circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
ఈ కాలపు వచనాలు
- కొలొస్సయులకు 3:14సుమారు క్రీ.శ. 64
వీటన్నిటికి పైగా, పరిపూర్ణ ఐక్యతలో బంధించే ప్రేమను ధరించుకోండి.
- కొలొస్సయులకు 3:15సుమారు క్రీ.శ. 64
ఒకే శరీరంలోని అవయవాల వలె, సమాధానం కోసం మీరు పిలువబడ్డారు, కాబట్టి క్రీస్తు యొక్క సమాధానం మీ హృదయాలను పరిపాలించనివ్వండి. అలాగే కృతజ్ఞత కలిగి ఉండండి.
- కొలొస్సయులకు 3:16సుమారు క్రీ.శ. 64
సంగీతంతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పాటలతో సమస్త జ్ఞానంతో ఒకరికి ఒకరు బోధించుకుంటూ, హెచ్చరించుకుంటూ మీ హృదయాల్లో కృతజ్ఞతతో దేవుని గురించి పాటలు పాడుతూ, క్రీస్తు సువార్తను మీ మధ్యలో సమృద్ధిగా నివసింపనివ్వండి.
- కొలొస్సయులకు 3:17సుమారు క్రీ.శ. 64
మీరు మాటల్లో కాని పనులలో కాని, ఏమి చేసినా ప్రభువైన యేసు నామంలో చేయండి, తండ్రియైన దేవునికి ఆయన ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండండి.
- కొలొస్సయులకు 3:18సుమారు క్రీ.శ. 64
భార్యలారా, మీ భర్తలకు లోబడి ఉండండి, అది ప్రభువులో తగినది.
- కొలొస్సయులకు 3:19సుమారు క్రీ.శ. 64
భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి వారితో కఠినంగా ప్రవర్తించకండి.
- కొలొస్సయులకు 3:20సుమారు క్రీ.శ. 64
పిల్లలారా, అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ప్రభువుకు ఇష్టము.
- కొలొస్సయులకు 3:21సుమారు క్రీ.శ. 64
తండ్రులారా, మీ పిల్లల మనస్సు నిరుత్సాహపడేటట్లు వారికి కోపం రేపకండి.
- కొలొస్సయులకు 3:22సుమారు క్రీ.శ. 64
బానిసలారా, మీ భూసంబంధ యజమానులకు లోబడి ఉండండి; వారి కనుదృష్టి మీమీద ఉన్నప్పుడు వారి దయను పొందాలని కాకుండా చిత్తశుద్ధి గల హృదయంతో, ప్రభువుకు భయపడుతూ అన్ని విషయాల్లో వారికి లోబడి ఉండండి.
- కొలొస్సయులకు 3:23సుమారు క్రీ.శ. 64
మీరు ఏమి చేసినా, అది మనుష్యుల మెప్పు కోసం కాకుండా ప్రభువు కోసం చేస్తున్నామని హృదయపూర్వకంగా చేయండి.
- కొలొస్సయులకు 3:24సుమారు క్రీ.శ. 64
మీరు ప్రభువు నుండి స్వాస్థ్యాన్ని ప్రతిఫలంగా పొందుకుంటారని మీకు తెలుసు కాబట్టి మీరు ప్రభువైన క్రీస్తునే సేవిస్తున్నారు.
- కొలొస్సయులకు 3:25సుమారు క్రీ.శ. 64
తప్పు చేసినవారికి, వారి తప్పులను బట్టి తగిన శిక్ష ఇవ్వబడుతుంది, ఇందులో ఎటువంటి పక్షపాతం ఉండదు.
- కొలొస్సయులకు 4:1సుమారు క్రీ.శ. 64
యజమానులారా, పరలోకంలో మీకు కూడా యజమాని ఉన్నాడని మీకు తెలుసు కాబట్టి, మీ దాసులకు సరియైనది న్యాయమైనది ఇవ్వండి.
- కొలొస్సయులకు 4:2సుమారు క్రీ.శ. 64
కృతజ్ఞత కలిగి మెలకువగా ఉండి, నిరంతరం ప్రార్థన చేయండి.
- కొలొస్సయులకు 4:3సుమారు క్రీ.శ. 64
నేను సంకెళ్ళతో ఉండడానికి కారణమైన క్రీస్తు మర్మాన్ని మేము ప్రకటించడానికి, మా సువార్త పరిచర్యకు దేవుడు ద్వారాలను తెరవాలని మాకోసం కూడా ప్రార్థన చేయండి.
- కొలొస్సయులకు 4:4సుమారు క్రీ.శ. 64
నేను ప్రకటించవలసినంత స్పష్టంగా ప్రకటించడానికి నా కోసం ప్రార్థన చేయండి.
- కొలొస్సయులకు 4:5సుమారు క్రీ.శ. 64
ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, సంఘానికి బయటివారితో జ్ఞానంతో ప్రవర్తించండి.
- కొలొస్సయులకు 4:6సుమారు క్రీ.శ. 64
మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లు రుచిగా కృపతో నిండిన మాటలతో, అందరికి ఎలా జవాబు చెప్పాలో తెలిసిన వారిగా ఉండాలి.
- కొలొస్సయులకు 4:7సుమారు క్రీ.శ. 64
తుకికు నా సమాచారాన్ని మీకు తెలియజేస్తాడు. అతడు ప్రియ సహోదరుడు, ప్రభువులో నమ్మకమైన పరిచారకుడు నా తోటి సేవకుడు.
- కొలొస్సయులకు 4:8సుమారు క్రీ.శ. 64
మీరు మా స్ధితి తెలుసుకోవాలని, అతడు మీ హృదయాలను ప్రోత్సాహపరచాలనే ఉద్దేశంతో అతన్ని మీ దగ్గరకు పంపుతున్నాను.
- కొలొస్సయులకు 4:9సుమారు క్రీ.శ. 64
అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిము వస్తున్నాడు, అతడు మీలో ఒకడు. ఇక్కడి సంగతులన్ని వారు మీకు తెలియజేస్తారు.
- కొలొస్సయులకు 4:10సుమారు క్రీ.శ. 64
నా తోటి ఖైదీలైన అరిస్తర్కుకు బర్నబాకు దగ్గరి బంధువైన మార్కు మీకు వందనాలు చెప్తున్నారు. మార్కును గురించి మీరు ఇంతకుముందే సూచనలు అందుకున్నారు, కాబట్టి అతడు మీ దగ్గరకు వస్తే, అతన్ని చేర్చుకోండి.
- కొలొస్సయులకు 4:11సుమారు క్రీ.శ. 64
యూస్తు అనబడే యేసు కూడా మీకు వందనాలు చెప్తున్నాడు. దేవుని రాజ్యం కోసం నాతో ఉన్న జతపనివారి మధ్యలో, యూదులు వీరు మాత్రమే ఉన్నారు. వీరు నాకు ఆదరణ కలిగిస్తున్నారు.
- కొలొస్సయులకు 4:12సుమారు క్రీ.శ. 64
క్రీస్తు యేసు సేవకుడును మీలో ఒకడైన ఎపఫ్రా మీకు వందనాలు చెప్తున్నాడు. మీరు పరిపూర్ణులుగా ప్రతి విషయంలో దేవుని చిత్తం గురించి పూర్తి నిశ్చయతగలవారై స్థిరంగా ఉండాలని, ఇతడు ఎప్పుడు మీ కోసం తన ప్రార్థనలో పోరాడుతూ ఉంటాడు.
- కొలొస్సయులకు 4:13సుమారు క్రీ.శ. 64
ఇతడు మీ కోసం, లవొదికయలో హియెరాపొలిలో ఉన్న వారి కోసం ఎంతో ప్రయాసపడుతున్నాడని ఇతన్ని గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను.