- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446–1406 BC
The Wilderness Years
Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.
ఈ కాలపు వచనాలు
- సంఖ్యాకాండము 22:30సుమారు క్రీ.పూ. 1452
గాడిద బిలాముతో, “ఈ రోజు వరకు ప్రతిసారి స్వారీ చేసిన మీ సొంత గాడిదను నేను కాదా? ఇలా ఎప్పుడైనా చేశానా?” అని అడిగింది. “లేదు” అని అతడు అన్నాడు.
- సంఖ్యాకాండము 22:31సుమారు క్రీ.పూ. 1452
అప్పుడు యెహోవా బిలాము కళ్లు తెరిచారు, దూసిన ఖడ్గం చేతితో పట్టుకుని దారికి అడ్డుగా ఉన్న యెహోవా దూతను అతడు చూశాడు. బిలాము తలవంచి సాష్టాంగపడ్డాడు.
- సంఖ్యాకాండము 22:32సుమారు క్రీ.పూ. 1452
యెహోవా దూత, “నీవెందుకు నీ గాడిదను ఈ మూడుసార్లు కొట్టావు? నీ మార్గం నాశనకరమైనది కాబట్టి నిన్ను అడ్డుకోడానికి వచ్చాను.
- సంఖ్యాకాండము 22:33సుమారు క్రీ.పూ. 1452
మూడుసార్లు గాడిద నన్ను చూసి తొలగిపోయింది. ఒకవేళ అది తిరగకపోయి ఉంటే, ఈపాటికి నేను తప్పకుండా నిన్ను చంపేసి గాడిదను వదిలేసేవాన్ని” అని అతనితో అన్నాడు.
- సంఖ్యాకాండము 22:34సుమారు క్రీ.పూ. 1452
బిలాము యెహోవా దూతతో, “నేను పాపం చేశాను. నన్ను ఎదుర్కోడానికి నీవు దారికి అడ్డుగా నిలబడ్డావని నేను గ్రహించలేదు. ఇప్పుడు నీకు ఇష్టం లేకపోతే నేను తిరిగి ఇంటికి వెళ్లిపోతాను” అని అన్నాడు.
- సంఖ్యాకాండము 22:35సుమారు క్రీ.పూ. 1452
యెహోవా దూత బిలాముతో, “వారితో వెళ్లు కానీ నేను చెప్పేదే నీవు పలకాలి” అని అన్నాడు. కాబట్టి బిలాము బాలాకు అధికారులతో వెళ్లాడు.
- సంఖ్యాకాండము 22:36సుమారు క్రీ.పూ. 1452
బిలాము వస్తున్నాడని విని బాలాకు అర్నోను నది సరిహద్దులో ఉన్న మోయాబు పట్టణం పొలిమేరలో అతన్ని కలసుకోడానికి వెళ్లాడు.
- సంఖ్యాకాండము 22:37సుమారు క్రీ.పూ. 1452
బాలాకు బిలాముతో, “నిన్ను త్వరగా రమ్మని చెప్పలేదా? నా దగ్గరకు ఎందుకు రాలేదు? నేను నీకు ఘనత ఇవ్వలేనా?” అని అన్నాడు.
- సంఖ్యాకాండము 22:38సుమారు క్రీ.పూ. 1452
“ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాను కదా” అని బిలాము జవాబిచ్చాడు. “కానీ నాకిష్టమైనది నేను చెప్పలేను. దేవుడు నా నోట్లో పెట్టిందే నేను చెప్పాలి” అని బాలాకుతో అన్నాడు.
- సంఖ్యాకాండము 22:39సుమారు క్రీ.పూ. 1452
తర్వాత బిలాము బాలాకు వెంట కిర్యత్-హుచ్చోతుకు వెళ్లాడు.
- సంఖ్యాకాండము 22:40సుమారు క్రీ.పూ. 1452
అక్కడ బాలాకు ఎద్దులను గొర్రెలను బలి ఇచ్చాడు, బిలాముకు, అతనితో ఉన్న అధికారులకు కొంత ఇచ్చాడు.
- సంఖ్యాకాండము 22:41సుమారు క్రీ.పూ. 1452
మర్నాడు ఉదయం బాలాకు బిలామును బామోత్ బయలుకు తీసుకెళ్లాడు, అక్కడినుండి ఇశ్రాయేలు శిబిరం యొక్క చివరలను చూడగలిగాడు.
- సంఖ్యాకాండము 23:1సుమారు క్రీ.పూ. 1452
బిలాము బాలాకుతో అన్నాడు, “నాకు ఇక్కడ ఏడు బలిపీఠాలు కట్టాలి, ఏడు కోడెలను, ఏడు పొట్టేళ్లను నా కోసం సిద్ధం చేయాలి.”
- సంఖ్యాకాండము 23:2సుమారు క్రీ.పూ. 1452
బాలాకు బిలాము చెప్పినట్లు చేశాడు, వారిద్దరు ఒక కోడెను, ఇద్దరు ఒక్కో బలిపీఠం మీద ఒక కోడెను, ఒక పొట్టేలును అర్పించారు.
- సంఖ్యాకాండము 23:3సుమారు క్రీ.పూ. 1452
అప్పుడు బిలాము బాలాకుతో, “నీవు నీ దహనబలి దగ్గర ఉండు. బహుశ యెహోవా నన్ను కలుసుకోడానికి రావొచ్చు. ఆయన నాకు ఏమి బయలుపరుస్తారో అది నీకు చెప్తాను” అని అన్నాడు. తర్వాత అతడు ఖాళీ కొండపైకి వెళ్లాడు.
- సంఖ్యాకాండము 23:4సుమారు క్రీ.పూ. 1452
దేవుడు అతన్ని కలుసుకున్నారు, బిలాము, “నేను ఏడు బలిపీఠాలు సిద్ధపరచి ఒక్కొక్క బలిపీఠం మీద ఒక కోడెను, ఒక పొట్టేలును అర్పించాను” అని అన్నాడు.
- సంఖ్యాకాండము 23:5సుమారు క్రీ.పూ. 1452
యెహోవా బిలాము నోటిలో ఒక సందేశం పెట్టి, “బాలాకు దగ్గరకు వెళ్లి ఈ మాటలు చెప్పు” అని అన్నారు.
- సంఖ్యాకాండము 23:6సుమారు క్రీ.పూ. 1452
కాబట్టి బిలాము తిరిగివెళ్లి రాజు, తన మోయాబు అధికారులతో దహనబలి దగ్గర నిలిచియుండడం చూశాడు.
- సంఖ్యాకాండము 23:7సుమారు క్రీ.పూ. 1452
అప్పుడు బిలాము తన సందేశాన్ని ఇచ్చాడు: “బాలాకు నన్ను అరాము నుండి తీసుకువచ్చాడు, మోయాబు రాజు తూర్పు పర్వతాల నుండి తెచ్చాడు. ‘రా, నా కోసం యాకోబును శపించు’ అని అన్నాడు; ‘రా, ఇశ్రాయేలును శపించు.’
- సంఖ్యాకాండము 23:8సుమారు క్రీ.పూ. 1452
దేవుడు శపించని వారిని నేనెలా శపించగలను? యెహోవా శపించని వారిని నేనెలా శపించగలను?
- సంఖ్యాకాండము 23:9సుమారు క్రీ.పూ. 1452
ఎత్తైన కొండ శిఖరాల నుండి నేను వారిని చూడగలను, ఎత్తైన స్థలాల నుండి నేను వారిని వీక్షించగలను. విడివిడిగా నివసించే ప్రజలను నేను చూస్తున్నాను తమను తాము దేశాల్లో ఒకటిగా పరిగణించని వారు.
- సంఖ్యాకాండము 23:10సుమారు క్రీ.పూ. 1452
యాకోబు ధూళిని ఎవరు లెక్కించగలరు? ఇశ్రాయేలు ప్రజల్లో కనీసం నాలుగవ వంతు ఎవరు లెక్కించగలరు? నేను యథార్థవంతుల మరణం పొందుదును గాక, నా అంతం వారి అంతంలా ఉండును గాక!”
- సంఖ్యాకాండము 23:11సుమారు క్రీ.పూ. 1452
బాలాకు బిలాముతో, “నీవు నాకు ఏమి చేశావు? నా శత్రువులను శపిస్తావని నిన్ను తీసుకువచ్చాను, కానీ నీవు వారిని ఆశీర్వదించడం తప్ప ఏమి చేయలేదు!”
- సంఖ్యాకాండము 23:12సుమారు క్రీ.పూ. 1452
బిలాము, “యెహోవా నా నోట పెట్టిన మాటను నేను మాట్లాడకూడదా?” అని అన్నాడు.
- సంఖ్యాకాండము 23:13సుమారు క్రీ.పూ. 1452
అప్పుడు బాలాకు అతనితో, “వారు కనిపించే మరో చోటికి నాతో రా; వారందరిని చూడవు కానీ, వారి శిబిరం సరిహద్దులు చూస్తావు. అక్కడినుండి నా కోసం వారిని శపించు” అని అన్నాడు.