14. ద్వితీయోపదేశకాండము 7:7సుమారు క్రీ.పూ. 1451

    మీరు ఇతర జనాంగాల కంటే ఎక్కువగా ఉన్నారని కాదు జనాంగాలన్నిటిలో మీరే తక్కువగా ఉన్నారని యెహోవా మిమ్మల్ని ప్రేమించి ఏర్పరచుకున్నారు.

  15. ద్వితీయోపదేశకాండము 7:8సుమారు క్రీ.పూ. 1451

    అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించారు కాబట్టి, మీ పూర్వికులతో చేసిన ప్రమాణం నెరవేర్చారు కాబట్టి, తన బలమైన హస్తంతో మిమ్మల్ని బయటకు తీసుకువచ్చి బానిస దేశం నుండి, ఈజిప్టు రాజైన ఫరో శక్తి నుండి మిమ్మల్ని విడిపించారు.

  16. ద్వితీయోపదేశకాండము 7:9సుమారు క్రీ.పూ. 1451

    కాబట్టి మీ దేవుడైన యెహోవాయే దేవుడని తెలుసుకోండి; ఆయన నమ్మదగిన దేవుడు, తనను ప్రేమిస్తూ, తన ఆజ్ఞలను పాటించే వారికి, ఆయన వెయ్యి తరాల వరకు తన నిబంధన స్థిరపరిచేవారు.

  17. ద్వితీయోపదేశకాండము 7:10సుమారు క్రీ.పూ. 1451

    అయితే, తనను ద్వేషించేవారిని నేరుగా నాశనం చేస్తారు; ఆలస్యం చేయకుండా నేరుగా వారికి ప్రతిఫలం చెల్లిస్తారు.

  18. ద్వితీయోపదేశకాండము 7:11సుమారు క్రీ.పూ. 1451

    కాబట్టి ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞలు, శాసనాలు, చట్టాలను జాగ్రత్తగా అనుసరించండి.

  19. ద్వితీయోపదేశకాండము 7:12సుమారు క్రీ.పూ. 1451

    మీరు ఈ చట్టాలను శ్రద్ధగా విని వాటిని జాగ్రత్తగా అనుసరిస్తే, మీ దేవుడైన యెహోవా మీ పూర్వికులకు ప్రమాణం చేసినట్లుగా, మీతో తన ప్రేమ నిబంధనను కొనసాగిస్తారు.

  20. ద్వితీయోపదేశకాండము 7:13సుమారు క్రీ.పూ. 1451

    ఆయన మిమ్మల్ని ప్రేమించి దీవించి అభివృద్ధి కలుగజేస్తారు. మీకు ఇస్తానని మీ పూర్వికులకు ప్రమాణం చేసిన దేశంలో, మీ గర్భఫలాన్ని, మీ భూఫలమైన మీ ధాన్యం, క్రొత్త ద్రాక్షరసం, ఒలీవనూనె, పశువుల దూడలను, మందల గొర్రెపిల్లలను దీవిస్తారు.

  21. ద్వితీయోపదేశకాండము 7:14సుమారు క్రీ.పూ. 1451

    ఇతర ప్రజలకన్నా అధికంగా మీరు ఆశీర్వదించబడతారు; మీలో పురుషులలో కాని స్త్రీలలో కాని సంతానలేమి ఉండదు, మీ పశువుల్లో కూడా ఉండదు.

  22. ద్వితీయోపదేశకాండము 7:15సుమారు క్రీ.పూ. 1451

    యెహోవా మిమ్మల్ని ప్రతీ వ్యాధి నుండి కాపాడతారు. ఈజిప్టులో మీకు తెలిసిన భయంకరమైన రోగాల మీ మీదికి రాకుండా చేస్తారు, కాని మిమ్మల్ని ద్వేషించే వారందరి మీదికి వాటిని రప్పిస్తారు.

  23. ద్వితీయోపదేశకాండము 7:16సుమారు క్రీ.పూ. 1451

    మీ దేవుడైన యెహోవా మీకు అప్పగించే ప్రజలందరినీ పూర్తిగా నాశనం చేయాలి. వారి మీద దయ చూపించకూడదు, వారి దేవుళ్ళను సేవించకూడదు, ఎందుకంటే అది మీకు ఉరిగా బిగుసుకుంటుంది.

  24. ద్వితీయోపదేశకాండము 7:17సుమారు క్రీ.పూ. 1451

    “ఈ జనాంగాలు మా కన్నా బలవంతులు. మేము వారినెలా వెళ్లగొట్టగలము?” అని మీలో మీరు అనుకోవచ్చు.

  25. ద్వితీయోపదేశకాండము 7:18సుమారు క్రీ.పూ. 1451

    అయితే వారికి భయపడకండి; మీ దేవుడైన యెహోవా ఫరోకు, ఈజిప్టు దేశమంతటికి చేసింది జాగ్రతగా జ్ఞాపకం చేసుకోండి.