కంటెంట్‌కు వెళ్లండి

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ద్వితీయోపదేశకాండము 3:5సుమారు క్రీ.పూ. 1452

    ఈ పట్టణాలన్ని ఎత్తైన గోడలు, ద్వారాలు గడియలతో పటిష్టంగా ఉన్నాయి, వీటితో పాటు గోడలులేని అనేక గ్రామాలు కూడా ఉన్నాయి.

  2. ద్వితీయోపదేశకాండము 3:6సుమారు క్రీ.పూ. 1452

    హెష్బోను రాజైన సీహోనుకు చేసినట్లే ప్రతి పట్టణంలోని స్త్రీ పురుషులు, పిల్లలను పూర్తిగా నాశనం చేశాము.

  3. ద్వితీయోపదేశకాండము 3:7సుమారు క్రీ.పూ. 1452

    అయితే మన కోసం పశువులన్నిటిని, వారి పట్టణాల నుండి సొమ్మును దోచుకున్నాము.

  4. ద్వితీయోపదేశకాండము 3:8సుమారు క్రీ.పూ. 1452

    ఆ సమయంలో ఈ ఇద్దరు అమోరీయుల రాజుల నుండి అర్నోను వాగు మొదలుకొని హెర్మోను పర్వతం వరకు యొర్దానుకు తూర్పున ఉన్న ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాము.

  5. ద్వితీయోపదేశకాండము 3:9సుమారు క్రీ.పూ. 1452

    హెర్మోనును సీదోనీయులు షిర్యోను అంటారు; అమోరీయులు శెనీరు అని పిలుస్తారు.

  6. ద్వితీయోపదేశకాండము 3:10సుమారు క్రీ.పూ. 1452

    పీఠభూమిలో ఉన్న పట్టణాలన్నిటిని, బాషానులో ఓగు రాజ్యంలోని పట్టణాలైన సలేకా ఎద్రెయీల వరకు గిలాదు అంతటిని, బాషానును అంతటిని స్వాధీనం చేసుకున్నాము.

  7. ద్వితీయోపదేశకాండము 3:11సుమారు క్రీ.పూ. 1452

    రెఫాయీయులలో బాషాను రాజైన ఓగు చివరివాడు. అతని సమాధి ఇనుముతో చేయబడి తొమ్మిది మూరల పొడవు నాలుగు మూరల వెడల్పు కలది. అది ఇంకా అమ్మోనీయులకు చెందిన రబ్బాలో ఉంది.

  8. ద్వితీయోపదేశకాండము 3:12సుమారు క్రీ.పూ. 1452

    ఆ సమయంలో మనం స్వాధీనం చేసుకున్న దేశాన్ని అనగా అర్నోను వాగు లోయలో ఉన్న అరోయేరు నుండి గిలాదు కొండ ప్రాంతంలోని సగభాగాన్ని దానిలో ఉన్న పట్టణాలతో కలిపి రూబేనీయులకు గాదీయులకు ఇచ్చాను.

  9. ద్వితీయోపదేశకాండము 3:13సుమారు క్రీ.పూ. 1452

    గిలాదులో మిగతా ప్రాంతాన్ని, ఓగు రాజ్యమైన బాషాను అంతటిని మనష్షే అర్ధగోత్రానికి ఇచ్చాను. బాషానులోని అర్గోబు ప్రాంతమంతా రెఫాయీయుల దేశమని పిలువబడేది.

  10. ద్వితీయోపదేశకాండము 3:14సుమారు క్రీ.పూ. 1452

    మనష్షే సంతానమైన యాయీరు అర్గోబు ప్రాంతమంతా గెషూరీయుల మయకాతీయుల సరిహద్దుల వరకు స్వాధీనపరచుకున్నాడు. దానికి అతని పేరు పెట్టబడింది కాబట్టి నేటికీ బాషాను హవ్వోత్ యాయీరు అని పిలుస్తారు.

  11. ద్వితీయోపదేశకాండము 3:15సుమారు క్రీ.పూ. 1452

    గిలాదును మాకీరుకు ఇచ్చాను.

  12. ద్వితీయోపదేశకాండము 3:16సుమారు క్రీ.పూ. 1452

    అయితే రూబేనీయులకు, గాదీయులకు గిలాదు నుండి అర్నోను వాగు లోయ మధ్య వరకు, యబ్బోకు నది వరకు, అమ్మోనీయుల సరిహద్దు వరకు నేను ఇచ్చాను.

  13. ద్వితీయోపదేశకాండము 3:17సుమారు క్రీ.పూ. 1452

    దాని పశ్చిమ సరిహద్దు కిన్నెరెతు నుండి పిస్గా కొండచరియల తూర్పున, మృత సముద్రమనే అరాబా సముద్రం వరకు వ్యాపించి ఉన్న అరాబాలోని యొర్దాను నది.

  14. ద్వితీయోపదేశకాండము 3:18సుమారు క్రీ.పూ. 1452

    ఆ సమయంలో నేను యొర్దాను తూర్పున నివసిస్తున్న గోత్రాలకు మీకు ఇలా ఆజ్ఞాపించాను: “మీ దేవుడైన యెహోవా మీరు స్వాధీనం చేసుకోవడానికి మీకు ఈ దేశాన్ని ఇచ్చారు. అయితే మీలో ధృడమైనవారు, యుద్ధానికి సిద్ధపడినవారు ఇతర ఇశ్రాయేలీయులకు ముందుగా నది దాటాలి.

  15. ద్వితీయోపదేశకాండము 3:19సుమారు క్రీ.పూ. 1452

    అయితే యెహోవా మీకు విశ్రాంతి ఇచ్చినట్టు మీ సోదరులకును విశ్రాంతి ఇచ్చేవరకు, అంటే యొర్దాను అవతల మీ దేవుడైన యెహోవా వారికి ఇస్తున్న దేశాన్ని వారు స్వాధీనం చేసుకునేవరకు మీ భార్యలు, మీ పిల్లలు మీ పశువులు నేను మీకిచ్చిన పట్టణాల్లోనే ఉండాలి. ఆ తర్వాత నేను మీకు ఇచ్చిన స్వాస్థ్యాలకు ప్రతి ఒక్కరు తిరిగి వెళ్లవచ్చు.”

  16. ద్వితీయోపదేశకాండము 3:20సుమారు క్రీ.పూ. 1452

    Until the LORD have given rest unto your brethren, as well as unto you, and until they also possess the land which the LORD your God hath given them beyond Jordan: and then shall ye return every man unto his possession, which I have given you.

  17. ద్వితీయోపదేశకాండము 3:21సుమారు క్రీ.పూ. 1452

    ఆ సమయంలో నేను యెహోషువకు ఆజ్ఞాపించాను: “నీవు నీ కళ్లారా దేవుడైన యెహోవా ఈ ఇద్దరు రాజులకు చేసిందంతా చూశావు. నీవు వెళ్లబోయే చోటులో ఉన్న అన్ని రాజ్యాలకు యెహోవా అలాగే చేస్తారు.

  18. ద్వితీయోపదేశకాండము 3:22సుమారు క్రీ.పూ. 1452

    వారికి నీవు భయపడకు; నీ దేవుడైన యెహోవా మీ పక్షంగా యుద్ధం చేస్తారు.”

  19. ద్వితీయోపదేశకాండము 3:23సుమారు క్రీ.పూ. 1452

    ఆ సమయంలో నేను యెహోవాను బ్రతిమాలుకున్నాను:

  20. ద్వితీయోపదేశకాండము 3:24సుమారు క్రీ.పూ. 1452

    “ప్రభువైన యెహోవా, మీ గొప్పతనాన్ని, మీ బలమైన చేతిని మీ సేవకునికి చూపించడం మొదలుపెట్టారు. ఆకాశంలో గాని భూమిమీదగాని మీరు చేసే పనులు, అద్భుతకార్యాలు చేయగల దేవుడెవరున్నారు?

  21. ద్వితీయోపదేశకాండము 3:25సుమారు క్రీ.పూ. 1452

    నేను వెళ్లి యొర్దాను అవతల ఉన్న మంచి దేశాన్ని, మంచి కొండ ప్రాంతాన్ని, లెబానోనును చూడనివ్వండి.”

  22. ద్వితీయోపదేశకాండము 3:26సుమారు క్రీ.పూ. 1452

    అయితే మీ కారణంగా యెహోవా నా మీద కోప్పడి, నా మొర వినలేదు. యెహోవా నాతో అన్నారు, “ఇక చాలు, ఈ విషయమై నాతో ఇక మాట్లాడవద్దు.

  23. ద్వితీయోపదేశకాండము 3:27సుమారు క్రీ.పూ. 1452

    నీవు పిస్గా కొండ శిఖరం పైకెక్కి అక్కడినుండి పడమర, ఉత్తరం, దక్షిణం, తూర్పు వైపులకు చూడు. నీవు యొర్దాను నది దాటవు కాబట్టి నీ కళ్లారా ఆ దేశాన్ని చూడు.

  24. ద్వితీయోపదేశకాండము 3:28సుమారు క్రీ.పూ. 1452

    అయితే యెహోషువను నియమించి, అతన్ని ప్రోత్సాహించి బలపరచు, ఎందుకంటే అతడు ఈ ప్రజలను నది దాటిస్తాడు, నీవు చూడబోయే దేశాన్ని వారు స్వాధీనపరచుకునేలా చేస్తాడు.”

  25. ద్వితీయోపదేశకాండము 3:29సుమారు క్రీ.పూ. 1452

    కాబట్టి మనం బేత్-పెయోరు దగ్గర ఉన్న లోయలో ఉన్నాము.