- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446–1406 BC
The Wilderness Years
Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.
ఈ కాలపు వచనాలు
- సంఖ్యాకాండము 23:14సుమారు క్రీ.పూ. 1452
బాలాకు బిలామును సోఫీము పొలములో ఉన్న పిస్గా శిఖరం మీదికి తీసుకెళ్లాడు. అక్కడ ఏడు బలిపీఠాలు కట్టి, ఒక్కో దాని మీద ఒక కోడెను, ఒక పొట్టేలును అర్పించాడు.
- సంఖ్యాకాండము 23:15సుమారు క్రీ.పూ. 1452
బిలాము బాలాకుతో, “నీవు ఇక్కడ నీ బలిపీఠం దగ్గర ఉండు, నేను అక్కడ దేవున్ని కలుస్తాను” అని అన్నాడు.
- సంఖ్యాకాండము 23:16సుమారు క్రీ.పూ. 1452
యెహోవా బిలామును కలుసుకొని, అతని నోటిలో మాట ఉంచి, “బాలాకు దగ్గరకు వెళ్లి ఈ మాటను చెప్పు” అని అన్నారు.
- సంఖ్యాకాండము 23:17సుమారు క్రీ.పూ. 1452
బిలాము తిరిగివెళ్లి రాజు, తన మోయాబు అధికారులతో దహనబలి దగ్గర నిలిచియుండడం చూశాడు. బాలాకు అతన్ని, “యెహోవా ఏమి చెప్పారు?” అని అడిగాడు.
- సంఖ్యాకాండము 23:18సుమారు క్రీ.పూ. 1452
అప్పుడు బిలాము తన సందేశాన్ని ఇచ్చాడు: “బాలాకు! లేచి, విను; సిప్పోరు కుమారుడా! నా మాట విను.
- సంఖ్యాకాండము 23:19సుమారు క్రీ.పూ. 1452
అబద్ధమాడడానికి దేవుడు మనుష్యుడు కాదు, మనస్సు మార్చుకోవడానికి ఆయన నరపుత్రుడు కాదు. ఆయన మాట్లాడి క్రియ చేయరా? ఆయన వాగ్దానం చేసి నెరవేర్చరా?
- సంఖ్యాకాండము 23:20సుమారు క్రీ.పూ. 1452
ఆశీర్వదించమని నేను ఆజ్ఞ పొందుకున్నాను; ఆయన వారిని ఆశీర్వదించారు, దాన్ని నేను మార్చలేను.
- సంఖ్యాకాండము 23:21సుమారు క్రీ.పూ. 1452
“యాకోబులో ఎటువంటి దోషం కనిపించలేదు, ఇశ్రాయేలులో ఏ చెడు కనిపించలేదు. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉన్నారు; రాజు యొక్క కేక వారి మధ్య ఉన్నది.
- సంఖ్యాకాండము 23:22సుమారు క్రీ.పూ. 1452
దేవుడు వారిని ఈజిప్టు నుండి బయటకు తెచ్చారు; వారికి అడవి ఎద్దుకు ఉన్న బలం ఉంది.
- సంఖ్యాకాండము 23:23సుమారు క్రీ.పూ. 1452
యాకోబుకు వ్యతిరేకంగా ఏ భవిష్యవాణి లేదు, ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ఏ శకునాలు లేవు. ఇప్పుడు యాకోబు గురించి, ఇశ్రాయేలు గురించి, ‘దేవుడు ఏమి చేశారో చూడండి!’
- సంఖ్యాకాండము 23:24సుమారు క్రీ.పూ. 1452
ప్రజలు ఆడ సింహంలా లేస్తారు; వారు తమకు తాము సింహంలా లేస్తారు అది తన వేట మాంసాన్ని మ్రింగివేసే వరకు దాని బాధితుల రక్తం త్రాగే వరకు విశ్రాంతి తీసుకోదు” అని చెప్పబడుతుంది.
- సంఖ్యాకాండము 23:25సుమారు క్రీ.పూ. 1452
బాలాకు బిలాముతో, “వారిని అసలు శపించకు వారిని దీవించకు!” అని అన్నాడు.
- సంఖ్యాకాండము 23:26సుమారు క్రీ.పూ. 1452
బిలాము బాలాకుతో, “యెహోవా ఏది చెప్తే నేను అదే చేయాలని నేను చెప్పలేదా?” అని జవాబిచ్చాడు.
- సంఖ్యాకాండము 23:27సుమారు క్రీ.పూ. 1452
అప్పుడు బాలాకు బిలాముతో, “అయితే నిన్ను మరో స్థలానికి తీసుకెళ్తాను. బహుశ అక్కడినుండి నీవు నా కోసం వారిని శపించడం దేవునికి ఇష్టం కావచ్చు” అని అన్నాడు.
- సంఖ్యాకాండము 23:28సుమారు క్రీ.పూ. 1452
బాలాకు, బిలామును నిర్మానుష్య స్థలానికి ఎదురుగా ఉన్న పెయోరు కొండ శిఖరం పైకి తీసుకెళ్లాడు.
- సంఖ్యాకాండము 23:29సుమారు క్రీ.పూ. 1452
బిలాము బాలాకుతో, “నా కోసం ఇక్కడ ఏడు బలిపీఠాలు కట్టించు, ఏడు కోడెలను, ఏడు పొట్టేళ్ళను సిద్ధం చేయించు” అని అన్నాడు.
- సంఖ్యాకాండము 23:30సుమారు క్రీ.పూ. 1452
బాలాకు బిలాము చెప్పినట్టు చేశాడు, ప్రతి బలిపీఠం మీద కోడెను, పొట్టేలును అర్పించాడు.
- సంఖ్యాకాండము 24:1సుమారు క్రీ.పూ. 1452
ఇశ్రాయేలును ఆశీర్వదించడం యెహోవాకు ఇష్టమని బిలాము గ్రహించినప్పుడు, అతడు ఇతర సమయాల్లో చేసినట్టు భవిష్యవాణి ఆశ్రయించలేదు, కానీ తన ముఖాన్ని అరణ్యం వైపు త్రిప్పాడు.
- సంఖ్యాకాండము 24:2సుమారు క్రీ.పూ. 1452
ఇశ్రాయేలు వారు గోత్రాల ప్రకారం గుడారాలు వేసుకుని ఉండడం బిలాము చూసినప్పుడు, దేవుని ఆత్మ అతని మీదికి వచ్చింది,
- సంఖ్యాకాండము 24:3సుమారు క్రీ.పూ. 1452
అతడు ఈ సందేశం ఇచ్చాడు: “బెయోరు కుమారుడైన బిలాము యొక్క ప్రవచనం, స్పష్టంగా చూడగలిగే కన్ను గలవాని ప్రవచనం,
- సంఖ్యాకాండము 24:4సుమారు క్రీ.పూ. 1452
దేవుని మాటలు వినే వాని ప్రవచనం, సర్వశక్తిగల దేవుని నుండి దర్శనం చూసేవాడు, సాష్టాంగపడేవాడు, కళ్లు తెరవబడినవాడు:
- సంఖ్యాకాండము 24:5సుమారు క్రీ.పూ. 1452
“ఓ యాకోబు, నీ గుడారాలు ఎంత అందంగా ఉన్నాయి, ఓ ఇశ్రాయేలు, నీ నివాస భవనాలు ఎంత రమ్యంగా ఉన్నాయి!
- సంఖ్యాకాండము 24:6సుమారు క్రీ.పూ. 1452
“అవి లోయల్లా వ్యాపించాయి, నది ప్రక్కన తోటల్లా ఉన్నాయి, యెహోవా నాటిన అగరు వంటివి, జలాల ప్రక్కన దేవదారు చెట్లలా ఉన్నాయి.
- సంఖ్యాకాండము 24:7సుమారు క్రీ.పూ. 1452
వాటి బొక్కెనల నుండి నీళ్లు పారుతున్నాయి; వాటి విత్తనాలకు సమృద్ధిగా నీళ్లుంటాయి. “వారి రాజు అగగు కంటే గొప్పవాడు; వారి రాజ్యం హెచ్చింపబడుతుంది.
- సంఖ్యాకాండము 24:8సుమారు క్రీ.పూ. 1452
“దేవుడు ఈజిప్టు నుండి వారిని బయటకు తెచ్చారు; వారు అడవి ఎద్దు బలం కలిగి ఉన్నారు. వారు శత్రు దేశాలను మ్రింగివేస్తారు వారి ఎముకలను తునాతునకలు చేస్తారు; వారి బాణాలతో వారు వారిని గుచ్చుతారు.