కంటెంట్‌కు వెళ్లండి

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 వచనాలు · 14 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యోనా 3:6సుమారు క్రీ.పూ. 862

    యోనా హెచ్చరిక నీనెవె రాజుకు చేరినప్పుడు, అతడు తన సింహాసనం దిగి, తన రాజ వస్త్రాలను తీసివేసి, గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నాడు.

  2. యోనా 3:7సుమారు క్రీ.పూ. 862

    అతడు నీనెవెలో ఈ ప్రకటన చేశాడు: “రాజు, అతని ఘనుల శాసనం ప్రకారం: “మనుష్యులు గాని జంతువులు పశువులు గొర్రెల మందలు గాని దేన్ని రుచి చూడకూడదు తినకూడదు త్రాగకూడదు.

  3. యోనా 3:8సుమారు క్రీ.పూ. 862

    మనుష్యులు పశువులు గోనెపట్ట కప్పుకోవాలి. అందరు తక్షణమే దేవున్ని వేడుకోవాలి. తమ చెడు మార్గాలను, దౌర్జన్యాన్ని మానివేయాలి.

  4. యోనా 3:9సుమారు క్రీ.పూ. 862

    దేవుని మనస్సు మార్చుకుని కనికరంతో తన తీవ్రమైన కోపాన్ని విడిచిపెట్టి మనం నశించకుండా చేస్తారేమో ఎవరికి తెలుసు?”

  5. యోనా 3:10సుమారు క్రీ.పూ. 862

    వారు చేసింది, వారు ఎలా తమ చెడుతనాన్ని విడిచిపెట్టారో దేవుడు చూసి తన మనస్సు మార్చుకొని, ఆయన వారికి మీదికి రప్పిస్తానని చెప్పిన కీడును రానివ్వలేదు.

  6. యోనా 4:1సుమారు క్రీ.పూ. 862

    అయితే యోనాకు ఇది చాల తప్పు అనిపించింది, అతనికి కోపం వచ్చింది.

  7. యోనా 4:2సుమారు క్రీ.పూ. 862

    అతడు యెహోవాకు ప్రార్థన చేస్తూ అన్నాడు, “యెహోవా, ఇలా జరుగుతుందని నేను నా దేశంలో ఉన్నప్పుడే చెప్పలేదా? అందుకే నేను తర్షీషుకు పారిపోవడానికి ప్రయత్నించాను. మీరు కృపాకనికరంగల దేవుడని, త్వరగా కోప్పడరని, మారని ప్రేమ గలవారని, కీడు కలిగించకుండా మానివేస్తారని నాకు తెలుసు.

  8. యోనా 4:3సుమారు క్రీ.పూ. 862

    యెహోవా, బ్రతకడం కంటే నాకు చావడం మేలు, కాబట్టి నా ప్రాణాన్ని తీసివేయండి.”

  9. యోనా 4:4సుమారు క్రీ.పూ. 862

    అయితే యెహోవా జవాబిస్తూ, “నీవలా కోప్పడడం న్యాయమేనా?” అని అన్నారు.

  10. యోనా 4:5సుమారు క్రీ.పూ. 862

    తర్వాత యోనా బయటకు వెళ్లి పట్టణానికి తూర్పుగా ఒకచోట కూర్చున్నాడు. అక్కడ తన కోసం తాను ఒక పందిరి వేసుకొని, పట్టణానికి ఏం జరుగుతుందో చూద్దామని దాని నీడలో కూర్చుని ఉన్నాడు.

  11. యోనా 4:6సుమారు క్రీ.పూ. 862

    అప్పుడు యెహోవా, యోనా తలకు నీడనివ్వాలని, అతనికి కలిగిన బాధ తగ్గించాలని ఆకులుగల ఒక చెట్టును మొలిపించారు, యోనా ఆ చెట్టును బట్టి ఎంతో సంతోషించాడు.

  12. యోనా 4:7సుమారు క్రీ.పూ. 862

    అయితే మరుసటిరోజు ఉదయం దేవుడు ఒక పురుగును పంపగా అది చెట్టును తినివేయడంతో ఆ చెట్టు వాడిపోయింది.

  13. యోనా 4:8సుమారు క్రీ.పూ. 862

    సూర్యుడు ఉదయించినప్పుడు, దేవుడు తూర్పు నుండి వడగాలిని పంపించారు, యోనా తలకు ఎండదెబ్బ తగిలి అతడు నీరసించిపోయాడు. “నేను బ్రతికి ఉండడం కంటే చావడం మేలు” అని తనలో తాను అనుకున్నాడు.

  14. యోనా 4:9సుమారు క్రీ.పూ. 862

    అయితే దేవుడు యోనాతో, “ఆ చెట్టు గురించి నీవలా కోప్పడడం సరైనదా?” అన్నారు. అతడు, “అవును, సరైనదే, నాకు చావాలన్నంత కోపం వస్తుంది” అన్నాడు.

  15. యోనా 4:10సుమారు క్రీ.పూ. 862

    అయితే యెహోవా, “నీవు ఈ చెట్టును పోషించలేదు, పెంచలేదు. అది రాత్రికి రాత్రి మొలిచింది, రాత్రికి రాత్రి చచ్చింది. అయినా నీవు ఈ చెట్టు విషయంలో బాధపడుతున్నావు.

  16. యోనా 4:11సుమారు క్రీ.పూ. 862

    అలాంటప్పుడు కుడి ఎడమలు తెలియని లక్ష ఇరవై వేలమంది మనుష్యులు ఎన్నో జంతువులు ఉన్న గొప్ప పట్టణమైన నీనెవె గురించి నేను చింతించకూడదా?” అన్నారు.

  17. మీకా 1:1సుమారు క్రీ.పూ. 750

    యోతాము, ఆహాజు, హిజ్కియా అనే యూదా రాజుల పరిపాలన కాలాల్లో మోరెషెతు వాడైన మీకా దగ్గరకు వచ్చిన యెహోవా వాక్కు. సమరయ, యెరూషలేముల గురించి అతడు చూసిన దర్శనం.

  18. మీకా 1:2సుమారు క్రీ.పూ. 750

    ప్రజలారా, మీరంతా వినండి, భూమీ, నీవు నీలోని నివాసులందరూ ఆలకించండి, ప్రభువైన యెహోవా మీమీద నేరారోపణ చేయబోతున్నారు, ప్రభువు తన పరిశుద్ధ ఆలయం నుండి మాట్లాడుతున్నారు.

  19. మీకా 1:3సుమారు క్రీ.పూ. 750

    చూడండి! యెహోవా తన నివాసస్థలం నుండి వస్తున్నారు; ఆయన దిగి భూమిమీది ఉన్నతస్థలాల మీద నడవబోతున్నారు.

  20. మీకా 1:4సుమారు క్రీ.పూ. 750

    అగ్నికి మైనం కరిగినట్లు, వాలు మీద నీరు ప్రవహించినట్లు, ఆయన పాదాల క్రింద పర్వతాలు కరుగుతాయి, లోయలు చీలిపోతాయి.

  21. మీకా 1:5సుమారు క్రీ.పూ. 750

    దీనంతటికీ యాకోబు అతిక్రమం, ఇశ్రాయేలు ప్రజల పాపాలే కారణం. యాకోబు అతిక్రమం ఏంటి? అది సమరయ కాదా? యూదా యొక్క క్షేత్రం ఏంటి? అది యెరూషలేము కాదా?

  22. మీకా 1:6సుమారు క్రీ.పూ. 750

    “కాబట్టి నేను సమరయను రాళ్ల కుప్పగా చేస్తాను, అది ద్రాక్షతోటలు నాటే స్థలం అవుతుంది. దాని రాళ్లను లోయలో పారవేస్తాను, దాని పునాదులు బయట పడతాయి.

  23. మీకా 1:7సుమారు క్రీ.పూ. 750

    దాని విగ్రహాలన్నీ ముక్కలుగా విరగ్గొట్టబడతాయి; దాని గుడి కానుకలన్ని అగ్నితో కాల్చబడతాయి; నేను దాని ప్రతిమలన్నిటినీ నాశనం చేస్తాను. అది వేశ్య సంపాదనతో తన బహుమానాలను పోగుచేసింది కాబట్టి అవి మళ్ళీ వేశ్య జీతంగా ఇవ్వబడతాయి.”

  24. మీకా 1:8సుమారు క్రీ.పూ. 750

    దీనిని బట్టి నేను ఏడుస్తూ విలపిస్తాను; నేను చెప్పులు లేకుండా, దిగంబరిగా బయట తిరుగుతాను. నేను నక్కలా అరుస్తాను, గుడ్లగూబలాగా మూలుగుతాను.

  25. మీకా 1:9సుమారు క్రీ.పూ. 750

    ఎందుకంటే సమరయ తెగులు బాగు చేయలేనిది; అది యూదాకు వ్యాపించింది. అది నా ప్రజల ద్వారాల వరకు, యెరూషలేము వరకు కూడా వ్యాపించింది.