కంటెంట్‌కు వెళ్లండి

circa 1446–1406 BC

The Wilderness Years

Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.

2,247 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. సంఖ్యాకాండము 25:9సుమారు క్రీ.పూ. 1452

    అయితే తెగులు ద్వారా 24,000 మంది చనిపోయారు.

  2. సంఖ్యాకాండము 25:10సుమారు క్రీ.పూ. 1452

    యెహోవా మోషేతో అన్నారు,

  3. సంఖ్యాకాండము 25:11సుమారు క్రీ.పూ. 1452

    “యాజకుడైన అహరోను మనవడు, ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు ఇశ్రాయేలీయుల మీద ఉన్న నా కోపాన్ని తిప్పాడు. నాలాగే అతడు నా ఘనత కోసం వారి మధ్యలో రోషం కలిగి ఉన్నాడు కాబట్టి, నా రోషాన్ని బట్టి వారిని శిక్షించకుండ ఆపివేశాను.

  4. సంఖ్యాకాండము 25:12సుమారు క్రీ.పూ. 1452

    కాబట్టి నేను అతనితో సమాధాన ఒడంబడిక చేస్తున్నానని అతనితో చెప్పు.

  5. సంఖ్యాకాండము 25:13సుమారు క్రీ.పూ. 1452

    అతడు అతని సంతానం నిత్య యాజకత్వ నిబంధన కలిగి ఉంటారు ఎందుకంటే తన దేవుని ఘనత కోసం రోషం కలిగి, ఇశ్రాయేలీయుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాడు.”

  6. సంఖ్యాకాండము 25:14సుమారు క్రీ.పూ. 1452

    మిద్యాను స్త్రీతో పాటు చంపబడిన ఇశ్రాయేలీయుని పేరు సలూ కుమారుడైన జిమ్రీ. ఇతడు షిమ్యోను కుటుంబంలో నాయకుడు.

  7. సంఖ్యాకాండము 25:15సుమారు క్రీ.పూ. 1452

    చంపబడిన ఆ మిద్యానీయ స్త్రీ పేరు కొజ్బీ, ఈమె మిద్యానీయ కుటుంబాలలో ఒక గోత్ర నాయకుడైన సూరు కుమార్తె.

  8. సంఖ్యాకాండము 25:16సుమారు క్రీ.పూ. 1452

    యెహోవా మోషేతో అన్నారు.

  9. సంఖ్యాకాండము 25:17సుమారు క్రీ.పూ. 1452

    “మిద్యానీయులను శత్రువులుగా భావించి వారిని చంపండి.

  10. సంఖ్యాకాండము 25:18సుమారు క్రీ.పూ. 1452

    వారు మిమ్మల్ని శత్రువులుగా భావించి మిమ్మల్ని మోసం చేయడానికి ఉపయోగించిన వారి సహోదరి, కొజ్బీ, మిద్యానీయుల నాయకుని కుమార్తె, పెయోరులో జరిగిన సంఘటన ఫలితంగా తెగులు వచ్చినప్పుడు చంపబడింది.”

  11. సంఖ్యాకాండము 26:1సుమారు క్రీ.పూ. 1452

    తెగులు అంతరించిన తర్వాత, యెహోవా మోషేతో యాజకుడైన అహరోను కుమారుడైన ఎలియాజరుతో అన్నారు,

  12. సంఖ్యాకాండము 26:2సుమారు క్రీ.పూ. 1452

    “ఇశ్రాయేలు సమాజమంతటిని ఇరవై సంవత్సరాలు అంతకు పైబడి వయస్సు ఉండి ఇశ్రాయేలు సైన్యంలో సేవ చేయగలవారిని కుటుంబాల ప్రకారం లెక్కించాలి.”

  13. సంఖ్యాకాండము 26:3సుమారు క్రీ.పూ. 1452

    కాబట్టి మోషే, యాజకుడైన ఎలియాజరు, యెరికో నుండి యొర్దాను వైపు ఉన్న మోయాబు సమతల మైదానాల్లో ఇశ్రాయేలీయుల నాయకులతో మాట్లాడుతూ,

  14. సంఖ్యాకాండము 26:4సుమారు క్రీ.పూ. 1452

    “యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, ఇరవై సంవత్సరాలు అంతకు పైబడి ఉన్న పురుషులను లెక్కించండి” అని చెప్పారు.

  15. సంఖ్యాకాండము 26:5సుమారు క్రీ.పూ. 1452

    ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన, రూబేను వారసులు: హనోకు ద్వార, హనోకీయుల వంశం; పల్లు ద్వార, పల్లువీయుల వంశం;

  16. సంఖ్యాకాండము 26:6సుమారు క్రీ.పూ. 1452

    హెస్రోను ద్వార, హెస్రోనీయుల వంశం; కర్మీ ద్వార, కర్మీయుల వంశము.

  17. సంఖ్యాకాండము 26:7సుమారు క్రీ.పూ. 1452

    ఇవి రూబేను వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 43,730.

  18. సంఖ్యాకాండము 26:8సుమారు క్రీ.పూ. 1452

    పల్లు కుమారుడు ఏలీయాబు,

  19. సంఖ్యాకాండము 26:9సుమారు క్రీ.పూ. 1452

    ఏలీయాబు కుమారులు నెమూయేలు, దాతాను, అబీరాము. ఈ దాతాను, అబీరాములే మోషే అహరోనులకు ఎదురు తిరిగినవారు, కోరహు అనుచరులు యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు వారి మధ్య ఉన్న అధికారులు.

  20. సంఖ్యాకాండము 26:10సుమారు క్రీ.పూ. 1452

    భూమి నోరు తెరచుకొని కోరహుతో పాటు వారిని మ్రింగివేసింది, అతని అనుచరులు 250 మంది మంటలో హతమయ్యారు. వారు హెచ్చరిక గుర్తుగా ఉన్నారు.

  21. సంఖ్యాకాండము 26:11సుమారు క్రీ.పూ. 1452

    అయితే, ఆ రోజున కోరహు కుమారులు చనిపోలేదు.

  22. సంఖ్యాకాండము 26:12సుమారు క్రీ.పూ. 1452

    షిమ్యోను వారసులు వారి వంశాల ప్రకారం: నెమూయేలు ద్వార, నెమూయేలీయుల వంశం; యామీను ద్వార, యామీనీయుల వంశం; యాకీను ద్వార, యాకీనీయుల వంశం;

  23. సంఖ్యాకాండము 26:13సుమారు క్రీ.పూ. 1452

    జెరహు ద్వార, జెరహీయుల వంశం; షావూలు ద్వార, షావూలీయుల వంశము.

  24. సంఖ్యాకాండము 26:14సుమారు క్రీ.పూ. 1452

    ఇవి షిమ్యోను వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 22,200.

  25. సంఖ్యాకాండము 26:15సుమారు క్రీ.పూ. 1452

    గాదు యొక్క వారసులు వారి వంశాల ప్రకారం: సెఫోను ద్వార, సెఫోనీయుల వంశం; హగ్గీ ద్వార, హగ్గీయుల వంశం; షూనీ ద్వార, షూనీయుల వంశం;