కంటెంట్‌కు వెళ్లండి

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. సంఖ్యాకాండము 19:16సుమారు క్రీ.పూ. 1471

    “ఎవరైనా బయట ఉన్నప్పుడు ఖడ్గం చేత చంపబడిన వారిని లేదా సహజ మరణం పొందినవారిని, లేదా మానవుల ఎముకలు కానీ, సమాధి కానీ ముట్టుకుంటే, వారు ఏడు రోజులు అపవిత్రులుగా ఉంటారు.

  2. సంఖ్యాకాండము 19:17సుమారు క్రీ.పూ. 1471

    “ఎందుకంటే అపవిత్రమైన వ్యక్తి కోసం, కాల్చబడిన పాపపరిహారబలి యొక్క బూడిద కొంత పాత్రలో వేసి, వాటి మీద పారే తాజా నీరు పొయ్యాలి.

  3. సంఖ్యాకాండము 19:18సుమారు క్రీ.పూ. 1471

    అప్పుడు ఆచార ప్రకారం పవిత్రంగా ఉన్న వ్యక్తి కొంత హిస్సోపు తీసుకుని, నీటిలో ముంచి గుడారం అన్ని అలంకరణలు అక్కడ ఉన్న ప్రజలను చిలకరించాలి. అతడు మానవ ఎముక లేదా సమాధిని తాకిన వారి మీద లేదా చంపబడిన ఎవరైనా లేదా సహజ మరణం పొందినవారి మీద కూడా చిలకరించాలి.

  4. సంఖ్యాకాండము 19:19సుమారు క్రీ.పూ. 1471

    పవిత్రుడైన పురుషుడు అపవిత్రుల మీద మూడవ రోజు, ఏడవ రోజు చిలకరించాలి, ఏడవ రోజు వారిని పవిత్రపరచాలి. పవిత్రపరచబడే వారు వారి బట్టలు ఉతుక్కుని నీటితో స్నానం చేయాలి, ఆ సాయంత్రం వారు శుద్ధులవుతారు.

  5. సంఖ్యాకాండము 19:20సుమారు క్రీ.పూ. 1471

    కానీ అపవిత్రులైనవారు తమను తాము శుద్ధి చేసుకోకపోతే, వారు సమాజం నుండి బహిష్కరించబడాలి, వారు యెహోవా పరిశుద్ధాలయాన్ని అపవిత్ర పరిచిన వారు. శుద్ధి జలం వారి మీద చిలకరింపబడలేదు కాబట్టి వారు అపవిత్రులు.

  6. సంఖ్యాకాండము 19:21సుమారు క్రీ.పూ. 1471

    ఇది వారికి నిత్య కట్టుబాటుగా ఉంటుంది. “శుద్ధి జలం చిలకరించు పురుషుడు కూడా తన బట్టలు ఉతుక్కోవాలి. ఎవరైనా శుద్ధి జలం తాకితే సాయంత్రం వరకు వారు అపవిత్రులు.

  7. సంఖ్యాకాండము 19:22సుమారు క్రీ.పూ. 1471

    అపవిత్రమైనవారు ఏది ముట్టిన అది అపవిత్రమే, ఎవరైనా దానిని ముట్టుకుంటే సాయంత్రం వరకు వారు అపవిత్రులుగా ఉంటారు.”

  8. సంఖ్యాకాండము 20:1సుమారు క్రీ.పూ. 1471

    సంవత్సరం మొదటి నెలలో ఇశ్రాయేలు సమాజమంతా సీను ఎడారికి చేరి కాదేషులో దిగారు. అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడింది.

  9. సంఖ్యాకాండము 20:2సుమారు క్రీ.పూ. 1471

    అయితే సమాజానికి నీళ్లు లేవు కాబట్టి ప్రజలు మోషే, అహరోనులకు వ్యతిరేకంగా గుమికూడారు.

  10. సంఖ్యాకాండము 20:3సుమారు క్రీ.పూ. 1471

    వారు మోషేతో గొడవపడుతూ, “మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేము కూడా చనిపోయి ఉంటే బాగుండేది!

  11. సంఖ్యాకాండము 20:4సుమారు క్రీ.పూ. 1471

    యెహోవా సమాజాన్ని ఈ అరణ్యంలోనికి ఎందుకు తెచ్చావు? మేము, మా పశువులు చావాలనా?

  12. సంఖ్యాకాండము 20:5సుమారు క్రీ.పూ. 1471

    మీరు మమ్మల్ని ఈజిప్టు నుండి ఈ భయంకరమైన చోటికి ఎందుకు తీసుకువచ్చారు? దీనిలో ధాన్యాలు లేదా అంజూరాలు, ద్రాక్షలు లేదా దానిమ్మలు లేవు. త్రాగడానికి నీరు దొరకలేదు!”

  13. సంఖ్యాకాండము 20:6సుమారు క్రీ.పూ. 1471

    మోషే అహరోనులు సమాజం నుండి సమావేశ గుడారం దగ్గరకు వెళ్లి సాష్టాంగపడ్డారు. అప్పుడు యెహోవా మహిమా ప్రకాశం వారికి కనిపించింది.

  14. సంఖ్యాకాండము 20:7సుమారు క్రీ.పూ. 1471

    యెహోవా మోషేతో,

  15. సంఖ్యాకాండము 20:8సుమారు క్రీ.పూ. 1471

    “చేతికర్రను పట్టుకుని, నీవు నీ అన్న అహరోను కలిసి సమాజాన్ని సమకూర్చి, వారు చూస్తుండగా ఆ బండను ఆజ్ఞాపించు, ఆ బండ నుండి నీళ్లు వస్తాయి. వారు వారి పశువులు త్రాగడానికి సమాజం కోసం నీవు ఆ బండ నుండి నీళ్లను రప్పిస్తావు.”

  16. సంఖ్యాకాండము 20:9సుమారు క్రీ.పూ. 1471

    కాబట్టి మోషే ఆయన ఆజ్ఞ ప్రకారం యెహోవా సన్నిధి నుండి తన చేతికర్రను తీసుకున్నాడు.

  17. సంఖ్యాకాండము 20:10సుమారు క్రీ.పూ. 1471

    అతడు, అహరోను సమాజాన్ని బండ ఎదుట సమకూర్చారు మోషే, “ద్రోహులారా! వినండి. ఈ బండలో నుండి మీ కోసం నీళ్లు రప్పించాలా?”

  18. సంఖ్యాకాండము 20:11సుమారు క్రీ.పూ. 1471

    అప్పుడు మోషే చేయి ఎత్తి రెండు సార్లు కర్రతో బండను కొట్టాడు. వెంటనే నీళ్లు ఉబుకుతూ వచ్చాయి, సమాజ ప్రజలు, వారి పశువులతో సహా త్రాగారు.

  19. సంఖ్యాకాండము 20:12సుమారు క్రీ.పూ. 1471

    అయితే యెహోవా మోషే అహరోనులతో, “మీరు ఇశ్రాయేలీయుల దృష్టిలో నా పరిశుద్ధతను ఘనపరచడానికి నన్ను నమ్మలేదు కాబట్టి మీరు ఈ సమాజాన్ని వాగ్దాన దేశానికి తీసుకెళ్లరు” అని అన్నారు.

  20. సంఖ్యాకాండము 20:13సుమారు క్రీ.పూ. 1471

    ఇవి మెరీబా జలాలు. ఇక్కడ ఇశ్రాయేలీయులు యెహోవాతో గొడవపడ్డారు, యెహోవా తన పరిశుద్ధతను నిరూపించుకున్నారు.

  21. సంఖ్యాకాండము 20:14సుమారు క్రీ.పూ. 1471

    మోషే కాదేషు నుండి ఎదోము రాజు దగ్గరకు ఈ వర్తమానంతో దూతలను పంపాడు: “నీ సహోదరుడైన ఇశ్రాయేలు ఇలా చెప్తున్నాడు: మా మీదికి వచ్చిన కష్టాలన్నిటి గురించి నీకు తెలుసు.

  22. సంఖ్యాకాండము 20:15సుమారు క్రీ.పూ. 1471

    మా పూర్వికులు ఈజిప్టుకు వెళ్లారు. చాలా కాలం మేమక్కడ ఉన్నాము. ఈజిప్టువారు మా పట్ల, మా పూర్వికుల పట్ల దారుణంగా ప్రవర్తించారు,

  23. సంఖ్యాకాండము 20:16సుమారు క్రీ.పూ. 1471

    అయితే మేము యెహోవాకు మొరపెట్టినప్పుడు, ఆయన మా మొర ఆలకించాడు దేవదూతను పంపి, ఈజిప్టు నుండి మమ్మల్ని బయటకు తీసుకువచ్చాడు. “ఇప్పుడు మేము కాదేషులో ఉన్నాము, ఈ పట్టణం మీ సరిహద్దుల చివర ఉంది.

  24. సంఖ్యాకాండము 20:17సుమారు క్రీ.పూ. 1471

    దయచేసి మమ్మల్ని మీ దేశం మార్గం ద్వారా వెళ్లనివ్వండి. మేము మీ పొలాలు, ద్రాక్షతోటల్లో నుండి వెళ్లము, మీ బావులలోని నీళ్లు త్రాగము. రాజమార్గంలోనే సాగిపోతాము. ఈ దేశం పొలిమేర దాటే వరకు కుడికి గాని, ఎడమకు గాని తిరగకుండా వెళ్తాము.”

  25. సంఖ్యాకాండము 20:18సుమారు క్రీ.పూ. 1471

    కానీ ఎదోము రాజు ఇలా ఆజ్ఞాపించారు: “మీరు ఇక్కడినుండి వెళ్లకూడదు. వెళ్లడానికి ప్రయత్నిస్తే ఖడ్గంతో మీపై దాడి చేస్తాము.”