కంటెంట్‌కు వెళ్లండి

circa 970–930 BC

Solomon & The Temple

Solomon builds the great Temple in Jerusalem and rules with unprecedented wisdom and wealth before foreign gods divide his heart.

635 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 1 రాజులు 8:58సుమారు క్రీ.పూ. 1004

    ఆయన మార్గాన్ని అనుసరిస్తూ, ఆయన మన పూర్వికులకు ఇచ్చిన ఆజ్ఞలను, శాసనాలను, నియమాలను పాటించడానికి, ఆయన వైపు మన హృదయాలను త్రిప్పాలి.

  2. 1 రాజులు 8:59సుమారు క్రీ.పూ. 1004

    ఆయన తన దాసుని పక్షాన, తన ఇశ్రాయేలు ప్రజల పక్షాన అనుదిన అవసరత ప్రకారం కార్యాన్ని జరిగించేలా నేను యెహోవా ఎదుట ప్రార్థన చేస్తూ మాట్లాడిన ఈ మాటలు, మన దేవుడైన యెహోవా ఎదుట రాత్రింబగళ్ళు నిలిచి ఉండాలి!

  3. 1 రాజులు 8:60సుమారు క్రీ.పూ. 1004

    అప్పుడు ప్రపంచంలోని అన్ని జనాంగాలు యెహోవాయే దేవుడని, వేరెవరు లేరని తెలుసుకుంటారు.

  4. 1 రాజులు 8:61సుమారు క్రీ.పూ. 1004

    మీ హృదయాలు ఇప్పుడున్నట్లుగా దేవుడైన యెహోవాకు పూర్తిగా సమర్పించుకొని, ఆయన శాసనాలు ప్రకారం జీవిస్తూ, ఆయన ఆజ్ఞలకు లోబడుతూ ఉండును గాక.”

  5. 1 రాజులు 8:62సుమారు క్రీ.పూ. 1004

    తర్వాత రాజు, అతనితో ఉన్న ఇశ్రాయేలు ప్రజలంతా యెహోవా ఎదుట బలులు అర్పించారు.

  6. 1 రాజులు 8:63సుమారు క్రీ.పూ. 1004

    సొలొమోను యెహోవాకు సమాధానబలులుగా 22,000 పశువులు, 1,20,000 గొర్రెలు, మేకలు అర్పించాడు. ఈ విధంగా రాజు, ఇశ్రాయేలీయులందరు యెహోవా మందిరాన్ని ప్రతిష్ఠించారు.

  7. 1 రాజులు 8:64సుమారు క్రీ.పూ. 1004

    యెహోవా సమక్షంలో ఉన్న ఇత్తడి బలిపీఠం మీద అర్పించలేనంత ఎక్కువగా ఆ దహనబలులు, భోజనార్పణలు, సమాధానబలుల క్రొవ్వు ఉంది కాబట్టి అదే రోజు రాజు యెహోవా ఆలయానికి ముందున్న ఆవరణం మధ్య భాగాన్ని అతడు పవిత్రపరచి, దహనబలులు, భోజనార్పణలు, సమాధానబలుల క్రొవ్వును అర్పించాడు.

  8. 1 రాజులు 8:65సుమారు క్రీ.పూ. 1004

    ఆ సమయంలో సొలొమోను అతనితో ఇశ్రాయేలు ప్రజలంతా పండుగ చేశారు. లెబో హమాతుకు వెళ్లే మార్గం నుండి ఈజిప్టు వాగువరకు ఉన్న ప్రాంతాల నుండి ప్రజలు గొప్ప సమూహంగా వచ్చి దేవుడైన యెహోవా ఎదుట ఏడు రోజులే కాకుండ మరి ఏడు రోజులు, మొత్తం పద్నాలుగు రోజులు పండుగ చేసుకున్నారు.

  9. 1 రాజులు 8:66సుమారు క్రీ.పూ. 1004

    తర్వాత రోజు అతడు ప్రజలను పంపించేశాడు. వారు రాజును దీవిస్తూ, యెహోవా తన సేవకుడైన దావీదుకు, తన ప్రజలైన ఇశ్రాయేలుకు చేసిన మంచి వాటినన్నిటిని బట్టి హృదయంలో ఆనందంతో, సంతోషంతో తమ ఇళ్ళకు వెళ్లారు.

  10. 1 రాజులు 9:1సుమారు క్రీ.పూ. 991

    సొలొమోను యెహోవా మందిరాన్ని, రాజభవనాన్ని కట్టించి తాను కోరుకున్నదంతా సాధించిన తర్వాత,

  11. 1 రాజులు 9:2సుమారు క్రీ.పూ. 991

    యెహోవా గిబియోనులో సొలొమోనుకు ప్రత్యక్షమైనట్లు రెండవసారి అతనికి ప్రత్యక్షమయ్యారు.

  12. 1 రాజులు 9:3సుమారు క్రీ.పూ. 991

    యెహోవా అతనితో ఇలా అన్నారు: “నా సమక్షంలో నీవు చేసిన ప్రార్థన విన్నపం విన్నాను; నీవు కట్టించిన ఈ మందిరంలో నా పేరు ఎప్పటికీ ఉండాలని నేను దీనిని ప్రతిష్ఠించాను. నా కనుదృష్టి, నా హృదయం ఎల్లప్పుడు దీనిపై ఉంటాయి.

  13. 1 రాజులు 9:4సుమారు క్రీ.పూ. 991

    “నీ మట్టుకైతే, నీ తండ్రి దావీదులా నమ్మకంగా యథార్థత నిజాయితీగల హృదయంతో జీవిస్తూ, నేను ఆజ్ఞాపించినదంతా చేసి, నా శాసనాలను నియమాలను పాటిస్తే,

  14. 1 రాజులు 9:5సుమారు క్రీ.పూ. 991

    నీ తండ్రి దావీదుకు, ‘ఇశ్రాయేలు సింహాసనం మీద నీ సంతతివారు ఎప్పటికీ కూర్చుంటారు’ అని వాగ్దానం చేసినట్లు నీ రాజ్యసింహాసనాన్ని ఎల్లకాలం ఇశ్రాయేలు మీద స్థాపిస్తాను.

  15. 1 రాజులు 9:6సుమారు క్రీ.పూ. 991

    “అయితే ఒకవేళ మీరు గాని మీ సంతానం గాని నాకు విరుద్ధంగా తిరిగి, నేను మీకు ఇచ్చిన శాసనాలు, ఆజ్ఞలు పాటించకుండా ఇతర దేవుళ్ళను సేవిస్తూ పూజిస్తే,

  16. 1 రాజులు 9:7సుమారు క్రీ.పూ. 991

    అప్పుడు నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన ఈ దేశంలో వారిని లేకుండా చేస్తాను. నా నామం కోసం ప్రతిష్ఠించుకున్న ఈ మందిరాన్ని తిరస్కరిస్తాను. అప్పుడు ఇశ్రాయేలీయులు సర్వజనాంగాల మధ్య ఒక సామెతగా హేళనకు కారణంగా మారతారు.

  17. 1 రాజులు 9:8సుమారు క్రీ.పూ. 991

    ఈ మందిరం శిథిలాల కుప్పగా మారుతుంది. దాటి వెళ్లేవారంతా ఆశ్చర్యపడి, అపహాస్యం చేస్తూ, ‘యెహోవా ఈ దేశానికి, ఈ ఆలయానికి ఇలా ఎందుకు చేశారో?’ అని అడుగుతారు.

  18. 1 రాజులు 9:9సుమారు క్రీ.పూ. 991

    అప్పుడు ప్రజలు, ‘వారు తమ పూర్వికులను ఈజిప్టు దేశం నుండి తీసుకువచ్చిన తమ దేవుడైన యెహోవాను విడిచిపెట్టి వేరే దేవుళ్ళను హత్తుకుని పూజిస్తూ వాటికి సేవ చేశారు, అందుకే యెహోవా వారిపై ఈ విపత్తును తెచ్చారు’ అని జవాబిస్తారు.”

  19. 1 రాజులు 9:10సుమారు క్రీ.పూ. 991

    సొలొమోను యెహోవా మందిరాన్ని, రాజభవనాన్ని కట్టించడానికి తీసుకున్న ఇరవై సంవత్సరాలు ముగిసిన తర్వాత,

  20. 1 రాజులు 9:11సుమారు క్రీ.పూ. 991

    సొలొమోనుకు కావలసిన అన్ని దేవదారు దూలాలు, సరళవృక్షపు చెట్లు, బంగారం, తూరు రాజైన హీరాము సరఫరాచేశాడు కాబట్టి సొలొమోను గలిలయ ప్రదేశంలోని ఇరవై పట్టణాలను హీరాముకు ఇచ్చాడు.

  21. 1 రాజులు 9:12సుమారు క్రీ.పూ. 991

    సొలొమోను తనకు ఇచ్చిన ఆ పట్టణాలను చూడడానికి హీరాము తూరు నుండి వెళ్లాడు, కాని అవి అతనికి నచ్చలేదు.

  22. 1 రాజులు 9:13సుమారు క్రీ.పూ. 991

    అతడు, “నా సోదరుడా, నీవు నాకిచ్చిన ఈ పట్టణాలు ఎలాంటివి?” అని అడిగాడు. అతడు వాటికి కాబూల్ ప్రాంతం అని పేరు పెట్టాడు, ఈనాటికీ దానికి అదే పేరు.

  23. 1 రాజులు 9:14సుమారు క్రీ.పూ. 991

    హీరాము రాజుకు సుమారు 120 తలాంతుల బంగారం పంపాడు.

  24. 1 రాజులు 9:15సుమారు క్రీ.పూ. 1015

    రాజైన సొలొమోను యెహోవా మందిరాన్ని, తన రాజభవనాన్ని, మేడలను, యెరూషలేము ప్రాకారాన్ని, హాసోరు, మెగిద్దో, గెజెరు పట్టణాలు కట్టడానికి నియమించిన వెట్టి పని చేసిన వారి వివరాలు.

  25. 1 రాజులు 9:16సుమారు క్రీ.పూ. 1015

    (ఈజిప్టు రాజైన ఫరో దాడి చేసి గెజెరును పట్టుకుని తగుల బెట్టాడు. ఆ పట్టణంలో నివసించే కనానీయులను చంపి, తన కుమార్తెయైన సొలొమోను భార్యకు పెళ్ళి కానుకగా ఇచ్చాడు.