కంటెంట్‌కు వెళ్లండి

circa AD 48–96

Letters to the Churches

Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.

2,767 వచనాలు · 21 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఫిలిప్పీయులకు 3:10సుమారు క్రీ.శ. 64

    నేను క్రీస్తును తెలుసుకోవాలని కోరుతున్నాను, అవును, ఆయన పునరుత్థాన శక్తిని తెలుసుకోవాలని, ఆయన శ్రమలలో పాలుపంచుకోవడం, ఆయన మరణంలో ఆయనలా కావడం,

  2. ఫిలిప్పీయులకు 3:11సుమారు క్రీ.శ. 64

    అలా, ఏదో ఒక విధంగా, మృతులలో నుండి పునరుత్థానం పొందడము.

  3. ఫిలిప్పీయులకు 3:12సుమారు క్రీ.శ. 64

    నేను ఇప్పటికే ఇవన్నీ పొందానని గాని, నా లక్ష్యాన్ని చేరుకున్నానని గాని నేను భావించడంలేదు, కాని దేనికోసం క్రీస్తు యేసు నన్ను పట్టుకున్నారో దానిని పట్టుకోవాలని పరుగెడుతున్నాను.

  4. ఫిలిప్పీయులకు 3:13సుమారు క్రీ.శ. 64

    సహోదరీ సహోదరులారా, నేను ఇంతకుముందే దానిని పట్టుకున్నానని భావించను, అయితే నేను చేస్తున్నది ఒకటే, వెనుక ఉన్నవాటిని మరచిపోయి ముందున్న వాటికోసం ప్రయాసపడుతున్నాను,

  5. ఫిలిప్పీయులకు 3:14సుమారు క్రీ.శ. 64

    క్రీస్తు యేసులో దేవుని ఉన్నత పిలుపు వలన కలిగే బహుమానాన్ని గెలవడానికి, లక్ష్యం వైపే పరుగెడుతున్నాను.

  6. ఫిలిప్పీయులకు 3:15సుమారు క్రీ.శ. 64

    కాబట్టి మనలో సంపూర్ణులమైన వారందరం ఇదే భావాన్ని కలిగి ఉందాము. అప్పుడు దేని గురించైనా మీరు వేరుగా ఆలోచిస్తే, దాన్ని కూడా దేవుడు మీకు స్పష్టం చేస్తారు.

  7. ఫిలిప్పీయులకు 3:16సుమారు క్రీ.శ. 64

    అయినా ఇప్పటివరకు మనం పొందుకున్న దానిని బట్టే క్రమంగా జీవిద్దాము.

  8. ఫిలిప్పీయులకు 3:17సుమారు క్రీ.శ. 64

    సహోదరీ సహోదరులారా, మీరు నా మాదిరిని అనుసరించండి. మేము మీకు మాదిరిగా ఉన్నట్లే, ఎవరైతే మాలా జీవిస్తారో వారిపై మీ దృష్టిని ఉంచండి.

  9. ఫిలిప్పీయులకు 3:18సుమారు క్రీ.శ. 64

    అనేకమంది క్రీస్తు సిలువకు శత్రువులుగా జీవిస్తున్నారు, గతంలో వీరిని గురించి మీతో అనేకసార్లు చెప్పినా, మరల ఇప్పుడు కన్నీటితో చెప్తున్నాను.

  10. ఫిలిప్పీయులకు 3:19సుమారు క్రీ.శ. 64

    వారి గమ్యం నాశనం, వారి కడుపే వారికి దేవుడు, తాము సిగ్గుపడవలసిన వాటిలో వారు గర్వపడుతున్నారు. భూసంబంధమైన వాటిపైనే తమ మనస్సు ఉంచుతున్నారు.

  11. ఫిలిప్పీయులకు 3:20సుమారు క్రీ.శ. 64

    అయితే మన పౌరసత్వం పరలోకంలో ఉంది, కాబట్టి అక్కడినుండి వచ్చే మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తు గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము.

  12. ఫిలిప్పీయులకు 3:21సుమారు క్రీ.శ. 64

    సమస్తాన్ని తన ఆధీనంలోనికి తీసుకురాగల తన శక్తినిబట్టి, ఆయన మన నీచమైన శరీరాలను తన మహిమగల శరీరాన్ని పోలి ఉండేలా మార్చగలరు.

  13. ఫిలిప్పీయులకు 4:1సుమారు క్రీ.శ. 64

    కాబట్టి, నా సహోదరీ సహోదరులారా, నా ఆనందం నా కిరీటమైన నా ప్రియ స్నేహితులారా, నేను మిమ్మల్ని ప్రేమించి, ఈ విధంగా మీరు ప్రభువులో స్థిరంగా నిలబడి ఉండాలని కోరుకుంటున్నాను.

  14. ఫిలిప్పీయులకు 4:2సుమారు క్రీ.శ. 64

    ప్రభువులో ఏక మనస్సు కలిగి ఉండమని యువొదియను, సుంటుకేను బ్రతిమాలుతున్నాను.

  15. ఫిలిప్పీయులకు 4:3సుమారు క్రీ.శ. 64

    అవును, నా నిజమైన సహకారీ, జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడిన ఈ స్త్రీలు క్లెమెంతుతో మిగతా నా సహపనివారితో కలిసి సువార్త పనిలో నాతోకూడ ప్రయాసపడ్డారు. కాబట్టి వారికి సహాయం చేయమని నిన్ను అడుగుతున్నా.

  16. ఫిలిప్పీయులకు 4:4సుమారు క్రీ.శ. 64

    ఎల్లప్పుడు ప్రభువులో ఆనందించండి, మరల చెప్తున్నాను ఆనందించండి.

  17. ఫిలిప్పీయులకు 4:5సుమారు క్రీ.శ. 64

    మీ శాంత స్వభావాన్ని అందరికి స్పష్టంగా తెలియనివ్వండి. ప్రభువు సమీపంగా ఉన్నారు.

  18. ఫిలిప్పీయులకు 4:6సుమారు క్రీ.శ. 64

    దేన్ని గురించి వేదన పడకండి, కాని ప్రతి విషయంలో ప్రార్థనావిజ్ఞాపనల చేత కృతజ్ఞతా పూర్వకంగా మీ విన్నపాలను దేవునికి తెలియజేయండి.

  19. ఫిలిప్పీయులకు 4:7సుమారు క్రీ.శ. 64

    అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయాలను మీ తలంపులను కాపాడుతుంది.

  20. ఫిలిప్పీయులకు 4:8సుమారు క్రీ.శ. 64

    చివరిగా, సహోదరీ సహోదరులారా, ఏదైనా యోగ్యమైనదిగా లేదా మంచిగా ఉంటే, సత్యమైన వాటి మీద, గొప్పవాటి మీద, న్యాయమైన వాటి మీద, పవిత్రమైన వాటి మీద, సుందరమైన వాటి మీద, ఘనమైన వాటి మీద మీ మనస్సులను పెట్టండి.

  21. ఫిలిప్పీయులకు 4:9సుమారు క్రీ.శ. 64

    మీరు నా నుండి ఏవి నేర్చుకున్నారో, పొందారో లేదా విన్నారో లేదా నాలో ఏమి చూశారు వాటిని ఆచరణలో పెట్టండి. అప్పుడు సమాధానకర్తయైన దేవుడు మీతో ఉంటారు.

  22. ఫిలిప్పీయులకు 4:10సుమారు క్రీ.శ. 64

    నా గురించి మీరు తిరిగి మరల ఆలోచిస్తున్నారని ప్రభువులో ఎంతో సంతోషించాను. మీరు నా గురించి ఆలోచిస్తున్నారు, గాని దానిని చూపించడానికి తగిన అవకాశం మీకు దొరకలేదు.

  23. ఫిలిప్పీయులకు 4:11సుమారు క్రీ.శ. 64

    నేను అవసరంలో ఉన్నానని ఇలా చెప్పడం లేదు. ఎందుకంటే ఏ స్థితిలో ఉన్నా, ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను.

  24. ఫిలిప్పీయులకు 4:12సుమారు క్రీ.శ. 64

    దీనస్థితిలో ఉండడం అంటే నాకు తెలుసు, సంపన్న స్థితిలో ఉండడం కూడా నాకు తెలుసు. ఏ స్థితిలోనైనా అన్ని పరిస్థితుల్లో అనగా, కడుపునిండా తిన్నా లేదా ఆకలితో ఉన్నా, సమృద్ధిగా ఉన్నా లేదా అవసరంలో ఉన్నా తృప్తి కలిగి ఉండడానికి రహస్యాన్ని నేను నేర్చుకున్నాను.

  25. ఫిలిప్పీయులకు 4:13సుమారు క్రీ.శ. 64

    నన్ను బలపరిచే ఆయనలోనే నేను ఇవన్నీ చేయగలను.