కంటెంట్‌కు వెళ్లండి

circa 1380–1050 BC

The Judges & Ruth

Israel cycles through rebellion, oppression, and rescue under charismatic leaders—culminating in Ruth's faithful love story.

703 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. న్యాయాధిపతులు 14:1సుమారు క్రీ.పూ. 1141

    సంసోను తిమ్నాకు వెళ్లాడు, అక్కడ ఒక ఫిలిష్తీ యువతిని చూశాడు.

  2. న్యాయాధిపతులు 14:2సుమారు క్రీ.పూ. 1141

    అతడు తిరగి వచ్చి, తన తండ్రితో, తల్లితో, “నేను తిమ్నాలో ఒక ఫిలిష్తీ యువతిని చూశాను; ఇప్పుడు ఆమెను నాకు భార్యగా తీసుకురండి” అని అన్నాడు.

  3. న్యాయాధిపతులు 14:3సుమారు క్రీ.పూ. 1141

    అతని తండ్రి, తల్లి జవాబిస్తూ, “నీ బంధువుల్లో గాని మన ప్రజలందరిలో నీకు తగిన అమ్మాయి దొరకలేదా? భార్యను తీసుకురావడానికి నీవు సున్నతి సంస్కారం లేని ఫిలిష్తీయుల దగ్గరకు వెళ్లాలా?” అన్నారు. కాని సంసోను తన తండ్రితో ఇలా అన్నాడు, “నా కోసం ఆమెను తీసుకురండి, ఆమె నాకు సరియైనది.”

  4. న్యాయాధిపతులు 14:4సుమారు క్రీ.పూ. 1141

    (ఇది యెహోవా నుండి వచ్చిందని, ఫిలిష్తీయులను ఎదుర్కొనే అవకాశం కోసం ఆయన చూస్తున్నారని అతని తల్లిదండ్రులకు తెలియదు; ఆ సమయంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలును పరిపాలిస్తున్నారు.)

  5. న్యాయాధిపతులు 14:5సుమారు క్రీ.పూ. 1141

    సంసోను తన తల్లిదండ్రులతో కలిసి తిమ్నాతుకు వెళ్లాడు. వారు తిమ్నాతు ద్రాక్షతోటలను సమీపించినప్పుడు, అకస్మాత్తుగా ఒక కొదమసింహం గర్జిస్తూ అతనివైపు వచ్చింది.

  6. న్యాయాధిపతులు 14:6సుమారు క్రీ.పూ. 1141

    యెహోవా ఆత్మ అతని మీదికి బలంగా వచ్చినందుకు అతడు మేకపిల్లను చీల్చినట్టు, వట్టి చేతులతో సింహాన్ని చీల్చేశాడు. అయితే తాను చేసింది తన తండ్రికి గాని తల్లికి గాని చెప్పలేదు.

  7. న్యాయాధిపతులు 14:7సుమారు క్రీ.పూ. 1141

    తర్వాత సంసోను తిమ్నాతుకు వెళ్లి ఆ యువతితో మాట్లాడాడు, ఆమెను ఇష్టపడ్డాడు.

  8. న్యాయాధిపతులు 14:8సుమారు క్రీ.పూ. 1141

    కొంతకాలం తర్వాత, ఆమెను పెళ్ళి చేసుకోవడానికి అతడు తిరిగి వెళ్లినప్పుడు, ఆ సింహం కళేబరాన్ని చూద్దామని ప్రక్కకు తిరిగాడు. ఆ కళేబరంలో తేనెటీగ గుంపును, కొంచెం తేనెను అతడు చూశాడు.

  9. న్యాయాధిపతులు 14:9సుమారు క్రీ.పూ. 1141

    అతడు కొంచెం తేనెను చేతుల్లోకి తీసుకుని తింటూ ముందుకు వెళ్లాడు. అతడు తన తల్లిదండ్రులను తిరిగి కలుసుకున్నప్పుడు, వారికి కొంచెం ఇచ్చాడు, వారు కూడా తిన్నారు. అయితే సింహం కళేబరంలో నుండి ఆ తేనెను తీసిన సంగతి మాత్రం వారితో చెప్పలేదు.

  10. న్యాయాధిపతులు 14:10సుమారు క్రీ.పూ. 1141

    అతని తండ్రి ఆ అమ్మాయిని చూడటానికి వెళ్లాడు. సంసోను అక్కడ ఒక విందు ఏర్పాటు చేశాడు, పెళ్ళికుమారుడు అలా చేయడం అక్కడి ఆనవాయితి.

  11. న్యాయాధిపతులు 14:11సుమారు క్రీ.పూ. 1141

    ప్రజలు అతన్ని చూడగానే వారు అతనికి తోడుగా ఉండడానికి ముప్పైమంది యువకులను తీసుకువచ్చారు.

  12. న్యాయాధిపతులు 14:12సుమారు క్రీ.పూ. 1141

    సంసోను వారితో అన్నాడు, “మీకు ఒక పొడవు కథ చెప్తాను, ఈ విందు జరిగే ఏడు రోజుల్లో మీరు దాని జవాబు చెప్తే, ముప్పై సన్నని నారబట్టలు, ముప్పై జతల దుస్తులు ఇస్తాను.

  13. న్యాయాధిపతులు 14:13సుమారు క్రీ.పూ. 1141

    ఒకవేళ మీరు జవాబు చెప్పలేకపోతే, ముప్పై సన్నటి నారబట్టలు, ముప్పై జతల దుస్తులు మీరు నాకు ఇవ్వాలి.” వారు అన్నారు, “నీ పొడుపు కథ చెప్పు, మేము వింటాము.”

  14. న్యాయాధిపతులు 14:14సుమారు క్రీ.పూ. 1141

    అందుకు అతడు అన్నాడు, “తినే దానిలో నుండి తిండి వచ్చింది, బలమైన దానిలో నుండి తియ్యనిది వచ్చింది.” మూడు రోజుల వరకు వారు దానికి జవాబివ్వలేకపోయారు.

  15. న్యాయాధిపతులు 14:15సుమారు క్రీ.పూ. 1141

    నాల్గవ రోజున వారు సంసోను భార్యతో అన్నారు, “ఆ పొడుపు కథ అర్థమేమిటో మాకు చెప్పమని నీ భర్తను ఒప్పించు లేకపోతే నిన్ను, నీ తండ్రి ఇంటివారిని దహించి వేస్తాము. మా స్వాస్థ్యాన్ని కాజేయడానికి మమ్మల్ని ఆహ్వానించారా?”

  16. న్యాయాధిపతులు 14:16సుమారు క్రీ.పూ. 1141

    అప్పుడు సంసోను భార్య అతనిపై పడి ఏడుస్తూ, “నీవు నన్ను ద్వేషిస్తున్నావు, నేనంటే నీకు ప్రేమ లేదు. నా ప్రజలకు ఒక పొడుపు కథ వేశావు, కానీ దాని అర్థం నాకు చెప్పలేదు” అన్నది. అతడు అన్నాడు, “దాని అర్థం నా తండ్రికి కాని తల్లికి గాని చెప్పలేదు, కాబట్టి నీకెందుకు దానిని వివరించాలి?”

  17. న్యాయాధిపతులు 14:17సుమారు క్రీ.పూ. 1141

    విందు జరిగిన ఏడు రోజులు కూడా ఆమె ఏడుస్తూనే ఉంది. ఆమె ఏడుస్తూ, అతన్ని ఇంకా విసిగిస్తున్నందుకు ఏడవ రోజున అతడు దాని అర్థం చెప్పాడు, ఆమె ఆ పొడుపు కథను తన ప్రజలకు వివరించింది.

  18. న్యాయాధిపతులు 14:18సుమారు క్రీ.పూ. 1141

    ఏడవ రోజు సూర్యాస్తమయం కాకముందు, ఆ నగరవాసులు అతనితో అన్నారు, “తేనె కంటే తియ్యగా ఉండేదేంటి? సింహం కంటే బలమైనదేది?” అందుకు సంసోను, “మీరు నా దూడ దున్నకపోతే నా పొడుపు కథను చెప్పే వారే కాదు” అన్నాడు.

  19. న్యాయాధిపతులు 14:19సుమారు క్రీ.పూ. 1141

    అప్పుడు యెహోవా ఆత్మ బలంగా అతని మీదికి వచ్చాడు. అతడు అష్కెలోను పట్టణానికి వెళ్లి, అక్కడి వారి ముప్పైమందిని చంపి, వారి వస్త్రాలను దోచుకొని పొడుపు కథ అర్థం చెప్పిన వారికిచ్చాడు. కోపంతో మండి పడుతూ అతడు తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్లాడు.

  20. న్యాయాధిపతులు 14:20సుమారు క్రీ.పూ. 1141

    సంసోను భార్యను ఆ విందుకు వచ్చిన సంసోను స్నేహితుల్లో ఒకనికి ఇచ్చి పెళ్ళి చేశారు.

  21. న్యాయాధిపతులు 15:1సుమారు క్రీ.పూ. 1141

    కొంతకాలం తర్వాత, గోధుమ పంట కోతకాలంలో, సంసోను ఒక మేకపిల్లను తీసుకుని భార్యను చూడడానికి వెళ్లాడు. “నా భార్యను చూడడానికి తన గదిలోకి వెళ్తాను” అని అతడు అనుకున్నాడు. కాని ఆమె తండ్రి అతన్ని లోపలికి వెళ్లనివ్వలేదు.

  22. న్యాయాధిపతులు 15:2సుమారు క్రీ.పూ. 1141

    ఆమె తండ్రి, “నీకు ఆమె అస్సలు ఇష్టం లేదు అనుకుని ఆమెను నీ స్నేహితునికి ఇచ్చాను. ఆమె చెల్లెలు ఆమెకంటే అందంగా ఉంటుంది ఆమెను చేసుకో” అని అన్నాడు.

  23. న్యాయాధిపతులు 15:3సుమారు క్రీ.పూ. 1141

    అప్పుడు సంసోను, “నేను ఇప్పుడు ఫిలిష్తీయులకు ఏదైనా కీడు చేసినా నిర్దోషినే” అని,

  24. న్యాయాధిపతులు 15:4సుమారు క్రీ.పూ. 1141

    సంసోను బయటకు వెళ్లి మూడువందల నక్కలను పట్టుకుని, రెండేసి నక్కల తోకలను ఒకదానికొకటి ముడివేసి ఆ రెండు తోకల మధ్య ఒక దివిటీని కట్టి,

  25. న్యాయాధిపతులు 15:5సుమారు క్రీ.పూ. 1141

    ఆ దివిటీలను వెలిగించి ఫిలిష్తీయుల గోధుమ పంట చేలల్లోకి ఆ నక్కలను వదిలాడు. ఇలా అతడు పనల కుప్పలను పైరును ద్రాక్ష ఒలీవ తోటలను తగలబెట్టాడు.