- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1380–1050 BC
The Judges & Ruth
Israel cycles through rebellion, oppression, and rescue under charismatic leaders—culminating in Ruth's faithful love story.
ఈ కాలపు వచనాలు
- న్యాయాధిపతులు 21:8సుమారు క్రీ.పూ. 1406
తర్వాత వారు, “ఇశ్రాయేలు గోత్రాలన్నిటిలో నుండి మిస్పాలో యెహోవా ఎదుట సమావేశం కాని గోత్రమేది?” అని అడిగారు. చివరకు యాబేషు గిలాదు నుండి ఎవ్వరూ సమావేశానికి రాలేదని తెలుసుకున్నారు.
- న్యాయాధిపతులు 21:9సుమారు క్రీ.పూ. 1406
ప్రజలందరినీ లెక్కపెట్టినప్పుడు, యాబేషు గిలాదు నుండి ఏ ఒక్కరూ అక్కడ కనిపించలేదు.
- న్యాయాధిపతులు 21:10సుమారు క్రీ.పూ. 1406
అప్పుడు సమాజం పన్నెండువేలమంది యుద్ధవీరులను యాబేషు గిలాదుకు పంపతూ, అక్కడికి వెళ్లి అక్కడి వారినందరిని, స్త్రీలు పిల్లలతో సహితం ఖడ్గంతో చంపాలని ఆదేశించారు.
- న్యాయాధిపతులు 21:11సుమారు క్రీ.పూ. 1406
వారు, “మీరు ఏం చేయాలంటే, ప్రతి పురుషుని, కన్య కాని ప్రతి స్త్రీని నాశనం చేయండి” అని వారు అన్నారు.
- న్యాయాధిపతులు 21:12సుమారు క్రీ.పూ. 1406
వారు అక్కడ యాబేషు గిలాదు ప్రజల్లో పురుషులతో పడుకోని నాలుగువందలమంది యువతులను కనుగొన్నారు, వారిని కనానులోని షిలోహు దగ్గర ఉన్న శిబిరానికి తీసుకెళ్లారు.
- న్యాయాధిపతులు 21:13సుమారు క్రీ.పూ. 1406
అప్పుడు సమాజమంతా రిమ్మోను బండ దగ్గర ఉన్న బెన్యామీనీయులతో సమాధానపడదాం అని కబురు పంపారు.
- న్యాయాధిపతులు 21:14సుమారు క్రీ.పూ. 1406
ఆ సమయంలో బెన్యామీనీయులు తిరిగి వచ్చారు, యాబేషు గిలాదు స్త్రీలలో బ్రతకనిచ్చినవారిని వారికిచ్చి పెళ్ళిళ్ళు చేశారు. అయితే వారందరికీ ఆ స్త్రీలు సరిపోలేదు.
- న్యాయాధిపతులు 21:15సుమారు క్రీ.పూ. 1406
యెహోవా ఇశ్రాయేలు గోత్రాల్లో లోపం కలుగజేశారని ప్రజలు బెన్యామీను విషయం బాధపడ్డారు.
- న్యాయాధిపతులు 21:16సుమారు క్రీ.పూ. 1406
అప్పుడు సమాజపెద్దలు, “బెన్యామీను గోత్రంలో స్త్రీలు లేకుండా నాశనమై పోయినందుకు, వారిలో మిగిలిన వారిని భార్యలను ఎలా తేగలం?
- న్యాయాధిపతులు 21:17సుమారు క్రీ.పూ. 1406
ఇశ్రాయేలు గోత్రాల్లో ఒక గోత్రం తుడిచిపెట్టుకుపోకుండ బెన్యామీను గోత్రంలో మిగిలిన వారికి వారసులుండాలి.
- న్యాయాధిపతులు 21:18సుమారు క్రీ.పూ. 1406
వారికి మన కుమార్తెలను భార్యలుగా ఇవ్వలేం, ఎందుకంటే ఇశ్రాయేలీయులమైన మనం, ‘ఎవరైనా బెన్యామీనీయునికి తమ కుమార్తెను భార్యగా ఇస్తే వారు శాపగ్రస్తులు’ అని ప్రమాణం చేశాము.
- న్యాయాధిపతులు 21:19సుమారు క్రీ.పూ. 1406
అయితే చూడండి, షిలోహులో యెహోవాకు సంవత్సర పండుగ జరుగుతుంది; షిలోహు బేతేలుకు ఉత్తరాన, బేతేలు నుండి షెకెముకు వెళ్లే దారికి తూర్పున, లెబోనాకు దక్షిణాన ఉన్న షిలోహులో యెహోవాకు సంవత్సర పండుగ జరుగుతుంది” అని అన్నారు.
- న్యాయాధిపతులు 21:20సుమారు క్రీ.పూ. 1406
అప్పుడు వారు బెన్యామీనీయులను ఇలా ఆదేశించారు: “అక్కడికి వెళ్లి ద్రాక్షతోటల్లో దాక్కుని
- న్యాయాధిపతులు 21:21సుమారు క్రీ.పూ. 1406
వేచి ఉండండి. షిలోహు నుండి యువతులు నాట్యంలో పాల్గొనడానికి వస్తున్నప్పుడు, మీరు ద్రాక్షతోటల్లో నుండి త్వరగా వచ్చి, ప్రతివాడును షిలోహు యువతులలో ఒక యువతిని పెళ్ళి చేసుకోడానికి తీసుకెళ్లండి. తర్వాత బెన్యామీను ప్రదేశానికి తిరిగి వెళ్లండి.
- న్యాయాధిపతులు 21:22సుమారు క్రీ.పూ. 1406
వారి తండ్రులు గాని సోదరులు గాని మా దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేస్తే, మేము వారితో, ‘యుద్ధ సమయంలో వారికి మేము భార్యలను తీసుకురాలేదు, కాబట్టి మీరు మా పట్ల దయచూపి వారికి సహాయం చెయ్యండి. మీ అంతట మీరు మీ కుమార్తెలను వారికివ్వలేదు, కాబట్టి మీరు ప్రమాణం విషయంలో అపరాధులు కారు’ అని చెప్తాము.”
- న్యాయాధిపతులు 21:23సుమారు క్రీ.పూ. 1406
కాబట్టి బెన్యామీనీయులు అలాగే చేశారు. యువతులు నాట్యం చేస్తూ ఉంటే, ఒక్కొక్కడు ఒక్కొక్క యువతిని పట్టుకుని తనకు భార్యగా చేసుకున్నాడు. తర్వాత వారు తమ వారసత్వ భూమికి తిరిగివెళ్లి పట్టణాలను మళ్ళీ కట్టి వాటిలో స్థిరపడ్డారు.
- న్యాయాధిపతులు 21:24సుమారు క్రీ.పూ. 1406
ఆ తర్వాత ఇశ్రాయేలీయులలో ప్రతి ఒక్కరు అక్కడినుండి తమ తమ గోత్రాలకు, వంశాలకు, తమ వారసత్వ భూమికి వెళ్లిపోయారు.
- న్యాయాధిపతులు 21:25సుమారు క్రీ.పూ. 1406
ఆ రోజుల్లో ఇశ్రాయేలుకు రాజు లేడు; ప్రతి ఒక్కరూ తమకు సరియైనదని అనిపించింది చేసేవారు.
న్యాయాధిపతులు పరిపాలించిన రోజుల్లో దేశంలో కరువు వచ్చింది. కాబట్టి యూదాలోని బేత్లెహేము నుండి ఒక వ్యక్తి తన భార్యను, తన ఇద్దరు కుమారులను తీసుకుని, మోయాబు దేశంలో కొంతకాలం ఉండడానికి వెళ్లాడు.
అతని పేరు ఎలీమెలెకు, అతని భార్యపేరు నయోమి, అతని ఇద్దరు కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదాలోని బేత్లెహేము వాసులైన ఎఫ్రాతీయులు. వారు మోయాబుకు వెళ్లి అక్కడ నివసించారు.
కొంతకాలం తర్వాత నయోమి భర్త ఎలీమెలెకు చనిపోయాడు. ఆమె, తన ఇద్దరు కుమారులు మిగిలారు.
వారు మోయాబు స్త్రీలను పెళ్ళి చేసుకున్నారు, వారిలో ఒకామె పేరు ఓర్పా, మరో ఆమె పేరు రూతు. వారు దాదాపు పది సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత,
- రూతు 1:5సుమారు క్రీ.పూ. 1308
మహ్లోను కిల్యోను ఇద్దరు చనిపోయారు. నయోమి, తన భర్తను ఇద్దరు కుమారులను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయింది.
- రూతు 1:6సుమారు క్రీ.పూ. 1308
యెహోవా తన ప్రజలకు ఆహారం ఇవ్వడానికి వారిని దర్శించారని నయోమి విన్నప్పుడు, ఆమె, తన ఇద్దరు కోడళ్ళతో కలిసి మోయాబు విడిచి స్వదేశానికి వెళ్లడానికి సిద్ధపడింది.
- రూతు 1:7సుమారు క్రీ.పూ. 1308
తన ఇద్దరు కోడళ్ళతో కలిసి తాను ఉంటున్న స్థలం విడిచి యూదా దేశానికి వెళ్లే మార్గంలో బయలుదేరింది.