కంటెంట్‌కు వెళ్లండి

circa AD 48–96

Letters to the Churches

Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.

2,767 వచనాలు · 21 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. తీతు 3:8సుమారు క్రీ.శ. 65

    ఇది నమ్మదగిన మాట. కాబట్టి దేవుని నమ్మినవారు మంచి పనులను చేయడానికి శ్రద్ధతో పూనుకొనేలా నీవు ఈ విషయాలను మరింత గట్టిగా బోధించాలని చెప్తున్నాను. ఇవి ఉత్తమమైనవి, అందరికి ప్రయోజనకరమైనవి.

  2. తీతు 3:9సుమారు క్రీ.శ. 65

    అయితే మూర్ఖమైన వివాదాలకు, వంశావళులకు, ధర్మశాస్త్రానికి సంబంధించిన వాదాలకు కలహాలకు దూరంగా ఉండు, ఎందుకంటే అవి నిష్ఫలమైనవి వ్యర్థమైనవి.

  3. తీతు 3:10సుమారు క్రీ.శ. 65

    విభజనలు కలిగించేవారిని మొదటిసారి గద్దించు, రెండవసారి హెచ్చరించు. ఆ తర్వాత వారిని వదిలేయి.

  4. తీతు 3:11సుమారు క్రీ.శ. 65

    అలాంటివారు చెడిపోయినవారు, పాపాత్ములు; వారు తమను తామే నిందించుకుంటారని నీకు ఖచ్చితంగా తెలుసు.

  5. తీతు 3:12సుమారు క్రీ.శ. 65

    నేను నికొపోలిలో శీతాకాలం గడపాలని అనుకుంటున్నాను, కాబట్టి నేను ఆర్తెమాను లేదా తుకికును నీ దగ్గరకు పంపిన వెంటనే నీవు బయలుదేరి నికొపోలిలో నా దగ్గరకు రావడానికి సిద్ధంగా ఉండు.

  6. తీతు 3:13సుమారు క్రీ.శ. 65

    న్యాయవాది జేనాసు అపొల్లోను జాగ్రత్తగా పంపించు, వారి ప్రయాణానికి కావలసినవన్ని సమకూర్చి తగిన సహాయం చేయి.

  7. తీతు 3:14సుమారు క్రీ.శ. 65

    మన ప్రజలు నిష్ఫలమైన జీవితాలను జీవించకుండా అవసరాలకు తగినట్లు మంచి పనులు చేయడంలో శ్రద్ధ వహించడం నేర్చుకోవాలి.

  8. తీతు 3:15సుమారు క్రీ.శ. 65

    నాతో ఉన్నవారందరు నీకు శుభాలు తెలియజేస్తున్నారు. విశ్వాసాన్నిబట్టి మమ్మల్ని ప్రేమించేవారందరికి మా వందనాలు తెలియజేయి. దేవుని కృప మీ అందరితో ఉండును గాక.

  9. ఫిలేమోను 1:1సుమారు క్రీ.శ. 64

    క్రీస్తు యేసును బట్టి ఖైదీనైన, పౌలు అనే నేను, మన సహోదరుడైన తిమోతి కలిసి,

  10. ఫిలేమోను 1:2సుమారు క్రీ.శ. 64

    మన సహోదరి అప్ఫియకు, తోటి సైనికుడైన అర్ఖిప్పుకు, మీ ఇంట్లో కూడుకొనే సంఘానికి వ్రాయునది:

  11. ఫిలేమోను 1:3సుమారు క్రీ.శ. 64

    మన తండ్రియైన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు కృపా సమాధానాలు కలుగును గాక.

  12. ఫిలేమోను 1:4సుమారు క్రీ.శ. 64

    ప్రభువైన యేసులో నీకున్న విశ్వాసం, దేవుని ప్రజల పట్ల నీవు చూపే ప్రేమ గురించి నేను విన్నప్పటి నుండి నా ప్రార్థనలలో నిన్ను జ్ఞాపకం చేసికొని, నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.

  13. ఫిలేమోను 1:5సుమారు క్రీ.శ. 64

    Hearing of thy love and faith, which thou hast toward the Lord Jesus, and toward all saints;

  14. ఫిలేమోను 1:6సుమారు క్రీ.శ. 64

    క్రీస్తు కోసం మనం పంచుకున్న ప్రతి మంచి విషయం పట్ల నీ విశ్వాసం మరింత జ్ఞానంలో వృద్ధిపొంది ఉపయోగకరంగా, మాతో పాలివానిగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.

  15. ఫిలేమోను 1:7సుమారు క్రీ.శ. 64

    సహోదరుడా, నీవు పరిశుద్ధుల హృదయాలను సేదదీర్చినందుకు, నీ ప్రేమ నాకెంతో సంతోషాన్ని, ప్రోత్సాహాన్ని కలిగించింది.

  16. ఫిలేమోను 1:8సుమారు క్రీ.శ. 64

    అందువల్ల, నీవేమి చేయాలనే దాని గురించి, క్రీస్తులో నేను ధైర్యంగా నిన్ను ఆజ్ఞాపించగలిగినా,

  17. ఫిలేమోను 1:9సుమారు క్రీ.శ. 64

    ముసలివాన్ని ఇప్పుడు యేసు క్రీస్తు కోసం ఖైదీగా ఉన్న పౌలు అనే నేను నిన్ను ప్రేమను బట్టి వేడుకుంటున్నాను.

  18. ఫిలేమోను 1:10సుమారు క్రీ.శ. 64

    నేను సంకెళ్ళతో బంధించబడి ఉన్నప్పుడు నాకు కుమారునిగా మారిన ఒనేసిము కోసం నిన్ను వేడుకుంటున్నాను.

  19. ఫిలేమోను 1:11సుమారు క్రీ.శ. 64

    గతంలో అతడు నీకు నిష్ప్రయోజకుడే కావచ్చు, కాని ఇప్పుడు అతడు నీకు నాకు, ఇద్దరికి ఉపయోగపడే వానిగా అయ్యాడు.

  20. ఫిలేమోను 1:12సుమారు క్రీ.శ. 64

    నా ప్రాణంతో సమానమైన ఇతన్ని, తిరిగి నీ దగ్గరకు పంపిస్తున్నాను.

  21. ఫిలేమోను 1:13సుమారు క్రీ.శ. 64

    నేను సువార్త కోసం సంకెళ్ళతో బంధింపబడి ఉన్న సమయంలో నాకు సహాయం చేయడానికి నీ బదులుగా అతన్ని నాతో పాటు ఉంచుకుని ఉండేవాన్ని.

  22. ఫిలేమోను 1:14సుమారు క్రీ.శ. 64

    కానీ, నీకు తెలియజేయకుండా నేను ఏమి చేయాలనుకోలేదు, ఎందుకంటే నీవు చేసే ఏ సహాయమైనా నీ ఇష్టపూర్వకంగానే చేయాలి కాని, బలవంతంగా కాదని నా అభిప్రాయం.

  23. ఫిలేమోను 1:15సుమారు క్రీ.శ. 64

    ఇతడు కొంతకాలం నీ నుండి వేరుకావడానికి కారణం, అతడు ఒక బానిసగా కాకుండా, బానిస కంటే ప్రియమైన సహోదరునిగా ఎల్లప్పుడు నీతో పాటు ఉండడానికే కావచ్చును.

  24. ఫిలేమోను 1:16సుమారు క్రీ.శ. 64

    ఇతడు నాకు చాలా ప్రియమైన వాడు, కాని, సాటి మనిషిగా ప్రభువులో ఒక సహోదరునిగా నీకు కూడా మరింత ప్రియమైన వాడుగా ఉన్నాడు.

  25. ఫిలేమోను 1:17సుమారు క్రీ.శ. 64

    కాబట్టి నీవు నన్ను ఒక జతపనివానిగా భావిస్తే, నన్ను ఆహ్వానించినట్లే అతన్ని కూడా ఆహ్వానించు.