- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1050–1010 BC
Samuel & King Saul
Israel demands a king; Samuel anoints Saul, whose disobedience leads to his rejection as God chooses a man after his own heart.
ఈ కాలపు వచనాలు
- 1 సమూయేలు 17:45సుమారు క్రీ.పూ. 1063
అందుకు దావీదు ఆ ఫిలిష్తీయునితో, “నీవు కత్తి ఈటె బల్లెం తీసుకుని నా మీదికి వస్తున్నావు కాని నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యాల దేవుడును సైన్యాల అధిపతియైన యెహోవా పేరట నేను నీ మీదికి వస్తున్నాను.
- 1 సమూయేలు 17:46సుమారు క్రీ.పూ. 1063
ఈ రోజు యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తారు; నేను నిన్ను చంపి నీ తల నరికివేస్తాను. నేను ఈ రోజే ఫిలిష్తీయుల కళేబరాలను పక్షులకు అడవి జంతువులకు వేస్తాను. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోకమంతా తెలుసుకుంటుంది.
- 1 సమూయేలు 17:47సుమారు క్రీ.పూ. 1063
అప్పుడు యెహోవా కత్తితో గాని ఈటెతో గాని రక్షించేవాడు కాడని ఇక్కడ ఉన్నవారందరు తెలుసుకుంటారు. యుద్ధం యెహోవాదే, ఆయనే మిమ్మల్ని మా చేతికి అప్పగిస్తారు” అన్నాడు.
- 1 సమూయేలు 17:48సుమారు క్రీ.పూ. 1063
ఆ ఫిలిష్తీయుడు దావీదుపై దాడి చేయడానికి ముందుకు రాగానే దావీదు అతన్ని ఎదుర్కోడానికి సైన్యం వైపు పరుగెత్తి వెళ్లాడు.
- 1 సమూయేలు 17:49సుమారు క్రీ.పూ. 1063
దావీదు తన సంచిలో నుండి ఒక రాయి తీసి వడిసెలలో పెట్టి విసిరి ఆ ఫిలిష్తీయుని నుదిటి మీద కొట్టాడు. ఆ రాయి అతని నుదిటి లోపలికి చొచ్చుకొని పోగా గొల్యాతు నేలపై బోర్లాపడ్డాడు.
- 1 సమూయేలు 17:50సుమారు క్రీ.పూ. 1063
అలా దావీదు ఆ ఫిలిష్తీయుని కేవలం ఒక వడిసెల ఒక రాయితో జయించాడు; తన చేతిలో కత్తి లేకుండానే ఆ ఫిలిష్తీయుని పడగొట్టాడు.
- 1 సమూయేలు 17:51సుమారు క్రీ.పూ. 1063
అప్పుడు దావీదు పరుగెత్తుకొని వెళ్లి ఆ ఫిలిష్తీయుని మీద నిలబడి వాని ఒరలో ఉన్న కత్తిని తీసి ఆ కత్తితోనే వాని చంపి, వాని తల నరికివేశాడు. ఫిలిష్తీయులు తమ వీరుడు చనిపోవడం చూసి పారిపోయారు.
- 1 సమూయేలు 17:52సుమారు క్రీ.పూ. 1063
అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యూదా ప్రజలు లేచి జయధ్వనులు చేస్తూ లోయవరకు ఎక్రోను ద్వారాల వరకు ఫిలిష్తీయులను వెంటాడారు. చనిపోయిన ఫిలిష్తీయులు షరాయిము దారిలో గాతు ఎక్రోను పట్టణాల వరకు పడి ఉన్నారు.
- 1 సమూయేలు 17:53సుమారు క్రీ.పూ. 1063
ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను వెంటాడడం ఆపి, తిరిగివచ్చి వారి డేరాలను దోచుకున్నారు.
- 1 సమూయేలు 17:54సుమారు క్రీ.పూ. 1063
దావీదు ఆ ఫిలిష్తీయుని తలను యెరూషలేముకు తీసుకువచ్చాడు. ఫిలిష్తీయుని ఆయుధాలను తన సొంత డేరాలో ఉంచాడు.
- 1 సమూయేలు 17:55సుమారు క్రీ.పూ. 1063
దావీదు ఆ ఫిలిష్తీయుని ఎదుర్కోడానికి వెళ్లడం చూసి సౌలు తన సేనాధిపతియైన అబ్నేరును పిలిచి, “అబ్నేరూ, ఈ యువకుడు ఎవరి కుమారుడు” అని అడిగాడు. అందుకు అబ్నేరు, “రాజా, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నాకు తెలియదు” అన్నాడు.
- 1 సమూయేలు 17:56సుమారు క్రీ.పూ. 1063
అందుకు రాజు, “ఈ యువకుడు ఎవరి కుమారుడో తెలుసుకోండి” అని ఆజ్ఞాపించాడు.
- 1 సమూయేలు 17:57సుమారు క్రీ.పూ. 1063
దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతన్ని పిలిచి ఫిలిష్తీయుని తల అతని చేతిలో ఉండగానే దావీదును సౌలు దగ్గరకు తీసుకువచ్చాడు.
- 1 సమూయేలు 17:58సుమారు క్రీ.పూ. 1063
సౌలు అతన్ని, “చిన్నవాడా, నీవెవరి కుమారుడవు?” అని అడిగాడు. అందుకు దావీదు, “నేను నీ సేవకుడు బేత్లెహేమీయుడైన యెష్షయి కుమారుడను” అని సమాధానమిచ్చాడు.
- 1 సమూయేలు 18:1సుమారు క్రీ.పూ. 1063
దావీదు సౌలుతో మాట్లాడడం పూర్తయిన తర్వాత యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయింది. యోనాతాను దావీదును ప్రాణానికి ప్రాణంగా భావించి అతన్ని ప్రేమించాడు.
- 1 సమూయేలు 18:2సుమారు క్రీ.పూ. 1063
ఆ రోజు నుండి సౌలు దావీదును తన దగ్గరే ఉంచుకుని అతన్ని తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్లనివ్వలేదు.
- 1 సమూయేలు 18:3సుమారు క్రీ.పూ. 1063
యోనాతాను దావీదును తన ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి అతడు దావీదుతో ఒక నిబంధన చేసుకున్నాడు.
- 1 సమూయేలు 18:4సుమారు క్రీ.పూ. 1063
యోనాతాను తాను కప్పుకుని ఉన్న వస్త్రాన్ని, దానితో పాటు తన కత్తిని విల్లును నడికట్టును తీసి దావీదుకు ఇచ్చాడు.
- 1 సమూయేలు 18:5సుమారు క్రీ.పూ. 1063
దావీదు సౌలు తనను పంపిన ప్రతి చోటుకు వెళ్లి, విజయం సాధించేవాడు కాబట్టి సౌలు అతనికి సైన్యంలో ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు. అది సైనికులందరికి, సౌలు అధికారులకు సంతోషం కలిగించింది.
- 1 సమూయేలు 18:6సుమారు క్రీ.పూ. 1063
దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వస్తున్నప్పుడు, ఇశ్రాయేలు పట్టణాలలోని స్త్రీలందరు చాలా ఆనందంతో తంబురలు వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడుతూ నాట్యం చేస్తూ రాజైన సౌలును కలుసుకోడానికి ఎదురువచ్చారు.
- 1 సమూయేలు 18:7సుమారు క్రీ.పూ. 1063
ఆ స్త్రీలు నాట్యం చేస్తూ వాయిద్యాలు వాయిస్తూ, “సౌలు వేయిమందిని దావీదు పదివేలమందిని చంపారు” అని పాడారు.
- 1 సమూయేలు 18:8సుమారు క్రీ.పూ. 1063
ఆ మాటలు సౌలుకు నచ్చలేదు కాబట్టి అతడు చాలా కోపం తెచ్చుకుని, “వారు దావీదుకు పదివేలమంది, నాకు వేయిమంది అంటున్నారు; రాజ్యం కాకుండా అతడు మరేం తీసుకోగలడు?” అనుకున్నాడు.
- 1 సమూయేలు 18:9సుమారు క్రీ.పూ. 1063
అప్పటినుండి సౌలు దావీదును అసూయతో చూడడం మొదలుపెట్టాడు.
- 1 సమూయేలు 18:10సుమారు క్రీ.పూ. 1063
తర్వాత రోజు దేవుని దగ్గర నుండి దురాత్మ ఒకటి సౌలు మీదికి బలంగా వచ్చి అతడు ఇంట్లో ప్రవచిస్తున్నప్పుడు దావీదు ఎప్పటిలాగానే వీణ పట్టుకుని వాయించాడు. సౌలు చేతిలో ఒక ఈటె ఉంది.
- 1 సమూయేలు 18:11సుమారు క్రీ.పూ. 1063
సౌలు, “దీనితో నేను దావీదును గోడకు వ్రేలాడదీస్తాను” అని తనలో తాను అనుకుని దావీదు మీదికి ఈటె విసిరాడు కాని దావీదు రెండు సార్లు తప్పించుకున్నాడు.