కంటెంట్‌కు వెళ్లండి

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ద్వితీయోపదేశకాండము 4:26సుమారు క్రీ.పూ. 1451

    మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనం చేసుకోబోయే ఆ దేశంలో ఎక్కువకాలం నివసించకుండా వెంటనే నశిస్తారని ఈ రోజు ఆకాశాలను భూమిని మీమీద సాక్షులుగా ఉంచుతున్నాను. ఆ దేశంలో ఎక్కువకాలం నివసించరు ఖచ్చితంగా నశించిపోతారు.

  2. ద్వితీయోపదేశకాండము 4:27సుమారు క్రీ.పూ. 1451

    యెహోవా జనాంగాల మధ్యలో మిమ్మల్ని చెదరగొడతారు, యెహోవా మిమ్మల్ని తోలివేసే దేశాల మధ్యలో మీలో కొద్దిమంది మాత్రమే మిగులుతారు.

  3. ద్వితీయోపదేశకాండము 4:28సుమారు క్రీ.పూ. 1451

    అక్కడ మీరు మనుష్యులు తయారుచేసిన కర్ర, రాతి దేవుళ్ళను సేవిస్తారు. అవి చూడలేవు, వినలేవు, తినలేవు, వాసన చూడలేవు.

  4. ద్వితీయోపదేశకాండము 4:29సుమారు క్రీ.పూ. 1451

    అయితే అక్కడినుండి మీరు మీ దేవుడైన యెహోవాను వెదికితే, మీ పూర్ణహృదయంతో మీ పూర్ణాత్మతో వెదికినప్పుడు ఆయన మీకు దొరుకుతారు.

  5. ద్వితీయోపదేశకాండము 4:30సుమారు క్రీ.పూ. 1451

    మీరు దుఃఖంలో ఉన్నప్పుడు, ఈ సంగతులన్ని మీకు జరిగిన తర్వాత, అప్పుడు చివరి రోజుల్లో మీరు మీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వింటారు.

  6. ద్వితీయోపదేశకాండము 4:31సుమారు క్రీ.పూ. 1451

    మీ దేవుడైన యెహోవా జాలిగల దేవుడు; కాబట్టి ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు, మిమ్మల్ని నాశనం చేయడు, ఆయన మీ పూర్వికులతో ప్రమాణం ద్వార నిశ్చయం చేసిన నిబంధనను మరచిపోరు.

  7. ద్వితీయోపదేశకాండము 4:32సుమారు క్రీ.పూ. 1451

    దేవుడు భూమి మీద నరుని సృజించిన రోజు నుండి, మీకంటే ముందు ఉన్న గత కాలం గురించి అడగండి; ఆకాశం యొక్క ఒక చివరి నుండి మరో చివరి వరకు అడగండి. ఇలాంటి గొప్ప కార్యం ఎప్పుడైనా జరిగిందా? లేదా అటువంటి దాని గురించి ఎప్పుడైనా విన్నారా?

  8. ద్వితీయోపదేశకాండము 4:33సుమారు క్రీ.పూ. 1451

    అగ్ని మధ్యలో నుండి మాట్లాడిన దేవుని స్వరాన్ని మీరు విన్నట్లు మరి ఏ ప్రజలైనా విని బ్రతికారా?

  9. ద్వితీయోపదేశకాండము 4:34సుమారు క్రీ.పూ. 1451

    మీ దేవుడైన యెహోవా ఈజిప్టులో మీ కళ్ళెదుట మీ కోసం శోధనలతో, సూచకక్రియలతో, అద్భుతాలతో, యుద్ధంతో, బలమైన హస్తంతో, చాచిన చేతితో మహా భయంకరమైన కార్యాలతో సమస్త కార్యాలను చేసినట్లు ఏ దేవుడైన తన కోసం ఒక దేశం నుండి మరొక దేశాన్ని బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేశాడా?

  10. ద్వితీయోపదేశకాండము 4:35సుమారు క్రీ.పూ. 1451

    యెహోవాయే దేవుడని ఆయన తప్ప మరి ఎవరు లేరని మీరు తెలుసుకునేలా ఇవన్నీ మీకు చూపబడ్డాయి.

  11. ద్వితీయోపదేశకాండము 4:36సుమారు క్రీ.పూ. 1451

    మిమ్మల్ని క్రమపరచడానికి ఆకాశం నుండి తన స్వరాన్ని మీకు వినిపించారు. భూమి మీద మీకు తన గొప్ప అగ్నిని చూపించారు, ఆ అగ్ని మధ్యలో నుండి ఆయన మాటలు మీరు విన్నారు.

  12. ద్వితీయోపదేశకాండము 4:37సుమారు క్రీ.పూ. 1451

    ఆయన మీ పూర్వికులను ప్రేమించి వారి సంతతిని ఎంపిక చేసుకున్నారు కాబట్టి, మీకంటే బలమైన గొప్ప దేశాలను మీ ఎదుట నుండి వెళ్లగొట్టి, వారి దేశంలోనికి మిమ్మల్ని తీసుకువచ్చి, ఈ రోజు ఇస్తున్నట్లుగా వారి దేశాన్ని మీకు స్వాస్థ్యంగా ఇవ్వడానికి ఆయన తన సన్నిధితో, తన మహాబలంతో మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు రప్పించారు.

  13. ద్వితీయోపదేశకాండము 4:38సుమారు క్రీ.పూ. 1451

    To drive out nations from before thee greater and mightier than thou art, to bring thee in, to give thee their land for an inheritance, as it is this day.

  14. ద్వితీయోపదేశకాండము 4:39సుమారు క్రీ.పూ. 1451

    కాబట్టి పైనున్న పరలోకంలో గాని, క్రిందున్న భూమిమీద గాని, యెహోవాయే దేవుడని, మరొక దేవుడు లేడని ఈ రోజే మీరు గుర్తించి, మీ హృదయాల్లో జ్ఞాపకం ఉంచుకోండి.

  15. ద్వితీయోపదేశకాండము 4:40సుమారు క్రీ.పూ. 1451

    మీకు, మీ తర్వాత మీ సంతతివారికి క్షేమం కలగడానికి యెహోవా శాశ్వతంగా మీకు ఇస్తున్న దేశంలో మీరు అధిక కాలం జీవించేలా ఈ రోజు నేను మీకు ఇస్తున్న శాసనాలను ఆజ్ఞలను పాటించండి.

  16. ద్వితీయోపదేశకాండము 4:41సుమారు క్రీ.పూ. 1451

    తర్వాత మోషే యొర్దానుకు తూర్పు వైపు ఉన్న మూడు పట్టణాలను ప్రత్యేకంగా ఉంచాడు.

  17. ద్వితీయోపదేశకాండము 4:42సుమారు క్రీ.పూ. 1451

    ఒక వ్యక్తిని చంపిన ఎవరైనా ఏ దురుద్దేశం లేకుండా పొరుగువారిని చంపినట్లయితే పారిపోవచ్చు. వారు ఈ పట్టణాల్లో ఒక దానికి పారిపోయి తమ ప్రాణాలను కాపాడుకోవచ్చు.

  18. ద్వితీయోపదేశకాండము 4:43సుమారు క్రీ.పూ. 1451

    ఆ పట్టణాలు ఇవి: రూబేనీయులకు అరణ్య పీఠభూమిలో ఉన్న బేసెరు; గాదీయులకు గిలాదులో ఉన్న రామోతు; మనష్షీయులకు బాషానులో ఉన్న గోలాను.

  19. ద్వితీయోపదేశకాండము 4:44సుమారు క్రీ.పూ. 1451

    మోషే ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రం ఇది.

  20. ద్వితీయోపదేశకాండము 4:45సుమారు క్రీ.పూ. 1451

    ఈ నిబంధనలు శాసనాలు చట్టాలు, ఇశ్రాయేలీయులు ఈజిప్టులో నుండి బయటకు వచ్చినప్పుడు యొర్దాను తూర్పున బేత్-పెయోరుకు ఎదురుగా ఉన్న లోయలో హెష్బోనులో పరిపాలించి, మోషే, ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయిన అమోరీయుల రాజైన సీహోను దేశంలో వారికి ఇవ్వబడినవి.

  21. ద్వితీయోపదేశకాండము 4:46సుమారు క్రీ.పూ. 1451

    On this side Jordan, in the valley over against Bethpeor, in the land of Sihon king of the Amorites, who dwelt at Heshbon, whom Moses and the children of Israel smote, after they were come forth out of Egypt:

  22. ద్వితీయోపదేశకాండము 4:47సుమారు క్రీ.పూ. 1451

    యొర్దానుకు తూర్పున ఉన్న అతని దేశాన్ని, బాషాను రాజైన ఓగు దేశాన్ని, ఈ ఇద్దరు అమోరీయుల రాజుల దేశాలను వారు స్వాధీనం చేసుకున్నారు.

  23. ద్వితీయోపదేశకాండము 4:48సుమారు క్రీ.పూ. 1451

    ఆ దేశం అర్నోను వాగు లోయ ఒడ్డున ఉన్న అరోయేరు నుండి హెర్మోను అనే సీయోను కొండ వరకు,

  24. ద్వితీయోపదేశకాండము 4:49సుమారు క్రీ.పూ. 1451

    యొర్దాను తూర్పున ఉన్న అరాబా ప్రాంతమంతా, పిస్గా కొండచరియల దిగువగా ఉప్పు సముద్రం వరకు ఉంది.

  25. ద్వితీయోపదేశకాండము 5:1సుమారు క్రీ.పూ. 1451

    మోషే ఇశ్రాయేలీయులందరిని పిలిపించి వారితో ఇలా చెప్పాడు: ఇశ్రాయేలూ, మీ వినికిడిలో నేను ప్రకటించే శాసనాలను, చట్టాలను వినండి. వాటిని నేర్చుకొని ఖచ్చితంగా పాటించండి.