- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1380–1050 BC
The Judges & Ruth
Israel cycles through rebellion, oppression, and rescue under charismatic leaders—culminating in Ruth's faithful love story.
ఈ కాలపు వచనాలు
- న్యాయాధిపతులు 16:11సుమారు క్రీ.పూ. 1120
అప్పుడు సంసోను, “ఎవరైనా నన్ను ఎప్పుడు వాడని క్రొత్త త్రాళ్లతో కట్టేస్తే, నేను ఇతర మనుష్యుల్లా బలహీనమవుతాను” అని జవాబిచ్చాడు.
- న్యాయాధిపతులు 16:12సుమారు క్రీ.పూ. 1120
కాబట్టి దెలీలా క్రొత్త త్రాళ్లు తెచ్చి వాటితో అతన్ని కట్టేసి గదిలో మనుష్యులతో దాక్కొని ఉండగా, “సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదికి వచ్చారు!” అని చెప్పింది. అయితే అతడు త్రాళ్లను నూలుపోగుల వలె తెంపేశాడు.
- న్యాయాధిపతులు 16:13సుమారు క్రీ.పూ. 1120
అప్పుడు దెలీలా సంసోనుతో, “అప్పుడు దెలీలా సంసోనుతో, ఈసారి కూడా నీవు నన్ను మోసం చేసి అబద్ధం చెప్పావు. నిన్ను ఎలా బంధించవచ్చో చెప్పు” అని అన్నది. అతడు జవాబిస్తూ, “బహుశ నా జుట్టును ఏడు జడలుగా మగ్గంతో అల్లితే వాటిని అనపసూదితో కట్టేస్తే నేను అందరు మనుష్యుల్లా బలహీనుడను అయిపోతాను” అని అన్నాడు కాబట్టి అతడు పడుకున్నప్పుడు దెలీలా అతని జుట్టును ఏడు జడలుగా మగ్గంతో అల్లి,
- న్యాయాధిపతులు 16:14సుమారు క్రీ.పూ. 1120
మేకు పెట్టి బిగించింది. అప్పుడు సంసోనుతో, “సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదికి వచ్చారు!” అని అనగానే అతడు నిద్ర మేల్కొని అనపసూదిని మగ్గాన్ని లాగివేశాడు.
- న్యాయాధిపతులు 16:15సుమారు క్రీ.పూ. 1120
అప్పుడు ఆమె, “నామీద నమ్మకం లేకుండా నిన్ను ప్రేమిస్తున్నానని ఎలా చెప్తావు? నీ గొప్ప బలం యొక్క రహస్యం నాకు చెప్పకుండా నన్ను మోసం చేయడం ఇది మూడవసారి” అని అన్నది.
- న్యాయాధిపతులు 16:16సుమారు క్రీ.పూ. 1120
ఇలా ఆమె ప్రతిరోజు అతన్ని వేధించడంతో అతడు చస్తే బాగుండేది అనుకున్నాడు.
- న్యాయాధిపతులు 16:17సుమారు క్రీ.పూ. 1120
అతడు ఆమెకు మొత్తం చెప్పేశాడు, “నేను పుట్టినప్పటి నుండి దేవునికి నాజీరుగా ప్రతిష్ఠించబడ్డాను. నా తలమీద ఇంతవరకు ఎన్నడు మంగల కత్తి పడలేదు. నా తలవెంట్రుకలు పూర్తిగా తీసివేస్తే నా బలం తొలగిపోయి నేను అందరు మనుష్యుల్లా బలహీనమవుతాను” అని చెప్పాడు.
- న్యాయాధిపతులు 16:18సుమారు క్రీ.పూ. 1120
అతడు తనకు మొత్తం చెప్పాడని దెలీలా గ్రహించి, ఫిలిష్తీ నాయకులకు, “మరోసారి మీరు రండి; అతడు నాకు మొత్తం చెప్పాడు” అని కబురు పంపింది. కాబట్టి ఫిలిష్తీయుల నాయకులు తమతో వెండిని తీసుకువచ్చారు.
- న్యాయాధిపతులు 16:19సుమారు క్రీ.పూ. 1120
ఆమె తన తొడ మీద అతన్ని నిద్రబుచ్చి ఒకని పిలిపించి, సంసోను ఏడు జడలను క్షౌరం చేయించి అతన్ని ఆధీనంలోకి తీసుకోవడం మొదలుపెట్టింది. అతని బలం అతన్ని విడిచిపోయింది.
- న్యాయాధిపతులు 16:20సుమారు క్రీ.పూ. 1120
అప్పుడు ఆమె, “సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదికి వచ్చారు!” అని అన్నది. అతడు నిద్ర మేల్కొని, “నేను ఎప్పటిలాగే లేచి బయటకు వెళ్లి రెచ్చిపోతాను” అని అనుకున్నాడు, కానీ యెహోవా తనను విడిచిపెట్టారని అతనికి తెలియలేదు.
- న్యాయాధిపతులు 16:21సుమారు క్రీ.పూ. 1120
తర్వాత ఫిలిష్తీయులు అతన్ని బంధించి కళ్లు ఊడదీసి గాజాకు తీసుకెళ్లారు. అతన్ని ఇత్తడి గొలుసులతో బంధించి చెరసాలలో ధాన్యం విసరడానికి పెట్టారు.
- న్యాయాధిపతులు 16:22సుమారు క్రీ.పూ. 1120
అయితే క్షౌరం చేయబడిన అతని తలమీద వెంట్రుకలు పెరగడం మొదలయ్యాయి.
- న్యాయాధిపతులు 16:23సుమారు క్రీ.పూ. 1120
ఫిలిష్తీయుల నాయకులు, “మన దేవుడు మన శత్రువైన సంసోనును మన చేతికప్పగించాడు” అని చెప్పుకుంటూ తమ దేవుడైన దాగోనుకు గొప్ప బలిగా అర్పించి పండుగ చేసుకోడానికి ఒకచోట చేరారు.
- న్యాయాధిపతులు 16:24సుమారు క్రీ.పూ. 1120
ఆ ప్రజలు అతన్ని చూసి, “మన దేవుడు మన శత్రువును మన చేతులకు అప్పగించాడు, మన దేశాన్ని పాడు చేసినవాన్ని, మన వారినెంతో మందిని చంపినవాన్ని మనకప్పగించాడు” తమ దేవున్ని పొగిడారు,
- న్యాయాధిపతులు 16:25సుమారు క్రీ.పూ. 1120
వారి హృదయాలు సంతోషంతో నిండిపోయి, “మనకు వినోదం కలిగించడానికి సంసోనును బయటకు తీసుకురండి!” అని కేకలు వేశారు. వారు సంసోనును చెరసాల నుండి పిలిపించి వారి ముందు నిలబెట్టినప్పుడు అతడు వారికి వినోదం కలిగించాడు. వారు అతన్ని స్తంభాల మధ్య నిలబెట్టినప్పుడు,
- న్యాయాధిపతులు 16:26సుమారు క్రీ.పూ. 1120
తన చేయి పట్టుకున్న దాసునితో సంసోను, “ఈ గుడికి ఆధారంగా ఉన్న స్తంభాల దగ్గరికి నన్ను తీసుకెళ్తావా? నేను వాటిని ఆనుకుని నిలబడతాను” అని అడిగాడు.
- న్యాయాధిపతులు 16:27సుమారు క్రీ.పూ. 1120
ఆ గుడి స్త్రీ పురుషులతో నిండిపోయింది. ఫిలిష్తీయుల నాయకులందరు అక్కడే ఉన్నారు, సంసోను చేస్తున్న వినోదాన్ని గుడి కప్పు మీది నుండి దాదాపు మూడువేలమంది స్త్రీ పురుషులు చూస్తున్నారు.
- న్యాయాధిపతులు 16:28సుమారు క్రీ.పూ. 1120
అప్పుడు సంసోను, “ప్రభువైన యెహోవా, నన్ను జ్ఞాపకం చేసుకోండి. దేవా దయచేసి ఒక్కసారి నన్ను బలపరచండి, నా రెండు కళ్లు పెరికివేసిన ఫిలిష్తీయుల మీద ఒక్కసారి ప్రతీకారం తీర్చుకుంటాను” అని ప్రార్థన చేశాడు.
- న్యాయాధిపతులు 16:29సుమారు క్రీ.పూ. 1120
తర్వాత సంసోను గుడికి ఆధారంగా ఉన్న రెండు మధ్య స్తంభాల్లో కుడిచేతితో ఒకదాన్ని ఎడమచేతితో ఒకదాన్ని పట్టుకుని,
- న్యాయాధిపతులు 16:30సుమారు క్రీ.పూ. 1120
సంసోను, “నేను నాతోపాటు ఫిలిష్తీయులు కలిసి చస్తాం” అంటూ బలంగా ముందుకు వంగాడు! అంతే ఆ గుడి దానిలో ఉన్న అధికారులు ప్రజలు అందరి మీదా కూలి, అతడు బ్రతికి ఉన్నప్పుడు చంపిన వారికంటే చనిపోయేటప్పుడు ఎక్కువమందిని చంపాడు.
- న్యాయాధిపతులు 16:31సుమారు క్రీ.పూ. 1120
అప్పుడు అతని సోదరులు, తండ్రి ఇంటివారందరు అతన్ని మోసికొనివచ్చి అతన్ని జోరహుకును ఎష్తాయోలుకును మధ్యలో ఉన్న అతని తండ్రి మనోహ సమాధిలో పాతిపెట్టారు. సంసోను ఇశ్రాయేలును ఇరవై సంవత్సరాలు నడిపించాడు.
- న్యాయాధిపతులు 17:1సుమారు క్రీ.పూ. 1419
ఎఫ్రాయిం కొండ సీమలో మీకా అనే ఒక వ్యక్తి నివసిస్తున్నాడు.
- న్యాయాధిపతులు 17:2సుమారు క్రీ.పూ. 1419
అతడు తన తల్లితో, “నీ దగ్గర నుండి తీసుకున్న పదకొండు వందల షెకెళ్ళ వెండి గురించి నీవు పెట్టిన శాపనార్థాలను నేను విన్నాను. ఆ వెండి నా దగ్గరే ఉంది, నేనే దానిని తీసుకున్నాను” అని అన్నాడు. అందుకు అతని తల్లి, “నా కుమారుడా! యెహోవా నిన్ను దీవించును గాక” అని అన్నది.
- న్యాయాధిపతులు 17:3సుమారు క్రీ.పూ. 1419
అతడు ఆ పదకొండు వందల షెకెళ్ళ వెండిని తన తల్లికి తిరిగి ఇచ్చేసినప్పుడు ఆమె, “నేను నా వెండిని యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను, నా కుమారుడు వెండితో పొదిగించిన ఒక విగ్రహం తయారుచేసిన తర్వాత అది తిరిగి నీకు ఇచ్చేస్తాను” అని అన్నది.
- న్యాయాధిపతులు 17:4సుమారు క్రీ.పూ. 1419
కాబట్టి అతడు తన తల్లికి ఆ వెండి తిరిగి ఇచ్చేసిన తర్వాత ఆమె దానిలో రెండువందల షెకెళ్ళ వెండి తీసి, కంసాలికి ఇచ్చింది. అతడు దానితో ఒక విగ్రహం చెక్కి పూత విగ్రహం తయారుచేశాడు. వాటిని మీకా ఇంట్లో పెట్టారు.