circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
ఈ కాలపు వచనాలు
- ఫిలేమోను 1:18సుమారు క్రీ.శ. 64
ఒకవేళ అతడు ఏదైనా తప్పు చేసినా లేదా నీకు ఏదైనా బాకీ ఉన్నా, వాటిని నా లెక్కలో వేయి.
- ఫిలేమోను 1:19సుమారు క్రీ.శ. 64
పౌలు అనే నేను, నా స్వహస్తంతో దీనిని వ్రాస్తున్నాను. నేను ఆ లెక్క చెల్లిస్తాను. నిజానికి, స్వయాన నీవే నాకు బాకీగా ఉన్నావని చెప్పనవసరం లేదు.
- ఫిలేమోను 1:20సుమారు క్రీ.శ. 64
అవును సహోదరుడా, ప్రభువులో నీ నుండి నేను కొంత లాభం పొందాలని ఆశిస్తున్నాను; క్రీస్తులో నా హృదయాన్ని ఉత్తేజపరచు.
- ఫిలేమోను 1:21సుమారు క్రీ.శ. 64
నేను అడిగిన దానికంటే ఎక్కువగా నీవు చేస్తావని తెలిసే, నీ విధేయత మీద నమ్మకంతో నేను నీకు వ్రాస్తున్నాను.
- ఫిలేమోను 1:22సుమారు క్రీ.శ. 64
మరొక విషయం: మీ ప్రార్థనలను బట్టి మీ దగ్గరకు తిరిగి రావాలని నేను నిరీక్షిస్తున్నాను, కాబట్టి నా కోసం ఒక వసతిగదిని ఏర్పాటు చేయండి.
- ఫిలేమోను 1:23సుమారు క్రీ.శ. 64
యేసు క్రీస్తు నిమిత్తం నాతో పాటు ఖైదీగా ఉన్న, ఎపఫ్రా మీకు వందనాలు తెలియజేస్తున్నాడు.
- ఫిలేమోను 1:24సుమారు క్రీ.శ. 64
అదే విధంగా మార్కు, అరిస్తర్కు, దేమా, లూకా అనే నా జతపనివారు కూడా వందనాలు తెలియజేస్తున్నారు.
- ఫిలేమోను 1:25సుమారు క్రీ.శ. 64
ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక.
- హెబ్రీయులకు 1:1సుమారు క్రీ.శ. 64
గతంలో దేవుడు మన పితరులతో ప్రవక్తల ద్వారా ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా మాట్లాడారు.
- హెబ్రీయులకు 1:2సుమారు క్రీ.శ. 64
కాని ఈ చివరి దినాల్లో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడారు, ఆయన తన కుమారున్ని సమస్తానికి వారసునిగా నియమించారు, ఆయన ద్వారానే ఈ జగత్తును కూడా సృష్టించారు.
- హెబ్రీయులకు 1:3సుమారు క్రీ.శ. 64
ఆ కుమారుడు తన శక్తిగల మాటచేత సమస్తాన్ని సంరక్షిస్తూ, దేవుని మహిమ యొక్క ప్రకాశంగా, ఆయన ఉనికికి ఖచ్చితమైన ప్రాతినిధ్యంగా ఉన్నారు. పాపాలకు ఆయన శుద్ధీకరణను సిద్ధపరచిన తర్వాత, ఆయన పరలోకంలో మహోన్నతుని కుడి వైపున కూర్చున్నారు.
- హెబ్రీయులకు 1:4సుమారు క్రీ.శ. 64
కాబట్టి ఆయన దేవదూతల కంటే ఉన్నతమైన నామాన్ని వారసత్వంగా పొందినట్లే ఆయన దేవదూతల కంటే ఉన్నతమైన స్థానాన్ని పొందారు.
- హెబ్రీయులకు 1:5సుమారు క్రీ.శ. 64
దేవదూతల్లో ఎవరితోనైనా ఎన్నడైన దేవుడు, “నీవు నా కుమారుడవు; ఈ రోజు నేను నీకు తండ్రిని అయ్యాను” అని గాని, “నేను అతనికి తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారునిగా ఉంటాడు,” అని గాని అన్నారా?
- హెబ్రీయులకు 1:6సుమారు క్రీ.శ. 64
దేవుడు తన మొదటి సంతానాన్ని భూలోకానికి తెచ్చినప్పుడు, ఆయన, “దేవదూతలందరు ఆయనను ఆరాధించాలి,” అని చెప్పారు.
- హెబ్రీయులకు 1:7సుమారు క్రీ.శ. 64
దేవదూతల గురించి మాట్లాడుతూ ఆయన ఇలా అన్నారు, “ఆయన తన దూతలను ఆత్మలుగా, తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేస్తారు,” అని అన్నారు.
- హెబ్రీయులకు 1:8సుమారు క్రీ.శ. 64
కాని తన కుమారుని గురించి ఆయన, “ఓ దేవా, మీ సింహాసనం నిరంతరం నిలుస్తుంది; మీ న్యాయ దండం మీ రాజ్య రాజదండం.
- హెబ్రీయులకు 1:9సుమారు క్రీ.శ. 64
మీరు నీతిని ప్రేమించి దుష్టత్వాన్ని ద్వేషించారు; కాబట్టి దేవుడు, మీ దేవుడు, ఆనంద తైలంతో మిమ్మల్ని అభిషేకించి, మీ తోటివారి కన్నా మిమ్మల్ని ఉన్నతస్థితికి హెచ్చించారు,” అని అన్నారు.
- హెబ్రీయులకు 1:10సుమారు క్రీ.శ. 64
ఇంకా ఆయన, “ప్రభువా, ఆదిలో మీరు భూమికి పునాదులు వేశారు, ఆకాశాలు మీ చేతి పని.
- హెబ్రీయులకు 1:11సుమారు క్రీ.శ. 64
అవి అంతరించిపోతాయి, కాని మీరు నిలిచి ఉంటారు; ఒక వస్త్రంలా అవన్నీ పాతగిల్లుతాయి.
- హెబ్రీయులకు 1:12సుమారు క్రీ.శ. 64
వాటిని మీరు అంగీలా చుట్టి పెడతారు; వస్త్రంలా అవన్నీ మార్చబడతాయి. కానీ మీరు అలాగే ఉంటారు, మీ సంవత్సరాలకు అంతం ఉండదు,” అని అన్నారు.
- హెబ్రీయులకు 1:13సుమారు క్రీ.శ. 64
దేవుడు దేవదూతల్లో ఎవరితోనైనా ఎప్పుడైనా, “నేను నీ శత్రువులను నీ పాదాలకు పాదపీఠంగా చేసే వరకు నా కుడి వైపున కూర్చో అని చెప్పారా”?
- హెబ్రీయులకు 1:14సుమారు క్రీ.శ. 64
దేవదూతలందరు రక్షణను వారసత్వంగా పొందబోయే వారికి పరిచర్య చేయడానికి పంపబడిన ఆత్మలు కారా?
- హెబ్రీయులకు 2:1సుమారు క్రీ.శ. 64
కాబట్టి మనం ప్రక్కకు మళ్ళించబడకుండా ఉండడానికి, మనం విన్న వాటి పట్ల అత్యంత జాగ్రత్తగా శ్రద్ధ వహించాలి.
- హెబ్రీయులకు 2:2సుమారు క్రీ.శ. 64
ఎందుకంటే దేవదూతల ద్వారా చెప్పబడిన వర్తమానం స్థిరపరచబడింది కాబట్టి, ప్రతి అతిక్రమం అవిధేయత న్యాయమైన శిక్షను పొందగా,
- హెబ్రీయులకు 2:3సుమారు క్రీ.శ. 64
మనం గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే, మనం ఎలా తప్పించుకోగలం? ఈ రక్షణను ప్రభువే మొదట ప్రకటించారు. ఆయన మాటలు విన్నవారి ద్వారా అది మనకు నిరూపించబడింది.