- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446–1406 BC
The Wilderness Years
Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.
ఈ కాలపు వచనాలు
- సంఖ్యాకాండము 22:5సుమారు క్రీ.పూ. 1452
యూఫ్రటీసు నదికి సమీపంలో ఉన్న పెతోరు దగ్గర ఉన్న బెయోరు కుమారుడైన బిలామును తన స్వదేశంలో పిలువడానికి దూతలను పంపాడు. బాలాకు అన్నాడు: “ఈజిప్టు నుండి ప్రజలు వచ్చారు; వారు భూ ముఖాన్ని కప్పి, నా ప్రక్కన స్థిరపడ్డారు.
- సంఖ్యాకాండము 22:6సుమారు క్రీ.పూ. 1452
నీవు వచ్చి వీరిని శపించాలి, ఎందుకంటే వారు నా శక్తికి మించి ఉన్నారు. బహుశా అప్పుడు నేను వీరిని ఓడించి ఈ స్థలం నుండి తరిమివేయగలుగుతాను. నీవు ఎవరిని దీవిస్తే వారు దీవించబడతారని, నీవు ఎవరిని శపిస్తే వారు శపించబడతారని నాకు తెలుసు.”
- సంఖ్యాకాండము 22:7సుమారు క్రీ.పూ. 1452
మోయాబు మిద్యాను పెద్దలు, భవిష్యవాణికి రుసుము తీసుకెళ్లారు. వారు బిలాము దగ్గరకు వచ్చి, బాలాకు చెప్పింది అతనికి చెప్పారు.
- సంఖ్యాకాండము 22:8సుమారు క్రీ.పూ. 1452
బిలాము వారితో, “ఈ రాత్రికి ఇక్కడ ఉండండి, యెహోవా నాకు చెప్పేది నేను మీకు తెలియజేస్తాను” అని అన్నాడు. కాబట్టి మోయాబు అధికారులు ఆ రాత్రి అతనితో ఉన్నారు.
- సంఖ్యాకాండము 22:9సుమారు క్రీ.పూ. 1452
ఆ రాత్రి దేవుడు వచ్చి బిలామును, “నీతో ఉన్న వీళ్ళు ఎవరు?” అని ప్రశ్నించారు.
- సంఖ్యాకాండము 22:10సుమారు క్రీ.పూ. 1452
బిలాము దేవునితో, “సిప్పోరు కుమారుడు, మోయాబు రాజైన బాలాకు, నాకు ఈ సందేశం పంపాడు:
- సంఖ్యాకాండము 22:11సుమారు క్రీ.పూ. 1452
‘ఈజిప్టు నుండి వచ్చిన ఒక ప్రజల గుంపు భూమినంతా కప్పుతుంది. నా కోసం వారిని శపించు. బహుశ అప్పుడు నేను వారితో యుద్ధం చేసి తరిమివేస్తాను.’ ”
- సంఖ్యాకాండము 22:12సుమారు క్రీ.పూ. 1452
అయితే దేవుడు బిలాముతో, “నీవు వారితో వెళ్లొద్దు. వారు దీవించబడినవారు కాబట్టి నీవు వారిని శపించకూడదు” అని అన్నారు.
- సంఖ్యాకాండము 22:13సుమారు క్రీ.పూ. 1452
మర్నాడు ఉదయం బిలాము బాలాకు అధికారులతో, “మీ సొంత దేశానికి వెళ్లిపొండి, నేను మీతో వెళ్లడానికి యెహోవా నిరాకరించారు” అని చెప్పాడు.
- సంఖ్యాకాండము 22:14సుమారు క్రీ.పూ. 1452
కాబట్టి మోయాబు అధికారులు బాలాకు దగ్గరకు తిరిగివెళ్లి, “బిలాము మాతో రావడానికి ఒప్పుకోలేదు” అని చెప్పారు.
- సంఖ్యాకాండము 22:15సుమారు క్రీ.పూ. 1452
అప్పుడు బాలాకు ఇతర అధికారులను, మొదటిసారి కన్నా ఇంకా ఎక్కువ మంది ప్రముఖులను, పంపాడు.
- సంఖ్యాకాండము 22:16సుమారు క్రీ.పూ. 1452
వారు బిలాము దగ్గరకు వచ్చి అన్నారు: “సిప్పోరు కుమారుడైన బాలాకు ఇలా చెప్తున్నాడు: నా దగ్గరకు రాకుండ ఏది కూడా మిమ్మల్ని ఆపనివ్వకండి,
- సంఖ్యాకాండము 22:17సుమారు క్రీ.పూ. 1452
ఎందుకంటే నేను నిన్ను గొప్పగా గౌరవిస్తాను, నీవు నాకు ఏది చెబితే అది చేస్తాను. వచ్చి నా కోసం ఈ ప్రజలపై శాపం పెట్టండి.”
- సంఖ్యాకాండము 22:18సుమారు క్రీ.పూ. 1452
అయితే బిలాము వారితో, “బాలాకు తన రాజభవనంలో ఉన్న వెండి బంగారమంతా ఇచ్చినా సరే, నా దేవుడైన యెహోవా ఆజ్ఞకు మించి ఎక్కువ గాని తక్కువ గాని చేయలేను.
- సంఖ్యాకాండము 22:19సుమారు క్రీ.పూ. 1452
మీరు రాత్రి ఇక్కడ గడపండి, యెహోవా నాకేమి చెప్తారు తెలుసుకుంటాను” అని చెప్పాడు.
- సంఖ్యాకాండము 22:20సుమారు క్రీ.పూ. 1452
ఆ రాత్రి దేవుడు బిలాముతో, “ఈ మనుష్యులు నిన్ను పిలువడానికి వచ్చారు కాబట్టి నీవు వారితో వెళ్లు కానీ నేను చెప్పేది మాత్రమే చేయు” అని అన్నారు.
- సంఖ్యాకాండము 22:21సుమారు క్రీ.పూ. 1452
మర్నాడు ఉదయం బిలాము తన గాడిదకు సీను కట్టుకుని మోయాబు అధికారులతో వెళ్లాడు.
- సంఖ్యాకాండము 22:22సుమారు క్రీ.పూ. 1452
కాని బిలాము వెళ్తునప్పుడు దేవుని కోపం రగులుకుంది. యెహోవా దూత మార్గంలో బిలామును అడ్డుకోడానికి నిలబడ్డాడు. బిలాము గాడిద మీద వెళ్తున్నాడు, అతనితో తన ఇద్దరు సేవకులు ఉన్నారు.
- సంఖ్యాకాండము 22:23సుమారు క్రీ.పూ. 1452
యెహోవా దూత కత్తి దూసి చేతపట్టుకుని త్రోవలో నిలిచి ఉండడం చూసి గాడిద దారి విడిచి పొలంలోకి వెళ్లింది. అది మార్గంలోకి రావాలని బిలాము దాన్ని కొట్టాడు.
- సంఖ్యాకాండము 22:24సుమారు క్రీ.పూ. 1452
అప్పుడు యెహోవా దూత రెండు ద్రాక్షతోటల మధ్య రెండు వైపుల గోడలు ఉన్నచోట నిలబడ్డాడు.
- సంఖ్యాకాండము 22:25సుమారు క్రీ.పూ. 1452
యెహోవా దూతను చూసి ఆ గాడిద గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమింది కాబట్టి అతడు గాడిదను మళ్ళీ కొట్టాడు.
- సంఖ్యాకాండము 22:26సుమారు క్రీ.పూ. 1452
తర్వాత యెహోవా దూత కొంచెం ముందుకు వెళ్లి, గాడిద కుడివైపు కానీ, ఎడమవైపు కానీ తిరుగకుండునట్లు ఇరుకు స్థలంలో నిలబడ్డాడు.
- సంఖ్యాకాండము 22:27సుమారు క్రీ.పూ. 1452
యెహోవా దూతను చూసి గాడిద బిలాము క్రింద నేల మీద పడి ఉన్నది. బిలాము కోపంతో తన చేతికర్రతో గాడిదను కొట్టాడు.
- సంఖ్యాకాండము 22:28సుమారు క్రీ.పూ. 1452
అప్పుడు యెహోవా ఆ గాడిద నోరు తెరిచారు, అది బిలాముతో మాట్లాడుతూ, “నేను నీకు ఏమి చేశానని నన్ను మూడుసార్లు కొట్టావు?” అని అన్నది.
- సంఖ్యాకాండము 22:29సుమారు క్రీ.పూ. 1452
బిలాము గాడిదకు, “నీవు నన్ను మూర్ఖునిగా ఎంచావు. నా చేతిలో ఖడ్గం ఉండి ఉంటే నిన్ను ఇప్పుడే చంపేసే వాన్ని” అని జవాబిచ్చాడు.