- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1380–1050 BC
The Judges & Ruth
Israel cycles through rebellion, oppression, and rescue under charismatic leaders—culminating in Ruth's faithful love story.
ఈ కాలపు వచనాలు
- న్యాయాధిపతులు 15:6సుమారు క్రీ.పూ. 1141
ఫిలిష్తీయులు, “ఇలా ఎవరు చేశారు?” అని అడిగినప్పుడు, “తిమ్నా అల్లుడైన సంసోను; తన భార్యను తన స్నేహితునికి ఇచ్చినందుకు అలా చేశాడు” అని చెప్పారు. అందుకు ఫిలిష్తీయులు వెళ్లి ఆమెను, ఆమె తండ్రిని కాల్చి చంపారు.
- న్యాయాధిపతులు 15:7సుమారు క్రీ.పూ. 1141
అప్పుడు సంసోను వారితో, “మీరిలా చేశారు కాబట్టి మీమీద పగతీర్చుకునే వరకు నేను ఊరుకోను” అంటూ,
- న్యాయాధిపతులు 15:8సుమారు క్రీ.పూ. 1141
అతడు వారిపై దాడి చేసి తొడలనూ తుంటి ఎముకలను విరగ్గొట్టి వారిలో చాలామందిని చంపేశాడు. తర్వాత అతడు వెళ్లి, ఏతాము బండ సందులో నివసించాడు.
- న్యాయాధిపతులు 15:9సుమారు క్రీ.పూ. 1141
అప్పుడు ఫిలిష్తీయులు బయలుదేరి యూదా ప్రదేశంలో దిగి సైన్య శిబిరాన్ని లేహి వరకు ఏర్పరచుకున్నారు.
- న్యాయాధిపతులు 15:10సుమారు క్రీ.పూ. 1141
యూదా ప్రజలు వారిని, “మీరెందుకు మా మీదికి వచ్చారు?” అని అడిగారు. అందుకు వారు, “మేము సంసోను మాకెలా చేశాడో మేము కూడ అతనికి అలాగే చేయడానికి వచ్చాం, మేము అతన్ని బంధించి తీసుకెళ్లడానికి వచ్చాం” అని జవాబిచ్చారు.
- న్యాయాధిపతులు 15:11సుమారు క్రీ.పూ. 1141
అప్పుడు యూదా నుండి మూడువేలమంది పురుషులు ఏతాము బండలో ఉన్న గుహలోకి దిగి, సంసోనుతో, “ఫిలిష్తీయులు మనలను పరిపాలిస్తున్నారని నీకు తెలియదా? మా మీదికి ఇంత ప్రమాదాన్ని ఎందుకు తెచ్చిపెట్టావు?” అని అన్నాడు. అతడు వారితో, “వారు నాకు ఏమి చేశారో నేను వారికి అదే చేశాను!” అన్నాడు.
- న్యాయాధిపతులు 15:12సుమారు క్రీ.పూ. 1141
అందుకు వారు అతనితో, “సరే, నిన్ను బంధించి ఫిలిష్తీయులకు అప్పగించడానికి మేము వచ్చాం” అన్నాడు. అందుకు సంసోను, “మీరు మాత్రం నన్ను చంపరని నాకు ప్రమాణం చేయండి” అని వారితో అన్నాడు.
- న్యాయాధిపతులు 15:13సుమారు క్రీ.పూ. 1141
“సరే, మేము కేవలం నిన్ను బంధించి వారికి అప్పగిస్తాం మేము నిన్ను చంపము” అని వారు జవాబిచ్చారు. అలా వారు అతన్ని రెండు క్రొత్త త్రాళ్లతో బంధించి బండ దగ్గర నుండి తీసుకువచ్చారు.
- న్యాయాధిపతులు 15:14సుమారు క్రీ.పూ. 1141
అతడు లేహిని సమీపించినప్పుడు, ఫిలిష్తీయులు కేకలువేస్తూ అతని దగ్గరకు వచ్చారు. యెహోవా ఆత్మ బలంగా అతని మీదికి రాగా అతని చేతులకున్న త్రాళ్లు కాలిపోయిన నారపీచులై అతని చేతుల నుండి తెగిపడిపోయాయి.
- న్యాయాధిపతులు 15:15సుమారు క్రీ.పూ. 1141
అక్కడే అతనికి గాడిద పచ్చి దవడ ఎముక ఒకటి దొరికింది. అతడు దాన్ని చేతపట్టుకుని దానితో వేయిమందిని చంపేశాడు.
- న్యాయాధిపతులు 15:16సుమారు క్రీ.పూ. 1141
అప్పుడు సంసోను, “గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను, రెండు కుప్పలను చంపాను. గాడిద దవడ ఎముకతో వేయిమందిని చంపాను” అని,
- న్యాయాధిపతులు 15:17సుమారు క్రీ.పూ. 1141
అతడు మాట్లాడడం ముగించిన తర్వాత, ఆ దవడ ఎముకను పారవేశాడు; ఆ స్థలం రామత్ లేహి అని పిలువబడింది.
- న్యాయాధిపతులు 15:18సుమారు క్రీ.పూ. 1141
అతనికి బాగా దాహం వేయడంతో యెహోవాకు మొరపెట్టి, “మీ సేవకుడనైన నాకు ఈ గొప్ప విజయాన్ని ఇచ్చారు. ఇప్పుడు నేను దాహంతో చచ్చి సున్నతిలేనివారి చేతుల్లో పడాలా?” అన్నాడు.
- న్యాయాధిపతులు 15:19సుమారు క్రీ.పూ. 1141
అప్పుడు దేవుడు లేహిలో ఉన్న ఒక బోలు స్థలం తెరవగా దానిలో నుండి నీళ్లు వచ్చాయి. సంసోను నీరు త్రాగగానే అతనికి బలం తిరిగివచ్చి అతని ప్రాణం తెప్పరిల్లింది. కాబట్టి ఆ ఊట ఎన్-హక్కోరె అని పిలువబడింది. అది ఇప్పటికి లేహిలో ఉంది.
- న్యాయాధిపతులు 15:20సుమారు క్రీ.పూ. 1141
ఫిలిష్తీయుల రోజుల్లో సంసోను ఇరవై సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు.
- న్యాయాధిపతులు 16:1సుమారు క్రీ.పూ. 1120
ఒక రోజు సంసోను గాజాకు వెళ్లి, అక్కడ ఒక వేశ్యను చూసి రాత్రి ఆమెతో గడపడానికి ఆమె దగ్గర ఉండిపోయాడు.
- న్యాయాధిపతులు 16:2సుమారు క్రీ.పూ. 1120
“సంసోను ఇక్కడ ఉన్నాడు!” అని గాజా ప్రజలకు తెలిసినప్పుడు వారు ఆ స్థలాన్ని చుట్టుముట్టి, “తెల్లవారినప్పుడు అతన్ని చంపుదాం” అని అనుకుని పట్టణ ద్వారం దగ్గర రాత్రంతా అక్కడినుండి కదలకుండా అతని కోసం కాపలా ఉన్నారు.
- న్యాయాధిపతులు 16:3సుమారు క్రీ.పూ. 1120
అయితే సంసోను మధ్యరాత్రి వరకు మాత్రమే అక్కడ పడుకున్నాడు. తర్వాత అతడు లేచి, పట్టణ ద్వారం తలుపులను వాటి అడ్డకర్రలతో సహా ఊడబెరికి తన భుజాల మీద ఎత్తుకుని హెబ్రోనుకు ఎదురుగా కొండ మీదికి వాటిని మోసుకెళ్లాడు.
- న్యాయాధిపతులు 16:4సుమారు క్రీ.పూ. 1120
కొంతకాలం తర్వాత అతడు శోరేకు లోయకు చెందిన దెలీలా అనే స్త్రీని ప్రేమించాడు.
- న్యాయాధిపతులు 16:5సుమారు క్రీ.పూ. 1120
ఫిలిష్తీయుల నాయకులు ఆమె దగ్గరకు వెళ్లి, “మేము అతన్ని కట్టిపడేసి లొంగదీసుకోడానికి నీవు అతన్ని ఆకర్షించుకుని అతని గొప్ప బలం యొక్క రహస్యం ఏమిటో, అతన్ని మేము ఎలా గెలవగలమో తెలుసుకో! అప్పుడు మాలో ప్రతి ఒక్కరూ నీకు పదకొండు వందల వెండి షెకెళ్లు ఇస్తాం” అని అన్నారు.
- న్యాయాధిపతులు 16:6సుమారు క్రీ.పూ. 1120
కాబట్టి దెలీలా సంసోనుతో, “నీ గొప్ప బలం యొక్క రహస్యం ఏంటో నాకు చెప్పవా, నిన్ను కట్టి లోబరుచుకోవడం ఎలా?” అని అడిగింది.
- న్యాయాధిపతులు 16:7సుమారు క్రీ.పూ. 1120
అందుకు సంసోను ఆమెతో, “ఎవరైనా నన్ను తడి ఆరని ఏడు పచ్చి క్రొత్త వింటినారలతో కట్టేస్తే, నా బలం పోయి నేను మామూలు మనుష్యుల్లా అవుతాను” అని జవాబిచ్చాడు.
- న్యాయాధిపతులు 16:8సుమారు క్రీ.పూ. 1120
అప్పుడు ఫిలిష్తీయుల నాయకులు తడి ఆరని ఏడు పచ్చి వింటినారలు ఆమె తెచ్చి ఇవ్వగా, ఆమె వాటితో అతన్ని కట్టేసింది.
- న్యాయాధిపతులు 16:9సుమారు క్రీ.పూ. 1120
లోపలి గదిలో మనుష్యులు దాక్కొని ఉన్నప్పుడు అతనితో, “సంసోనూ, ఫిలిష్తీయులు నీ మీదికి వచ్చారు!” అని ఆమె అతనితో అనగా అతడు నూలు పోగును మంట దగ్గర పెడితే తెగిపోయినట్లు ఆ వింటినారలను తెంపేశాడు. కాబట్టి అతని బలం యొక్క రహస్యం వెల్లడి కాలేదు.
- న్యాయాధిపతులు 16:10సుమారు క్రీ.పూ. 1120
అప్పుడు దెలీలా సంసోనుతో, “నీవు నన్ను మోసం చేశావు; నాకు అబద్ధం చెప్పావు. సరే ఇప్పుడైనా నిజం చెప్పు” అని అన్నది.