- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1380–1050 BC
The Judges & Ruth
Israel cycles through rebellion, oppression, and rescue under charismatic leaders—culminating in Ruth's faithful love story.
ఈ కాలపు వచనాలు
- రూతు 2:11సుమారు క్రీ.పూ. 1307
అందుకు బోయజు ఆమెతో అన్నాడు, “నీ భర్త చనిపోయిన తర్వాత నీ అత్తకు నీవు చేసినదంతా అనగా ఎలా నీవు నీ తండ్రిని తల్లిని, నీ కుటుంబాన్ని, నీ స్వదేశాన్ని విడిచి ఇంతకుముందు నీకు తెలియని ఈ ప్రజల మధ్యకు వచ్చావో నేను విన్నాను.
- రూతు 2:12సుమారు క్రీ.పూ. 1307
యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును గాక. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చావు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును గాక.”
- రూతు 2:13సుమారు క్రీ.పూ. 1307
అందుకు ఆమె, “నా ప్రభువా, నేను మీ పనివారిలో ఒకదాన్ని కానప్పటికి, మీరు నన్నాదరించి దయతో మాట్లాడారు. నేను మీ దృష్టిలో దయ సంపాదించుకోవడం కొనసాగాలి” అన్నది.
- రూతు 2:14సుమారు క్రీ.పూ. 1307
భోజన సమయంలో బోయజు ఆమెతో, “నీవిక్కడికి రా, భోజనం చేసి, పులిసిన ద్రాక్షరసంలో రొట్టె ముంచి తిను” అన్నాడు. ఆమె పనివారితో కూర్చున్నప్పుడు, అతడు ఆమెకు కాల్చిన ధాన్యం కొంత ఇచ్చాడు. ఆమె తృప్తిగా తిని కొంత మిగిల్చింది.
- రూతు 2:15సుమారు క్రీ.పూ. 1307
ఆమె ఏరుకోడానికి లేచినప్పుడు, బోయజు తన మగ పనివారితో, “ఆమె పనల మధ్య ఏరుకోనివ్వండి, ఆమెను అభ్యంతర పెట్టకండి.
- రూతు 2:16సుమారు క్రీ.పూ. 1307
ఆమె కోసం కొన్ని కంకులు పనల నుండి పడేయండి, ఆమె వాటిని ఏరుకునేలా విడిచిపెట్టండి, ఆమెను గద్దించకండి” అని అంటూ హెచ్చరించాడు.
- రూతు 2:17సుమారు క్రీ.పూ. 1307
కాబట్టి రూతు సాయంత్రం వరకు పరిగె ఏరుకుంది. తర్వాత తాను సేకరించుకున్న యవలను దుళ్లగొట్టింది, అది దాదాపు తూమెడు అయ్యింది.
- రూతు 2:18సుమారు క్రీ.పూ. 1307
ఆమె వాటిని పట్టణానికి తీసుకెళ్లింది, తన అత్త ఆమె ఎంత సేకరించిందో చూసింది. రూతు తాను తృప్తిగా తిన్న తర్వాత మిగిలిన దానిని కూడ తెచ్చి ఆమెకు ఇచ్చింది.
- రూతు 2:19సుమారు క్రీ.పూ. 1307
ఆమె అత్త ఆమెతో, “ఈ రోజు నీవెక్కడ ఏరుకున్నావు? ఎక్కడ పని చేశావు? నిన్ను గమనించిన మనిషి ధన్యుడు!” అని అన్నది. అప్పుడు రూతు ఆమె ఏ స్థలంలో పని చేస్తూ ఉన్నదో చెప్తూ, “నేను బోయజు అని పేరుగల మనిషి దగ్గర ఈ రోజు పని చేశాను” అన్నది.
- రూతు 2:20సుమారు క్రీ.పూ. 1307
నయోమి తన కోడలితో, “యెహోవా అతన్ని ఆశీర్వదించును గాక! అతడు బ్రతికి ఉన్నవారికి, చచ్చినవారికి దయ చూపడం మానలేదు” అన్నది. “ఆ మనుష్యుడు మనకు సమీపబంధువు; అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడు” అని కూడా చెప్పింది.
- రూతు 2:21సుమారు క్రీ.పూ. 1307
అప్పుడు మోయాబీయురాలైన రూతు అన్నది, “అతడు నాతో, ‘నా పనివారు పంటంతా కోసే వరకు వారితో ఇక్కడే ఉండు’ అని కూడా అన్నాడు.”
- రూతు 2:22సుమారు క్రీ.పూ. 1307
నయోమి తన కోడలైన రూతుతో, “నా కుమారీ, అతని పనికత్తెలతోనే వెళ్లడం మంచిది, ఎందుకంటే ఇతరుల పొలంలో నీకు హాని కలుగవచ్చు” అని అన్నది.
- రూతు 2:23సుమారు క్రీ.పూ. 1307
కాబట్టి రూతు పరిగె ఏరుకోడానికి, యవల కోత గోధుమల కోత ముగిసేవరకు బోయజు పనికత్తెలకు దగ్గరగా ఉంది. ఆమె తన అత్తతో నివసించింది.
- రూతు 3:1సుమారు క్రీ.పూ. 1307
ఒక రోజు రూతు అత్తయైన నయోమి, “నా కుమారీ, నేను నీకోసం ఒక ఇంటిని వెదకాలి, అక్కడ నీకు మంచి జరుగుతుంది.
- రూతు 3:2సుమారు క్రీ.పూ. 1307
నీవు ఎవరి పనికత్తెలతో పని చేస్తున్నావో, ఆ బోయజు మనకు బంధువు. ఈ రాత్రి అతడు నూర్పిడి కళ్ళంలో యవలు చెరిగిస్తూ ఉంటాడు.
- రూతు 3:3సుమారు క్రీ.పూ. 1307
నీవు స్నానం చేసి నూనె రాసుకుని మంచి బట్టలు కట్టుకుని ఆ నూర్పిడి కళ్ళం దగ్గరకు వెళ్లు. అతడు భోజనం చేసే వరకు నీవు అక్కడ ఉన్నావని అతనికి తెలియనీయకు.
- రూతు 3:4సుమారు క్రీ.పూ. 1307
అతడు పడుకున్నప్పుడు అతడు పడుకున్న స్థలం గమనించు. తర్వాత లోపలికి వెళ్లి, అతని కాళ్లమీద ఉన్న బట్ట తీసి పడుకో. నీవు ఏం చేయాలో అతడు నీకు చెప్తాడు” అని చెప్పింది.
- రూతు 3:5సుమారు క్రీ.పూ. 1307
అందుకు రూతు, “నీవు చెప్పింది నేను చేస్తాను” అని జవాబిచ్చింది.
- రూతు 3:6సుమారు క్రీ.పూ. 1307
కాబట్టి ఆమె ఆ నూర్పిడి కళ్ళం దగ్గరకు వెళ్లి, తన అత్త చెప్పినదంతా చేసింది.
- రూతు 3:7సుమారు క్రీ.పూ. 1307
బోయజు తృప్తిగా భోజనం చేసి పడుకోడానికి ధాన్యం కుప్ప దగ్గరకు వెళ్లాడు. రూతు మెల్లగా వెళ్లి, అతని కాళ్ల మీదున్న దుప్పటి తీసి పడుకుంది.
- రూతు 3:8సుమారు క్రీ.పూ. 1307
మధ్యరాత్రి అతడు ఉలిక్కిపడి తిరిగి చూసినప్పుడు, ఒక స్త్రీ అతని కాళ్ల దగ్గర పడుకుని కనిపించింది.
- రూతు 3:9సుమారు క్రీ.పూ. 1307
“ఎవరు నీవు?” అని అతడు అడిగాడు. రూతు జవాబిస్తూ, “నేను రూతును, మీ దాసురాలిని, మీరు నన్ను విడిపించగల సమీపబంధువు కాబట్టి నా మీద మీ వస్త్రం కప్పండి” అన్నది.
- రూతు 3:10సుమారు క్రీ.పూ. 1307
అతడు, “నా కుమారీ, యెహోవా నిన్ను దీవించును గాక. నీవు చూపించే ఈ మంచితనం ఇంతకుముందు కన్నా ఇంకా గొప్పది: ధనికులైనా పేదలైనా సరే, నీవు ఏ యువకుల వెంటపడలేదు.
- రూతు 3:11సుమారు క్రీ.పూ. 1307
నా కుమారీ, భయపడకు. నీవు అడిగినదంతా నీకు చేస్తాను. నీవు గుణవతివని నా పట్టణంలో ఉన్న ప్రజలందరికి తెలుసు.
- రూతు 3:12సుమారు క్రీ.పూ. 1307
నేను నిన్ను విడిపించగల సమీపబంధువును అనే సంగతి నిజమే కాని, నా కంటే సమీపబంధువు ఒకడు ఉన్నాడు.