కంటెంట్‌కు వెళ్లండి

circa 1380–1050 BC

The Judges & Ruth

Israel cycles through rebellion, oppression, and rescue under charismatic leaders—culminating in Ruth's faithful love story.

703 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. న్యాయాధిపతులు 20:31సుమారు క్రీ.పూ. 1406

    వారిని ఎదిరించడానికి బెన్యామీనీయులు బయటకు వచ్చి వారిని తరుముతూ పట్టణం నుండి దూరంగా వెళ్లారు. మునుపటిలా వారు ఇశ్రాయేలీయులలో గాయపడిన వారిని చంపడం మొదలుపెట్టి, బేతేలుకు గిబియాకు వెళ్లే రహదారుల్లో, మైదానాల్లో సుమారు ముప్పైమంది ఇశ్రాయేలీయులు చనిపోయారు.

  2. న్యాయాధిపతులు 20:32సుమారు క్రీ.పూ. 1406

    “మునుపటిలా మనం వారిని ఓడిస్తున్నాం” అని బెన్యామీనీయులు అనేటప్పుడు ఇశ్రాయేలీయులు, “మనం పరుగెత్తి వారు తమ పట్టణం నుండి బయటకు వచ్చేలా చేద్దాం” అని చెప్పుకున్నారు.

  3. న్యాయాధిపతులు 20:33సుమారు క్రీ.పూ. 1406

    ఇశ్రాయేలు వారందరు తామున్న చోట్ల నుండి బయలుదేరి బయల్-తామారు దగ్గర బారులు తీరారు. అప్పుడు మాటున ఉన్న ఇశ్రాయేలీయులు తమ స్థలం నుండి గెబాకు పడమటి వైపు నుండి దాడి చేశారు.

  4. న్యాయాధిపతులు 20:34సుమారు క్రీ.పూ. 1406

    అప్పుడు ఇశ్రాయేలీయులలో పదివేలమంది శూరులైన యువకులు గిబియా ఎదురుగా వచ్చి దాడి చేశారు. యుద్ధం ఎంతో తీవ్రంగా ఉండడంతో బెన్యామీనీయులు తమకు ఆపద రాబోతుందని గ్రహించలేదు.

  5. న్యాయాధిపతులు 20:35సుమారు క్రీ.పూ. 1406

    యెహోవా ఇశ్రాయేలీయుల చేతిలో బెన్యామీనీయులను ఓడించారు. ఆ రోజు ఇశ్రాయేలీయులు 25,100 మంది బెన్యామీనీయులను చంపారు. వారంతా కత్తి పట్టినవారే.

  6. న్యాయాధిపతులు 20:36సుమారు క్రీ.పూ. 1406

    అప్పుడు తాము ఓటమి పాలయ్యామని బెన్యామీనీయులు తెలుసుకున్నారు. ఇశ్రాయేలీయులు తాము గిబియా మీద పెట్టిన మాటుగాండ్రను నమ్మి బెన్యామీనీయులకు దారి ఇచ్చారు.

  7. న్యాయాధిపతులు 20:37సుమారు క్రీ.పూ. 1406

    మాటులో ఉన్నవారు గిబియాలో అకస్మాత్తుగా చొరబడి వారు పట్టణంలోని వారందరిని ఖడ్గంతో చంపారు.

  8. న్యాయాధిపతులు 20:38సుమారు క్రీ.పూ. 1406

    పట్టణంలో నుండి పెద్ద మేఘంలా పొగను రాజేయాలని మాటున దాక్కున్న వారికి ఇశ్రాయేలీయులకు మధ్య సంకేతం ఏర్పాటు చేసుకున్నారు,

  9. న్యాయాధిపతులు 20:39సుమారు క్రీ.పూ. 1406

    అప్పుడు ఇశ్రాయేలీయులు తిరిగి యుద్ధం చేశారు. బెన్యామీనీయులు ఇశ్రాయేలీయులకు (దాదాపు ముప్పైమందిని) ప్రాణనష్టం కలిగిస్తూ, “మొదటి యుద్ధంలా మనం వారిని ఓడిస్తున్నాం” అని అన్నారు.

  10. న్యాయాధిపతులు 20:40సుమారు క్రీ.పూ. 1406

    అయితే పట్టణంలో నుండి పొగ పైకి లేవడం ఆరంభమైనప్పుడు, బెన్యామీనీయులు పట్టణమంతా ఆకాశం వైపు వెళ్తున్న పొగను చూశారు.

  11. న్యాయాధిపతులు 20:41సుమారు క్రీ.పూ. 1406

    అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదురు దాడి చేశారు, విపత్తు తమను సమీపించిందని తెలుసుకొని బెన్యామీనీయులు హడలిపోయారు.

  12. న్యాయాధిపతులు 20:42సుమారు క్రీ.పూ. 1406

    కాబట్టి వారు ఇశ్రాయేలీయుల నుండి అరణ్యం వైపు పారిపోయారు, కానీ వారు యుద్ధం తప్పించుకోలేకపోయారు. పట్టణాల్లో నుండి వచ్చిన ఇశ్రాయేలీయులు వారిని అక్కడ హతం చేశారు.

  13. న్యాయాధిపతులు 20:43సుమారు క్రీ.పూ. 1406

    వారు బెన్యామీనీయులను చట్టుముట్టి ఆగకుండా వారిని తరిమి గిబియాకు తూర్పుదిక్కు ప్రాంతం దగ్గర ఓడించారు.

  14. న్యాయాధిపతులు 20:44సుమారు క్రీ.పూ. 1406

    పద్దెనిమిది వేలమంది బెన్యామీనీయులు పడిపోయారు, వారంతా యుద్ధవీరులు.

  15. న్యాయాధిపతులు 20:45సుమారు క్రీ.పూ. 1406

    మిగిలిన వారు అరణ్యం వైపు, రిమ్మోను బండ వైపు పారిపోతున్నప్పుడు, ఇశ్రాయేలీయులు రహదారుల వెంట అయిదువేల మందిని హతం చేశారు. వారింకా బెన్యామీనీయులను గిదోము వరకు తరుముతూ ఇంకొక రెండువేలమందిని హతం చేశారు.

  16. న్యాయాధిపతులు 20:46సుమారు క్రీ.పూ. 1406

    ఆ రోజు ఇరవై అయిదువేల బెన్యామీనీయులు కూలారు. వారంతా యుద్ధవీరులు.

  17. న్యాయాధిపతులు 20:47సుమారు క్రీ.పూ. 1406

    అయితే వారిలో ఆరువందలమంది మాత్రం తప్పించుకు వెళ్లి అరణ్యంలో ఉన్న రిమ్మోను బండ దగ్గరకు పారిపోయి అక్కడ నాలుగు నెలలు ఉండిపోయారు.

  18. న్యాయాధిపతులు 20:48సుమారు క్రీ.పూ. 1406

    ఇశ్రాయేలీయులు బెన్యామీను ప్రదేశానికి తిరగి వెళ్లి పట్టణాల మీద పడి పశువులను, కనిపించిన దాన్నంతా ఖడ్గంతో హతం చేశారు. వారికి కనబడిన ప్రతి పట్టణాన్ని తగుల బెట్టారు.

  19. న్యాయాధిపతులు 21:1సుమారు క్రీ.పూ. 1406

    ఇశ్రాయేలీయులు మిస్పాలో, “మనలో ఎవ్వరూ బెన్యామీనీయులకు తమ కుమార్తెలను పెళ్ళికి ఇవ్వకూడదు” అని ప్రమాణం చేసుకున్నారు.

  20. న్యాయాధిపతులు 21:2సుమారు క్రీ.పూ. 1406

    ప్రజలు బేతేలుకు వెళ్లి అక్కడ సాయంత్రం వరకు దేవుని సన్నిధిలో కూర్చుని ఎంతగానో ఏడ్చారు.

  21. న్యాయాధిపతులు 21:3సుమారు క్రీ.పూ. 1406

    “యెహోవా! ఇశ్రాయేలు దేవా! ఇశ్రాయేలుకు ఇలా ఎందుకు జరిగింది? ఈ రోజు ఇశ్రాయేలు గోత్రాల్లో ఎందుకని ఒక గోత్రం అంతరించిపోవలసి వచ్చింది?” అంటూ ఏడ్చారు.

  22. న్యాయాధిపతులు 21:4సుమారు క్రీ.పూ. 1406

    మరుసటిరోజు ప్రొద్దున్నే వారు ఒక బలిపఠం కట్టి దాని మీద దహనబలులు, సమాధానబలులు అర్పించారు.

  23. న్యాయాధిపతులు 21:5సుమారు క్రీ.పూ. 1406

    అప్పుడు ఇశ్రాయేలీయులు, “ఇశ్రాయేలు గోత్రాలన్నిటిలో ఎవరైనా మిస్పాలో యెహోవా ఎదుట సమావేశం కాని వారున్నారా?” అని అడిగారు. ఎందుకంటే ఎవరైనా మిస్పాలో యెహోవా ఎదుట సమావేశం కాకపోతే వారికి మరణశిక్ష విధించాలని శపథం చేశారు.

  24. న్యాయాధిపతులు 21:6సుమారు క్రీ.పూ. 1406

    అప్పుడు వారు తమ తోటి ఇశ్రాయేలీయులైన బెన్యామీను గోత్రం గురించి బాధపడుతూ, “ఇశ్రాయేలులో ఈ రోజు ఒక గోత్రం అంతరించి పోయింది.

  25. న్యాయాధిపతులు 21:7సుమారు క్రీ.పూ. 1406

    వారికి మన కుమార్తెలను ఇవ్వవద్దని మనం యెహోవా పేరట శపథం చేశాం, మరి మిగిలిన వారికి భార్యలను ఎక్కడ చూడగలం?” అనుకున్నారు.