- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1050–1010 BC
Samuel & King Saul
Israel demands a king; Samuel anoints Saul, whose disobedience leads to his rejection as God chooses a man after his own heart.
ఈ కాలపు వచనాలు
- 1 సమూయేలు 16:18సుమారు క్రీ.పూ. 1063
అప్పుడు సౌలు సేవకులలో ఒకడు, “బేత్లెహేమీయుడైన యెష్షయి కుమారులలో ఒకనిని చూశాను. అతడు వీణ వాయిస్తాడు. అతడు ధైర్యవంతుడు యుద్ధవీరుడు వివేకం గలవాడు, అందగాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు” అని చెప్పాడు.
- 1 సమూయేలు 16:19సుమారు క్రీ.పూ. 1063
సౌలు యెష్షయి దగ్గరకు దూతలను పంపి, “గొర్రెల దగ్గర ఉన్న నీ కుమారుడైన దావీదును నా దగ్గరకు పంపు” అని కబురు పంపాడు.
- 1 సమూయేలు 16:20సుమారు క్రీ.పూ. 1063
అప్పుడు యెష్షయి ఒక గాడిద మీద రొట్టెలు ద్రాక్షరసపు తిత్తిని ఒక మేకపిల్లను ఉంచి వాటిని తన కుమారుడైన దావీదుతో పాటు సౌలు దగ్గరకు పంపించాడు.
- 1 సమూయేలు 16:21సుమారు క్రీ.పూ. 1063
దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలబడగా సౌలు అతన్ని చాలా ఇష్టపడ్డాడు. దావీదు సౌలు ఆయుధాలను మోసేవారిలో ఒకనిగా నియమించబడ్డాడు.
- 1 సమూయేలు 16:22సుమారు క్రీ.పూ. 1063
తర్వాత సౌలు, “దావీదు అంటే నాకు ఇష్టం ఏర్పడింది కాబట్టి అతడు నా దగ్గర ఉండి సేవ చేయడానికి ఒప్పుకో” అని యెష్షయికి కబురు పంపాడు.
- 1 సమూయేలు 16:23సుమారు క్రీ.పూ. 1063
దేవుని దగ్గర నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చినప్పుడెల్లా దావీదు సితారా పట్టుకుని వాయించేవాడు, అప్పుడు దురాత్మ సౌలును విడిచివెళ్లి అతనికి నెమ్మది కలిగేది.
- 1 సమూయేలు 17:1సుమారు క్రీ.పూ. 1063
ఫిలిష్తీయులు తమ సైన్యాలను యుద్ధానికి సమకూర్చి యూదాలోని శోకోలో సమీకరించి ఎఫెస్-దమ్మీము దగ్గర శోకోకు అజేకాకు మధ్యన శిబిరం ఏర్పరచుకున్నారు.
- 1 సమూయేలు 17:2సుమారు క్రీ.పూ. 1063
సౌలు ఇశ్రాయేలీయులు కలిసివచ్చి ఏలహు లోయలో శిబిరం ఏర్పరచుకొని ఫిలిష్తీయులకు ఎదురుగా పోరాడడానికి యుద్ధవరుసలు ఏర్పరచుకున్నారు.
- 1 సమూయేలు 17:3సుమారు క్రీ.పూ. 1063
ఫిలిష్తీయులు ఒక కొండను, ఇశ్రాయేలీయులు మరొక కొండను ఆక్రమించుకున్నారు, వాటి మధ్య లోయ ఉంది.
- 1 సమూయేలు 17:4సుమారు క్రీ.పూ. 1063
గాతుకు చెందిన గొల్యాతు అనే శూరుడు ఫిలిష్తీయుల శిబిరం నుండి బయలుదేరాడు. అతని ఎత్తు ఆరు మూరల ఒక జేన.
- 1 సమూయేలు 17:5సుమారు క్రీ.పూ. 1063
అతని తలమీద ఇత్తడి శిరస్త్రాణం ఉంది, అతడు 5,000 షెకెళ్ళ బరువుగల ఇత్తడి యుద్ధకవచాన్ని ధరించాడు.
- 1 సమూయేలు 17:6సుమారు క్రీ.పూ. 1063
అతని కాళ్లకు ఇత్తడి తొడుగు అతని వీపు మీద ఒక ఇత్తడి బల్లెం ఉన్నాయి.
- 1 సమూయేలు 17:7సుమారు క్రీ.పూ. 1063
అతని ఈటె నేతపనివాని కర్రంత పెద్దది. అతని ఈటె కొనలో ఉన్న ఇనుము బరువు ఆరువందల షెకెళ్ళు. అతని డాలు మోసేవాడు అతని ముందు నడుస్తున్నాడు.
- 1 సమూయేలు 17:8సుమారు క్రీ.పూ. 1063
గొల్యాతు నిలబడి ఇశ్రాయేలీయుల సైన్యంతో, “మీరు వచ్చి యుద్ధం చేయడానికి ఎందుకు బారులు తీరి నిలబడ్డారు? నేను ఫిలిష్తీయుడను కానా మీరు సౌలు దాసులు కారా? మీ వైపు నుండి ఒకరిని ఎంచుకుని నాతో యుద్ధం చేయడానికి పంపండి.
- 1 సమూయేలు 17:9సుమారు క్రీ.పూ. 1063
అతడు నాతో పోరాడి నన్ను చంపగలగితే మేము మీకు లోబడి ఉంటాం; కాని నేను అతన్ని జయించి చంపితే మీరు మాకు లోబడి మాకు సేవ చేయాలి” అన్నాడు.
- 1 సమూయేలు 17:10సుమారు క్రీ.పూ. 1063
ఆ ఫిలిష్తీయుడు ఇంకా, “ఈ రోజు నేను ఇశ్రాయేలీయుల సైన్యానికి సవాలు విసురుతున్నాను. మీరు ఒకడిని పంపిస్తే మేమిద్దరం ఒకరితో ఒకరం పోరాడతాం” అన్నాడు.
- 1 సమూయేలు 17:11సుమారు క్రీ.పూ. 1063
ఆ ఫిలిష్తీయుని మాటలు విని సౌలు ఇశ్రాయేలీయులందరు చాలా దిగులుపడి భయపడ్డారు.
- 1 సమూయేలు 17:12సుమారు క్రీ.పూ. 1063
దావీదు యూదాలోని బేత్లెహేముకు చెందిన ఎఫ్రాతీయుడైన యెష్షయి కుమారుడు. యెష్షయికి ఎనిమిది మంది కుమారులు. సౌలు కాలంలో అతడు చాలా ముసలివాడు.
- 1 సమూయేలు 17:13సుమారు క్రీ.పూ. 1063
యెష్షయి ముగ్గురు పెద్దకుమారులు సౌలుతో పాటు యుద్ధానికి వెళ్లారు. వారిలో మొదటివాడు ఏలీయాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షమ్మా.
- 1 సమూయేలు 17:14సుమారు క్రీ.పూ. 1063
దావీదు చివరివాడు. పెద్దవారైన ముగ్గురు సౌలుతో పాటు వెళ్లారు.
- 1 సమూయేలు 17:15సుమారు క్రీ.పూ. 1063
అయితే దావీదు బేత్లెహేములో తన తండ్రి గొర్రెలు మేపడానికి, అలాగే సౌలు దగ్గరకు వెళ్లి వస్తుండేవాడు.
- 1 సమూయేలు 17:16సుమారు క్రీ.పూ. 1063
ఆ ఫిలిష్తీయుడు నలభైరోజుల వరకు ప్రతి ఉదయం సాయంత్రం వచ్చి నిలబడేవాడు.
- 1 సమూయేలు 17:17సుమారు క్రీ.పూ. 1063
యెష్షయి తన కుమారుడైన దావీదును పిలిచి, “నీ అన్నల కోసం ఒక ఏఫా వేయించిన గోధుమలు, ఈ పది రొట్టెలను తీసుకుని శిబిరంలో ఉన్న నీ అన్నల దగ్గరకు తొందరగా వెళ్లు.
- 1 సమూయేలు 17:18సుమారు క్రీ.పూ. 1063
అలాగే ఈ పది జున్నుముక్కలు తీసుకెళ్లి వారి సేనాధిపతికి ఇవ్వు. నీ అన్నల క్షేమాన్ని తెలుసుకొని రా.
- 1 సమూయేలు 17:19సుమారు క్రీ.పూ. 1063
వారు సౌలుతో ఉన్నారు; ఇశ్రాయేలీయులందరు ఏలహు లోయలో ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నారు” అని చెప్పి పంపించాడు.