- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1050–1010 BC
Samuel & King Saul
Israel demands a king; Samuel anoints Saul, whose disobedience leads to his rejection as God chooses a man after his own heart.
ఈ కాలపు వచనాలు
- 1 సమూయేలు 18:12సుమారు క్రీ.పూ. 1063
యెహోవా తనను విడిచిపెట్టి దావీదుకు తోడుగా ఉండడం చూసి సౌలు దావీదుకు భయపడ్డాడు.
- 1 సమూయేలు 18:13సుమారు క్రీ.పూ. 1063
కాబట్టి సౌలు దావీదును తన దగ్గర నుండి తీసివేసి సహస్రాధిపతిగా నియమించాడు; దావీదు యుద్ధాలలో సైన్యాన్ని ముందుండి నడిపించాడు.
- 1 సమూయేలు 18:14సుమారు క్రీ.పూ. 1063
యెహోవా దావీదుకు తోడుగా ఉన్నారు కాబట్టి అతడు చేసిన వాటన్నిటిలో విజయాన్ని సాధించాడు.
- 1 సమూయేలు 18:15సుమారు క్రీ.పూ. 1063
దావీదు సాధిస్తున్న విజయాలను చూసి సౌలు అతనంటే మరింత భయపడ్డాడు.
- 1 సమూయేలు 18:16సుమారు క్రీ.పూ. 1063
దావీదు యుద్ధాలలో సైన్యాన్ని ముందుండి నడిపించాడు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు యూదా ప్రజలు అతన్ని ప్రేమించారు.
- 1 సమూయేలు 18:17సుమారు క్రీ.పూ. 1063
సౌలు తనలో తాను, “నా చేయి అతని మీద పడకూడదు, ఫిలిష్తీయుల చేయి అతని మీద పడాలి” అనుకుని దావీదుతో, “ఈమె నా పెద్దకుమార్తె మేరబు; ఆమెను నీకు భార్యగా చేస్తాను. అయితే నీవు నా కోసం యుద్ధవీరునిగా ఉండి యెహోవా యుద్ధాలను చేస్తూ ఉండాలి” అన్నాడు.
- 1 సమూయేలు 18:18సుమారు క్రీ.పూ. 1063
అందుకు దావీదు సౌలుతో, “రాజుకు అల్లుడు అవడానికి నేను ఎంతటివాడను? నా కుటుంబం గాని, ఇశ్రాయేలులో నా వంశం గాని ఏపాటిది?” అన్నాడు.
- 1 సమూయేలు 18:19సుమారు క్రీ.పూ. 1063
అయితే దావీదుకు పెళ్ళి చేస్తానన్న సౌలు కుమార్తె మేరబుకు పెళ్ళి సమయం వచ్చినప్పుడు సౌలు ఆమెను మెహోలతీయుడైన అద్రీయేలుకు ఇచ్చి పెళ్ళి చేశాడు.
- 1 సమూయేలు 18:20సుమారు క్రీ.పూ. 1063
అయితే తన కుమార్తె మీకాలు దావీదును ప్రేమించింది. ఆ విషయం తనకు తెలిసినప్పుడు సౌలు సంతోషించాడు.
- 1 సమూయేలు 18:21సుమారు క్రీ.పూ. 1063
“ఆమెను అతనికి ఇచ్చి పెళ్ళి చేస్తాను అప్పుడు ఆమె అతనికి ఉరిగా మారి ఫిలిష్తీయుల చేయి అతని మీద పడుతుంది” అనుకుని సౌలు దావీదుతో, “నీవు నా అల్లుడు అవ్వడానికి నీకు మరో అవకాశం ఉంది” అన్నాడు.
- 1 సమూయేలు 18:22సుమారు క్రీ.పూ. 1063
సౌలు తన సేవకులను పిలిచి, “మీరు దావీదుతో రహస్యంగా మాట్లాడి, ‘రాజుకు నీవంటే ఇష్టం, అలాగే అతని సేవకులందరు నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నీవు రాజుకు అల్లుడివి కావాలి’ అని చెప్పమని” వారిని ఆజ్ఞాపించాడు.
- 1 సమూయేలు 18:23సుమారు క్రీ.పూ. 1063
సౌలు సేవకులు ఆ మాటలే దావీదుతో మాట్లాడినప్పుడు దావీదు, “రాజుకు అల్లుడు కావడం చిన్న విషయమా? నేను ఒక పేదవాన్ని అంతగా గుర్తింపులేనివాన్ని” అన్నాడు.
- 1 సమూయేలు 18:24సుమారు క్రీ.పూ. 1063
సౌలు సేవకులు దావీదు చెప్పిన మాటలు సౌలుకు తెలియజేశారు.
- 1 సమూయేలు 18:25సుమారు క్రీ.పూ. 1063
అందుకు సౌలు, “రాజు వధువుకు కట్నంగా ఏమి కోరడంలేదు గాని రాజు శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి వందమంది ఫిలిష్తీయుల మర్మాంగ చర్మాలు తీసుకువస్తే సరిపోతుందని దావీదుతో చెప్పండి” అన్నాడు. దావీదు ఫిలిష్తీయుల చేతిలో పడాలనేదే సౌలు పన్నాగము.
- 1 సమూయేలు 18:26సుమారు క్రీ.పూ. 1063
సౌలు సేవకులు ఆ మాటలు దావీదుకు చెప్పినప్పుడు తాను రాజుకు అల్లుడు అవ్వడానికి అంగీకరించాడు. కాబట్టి ఇచ్చిన సమయం కన్నా ముందే,
- 1 సమూయేలు 18:27సుమారు క్రీ.పూ. 1063
దావీదు తన మనుష్యులను తీసుకెళ్లి రెండువందలమంది ఫిలిష్తీయులను చంపి వారి మర్మాంగ చర్మాలు తీసుకువచ్చాడు. రాజుకు అల్లుడు అవ్వడానికి కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగించగా సౌలు తన కుమార్తె మీకాలును అతనికిచ్చి పెళ్ళి చేశాడు.
- 1 సమూయేలు 18:28సుమారు క్రీ.పూ. 1063
యెహోవా దావీదుకు తోడుగా ఉండడం, తన కుమార్తె మీకాలు అతని ప్రేమించడం చూసి,
- 1 సమూయేలు 18:29సుమారు క్రీ.పూ. 1063
సౌలు దావీదుకు మరి ఎక్కువగా భయపడ్డాడు. అతడు జీవించినంతకాలం దావీదును శత్రువుగానే చూశాడు.
- 1 సమూయేలు 18:30సుమారు క్రీ.పూ. 1063
ఫిలిష్తీయుల దళాధిపతులు తరచూ యుద్ధానికి వచ్చేవారు. వారు వచ్చినప్పుడెల్లా దావీదు మిగిలిన సౌలు అధికారులందరికంటే ఎక్కువ విజయాన్ని సాధించేవాడు; కాబట్టి అతనికి ఎంతో పేరు వచ్చింది.
- 1 సమూయేలు 19:1సుమారు క్రీ.పూ. 1062
సౌలు దావీదును చంపమని తన కుమారుడైన యోనాతానుతో తన సేవకులందరితో చెప్పాడు. అయితే యోనాతానుకు దావీదు అంటే ఎంతో ఇష్టము.
- 1 సమూయేలు 19:2సుమారు క్రీ.పూ. 1062
కాబట్టి యోనాతాను దావీదును హెచ్చరిస్తూ, “నా తండ్రియైన సౌలు నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి నీవు ఉదయానే జాగ్రత్తపడి రహస్య స్ధలంలో దాక్కొని ఉండు.
- 1 సమూయేలు 19:3సుమారు క్రీ.పూ. 1062
నేను బయటకు వెళ్లి నీవు ఉన్న పొలంలో మా నాన్నతో పాటు నిలబడి అతనితో నీ గురించి మాట్లాడిన తర్వాత నేను తెలుసుకున్న వాటిని నీకు చెప్తాను” అని అన్నాడు.
- 1 సమూయేలు 19:4సుమారు క్రీ.పూ. 1062
యోనాతాను తన తండ్రియైన సౌలుతో దావీదు గురించి మంచిగా మాట్లాడి, “నీ సేవకుడైన దావీదు నీ పట్ల ఏ తప్పు చేయలేదు గాని ఎంతో మేలు చేశాడు. కాబట్టి రాజా, నీవు అతనికి ఏ హాని చేయవద్దు.
- 1 సమూయేలు 19:5సుమారు క్రీ.పూ. 1062
అతడు తన ప్రాణాలకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపినప్పుడు యెహోవా ఇశ్రాయేలీయులందరికి గొప్ప విజయాన్ని ఇచ్చారు; అది చూసి నీవు కూడా సంతోషించావు. అకారణంగా దావీదువంటి నిరపరాధిని చంపిన పాపం నీకెందుకు?” అని అన్నాడు.
- 1 సమూయేలు 19:6సుమారు క్రీ.పూ. 1062
సౌలు యోనాతాను మాటలు విని, “సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, అతనికి మరణశిక్ష విధించను” అని చెప్పాడు.