కంటెంట్‌కు వెళ్లండి

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ద్వితీయోపదేశకాండము 5:2సుమారు క్రీ.పూ. 1451

    మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేశారు.

  2. ద్వితీయోపదేశకాండము 5:3సుమారు క్రీ.పూ. 1451

    యెహోవా ఈ నిబంధన చేసింది మన పూర్వికులతో కాదు, మనతో, ఈ రోజు సజీవంగా ఉన్న మనందరితో చేశారు.

  3. ద్వితీయోపదేశకాండము 5:4సుమారు క్రీ.పూ. 1451

    ఆ పర్వతం మీద అగ్నిలో నుండి యెహోవా మీతో ముఖాముఖిగా మాట్లాడారు.

  4. ద్వితీయోపదేశకాండము 5:5సుమారు క్రీ.పూ. 1451

    అయితే మీరు ఆ అగ్నికి భయపడి పర్వతం ఎక్కలేదు కాబట్టి యెహోవా మాట మీకు తెలియజేయడానికి నేను యెహోవాకు మీకు మధ్యలో నిలబడ్డాను. ఆయన ఇలా అన్నారు:

  5. ద్వితీయోపదేశకాండము 5:6సుమారు క్రీ.పూ. 1451

    “బానిస దేశమైన ఈజిప్టు నుండి మిమ్మల్ని బయటకు రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే.

  6. ద్వితీయోపదేశకాండము 5:7సుమారు క్రీ.పూ. 1451

    “నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు.

  7. ద్వితీయోపదేశకాండము 5:8సుమారు క్రీ.పూ. 1451

    పైన ఆకాశంలో గాని, క్రింద భూమిమీద గాని భూమి క్రింద నీళ్లలో గాని ఉన్న దేని రూపంలో మీరు మీకోసం ప్రతిమను చేసుకోకూడదు.

  8. ద్వితీయోపదేశకాండము 5:9సుమారు క్రీ.పూ. 1451

    మీరు వాటికి నమస్కరించకూడదు పూజింపకూడదు; ఎందుకంటే నేను, మీ దేవుడనైన యెహోవాను, రోషం గల దేవుడను, నన్ను ద్వేషించినవారి విషయంలో మూడు నాలుగు తరాల వరకు తండ్రుల పాపం యొక్క శిక్షను వారి పిల్లల మీదికి రప్పిస్తాను.

  9. ద్వితీయోపదేశకాండము 5:10సుమారు క్రీ.పూ. 1451

    అయితే నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను పాటించే వారికి వెయ్యి తరాల వరకు కరుణను చూపిస్తాను.

  10. ద్వితీయోపదేశకాండము 5:11సుమారు క్రీ.పూ. 1451

    మీ దేవుడైన యెహోవా నామాన్ని అనవసరంగా ఉపయోగించకూడదు, ఎందుకంటే తన నామాన్ని అనవసరంగా ఉపయోగించే వారిని యెహోవా నిర్దోషులుగా వదిలేయరు.

  11. ద్వితీయోపదేశకాండము 5:12సుమారు క్రీ.పూ. 1451

    యెహోవా మీకు ఆజ్ఞాపించినట్లు సబ్బాతు దినాన్ని పరిశుద్ధంగా పాటించడం జ్ఞాపకముంచుకోండి.

  12. ద్వితీయోపదేశకాండము 5:13సుమారు క్రీ.పూ. 1451

    ఆరు రోజులు మీరు కష్టపడి మీ పని అంతటిని చేసుకోవాలి,

  13. ద్వితీయోపదేశకాండము 5:14సుమారు క్రీ.పూ. 1451

    కాని ఏడవ రోజు మీ దేవుడైన యెహోవాకు సబ్బాతు దినము. ఆ రోజు మీరు ఏ పని చేయకూడదు, మీరు గాని, మీ కుమారుడు లేదా కుమార్తె గాని, మీ దాసదాసీలు గాని, మీ ఎద్దు గాని, మీ గాడిద గాని, మీ పశువులు గాని, మీ పట్టణాల్లో ఉంటున్న విదేశీయులు గాని ఏ పని చేయకూడదు తద్వార మీలా మీ దాసదాసీలు విశ్రాంతి తీసుకుంటారు.

  14. ద్వితీయోపదేశకాండము 5:15సుమారు క్రీ.పూ. 1451

    మీరు ఈజిప్టులో బానిసత్వంలో ఉన్నప్పుడు, మీ దేవుడైన యెహోవా బలమైన హస్తంతో, చాచిన చేతితో మిమ్మల్ని అక్కడినుండి బయటకు తీసుకువచ్చారని జ్ఞాపకం ఉంచుకోండి. కాబట్టి సబ్బాతు దినాన్ని పాటించమని మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించారు.

  15. ద్వితీయోపదేశకాండము 5:16సుమారు క్రీ.పూ. 1451

    మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చే దేశంలో మీరు దీర్ఘాయుష్మంతులై మీకు క్షేమం కలిగేలా మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన ప్రకారం, మీ తండ్రిని తల్లిని గౌరవించాలి.

  16. ద్వితీయోపదేశకాండము 5:17సుమారు క్రీ.పూ. 1451

    మీరు హత్య చేయకూడదు.

  17. ద్వితీయోపదేశకాండము 5:18సుమారు క్రీ.పూ. 1451

    మీరు వ్యభిచారం చేయకూడదు.

  18. ద్వితీయోపదేశకాండము 5:19సుమారు క్రీ.పూ. 1451

    మీరు దొంగతనం చేయకూడదు.

  19. ద్వితీయోపదేశకాండము 5:20సుమారు క్రీ.పూ. 1451

    మీ పొరుగువారికి వ్యతిరేకంగా అబద్ధసాక్ష్యం చెప్పకూడదు.

  20. ద్వితీయోపదేశకాండము 5:21సుమారు క్రీ.పూ. 1451

    మీ పొరుగువాని భార్యను మీరు ఆశించకూడదు. మీ పొరుగువాని ఇంటిని గాని స్థలాన్ని గాని అతని దాసుని గాని, దాసిని గాని, అతని ఎద్దును గాని గాడిదను గాని, మీ పొరుగువానికి చెందిన దేన్ని మీరు ఆశించకూడదు.”

  21. ద్వితీయోపదేశకాండము 5:22సుమారు క్రీ.పూ. 1451

    ఈ ఆజ్ఞలు యెహోవా ఆ పర్వతం మీద అగ్ని, మేఘం, కటిక చీకటిలో నుండి గొప్ప స్వరంతో మీ సమాజమంతటికి ప్రకటించారు; ఆయన ఇంకా ఏది కలుపలేదు. ఆ తర్వాత ఆయన రెండు రాతి పలకల మీద వాటిని వ్రాసి నాకు ఇచ్చారు.

  22. ద్వితీయోపదేశకాండము 5:23సుమారు క్రీ.పూ. 1451

    ఆ పర్వతం అగ్నితో మండుతున్నప్పుడు, ఆ చీకటిలో నుండి స్వరాన్ని మీరు విన్నప్పుడు, మీ గోత్రాల నాయకులందరు, మీ పెద్దలు నా దగ్గరకు వచ్చారు.

  23. ద్వితీయోపదేశకాండము 5:24సుమారు క్రీ.పూ. 1451

    మీరు నాతో అన్నారు, “మన దేవుడైన యెహోవా తన మహిమను తన ఘనతను మాకు చూపించారు, అగ్నిలో నుండి ఆయన స్వరాన్ని మేము విన్నాము. దేవుడు మనుష్యులతో మాట్లాడినా వారు బ్రతికే ఉంటారని ఈ రోజు మేము చూశాము.

  24. ద్వితీయోపదేశకాండము 5:25సుమారు క్రీ.పూ. 1451

    అయితే ఇప్పుడు మేమెందుకు చావాలి? ఈ గొప్ప అగ్ని మమ్మల్ని కాల్చివేస్తుంది, మేము మన దేవుడైన యెహోవా స్వరాన్ని ఇంకా వింటే చనిపోతాము.

  25. ద్వితీయోపదేశకాండము 5:26సుమారు క్రీ.పూ. 1451

    మేము విన్నట్లు మానవులలో ఎవరైనా సజీవుడైన దేవుని స్వరం అగ్నిలో నుండి మాట్లాడడం విని బ్రతికి ఉన్నారా?