కంటెంట్‌కు వెళ్లండి

circa 1380–1050 BC

The Judges & Ruth

Israel cycles through rebellion, oppression, and rescue under charismatic leaders—culminating in Ruth's faithful love story.

703 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. న్యాయాధిపతులు 18:17సుమారు క్రీ.పూ. 1406

    యాజకుడు, యుద్ధాయుధాలు ధరించిన ఆరువందలమంది ద్వారం దగ్గర నిలబడి ఉన్నప్పుడు, దేశాన్ని పరిశోధించడానికి వెళ్లిన ఆ అయిదుగురు మనుష్యులు లోనికి వెళ్లి విగ్రహాన్ని, ఏఫోదును గృహదేవతలను తీసుకున్నారు.

  2. న్యాయాధిపతులు 18:18సుమారు క్రీ.పూ. 1406

    ఆ అయిదుగురు మీకా ఇంట్లోకి వెళ్లి విగ్రహాన్ని, ఏఫోదును, గృహదేవతలను తీసుకున్నప్పుడు, ఆ యాజకుడు, “మీరు ఏం చేస్తున్నారు?” అని వారిని అడిగాడు.

  3. న్యాయాధిపతులు 18:19సుమారు క్రీ.పూ. 1406

    వారు అతనితో, “నోరు మూసుకో! ఒక్క మాట మాట్లాడకుండ మాతో వచ్చి మాకు తండ్రిగా యాజకునిగా ఉండు. ఒక మనిషి కుటుంబానికి మాత్రమే యాజకునిగా ఉండడం కంటే ఇశ్రాయేలులో ఒక గోత్రమంతటికి, కుటుంబానికి యాజకునిగా ఉండడం మంచిది కాదా?” అన్నారు.

  4. న్యాయాధిపతులు 18:20సుమారు క్రీ.పూ. 1406

    యాజకుడు చాలా సంతోషించాడు. అతడు ఏఫోదును, గృహదేవతలను, విగ్రహాన్ని తీసుకుని ఆ ప్రజలతో వెళ్లాడు.

  5. న్యాయాధిపతులు 18:21సుమారు క్రీ.పూ. 1406

    వారు తమ చిన్న పిల్లలను, పశువులను, ఆస్తులను ముందుగా పెట్టుకొని అక్కడినుండి బయలుదేరారు.

  6. న్యాయాధిపతులు 18:22సుమారు క్రీ.పూ. 1406

    వారు మీకా ఇంటి నుండి కొంత దూరం వెళ్లాక, మీకా పొరుగువారు సమకూడి దానీయుల వెంటపడ్డారు.

  7. న్యాయాధిపతులు 18:23సుమారు క్రీ.పూ. 1406

    వారు కేకలు వేస్తుండగా, దానీయులు తిరిగి మీకాను, “నీ మనుష్యులను పోరాడడానికి పిలిచావు, నీకేమి కావాలి?” అని అడిగారు.

  8. న్యాయాధిపతులు 18:24సుమారు క్రీ.పూ. 1406

    మీకా జవాబిస్తూ, “నేను చేసిన దేవుళ్ళను, నా యాజకుని మీరు తీసుకెళ్లారు. ఇక నా దగ్గర ఏముంది? ‘ఏంటి విషయం?’ అని నన్ను అడుగుతారేంటి?” అన్నాడు.

  9. న్యాయాధిపతులు 18:25సుమారు క్రీ.పూ. 1406

    దానీయులు అతనితో అన్నారు, “మాతో వాదించకు; కోపంతో మా మనుష్యుల్లో కొందరు నీపై దాడి చేసి నిన్ను నీ కుటుంబాన్ని చంపుతారు.”

  10. న్యాయాధిపతులు 18:26సుమారు క్రీ.పూ. 1406

    కాబట్టి దానీయులు తమ దారిన తాము వెళ్లిపోయారు. వారు అతనికంటే బలంగా ఉన్నారని గ్రహించి, మీకా తిరిగి తన ఇంటికి వెళ్లిపోయాడు.

  11. న్యాయాధిపతులు 18:27సుమారు క్రీ.పూ. 1406

    దానీయులు మీకా తయారుచేసుకున్న వాటిని, అతని యాజకుడిని తీసుకుని లాయిషుపై, సమాధాన భద్రతలతో ఉన్న ప్రజలను చేరుకున్నారు. వారిపై ఖడ్గంతో దాడి చేసి, పట్టణాన్ని తగలబెట్టారు.

  12. న్యాయాధిపతులు 18:28సుమారు క్రీ.పూ. 1406

    ఆ ప్రజలు సీదోనుకు దూరంగా ఉండడం, ఎవరితో సంబంధం లేకపోవడం చేత వారిని కాపాడే మనుష్యులే లేరు. ఆ పట్టణం బేత్-రెహోబు దగ్గర లోయలో ఉంది. దానీయులు ఆ పట్టణాన్ని పునర్నిర్మించి అక్కడ స్థిరపడ్డారు.

  13. న్యాయాధిపతులు 18:29సుమారు క్రీ.పూ. 1406

    దానికి ఇశ్రాయేలు కుమారుడైన దాను అని తమ పూర్వికుడైన దాను పేరు పెట్టారు; మొదట ఆ పట్టణం లాయిషు అని పిలువబడేది.

  14. న్యాయాధిపతులు 18:30సుమారు క్రీ.పూ. 1406

    అక్కడ దానీయులు తమ కోసం ఆ విగ్రహాన్ని నిలుపుకున్నారు. దేశం చెరగా అయ్యేవరకు, మోషే కుమారుడు గెర్షోము యొక్క కుమారుడైన యోనాతాను, అతని కుమారులు దాను గోత్రానికి యాజకులుగా ఉన్నారు.

  15. న్యాయాధిపతులు 18:31సుమారు క్రీ.పూ. 1406

    షిలోహులో దేవుని మందిరం ఉన్న కాలమంతా వారు మీకా చేసిన విగ్రహాన్ని పూజించారు.

  16. న్యాయాధిపతులు 19:1సుమారు క్రీ.పూ. 1406

    ఆ రోజుల్లో ఇశ్రాయేలుకు రాజు లేడు. అప్పుడు ఎఫ్రాయిం కొండ సీమలో మారుమూల ప్రాంతంలో నివసించే లేవీయుడు ఒకడు యూదాలోని బేత్లెహేముకు లో ఒక ఉంపుడుగత్తెను తెచ్చుకున్నాడు.

  17. న్యాయాధిపతులు 19:2సుమారు క్రీ.పూ. 1406

    కాని ఆ ఉంపుడుగత్తె ఒక నమ్మకద్రోహి. ఆమె అతన్ని వదిలి యూదా బేత్లెహేములోని తన తండ్రి ఇంటికి వెళ్లిపోయింది. అక్కడ ఆమె నాలుగు నెలలు ఉన్న తర్వాత,

  18. న్యాయాధిపతులు 19:3సుమారు క్రీ.పూ. 1406

    ఆమె భర్త తనను బ్రతిమాలి తీసుకువద్దామని ఆమె దగ్గరకు వెళ్లాడు. అతడు వెళ్తూ తనతో తన పనివాన్ని, రెండు గాడిదలను తీసుకెళ్లాడు. ఆమె అతన్ని తన తండ్రి ఇంట్లోకి తీసుకెళ్లినప్పుడు ఆమె తండ్రి అతన్ని చూసి సంతోషంగా అతన్ని ఆహ్వానించాడు.

  19. న్యాయాధిపతులు 19:4సుమారు క్రీ.పూ. 1406

    ఆమె తండ్రి అనగా అతని మామ అతన్ని ఉండమని బలవంతం చేశాడు; కాబట్టి అతడు మూడు రోజులు అతని దగ్గరే తింటూ, త్రాగుతూ, పడుకుంటూ అక్కడే ఉన్నాడు.

  20. న్యాయాధిపతులు 19:5సుమారు క్రీ.పూ. 1406

    నాలుగవ రోజు వారు ప్రొద్దున్నే లేచి లేవీయుడు వెళ్లడానికి సిద్ధపడ్డాడు కాని ఆమె తండ్రి తన అల్లుడితో, “భోజనం చేసి సేదతీరిన తర్వాత వెళ్లవచ్చు” అన్నాడు.

  21. న్యాయాధిపతులు 19:6సుమారు క్రీ.పూ. 1406

    కాబట్టి వారిద్దరు కూర్చుని కలిసి తిని త్రాగారు. తర్వాత ఆమె తండ్రి తన అల్లునితో, “దయచేసి ఈ రాత్రి సరదాగా గడుపు” అని అన్నాడు.

  22. న్యాయాధిపతులు 19:7సుమారు క్రీ.పూ. 1406

    ఆ మనుష్యుడు వెళ్లడానికి లేచినప్పుడు, తన మామ బలవంతం చేశాడు కాబట్టి అతడు ఆ రాత్రి అక్కడే ఉన్నాడు.

  23. న్యాయాధిపతులు 19:8సుమారు క్రీ.పూ. 1406

    అయిదవ రోజు ప్రొద్దున అతడు వెళ్లడానికి లేచినప్పుడు, ఆమె తండ్రి, “మధ్యాహ్నం వరకు ఉండి కొంచెం సేద తీర్చుకో” అన్నాడు. కాబట్టి వారిద్దరు కలిసి భోజనం చేశారు.

  24. న్యాయాధిపతులు 19:9సుమారు క్రీ.పూ. 1406

    తర్వాత అతడు తన ఉంపుడుగత్తె, తన పనివానితో కలిసి వెళ్లడానికి లేచినప్పుడు, అతని మామ, “ఇదిగో చూడు, సాయంత్రం అవుతుంది, రాత్రి ఇక్కడ గడిపి ప్రొద్దున్నే లేచి మీ దారిన మీ ఇంటికి వెళ్లవచ్చు” అన్నాడు.

  25. న్యాయాధిపతులు 19:10సుమారు క్రీ.పూ. 1406

    కాని ఇంకొక రాత్రి ఉండడానికి అతడు ఒప్పుకోకుండా తన ఉంపుడుగత్తెను తీసుకుని కట్టిన రెండు గాడిదలతో యెబూసు అనగా యెరూషలేము వైపు వెళ్లాడు.