కంటెంట్‌కు వెళ్లండి

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. సంఖ్యాకాండము 21:15సుమారు క్రీ.పూ. 1453

    And at the stream of the brooks that goeth down to the dwelling of Ar, and lieth upon the border of Moab.

  2. సంఖ్యాకాండము 21:16సుమారు క్రీ.పూ. 1453

    అక్కడినుండి వారు బెయేర్‌కు వెళ్లారు, ఈ బావి గురించి యెహోవా మోషేతో, “ప్రజలను సమకూర్చు, నేను వారికి నీళ్లిస్తాను” అని అన్నారు.

  3. సంఖ్యాకాండము 21:17సుమారు క్రీ.పూ. 1453

    అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఈ పాట పాడారు: “ఓ బావి ఉప్పొంగు! దాని గురించి పాడండి.

  4. సంఖ్యాకాండము 21:18సుమారు క్రీ.పూ. 1453

    రాకుమారులు ఆ బావిని త్రవ్వించారు, ప్రజల సంస్థానాధిపతులు తమ రాజదండాలతో కర్రలతో త్రవ్వారు.” తర్వాత వారు అరణ్యం నుండి మత్తానకు వెళ్లారు,

  5. సంఖ్యాకాండము 21:19సుమారు క్రీ.పూ. 1453

    మత్తాన నుండి నహలీయేలుకు, నహలీయేలు నుండి బామోతుకు,

  6. సంఖ్యాకాండము 21:20సుమారు క్రీ.పూ. 1453

    బామోతు నుండి మోయాబు లోయకు వెళ్లారు. అక్కడే పిస్గా పర్వతం ఉంది.

  7. సంఖ్యాకాండము 21:21సుమారు క్రీ.పూ. 1453

    ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోను దగ్గరకు దూతలను పంపారు:

  8. సంఖ్యాకాండము 21:22సుమారు క్రీ.పూ. 1453

    “మీ దేశం మీదుగా మమ్మల్ని వెళ్లనివ్వండి. మీ పొలాల వైపు, ద్రాక్షతోటల పొలాల వైపు తిరగము, మీ బావులలోని నీళ్లు త్రాగము. మీ దేశం పొలిమేర దాటే వరకు రాజమార్గంలోనే వెళ్తాము.”

  9. సంఖ్యాకాండము 21:23సుమారు క్రీ.పూ. 1453

    అయితే సీహోను ఇశ్రాయేలీయులను తన దేశం గుండా వెళ్లడానికి అనుమతించలేదు. అతడు తన సైన్యమంతటిని పోగు చేసి, ఇశ్రాయేలుపై దాడి చేయడానికి అరణ్యంలోకి వెళ్లాడు. అతడు యాహాజుకు చేరినప్పుడు, ఇశ్రాయేలుతో పోరాడాడు.

  10. సంఖ్యాకాండము 21:24సుమారు క్రీ.పూ. 1453

    అయితే ఇశ్రాయేలు అతన్ని ఖడ్గంతో చంపి అతని దేశాన్ని అర్నోను నది నుండి యబ్బోకు వరకు ఆక్రమించారు, కానీ అమ్మోనీయుల సరిహద్దు వరకు మాత్రమే ఎందుకంటే వారి సరిహద్దు పటిష్టమైనది.

  11. సంఖ్యాకాండము 21:25సుమారు క్రీ.పూ. 1453

    ఇశ్రాయేలీయులు అమోరీయుల పట్టణాలన్నిటిని, హెష్బోను దాని చుట్టూరా ఉన్న గ్రామాలతో సహా స్వాధీనం చేసుకుని ఆక్రమించారు.

  12. సంఖ్యాకాండము 21:26సుమారు క్రీ.పూ. 1453

    హెష్బోను అమోరీయుల రాజైన సీహోను పట్టణము. సీహోను అంతకుముందు మోయాబు రాజుతో యుద్ధం చేసి, అర్నోను నది వరకు ఉన్న ప్రదేశమంతా వశం చేసుకున్నాడు.

  13. సంఖ్యాకాండము 21:27సుమారు క్రీ.పూ. 1453

    అందుకే సామెతలు చెప్పేవారు ఇలా అంటారు: హెష్బోనుకు రండి అది తిరిగి కట్టబడనివ్వండి; సీహోను పట్టణం పూర్వస్థితికి వచ్చును గాక.

  14. సంఖ్యాకాండము 21:28సుమారు క్రీ.పూ. 1453

    హెష్బోను నుండి అగ్ని బయలుదేరింది, సీహోను పట్టణం నుండి మంటలు వచ్చాయి. అది మోయాబులోని ఆరు పట్టణాన్ని కాల్చివేసింది. అర్నోను యొక్క ఎత్తైన స్థలాల యజమానులను దహించివేసింది.

  15. సంఖ్యాకాండము 21:29సుమారు క్రీ.పూ. 1453

    మోయాబూ, నీకు శ్రమ! కెమోషు ప్రజలారా! మీరు నాశనమయ్యారు. అతడు తన కుమారులను పారిపోయేవారిగా, అతని కుమార్తెలను అమోరీయుల రాజైన సీహోను దగ్గర చెరగా అప్పగించాడు.

  16. సంఖ్యాకాండము 21:30సుమారు క్రీ.పూ. 1453

    “అయితే మేము వారిని కూల్చివేసాము; హెష్బోను అధికారం దీబోను వరకు నాశనమైంది. నోఫహు వరకు వారిని పడగొట్టాము, మెదెబా వరకు అది వ్యాపించింది.”

  17. సంఖ్యాకాండము 21:31సుమారు క్రీ.పూ. 1453

    కాబట్టి ఇశ్రాయేలీయులు అమోరీయుల స్థలంలో స్థిరపడ్డారు.

  18. సంఖ్యాకాండము 21:32సుమారు క్రీ.పూ. 1453

    యాజెరు ప్రాంతాన్ని చూసి రమ్మని మోషే వేగులవారిని పంపిన తర్వాత, ఇశ్రాయేలీయులు ఆ పట్టణాన్ని, దాని చుట్టూరా ఉన్న గ్రామాలను స్వాధీనపరచుకుని అక్కడ ఉన్న అమోరీయులను తరిమేశారు.

  19. సంఖ్యాకాండము 21:33సుమారు క్రీ.పూ. 1453

    తర్వాత వారు తిరిగి బాషానుకు వెళ్లే మార్గంలో వెళ్లాము, అప్పుడు బాషాను రాజైన ఓగు తన సైన్యమంతటితో ఎద్రెయీ దగ్గర యుద్ధంలో వారిని ఎదుర్కోడానికి బయలుదేరాడు.

  20. సంఖ్యాకాండము 21:34సుమారు క్రీ.పూ. 1453

    యెహోవా మోషేతో, “అతనికి భయపడకండి, ఎందుకంటే అతన్ని, అతని సైన్యమంతటిని, అతని దేశాన్ని మీ చేతికి అప్పగించాను. హెష్బోనులో పరిపాలించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు అతనికి చేయండి” అని ఆజ్ఞాపించారు.

  21. సంఖ్యాకాండము 21:35సుమారు క్రీ.పూ. 1453

    కాబట్టి వారు ఓగును, అతని కుమారులను, అతని సైన్యమంతటిని, ఏ ఒక్కరు మిగలకుండా హతం చేశారు. అతని దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు.

  22. సంఖ్యాకాండము 22:1సుమారు క్రీ.పూ. 1452

    తర్వాత ఇశ్రాయేలీయులు మోయాబు సమతల మైదానాల వైపు ప్రయాణం చేసి యొర్దాను నది తూర్పుగా, యెరికో వైపు దిగారు.

  23. సంఖ్యాకాండము 22:2సుమారు క్రీ.పూ. 1452

    ఇశ్రాయేలు అమోరీయులకు చేసినదంతా సిప్పోరు కుమారుడైన బాలాకు చూశాడు,

  24. సంఖ్యాకాండము 22:3సుమారు క్రీ.పూ. 1452

    చాలామంది ఉన్నందున మోయాబు భయపడింది. నిజానికి, ఇశ్రాయేలీయుల వల్ల మోయాబు భయంతో నిండిపోయింది.

  25. సంఖ్యాకాండము 22:4సుమారు క్రీ.పూ. 1452

    మోయాబీయులు మిద్యాను పెద్దలతో, “ఈ దండు, ఒక ఎద్దు పొలం లోని గడ్డిని లాక్కున్నట్లు, మన చుట్టూ ఉన్న సమస్తాన్ని లాక్కుంటుంది” అని అన్నారు. కాబట్టి ఆ సమయంలో మోయాబు రాజైన సిప్పోరు కుమారుడైన బాలాకు,