కంటెంట్‌కు వెళ్లండి

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. సంఖ్యాకాండము 17:11సుమారు క్రీ.పూ. 1471

    యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లే మోషే చేశాడు.

  2. సంఖ్యాకాండము 17:12సుమారు క్రీ.పూ. 1471

    ఇశ్రాయేలీయులు మోషేతో, “మేము చస్తాము! మేము నశించాము, మేమంతా నశించాము!

  3. సంఖ్యాకాండము 17:13సుమారు క్రీ.పూ. 1471

    ఎవరైనా కనీసం యెహోవా యొక్క సమావేశ గుడారం దగ్గరకు వచ్చినా చస్తారు. మేమంతా చస్తామా?” అని అన్నారు.

  4. సంఖ్యాకాండము 18:1సుమారు క్రీ.పూ. 1471

    యెహోవా అహరోనుతో, “పరిశుద్ధాలయానికి సంబంధించిన అపరాధాలకు నీవూ నీ కుమారులు నీ కుటుంబం బాధ్యులు, యాజక ధర్మానికి సంబంధించిన అపరాధాలకు నీవూ నీ కుమారులు బాధ్యులు.

  5. సంఖ్యాకాండము 18:2సుమారు క్రీ.పూ. 1471

    మీతో చేరి నీవు, మీ కుమారులు నిబంధన గుడారం ముందు పరిచర్య చేస్తున్నప్పుడు మీకు సహాయపడడానికి మీ పూర్వికుల గోత్రానికి చెందిన మీ తోటి లేవీయులను తీసుకురండి.

  6. సంఖ్యాకాండము 18:3సుమారు క్రీ.పూ. 1471

    వారు నీకు బాధ్యత వహించాలి, గుడారం యొక్క అన్ని విధులను నిర్వర్తించాలి, అయితే వారు పరిశుద్ధాలయం యొక్క సామాగ్రి దగ్గరకు గాని బలిపీఠం దగ్గరకు గాని వెళ్లకూడదు. లేదంటే వారు మీరు చస్తారు.

  7. సంఖ్యాకాండము 18:4సుమారు క్రీ.పూ. 1471

    వారు మీతో కలిసి సమావేశ గుడారంలోని అన్ని పనులు జరిగేలా బాధ్యత వహించాలి; మీకు సహాయం చేయడానికి ఇతరులెవ్వరు రాకూడదు.

  8. సంఖ్యాకాండము 18:5సుమారు క్రీ.పూ. 1471

    “పరిశుద్ధాలయం, బలిపీఠం పట్ల శ్రద్ధ వహించే విషయంలో మీరు బాధ్యత వహించాలి. తద్వారా ఇశ్రాయేలీయుల మీదికి యెహోవా కోపం రాదు.

  9. సంఖ్యాకాండము 18:6సుమారు క్రీ.పూ. 1471

    నేను నేనే ఇశ్రాయేలీయుల నుండి మీ తోటి లేవీయులను మీకు బహుమానంగా, సమావేశ గుడారంలో సేవ చేయడానికి యెహోవాకు ప్రతిష్ఠించాను.

  10. సంఖ్యాకాండము 18:7సుమారు క్రీ.పూ. 1471

    అయితే నీవు, నీ కుమారులు మాత్రమే బలిపీఠం దగ్గర, తెర వెనుక ఉన్న ప్రతిదానికీ సంబంధించి యాజకులుగా పని చేయవచ్చు. యాజక ధర్మాన్ని మీకు ప్రత్యేకమైన వరంగా ఇస్తున్నాను. వేరే ఎవరైనా పరిశుద్ధాలయాన్ని సమీపిస్తే, వారికి మరణశిక్ష విధించబడుతుంది.”

  11. సంఖ్యాకాండము 18:8సుమారు క్రీ.పూ. 1471

    అప్పుడు యెహోవా అహరోనుతో ఇలా అన్నాడు: “నాకు అర్పించిన అర్పణలకు నేనే నీకు బాధ్యత అప్పగించాను; ఇశ్రాయేలీయులు నాకు ఇచ్చే పరిశుద్ధ అర్పణలన్నీ నేను నీకు, నీ కుమారులకు మీ భాగంగా, మీ శాశ్వత వాటాగా నిర్ణయిస్తున్నాను.

  12. సంఖ్యాకాండము 18:9సుమారు క్రీ.పూ. 1471

    బలిపీఠం మీది నిప్పులో కాల్చివేయబడని అతి పవిత్ర అర్పణలలో కొంత భాగం మీరు తీసుకోవాలి. నాకు వారు తెచ్చే అతి పవిత్రమైన భోజనార్పణలు పాపపరిహారబలులు అపరాధబలులు నీకు, నీ కుమారులకు చెందినవి.

  13. సంఖ్యాకాండము 18:10సుమారు క్రీ.పూ. 1471

    అవి అతి పవిత్రంగా ఎంచి తినాలి. ప్రతి మగవాడు అది తినాలి. వాటిని పవిత్రమైనవిగా పరిగణించాలి.

  14. సంఖ్యాకాండము 18:11సుమారు క్రీ.పూ. 1471

    “ఇది కూడా మీదే: ఇశ్రాయేలీయులు అర్పించే అర్పణలన్నిటిలో నుండి ప్రక్కన పెట్టబడినది. నేను నీకు, నీ కుమారులు కుమార్తెలకు మీ శాశ్వత వాటాగా నిర్ణయిస్తున్నాను. మీ ఇంట్లో ఆచార ప్రకారంగా శుభ్రంగా ఉన్న ప్రతి ఒక్కరూ దానిని తినవచ్చు.

  15. సంఖ్యాకాండము 18:12సుమారు క్రీ.పూ. 1471

    “యెహోవాకు ఇశ్రాయేలీయులు వారి కోతలో నుండి ప్రథమ ఫలంగా అర్పించే ధాన్యము, ద్రాక్షరసము, నూనె అంతటిని మీకు ఇస్తున్నాను.

  16. సంఖ్యాకాండము 18:13సుమారు క్రీ.పూ. 1471

    దేశం పంటలన్నిటిలో యెహోవాకు అర్పించే ప్రథమ ఫలాలు మీకు చెందుతాయి. నీ కుటుంబంలో ఆచార ప్రకారం పవిత్రులందరు వాటిని తినవచ్చు.

  17. సంఖ్యాకాండము 18:14సుమారు క్రీ.పూ. 1471

    “ఇశ్రాయేలీయులు యెహోవా కోసం ప్రతిష్ఠించిన ప్రతిదీ నీకు చెందుతుంది.

  18. సంఖ్యాకాండము 18:15సుమారు క్రీ.పూ. 1471

    ప్రతి గర్భం నుండి వచ్చిన యెహోవాకు అర్పించబడ్డ జ్యేష్ఠ సంతానం, మనుష్యులైన, జంతువులైన, మీకు చెందుతాయి. కానీ మీరు ప్రతి పెద్ద కుమారున్ని, అపవిత్ర జంతువుల తొలిచూలును విడిపించాలి.

  19. సంఖ్యాకాండము 18:16సుమారు క్రీ.పూ. 1471

    ఒక నెల వయస్సున్నప్పుడు పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం అయిదు షెకెళ్ళ వెండితో విడిపించాలి, అంటే ఇరవై గెరాలు.

  20. సంఖ్యాకాండము 18:17సుమారు క్రీ.పూ. 1471

    “ఆవులలో, గొర్రెలలో, మేకలలో తొలిచూలును విడిపించకూడదు. అవి పవిత్రమైనవి. వాటి రక్తం బలిపీఠం చుట్టూ ప్రోక్షించి యెహోవాకు సువాసనగా ఉండే హోమంగా వాటి క్రొవ్వును కాల్చివేయాలి.

  21. సంఖ్యాకాండము 18:18సుమారు క్రీ.పూ. 1471

    ప్రత్యేక అర్పణలోని బోర, కుడి తొడ ఎలాగో, వాటి మాంసం కూడా మీకు చెందుతుంది.

  22. సంఖ్యాకాండము 18:19సుమారు క్రీ.పూ. 1471

    ఇశ్రాయేలీయులు యెహోవాకు తెచ్చే పవిత్రార్పణలను ప్రక్కకు పెట్టినవి నీకు, నీ కుమారులకు, కుమార్తెలకు శాశ్వత వాటాగా ఇస్తున్నాను. ఇది యెహోవా ఎదుట నీతో పాటు నీ సంతానానికి నిత్య ఉప్పు ఒడంబడికగా ఉంటుంది.”

  23. సంఖ్యాకాండము 18:20సుమారు క్రీ.పూ. 1471

    యెహోవా అహరోనుతో ఇలా చెప్పారు, “వారి దేశంలో నీకు స్వాస్థ్యం కానీ వాటా కానీ ఉండదు; ఇశ్రాయేలీయుల మధ్య నేనే నీ వాటాను నేనే నీ స్వాస్థ్యాన్ని.

  24. సంఖ్యాకాండము 18:21సుమారు క్రీ.పూ. 1471

    “సమావేశ గుడారం దగ్గర సేవ చేస్తున్న లేవీయులకు పారితోషికంగా ఇశ్రాయేలీయులు ఇచ్చే దశమ భాగాలను స్వాస్థ్యంగా ఇస్తున్నాను.

  25. సంఖ్యాకాండము 18:22సుమారు క్రీ.పూ. 1471

    ఇప్పటినుండి యాజకులు, లేవీయులు తప్ప ఇశ్రాయేలీయులు సమావేశ గుడారం దగ్గరకు రాకూడదు లేదా వారి పాపానికి ప్రతిఫలం భరించి చస్తారు.