- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446–1406 BC
The Wilderness Years
Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.
ఈ కాలపు వచనాలు
- ద్వితీయోపదేశకాండము 5:27సుమారు క్రీ.పూ. 1451
నీవే దగ్గరకు వెళ్లి మన దేవుడైన యెహోవా చెప్పినదంతా విను. తర్వాత మన దేవుడైన యెహోవా నీకు చెప్పినదంతా నీవు మాకు చెప్పు, మేము వింటాము, లోబడతాము.”
- ద్వితీయోపదేశకాండము 5:28సుమారు క్రీ.పూ. 1451
మీరు నాతో మాట్లాడినప్పుడు యెహోవా మీ మాటలు విన్నారు, యెహోవా నాతో ఇలా అన్నారు, “ఈ ప్రజలు నీతో చెప్పిన మాటలు నేను విన్నాను. వారు చెప్పిందంతా మంచిదే.
- ద్వితీయోపదేశకాండము 5:29సుమారు క్రీ.పూ. 1451
వారికి వారి సంతతికి నిరంతరం క్షేమం కలిగేలా వారు నా పట్ల భయం కలిగి, నా ఆజ్ఞలన్నిటిని అనుసరించే హృదయం వారికుంటే ఎంతో మంచిది.
- ద్వితీయోపదేశకాండము 5:30సుమారు క్రీ.పూ. 1451
“నీవు వెళ్లి, వారి గుడారలకు వారిని తిరిగి వెళ్లమని చెప్పు.
- ద్వితీయోపదేశకాండము 5:31సుమారు క్రీ.పూ. 1451
అయితే నీవు ఇక్కడ నాతో ఉండు, ఎందుకంటే వారు స్వాధీనం చేసుకోవడానికి నేను వారికి ఇస్తున్న దేశంలో పాటించేలా నీవు బోధించాల్సిన ఆజ్ఞలు, శాసనాలు చట్టాలు నీకు ఇస్తాను.”
- ద్వితీయోపదేశకాండము 5:32సుమారు క్రీ.పూ. 1451
కాబట్టి మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన వాటిని చేయడంలో జాగ్రత్త వహించండి; కుడికి గాని ఎడమకు గాని తిరగకూడదు.
- ద్వితీయోపదేశకాండము 5:33సుమారు క్రీ.పూ. 1451
మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీరు జీవిస్తూ, అభివృద్ధి పొందుతూ, ఎక్కువకాలం జీవించేలా, మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గంలో నడవండి.
- ద్వితీయోపదేశకాండము 6:1సుమారు క్రీ.పూ. 1451
మీరు యొర్దాను దాటి స్వాధీనపరుచుకోబోయే దేశంలో మీరు పాటించాలని మీకు బోధించమని మీ దేవుడైన యెహోవా నాకు నిర్దేశించిన ఆజ్ఞలు, శాసనాలు చట్టాలు ఇవే.
- ద్వితీయోపదేశకాండము 6:2సుమారు క్రీ.పూ. 1451
మీరు, మీ పిల్లలు, వారి పిల్లలు జీవితకాలమంతా మీ దేవుడైన యెహోవాకు భయపడి, నేను మీకు ఇచ్చే ఆయన శాసనాలు, ఆజ్ఞలు పాటించడం ద్వారా మీరు దీర్ఘాయువును అనుభవిస్తారు.
- ద్వితీయోపదేశకాండము 6:3సుమారు క్రీ.పూ. 1451
ఇశ్రాయేలూ విను, మీ పూర్వికుల దేవుడైన యెహోవా మీకు వాగ్దానం చేసిన రీతిగా పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీకు శ్రేయస్సు కలిగి అధికంగా అభివృద్ధి కలిగేలా మీరు వాటికి లోబడి ఉండేలా జాగ్రత్త వహించండి.
- ద్వితీయోపదేశకాండము 6:4సుమారు క్రీ.పూ. 1451
ఓ ఇశ్రాయేలీయులారా, వినండి: మన దేవుడైన యెహోవా, యెహోవా ఒక్కరే.
- ద్వితీయోపదేశకాండము 6:5సుమారు క్రీ.పూ. 1451
మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో, మీ పూర్ణబలంతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి.
- ద్వితీయోపదేశకాండము 6:6సుమారు క్రీ.పూ. 1451
ఈ రోజు నేను మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞలు మీ హృదయాల్లో నిలిచి ఉండాలి.
- ద్వితీయోపదేశకాండము 6:7సుమారు క్రీ.పూ. 1451
వాటిని మీ పిల్లలకు నేర్పించాలి. మీరు ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు, దారిలో నడుస్తున్నప్పుడు, మీరు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, వాటి గురించి మాట్లాడాలి.
- ద్వితీయోపదేశకాండము 6:8సుమారు క్రీ.పూ. 1451
వాటిని సూచనలుగా మీ చేతికి కట్టుకోండి, మీ నుదిటి మీద బాసికాలుగా కట్టుకోండి.
- ద్వితీయోపదేశకాండము 6:9సుమారు క్రీ.పూ. 1451
మీ ఇళ్ళ ద్వారబంధాల మీద, ద్వారాల మీద వాటిని వ్రాయండి.
- ద్వితీయోపదేశకాండము 6:10సుమారు క్రీ.పూ. 1451
మీ దేవుడైన యెహోవా మీ పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన రీతిగా మిమ్మల్ని ఆ దేశంలోనికి తీసుకువచ్చి మీరు కట్టని విశాలమైన మంచి పట్టణాలను,
- ద్వితీయోపదేశకాండము 6:11సుమారు క్రీ.పూ. 1451
మీరు సమకూర్చని అన్ని రకాల మంచి వస్తువులతో నిండిన ఇళ్ళను, మీరు తవ్వని బావులను, మీరు నాటని ద్రాక్షతోటలు, ఒలీవల తోటలను మీకు ఇస్తారు; మీరు తిని తృప్తిపొందిన తర్వాత,
- ద్వితీయోపదేశకాండము 6:12సుమారు క్రీ.పూ. 1451
బానిస దేశమైన ఈజిప్టులో నుండి మిమ్మల్ని బయటకు తీసుకువచ్చిన యెహోవాను మరచిపోకుండా జాగ్రత్తగా ఉండండి.
- ద్వితీయోపదేశకాండము 6:13సుమారు క్రీ.పూ. 1451
మీ దేవుడైన యెహోవాకు భయపడి, ఆయనను మాత్రమే సేవించి, ఆయన పేరిట మాత్రమే మీరు ప్రమాణం చేయాలి.
- ద్వితీయోపదేశకాండము 6:14సుమారు క్రీ.పూ. 1451
ఇతర దేవుళ్ళను అనగా మీ చుట్టూ ఉన్న ప్రజల దేవుళ్ళను అనుసరించకూడదు;
- ద్వితీయోపదేశకాండము 6:15సుమారు క్రీ.పూ. 1451
మీ మధ్యనున్న మీ దేవుడైన యెహోవా రోషం గల దేవుడు, ఆయన కోపం మీమీద రగులుకొని దేశంలో ఉండకుండా ఆయన మిమ్మల్ని నాశనం చేస్తారు.
- ద్వితీయోపదేశకాండము 6:16సుమారు క్రీ.పూ. 1451
మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను పరీక్షించినట్లు ఆయనను పరీక్షించకూడదు.
- ద్వితీయోపదేశకాండము 6:17సుమారు క్రీ.పూ. 1451
మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను, అనగా ఆయన మీకు ఇచ్చిన నిబంధనలను, శాసనాలను జాగ్రత్తగా పాటించండి.
- ద్వితీయోపదేశకాండము 6:18సుమారు క్రీ.పూ. 1451
మీకు మేలు కలిగేలా యెహోవా చెప్పినట్లు మీ శత్రువులందరిని మీ ఎదుట నుండి తరిమివేసి యెహోవా మీ పూర్వికులతో ప్రమాణం చేసిన ఆ మంచి దేశంలో మీరు ప్రవేశించి దానిని స్వాధీనం చేసుకోవాలంటే మీరు యెహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయాలి.