కంటెంట్‌కు వెళ్లండి

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ద్వితీయోపదేశకాండము 4:1సుమారు క్రీ.పూ. 1451

    ఇప్పుడు, ఇశ్రాయేలూ, నేను మీకు బోధించే శాసనాలు చట్టాలను వినండి. మీరు జీవించి, మీ పూర్వికుల దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలోకి వెళ్లి స్వాధీనం చేసుకోవడానికి వాటిని అనుసరించండి.

  2. ద్వితీయోపదేశకాండము 4:2సుమారు క్రీ.పూ. 1451

    నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేన్ని కలుపకూడదు, దాని నుండి దేన్ని తీసివేయకూడదు, కాని నేను మీకు ఇస్తున్న మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను పాటించండి.

  3. ద్వితీయోపదేశకాండము 4:3సుమారు క్రీ.పూ. 1451

    బయల్-పెయోరు విషయంలో యెహోవా చేసిన దానిని మీరు కళ్లారా చూశారు. బయల్-పెయోరును వెంబడించిన వారందరిని మీ దేవుడైన యెహోవా మీ మధ్యలో ఉండకుండా నాశనం చేశారు,

  4. ద్వితీయోపదేశకాండము 4:4సుమారు క్రీ.పూ. 1451

    కాని మీ దేవుడైన యెహోవాను నమ్మకంగా పట్టుకుని ఉన్న మీరందరు ఈ రోజు వరకు బ్రతికి ఉన్నారు.

  5. ద్వితీయోపదేశకాండము 4:5సుమారు క్రీ.పూ. 1451

    చూడండి, నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీరు పాటించవలసిన శాసనాలను చట్టాలను నేను మీకు బోధించాను.

  6. ద్వితీయోపదేశకాండము 4:6సుమారు క్రీ.పూ. 1451

    వాటిని జాగ్రతగా పాటించండి. ఈ శాసనాలన్నిటి గురించి వినే దేశాలకు అవే మీ జ్ఞానాన్ని మీ వివేకాన్ని తెలియజేస్తాయి; వారు, “ఈ గొప్ప దేశం ఖచ్చితంగా జ్ఞానం వివేకం కలిగిన ప్రజలు” అని చెప్పుకుంటారు.

  7. ద్వితీయోపదేశకాండము 4:7సుమారు క్రీ.పూ. 1451

    మనం ఆయనకు ప్రార్థన చేసినప్పుడు మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్పప్రజలకు వారి దేవుళ్ళు సమీపంగా ఉంటారు?

  8. ద్వితీయోపదేశకాండము 4:8సుమారు క్రీ.పూ. 1451

    ఈ రోజు నేను మీ ఎదుట పెట్టిన ఈ ధర్మశాస్త్రమంతటిలో నీతిగల శాసనాలు, చట్టాలు ఏ గొప్ప దేశం కలిగి ఉంది?

  9. ద్వితీయోపదేశకాండము 4:9సుమారు క్రీ.పూ. 1451

    అయితే జాగ్రత్తగా ఉండండి, మీరు మీ కళ్లారా చూసినవాటిని మరచిపోకుండా, మీరు జీవితాంతం మీ హృదయంలోనుండి చెరిగిపోకుండా జాగ్రత్త వహించండి. మీ పిల్లలకు వారి తర్వాత వారి పిల్లలకు వాటిని బోధించండి.

  10. ద్వితీయోపదేశకాండము 4:10సుమారు క్రీ.పూ. 1451

    హోరేబు దగ్గర మీ దేవుడైన యెహోవా ఎదుట మీరు నిలబడినప్పుడు ఆయన నాతో, “వారు ఆ దేశంలో జీవించినంత వరకు నాకు భయపడడం నేర్చుకొని, వాటిని తమ పిల్లలకు నేర్పేలా వారు నా మాటలు వినడానికి ప్రజలందర్ని సమకూర్చు” అని చెప్పిన రోజును జ్ఞాపకం ఉంచుకోండి.

  11. ద్వితీయోపదేశకాండము 4:11సుమారు క్రీ.పూ. 1451

    మీరంతా దగ్గరకు వచ్చి ఆ పర్వతం క్రింద నిలబడ్డారు, అది దట్టమైన మేఘాలు, కటిక చీకటి కమ్మి, ఆకాశం వరకు అగ్నితో మండుతూ ఉంది,

  12. ద్వితీయోపదేశకాండము 4:12సుమారు క్రీ.పూ. 1451

    యెహోవా ఆ అగ్నిలో నుండి మీతో మాట్లాడారు. మీరు మాటల శబ్దం విన్నారు కాని ఏ రూపాన్ని మీరు చూడలేదు; స్వరం మాత్రమే వినిపించింది.

  13. ద్వితీయోపదేశకాండము 4:13సుమారు క్రీ.పూ. 1451

    ఆయన మీకు తన నిబంధనను ప్రకటించారు, అనగా మీరు పాటించాలని పది ఆజ్ఞలు మీకు ఆజ్ఞాపించి, వాటిని రెండు రాతి పలకలమీద వ్రాశారు.

  14. ద్వితీయోపదేశకాండము 4:14సుమారు క్రీ.పూ. 1451

    మీరు యొర్దాను దాటి స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీరు అనుసరించాల్సిన శాసనాలను చట్టాలను మీకు నేర్పించమని యెహోవా నాకు ఆదేశించారు.

  15. ద్వితీయోపదేశకాండము 4:15సుమారు క్రీ.పూ. 1451

    అయితే చాలా జాగ్రతగా ఉండండి! హోరేబులో యెహోవా అగ్ని మధ్యలో నుండి మీతో మాట్లాడిన రోజున మీరు ఏ రూపాన్ని చూడలేదు.

  16. ద్వితీయోపదేశకాండము 4:16సుమారు క్రీ.పూ. 1451

    మీ కోసం ఎలాంటి విగ్రహాన్ని, ఎలాంటి రూపంలో ఉన్న దానినైన, స్త్రీ లేదా పురుషుని రూపంలో కాని,

  17. ద్వితీయోపదేశకాండము 4:17సుమారు క్రీ.పూ. 1451

    లేదా భూమి మీద ఉండే ఏ జంతువులా కాని, ఆకాశంలో ఎగిరే పక్షిలా కాని,

  18. ద్వితీయోపదేశకాండము 4:18సుమారు క్రీ.పూ. 1451

    లేదా నేల మీద ప్రాకే ఏ ప్రాణిలా కాని, నీటి క్రింద ఉండే ఏ చేపలా కాని విగ్రహం తయారుచేసుకోకండి.

  19. ద్వితీయోపదేశకాండము 4:19సుమారు క్రీ.పూ. 1451

    మీరు ఆకాశం వైపు కళ్ళెత్తి ఆకాశ సైన్యాలైన సూర్యచంద్ర నక్షత్రాలను చూసిన వాటిచే ఆకర్షించబడి, మీ దేవుడైన యెహోవా ఆకాశం క్రింద సమస్త దేశాల కోసం పంచి ఇచ్చిన వాటికి నమస్కరించి వాటికి సేవచేయకుండ మీరు జాగ్రత్తపడండి.

  20. ద్వితీయోపదేశకాండము 4:20సుమారు క్రీ.పూ. 1451

    మీరైతే, యెహోవా మిమ్మల్ని పట్టుకుని నేడు మీరున్నట్లుగా ఆయన వారసత్వ ప్రజలుగా ఉండడానికి ఇనుప కొలిమిలో నుండి, ఈజిప్టు నుండి, మిమ్మల్ని బయటకు తీసుకువచ్చారు.

  21. ద్వితీయోపదేశకాండము 4:21సుమారు క్రీ.పూ. 1451

    మీ కారణంగా యెహోవా నా మీద కోప్పడి నేను ఈ యొర్దాను దాటకూడదని, మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యంగా ఇస్తున్న మంచి దేశంలో ప్రవేశించకూడదని ఆయన ప్రమాణము చేశారు.

  22. ద్వితీయోపదేశకాండము 4:22సుమారు క్రీ.పూ. 1451

    నేను ఈ దేశంలో చనిపోతాను; నేను యొర్దానును దాటను; కాని మీరు నది దాటి వెళ్లి ఆ మంచి దేశాన్ని స్వాధీనం చేసుకోబోతున్నారు.

  23. ద్వితీయోపదేశకాండము 4:23సుమారు క్రీ.పూ. 1451

    మీ దేవుడైన యెహోవా మీతో చేసిన నిబంధనను మరచిపోకుండా జాగ్రత్తపడండి; మీ దేవుడైన యెహోవా నిషేధించిన వాటి యొక్క ఎలాంటి రూపంలోను మీ కోసం విగ్రహాన్ని చేసుకోకండి.

  24. ద్వితీయోపదేశకాండము 4:24సుమారు క్రీ.పూ. 1451

    ఎందుకంటే మీ దేవుడైన యెహోవా దహించు అగ్ని, ఆయన రోషం గల దేవుడు.

  25. ద్వితీయోపదేశకాండము 4:25సుమారు క్రీ.పూ. 1451

    మీకు పిల్లలు మనవళ్లు కలిగి, ఆ దేశంలో చాలా కాలం నివసించిన తర్వాత, మీరు అప్పుడు చెడిపోయి ఏ రూపంలోనైనా విగ్రహాన్ని చేసుకుని మీ దేవుడైన యెహోవా కళ్ళెదుట చెడు చేసి ఆయనకు కోపం పుట్టిస్తే,