కంటెంట్‌కు వెళ్లండి

circa 1010–970 BC

The Reign of David

David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.

1,230 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 1 దినవృత్తాంతములు 22:1సుమారు క్రీ.పూ. 1017

    తర్వాత దావీదు, “దేవుడైన యెహోవా మందిరం, ఇశ్రాయేలు కోసం దహనబలులు అర్పించే బలిపీఠం ఇక్కడ ఉండాలి” అని అన్నాడు.

  2. 1 దినవృత్తాంతములు 22:2సుమారు క్రీ.పూ. 1017

    కాబట్టి దావీదు ఇశ్రాయేలు దేశంలో నివసిస్తున్న విదేశీయులను సమావేశపరచమని ఆజ్ఞాపించాడు. అతడు వారిలో కొందరిని దేవుని మందిరం కట్టించడానికి రాళ్లు చెక్కే పనికి నియమించాడు.

  3. 1 దినవృత్తాంతములు 22:3సుమారు క్రీ.పూ. 1017

    దావీదు ద్వారాల తలుపులకు కావలిసిన మేకులు, బందుల కోసం చాలా ఇనుమును తూయలేనంత ఇత్తడిని సమకూర్చాడు.

  4. 1 దినవృత్తాంతములు 22:4సుమారు క్రీ.పూ. 1017

    సీదోనీయులు, తూరీయులు దావీదుకు పెద్ద సంఖ్యలో దేవదారు మ్రానులను తీసుకురావడం వల్ల, వాటిని కూడా లెక్కపెట్టలేనంతగా సమకూర్చాడు.

  5. 1 దినవృత్తాంతములు 22:5సుమారు క్రీ.పూ. 1017

    దావీదు, “నా కుమారుడైన సొలొమోను చిన్నవాడు, అనుభవం లేనివాడు, యెహోవాకు కట్టవలసిన మందిరపు కీర్తి, వైభవం బట్టి అది అన్ని దేశాల్లో ప్రసిద్ధి చెందాలి. కాబట్టి దాని నిర్మాణానికి కావలసిన వాటిని నేను సిద్ధం చేస్తాను” అని చెప్పి దావీదు చనిపోవడానికి ముందే విస్తారంగా సామాగ్రిని సిద్ధం చేశాడు.

  6. 1 దినవృత్తాంతములు 22:6సుమారు క్రీ.పూ. 1017

    తర్వాత అతడు తన కుమారుడైన సొలొమోనును పిలిచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మందిరం కట్టాలని అతన్ని ఆదేశించాడు.

  7. 1 దినవృత్తాంతములు 22:7సుమారు క్రీ.పూ. 1017

    దావీదు సొలొమోనుతో ఇలా అన్నాడు: “నా కుమారుడా, నా దేవుడైన యెహోవా నామం కోసం మందిరాన్ని కట్టించాలని నా హృదయంలో అనుకున్నాను.

  8. 1 దినవృత్తాంతములు 22:8సుమారు క్రీ.పూ. 1017

    అయితే యెహోవా మాట నాతో ఇలా చెప్పింది: ‘నీవు చాలా రక్తం చిందించి, చాలా యుద్ధాలు చేశావు. నా ఎదుట నీవు నేల మీద చాలా రక్తాన్ని చిందించావు, కాబట్టి నీవు నా పేరిట మందిరాన్ని కట్టించకూడదు.

  9. 1 దినవృత్తాంతములు 22:9సుమారు క్రీ.పూ. 1017

    అయితే నీకు ఒక కుమారుడు జన్మిస్తాడు, అతడు సమాధానం, విశ్రాంతి కలిగిన వ్యక్తిగా ఉంటాడు. అన్నివైపులా అతని శత్రువులందరి నుండి నేనతనికి విశ్రాంతిని ఇస్తాను. అతనికి సొలొమోను అనే పేరు పెడతారు. అతని కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు సమాధానాన్ని, నెమ్మదిని ఇస్తాను.

  10. 1 దినవృత్తాంతములు 22:10సుమారు క్రీ.పూ. 1017

    అతడే నా పేరిట ఒక మందిరాన్ని కట్టిస్తాడు. అతడు నాకు కుమారుడై ఉంటాడు, నేనతనికి తండ్రినై ఉంటాను. ఇశ్రాయేలీయుల మీద అతని రాజ్యసింహాసనాన్ని శాశ్వతంగా స్థిరపరుస్తాను.’

  11. 1 దినవృత్తాంతములు 22:11సుమారు క్రీ.పూ. 1017

    “నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉంటారు, నీవు విజయం సాధించి, నీ దేవుడైన యెహోవా నీ గురించి చెప్పిన ప్రకారం నీవు ఆయనకు మందిరాన్ని కట్టిస్తావు.

  12. 1 దినవృత్తాంతములు 22:12సుమారు క్రీ.పూ. 1017

    నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రాన్ని నీవు అనుసరించేలా ఆయన నిన్ను ఇశ్రాయేలీయుల మీద పాలకునిగా నియమించినప్పుడు, యెహోవా నీకు వివేకాన్ని జ్ఞానాన్ని ఆయన ఇచ్చును గాక.

  13. 1 దినవృత్తాంతములు 22:13సుమారు క్రీ.పూ. 1017

    అప్పుడు ఇశ్రాయేలీయుల గురించి యెహోవా మోషేకు ఇచ్చిన నియమనిబంధనలను నీవు జాగ్రత్తగా పాటిస్తే, నీవు విజయం సాధిస్తావు. ధైర్యంగా దృఢంగా ఉండు. భయపడకు, నిరుత్సాహపడకు.

  14. 1 దినవృత్తాంతములు 22:14సుమారు క్రీ.పూ. 1017

    “యెహోవా మందిరం కట్టడానికి కావలసిన వాటిని సమకూర్చడం కోసం నేను చాలా శ్రమపడ్డాను. దాని కోసం లక్ష తలాంతుల బంగారాన్ని, పది లక్షల తలాంతుల వెండిని, తూయలేనంత ఇత్తడిని, ఇనుమును సమకూర్చాను. చెక్క, రాళ్లు కూడా సమకూర్చాను. నీవింకా వాటికి కలుపవచ్చు.

  15. 1 దినవృత్తాంతములు 22:15సుమారు క్రీ.పూ. 1017

    నీ దగ్గర చాలామంది నైపుణ్యం కలిగిన పనివారు అనగా శిల్పకారులు, తాపీ పనివారు, వడ్రంగులు, అన్ని రకాల పనులు చేసేవారు,

  16. 1 దినవృత్తాంతములు 22:16సుమారు క్రీ.పూ. 1017

    బంగారం, వెండి, ఇత్తడి, ఇనుములతో పని చేసే శిల్పకారులు సంఖ్యకు మించి ఉన్నారు. కాబట్టి ఇక పని మొదలుపెట్టు. యెహోవా నీకు తోడుగా ఉండును గాక!”

  17. 1 దినవృత్తాంతములు 22:17సుమారు క్రీ.పూ. 1017

    తర్వాత తన కుమారుడైన సొలొమోనుకు సహాయం చేయాలని దావీదు ఇశ్రాయేలీయుల నాయకులందరికి ఆదేశించాడు.

  18. 1 దినవృత్తాంతములు 22:18సుమారు క్రీ.పూ. 1017

    అతడు వారితో ఇలా అన్నాడు, “మీ దేవుడైన యెహోవా మీతో ఉన్నారు కదా? అన్నివైపులా ఆయన మీకు విశ్రాంతి ఇచ్చారు కదా? ముందున్న దేశవాసులను ఆయన నా చేతికి అప్పగించారు కాబట్టి ఇప్పుడు దేశం యెహోవాకు, ఆయన ప్రజలకు స్వాధీనం అయింది.

  19. 1 దినవృత్తాంతములు 22:19సుమారు క్రీ.పూ. 1017

    ఇప్పుడు మనసారా మీ దేవుడైన యెహోవాను వెదకండి. యెహోవా నిబంధన మందసాన్ని, దేవుని సంబంధమైన పవిత్ర వస్తువులను, ఆయన పేరున కట్టబడే మందిరంలోకి చేర్చేటట్టు మీరు దేవుడైన యెహోవా పరిశుద్ధాలయాన్ని కట్టడం మొదలుపెట్టండి.”

  20. 1 దినవృత్తాంతములు 23:1సుమారు క్రీ.పూ. 1015

    దావీదు వృద్ధుడై వయస్సు నిండినవాడై ఉన్నప్పుడు, అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలు మీద రాజుగా నియమించాడు.

  21. 1 దినవృత్తాంతములు 23:2సుమారు క్రీ.పూ. 1015

    అతడు ఇశ్రాయేలు నాయకులందరిని, యాజకులను, లేవీయులను సమకూర్చాడు.

  22. 1 దినవృత్తాంతములు 23:3సుమారు క్రీ.పూ. 1015

    ముప్పై సంవత్సరాలు అంతకు పైవయస్సు లేవీయులు లెక్కించబడ్డారు. వారు మొత్తం ముప్పై ఎనిమిది వేలమంది మనుష్యులు.

  23. 1 దినవృత్తాంతములు 23:4సుమారు క్రీ.పూ. 1015

    దావీదు, “వీరిలో ఇరవైనాలుగు వేలమంది యెహోవా ఆలయ పని బాధ్యత తీసుకోవాలి, ఆరు వేలమంది అధికారులుగా, న్యాయాధిపతులుగా ఉండాలి.

  24. 1 దినవృత్తాంతములు 23:5సుమారు క్రీ.పూ. 1015

    నాలుగు వేలమంది ద్వారపాలకులుగా ఉండాలి, నాలుగు వేలమంది ఉద్దేశ్యం కలిగి నేను చేయించిన సంగీత వాయిద్యాలతో యెహోవాను కీర్తించాలి” అని చెప్పాడు.

  25. 1 దినవృత్తాంతములు 23:6సుమారు క్రీ.పూ. 1015

    లేవీ కుమారులైన గెర్షోను, కహాతు, మెరారి వంశాల ప్రకారం దావీదు లేవీయులను వేరుచేసి మూడు విభాగాలు చేశాడు.