circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
ఈ కాలపు వచనాలు
- కొలొస్సయులకు 1:16సుమారు క్రీ.శ. 64
ఎందుకనగా, ఆయనలోనే సమస్తం సృష్టించబడ్డాయి, అనగా: ఆకాశంలో ఉన్నవి, భూమిపై ఉన్నవి, కంటికి కనబడేవి కనబడనివి, సింహాసనాలైనా లేదా ప్రభుత్వాలైనా లేదా పాలకులైనా లేదా అధికారులైనా, సమస్తం ఆయన ద్వారానే ఆయన కొరకే సృష్టించబడ్డాయి.
- కొలొస్సయులకు 1:17సుమారు క్రీ.శ. 64
ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, సమస్తానికి ఆయనే ఆధారము.
- కొలొస్సయులకు 1:18సుమారు క్రీ.శ. 64
సంఘమనే శరీరానికి ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో సర్వాధికారం కలిగి ఉండడానికి ఆయనే ఆరంభం, మృతులలో నుండి లేచుటలో ప్రథముడయ్యారు.
- కొలొస్సయులకు 1:19సుమారు క్రీ.శ. 64
ఆయనలో దేవుని సంపూర్ణత నివసించాలని తండ్రి యొక్క దేవుని ఉద్దేశం.
- కొలొస్సయులకు 1:20సుమారు క్రీ.శ. 64
ఆయన ద్వారా సమస్తాన్ని అనగా, భూమిపై ఉన్న లేదా పరలోకంలో ఉన్న, అన్నిటిని, క్రీస్తు సిలువలో కార్చిన రక్తం ద్వారా రాజీపరచి, క్రీస్తు ద్వారా తనలో సమాధానపరచుకోవడం తండ్రికి ఇష్టమైనది.
- కొలొస్సయులకు 1:21సుమారు క్రీ.శ. 64
ఒకప్పుడు మీరు దేవుని నుండి దూరం అయ్యారు, మీ దుష్ట ప్రవర్తన వలన మీ మనస్సులో విరోధులయ్యారు.
- కొలొస్సయులకు 1:22సుమారు క్రీ.శ. 64
అయితే, దేవుడు మిమ్మల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా తన సన్నిధిలో నిలబెట్టడానికి యేసు యొక్క భౌతికమైన శరీరం మరణించుట ద్వారా ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచారు.
- కొలొస్సయులకు 1:23సుమారు క్రీ.శ. 64
అందువల్ల మీరు విశ్వాసంలో కొనసాగుతూ స్థిరంగా నిలబడి, సువార్తలో చెప్పబడిన నిరీక్షణలో నుండి తొలగిపోకుండా ఉండండి. మీరు విన్న ఈ సువార్త, ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడుతుంది, పౌలు అనే నేను ఆ సువార్తకు సేవకుడినయ్యాను.
- కొలొస్సయులకు 1:24సుమారు క్రీ.శ. 64
మీ కోసం నేను అనుభవిస్తున్న శ్రమలలో ఇప్పుడు నేను సంతోషిస్తున్నాను, సంఘమనే ఆయన శరీరం కోసం క్రీస్తు పడిన బాధల్లో మిగిలి ఉన్న వాటిలో నా వంతును, నా శరీరంలో పూర్తి చేస్తున్నాను.
- కొలొస్సయులకు 1:25సుమారు క్రీ.శ. 64
మీకు దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా తెలియజేయడానికి, దేవుడు నాకు అప్పగించిన బాధ్యతను బట్టి సంఘానికి సేవకుడినయ్యాను.
- కొలొస్సయులకు 1:26సుమారు క్రీ.శ. 64
దేవుని వాక్యం అనగా గత అనేక యుగాలుగా తరాలుగా మరుగుచేయబడిన మర్మం, కాని ఇది ఇప్పుడు పరిశుద్ధులకు తెలియజేయబడింది.
- కొలొస్సయులకు 1:27సుమారు క్రీ.శ. 64
యూదేతరుల మధ్యలో నుండి దేవుడు ఎన్నికచేసిన వారికి ఈ మర్మం యొక్క సంపూర్ణ మహిమైశ్వర్యం ఎలాంటిదో, అనగా మీలో ఉన్న క్రీస్తు, మహిమ నిరీక్షణయై ఉన్నారనే విషయం తెలియజేయబడింది.
- కొలొస్సయులకు 1:28సుమారు క్రీ.శ. 64
మేము అందరిని సంపూర్ణులుగా క్రీస్తులో నిలబెట్టడానికి సమస్త జ్ఞానంతో అందరికి ఆయన గురించే ప్రకటిస్తున్నాము, హెచ్చరిస్తున్నాము, బోధిస్తున్నాము.
- కొలొస్సయులకు 1:29సుమారు క్రీ.శ. 64
నాలో బలంగా పని చేస్తున్న క్రీస్తు శక్తి అంతటిని బట్టి, ఇప్పటివరకు నేను ప్రయాసపడి పని చేస్తున్నాను.
- కొలొస్సయులకు 2:1సుమారు క్రీ.శ. 64
మీ కోసం లవొదికయలో ఉన్న వారి కోసం, వ్యక్తిగతంగా నన్ను కలుసుకొనని వారందరి కోసం నేను ఎంతగా కష్టపడుతున్నానో మీరు తెలుసుకోవాలని ఆశిస్తున్నాను.
- కొలొస్సయులకు 2:2సుమారు క్రీ.శ. 64
వారు క్రీస్తు అనే దేవుని మర్మాన్ని స్పష్టంగా తెలుసుకొని, సంపూర్ణ గ్రహింపు అనే గొప్ప సంపదను కలిగి ఉండి, హృదయాల్లో ధైర్యపరచబడి ప్రేమలో ఐక్యత కలిగి ఉండాలనేదే నా లక్ష్యము.
- కొలొస్సయులకు 2:3సుమారు క్రీ.శ. 64
బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనలోనే దాచబడి ఉన్నాయి.
- కొలొస్సయులకు 2:4సుమారు క్రీ.శ. 64
ఇంపైన మాటలతో ఎవరూ మిమ్మల్ని మోసపరచకూడదని దీనిని మీకు చెప్తున్నాను.
- కొలొస్సయులకు 2:5సుమారు క్రీ.శ. 64
నేను శరీర విషయంలో మీకు దూరంగా ఉన్నా కాని, ఆత్మలో మీతో కూడా ఉండి, మీరు ఎంత క్రమశిక్షణగా ఉన్నారో క్రీస్తులో మీ విశ్వాసం ఎంత స్థిరంగా ఉందో చూసి ఆనందిస్తున్నాను.
- కొలొస్సయులకు 2:6సుమారు క్రీ.శ. 64
కాబట్టి, మీరు క్రీస్తు యేసును ప్రభువుగా అంగీకరించినట్టుగా, ఆయనలో వేరుపారి బలపడుతూ,
- కొలొస్సయులకు 2:7సుమారు క్రీ.శ. 64
మీకు బోధించబడిన ప్రకారం విశ్వాసంలో స్థిరపడుతూ, మరి ఎక్కువగా కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ, ఆయనలో మీరు జీవించడం కొనసాగించండి.
- కొలొస్సయులకు 2:8సుమారు క్రీ.శ. 64
క్రీస్తుపై కాకుండా, మానవ ఆచార సాంప్రదాయాలు ఈ లోకసంబంధమైన మూల నియమాలపై ఆధారపడిన మోసకరమైన వ్యర్థ తత్వజ్ఞానంతో ఎవరూ మిమ్మల్ని బంధించకుండా జాగ్రత్తపడండి.
- కొలొస్సయులకు 2:9సుమారు క్రీ.శ. 64
ఎందుకంటే, పరిపూర్ణ దైవత్వం శరీర రూపంలో క్రీస్తులో జీవిస్తుంది.
- కొలొస్సయులకు 2:10సుమారు క్రీ.శ. 64
మీరు క్రీస్తులో పరిపూర్ణతలోనికి తీసుకురాబడ్డారు. సమస్త బలానికి అధికారానికి ఆయనే శిరస్సు.
- కొలొస్సయులకు 2:11సుమారు క్రీ.శ. 64
మానవ చేతులతో చేయబడని సున్నతిని క్రీస్తులో మీరు పొందారు. క్రీస్తు చేత మీరు సున్నతి చేయబడినప్పుడు, మిమ్మల్ని పరిపాలిస్తున్న మీ శరీర పాప స్వభావం కొట్టివేయబడింది.