- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1380–1050 BC
The Judges & Ruth
Israel cycles through rebellion, oppression, and rescue under charismatic leaders—culminating in Ruth's faithful love story.
ఈ కాలపు వచనాలు
- న్యాయాధిపతులు 19:11సుమారు క్రీ.పూ. 1406
వారు యెబూసును సమీపించినప్పటికి దాదాపు రోజు గడిచింది. పనివాడు తన యజమానితో, “ఈ యెబూసీయుల పట్టణంలో ఆగి ఈ రాత్రి గడుపుదాం” అన్నాడు.
- న్యాయాధిపతులు 19:12సుమారు క్రీ.పూ. 1406
తన యాజమాని జవాబిస్తూ, “లేదు, ఇశ్రాయేలీయులు కాని ఏ ప్రజల పట్టణంలోకి వెళ్లక మనం గిబియాకు వెళ్దాం” అన్నాడు.
- న్యాయాధిపతులు 19:13సుమారు క్రీ.పూ. 1406
“మనం గిబియాకు గాని రామాకు గాని చేరి ఒకచోట రాత్రి గడుపుదాం” అన్నాడు.
- న్యాయాధిపతులు 19:14సుమారు క్రీ.పూ. 1406
కాబట్టి వారు ముందుకు వెళ్తూ ఉండగా బెన్యామీనులోని గిబియాను చేరుకునేటప్పటికి సూర్యాస్తమయం అయ్యింది.
- న్యాయాధిపతులు 19:15సుమారు క్రీ.పూ. 1406
వారు ఆ రాత్రి గడపడానికి గిబియాలో ఆగారు. వారు వెళ్లి పట్టణం మధ్యలో కూర్చున్నారు కాని ఆ రాత్రి ఎవరూ వారిని తమ ఇంట్లోకి ఆహ్వానించలేదు.
- న్యాయాధిపతులు 19:16సుమారు క్రీ.పూ. 1406
ఆ సాయంత్రం గిబియాలో నివసిస్తున్న ఎఫ్రాయిం కొండ సీమకు చెందిన ఒక వృద్ధుడు పొలాల్లో పని ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్నాడు (ఆ పట్టణంలో నివసిస్తున్నవారు బెన్యామీనీయులు).
- న్యాయాధిపతులు 19:17సుమారు క్రీ.పూ. 1406
ఆ వృద్ధుడు ఊరి మధ్యలో ప్రయాణికున్ని చూసి, “మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడ నుండి వస్తున్నారు?” అని అడిగాడు.
- న్యాయాధిపతులు 19:18సుమారు క్రీ.పూ. 1406
అందుకతడు, “మేము యూదాలోని బేత్లెహేము నుండి ప్రయాణమై నేను నివసించే ఎఫ్రాయిం కొండసీమలో ఉన్న మారుమూల ప్రాంతానికి వెళ్తున్నాం, నేను అక్కడివాడను. నేను యూదాలోని బేత్లెహేముకు వెళ్లి వస్తున్నాను. ఇప్పుడు యెహోవా మందిరానికి వెళ్తున్నాను. ఎవరూ నన్ను ఇంటికి చేర్చుకోలేదు.
- న్యాయాధిపతులు 19:19సుమారు క్రీ.పూ. 1406
మా గాడిదలకు గడ్డి, ఎండుగడ్డి మేత మా దగ్గర ఉంది. నాకు మీ దాసికి, మాతో ఉన్న యువకుడికి రొట్టె, ద్రాక్షరసం కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మాకెలాంటి ఇబ్బంది లేదు” అన్నాడు.
- న్యాయాధిపతులు 19:20సుమారు క్రీ.పూ. 1406
ఆ వృద్ధుడు, “మీకు క్షేమం కలుగును గాక! మీరు మా ఇంటికి రండి, మీకు అవసరమైంది నేను చూసుకుంటాను. ఇలా రాత్రివేళ వీధిలో మాత్రం గడపకండి” అని అన్నాడు.
- న్యాయాధిపతులు 19:21సుమారు క్రీ.పూ. 1406
అతడు వారిని ఇంటికి తీసుకెళ్లి తమ గాడిదలకు మేత వేశాడు. వారు తమ కాళ్లు కడుక్కున్న తర్వాత భోజనపానీయాలు పుచ్చుకున్నారు.
- న్యాయాధిపతులు 19:22సుమారు క్రీ.పూ. 1406
అలా వారు ఆనందిస్తూ ఉండగా, ఆ పట్టణంలో ఉన్న కొందరు దుష్టులు ఆ ఇంటి చుట్టూ చేరి తలుపును తడుతూ ఆ ఇంటి యజమానియైన ఆ వృద్ధునితో, “నీ ఇంటికి వచ్చిన వ్యక్తిని బయటకు తీసుకురా, మేము అతనితో పడుకుంటాం” అని బిగ్గరగా అరిచారు.
- న్యాయాధిపతులు 19:23సుమారు క్రీ.పూ. 1406
అప్పుడు ఆ ఇంటి యజమాని బయటకు వెళ్లి వారితో అన్నాడు, “అలా అనవద్దు. నా సోదరులారా, అంత నీచానికి దిగజారకండి, ఈ మనిషి నా అతిథి కాబట్టి ఇంత అవమానకరమైన పని చేయవద్దు.
- న్యాయాధిపతులు 19:24సుమారు క్రీ.పూ. 1406
ఇదిగో, కన్యగా ఉన్న నా కుమార్తె అతని ఉంపుడుగత్తె ఉన్నారు, వారిని బయటకు తెస్తాను, మీరు వారిని వాడుకొని ఏమి చేయాలనుకుంటే అది చేసుకోండి. అయితే ఈ మనిషి పట్ల ఇంత అవమానకరమైన పని చేయకండి.”
- న్యాయాధిపతులు 19:25సుమారు క్రీ.పూ. 1406
అయితే ఆ మనుష్యులు అతని మాట వినలేదు. కాబట్టి ఆ మనుష్యుడు తన ఉంపుడుగత్తెను బయటకు వారి దగ్గరకు పంపాడు, వారు ఆమెను మానభంగం చేస్తూ, రాత్రంతా వేదిస్తూ ఉన్నారు. తెల్లవారినప్పుడు వారు ఆమెను వెళ్లనిచ్చారు.
- న్యాయాధిపతులు 19:26సుమారు క్రీ.పూ. 1406
ప్రొద్దున్నే ఆమె తన యజమాని ఉంటున్న ఇంటికి తిరిగివెళ్లి ద్వారం దగ్గర వెలుగు వచ్చేవరకు పడి ఉంది.
- న్యాయాధిపతులు 19:27సుమారు క్రీ.పూ. 1406
ప్రొద్దున ఆమె యజమాని లేచి, ఇంటి తలుపు తీసి తన దారిన వెళ్లడానికి బయటకు వచ్చి చూస్తే, అక్కడ ఇంటి ద్వార మార్గంలో తన ఉంపుడుగత్తె తన చేతులు గడప మీద పెట్టుకొని పడి ఉన్నది.
- న్యాయాధిపతులు 19:28సుమారు క్రీ.పూ. 1406
అతడు ఆమెతో అన్నాడు, “లే, మనం వెళ్దాము.” అయితే ఆమె నుండి జవాబు రాలేదు. అప్పుడు ఆ మనిషి ఆమెను తన గాడిద మీద ఉంచి ఇంటికి బయలుదేరాడు.
- న్యాయాధిపతులు 19:29సుమారు క్రీ.పూ. 1406
అతడు ఇంటికి చేరుకుని ఒక కత్తి తీసుకుని తన ఉంపుడుగత్తెను పన్నెండు ముక్కలుగా ఏ అవయవానికి ఆ అవయవం కోసి, ఇశ్రాయేలీయుల ప్రాంతాలన్నిటికీ పంపాడు.
- న్యాయాధిపతులు 19:30సుమారు క్రీ.పూ. 1406
అది చూసినవారందరు, “ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి వచ్చిన రోజు నుండి ఇంతవరకు ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు. ఈ విషయమై ఆలోచించండి! మనం ఏమి చేయాలో తెలుపండి!” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.
- న్యాయాధిపతులు 20:1సుమారు క్రీ.పూ. 1406
అప్పుడు ఇశ్రాయేలీయులందరు, దాను నుండి బెయేర్షేబ వరకు ఉన్నవారు, గిలాదు ప్రదేశంలో ఉన్నవారు, అంతా ఏకమై మిస్పా దగ్గర యెహోవా సన్నిధిలో సమావేశమయ్యారు.
- న్యాయాధిపతులు 20:2సుమారు క్రీ.పూ. 1406
ఇశ్రాయేలు గోత్రాలన్నిటి నాయకులు, నాలుగు లక్షలమంది ఆయుధాలు కలిగి దేవుని ప్రజల సమావేశానికి హాజరయ్యారు.
- న్యాయాధిపతులు 20:3సుమారు క్రీ.పూ. 1406
ఇశ్రాయేలీయులు మిస్పాకు వెళ్లారని బెన్యామీనీయులు విన్నారు. అప్పుడు ఇశ్రాయేలీయులు, “ఈ నీచమైన పని ఎలా జరిగిందో మాకు చెప్పండి” అన్నారు.
- న్యాయాధిపతులు 20:4సుమారు క్రీ.పూ. 1406
చంపబడిన స్త్రీ భర్తయైన లేవీయుడు మాట్లాడుతూ అన్నాడు, “నేను, నా ఉంపుడుగత్తె రాత్రి గడుపుదామని బెన్యామీనులోని గిబియాకు వచ్చాము.
- న్యాయాధిపతులు 20:5సుమారు క్రీ.పూ. 1406
రాత్రివేళ గిబియా నాయకులు నా వెంటపడి నన్ను చంపాలనుకొని ఇంటిని చుట్టుముట్టారు. వారు నా ఉంపుడుగత్తెను మానభంగం చేయగా ఆమె చనిపోయింది.